Saturday, January 23, 2016

దుమ్మురేపిన కంగారులు..భారత్ విజయలక్ష్యం

ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా వేధికగా భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీస్కొర్ చేసింది.  టాస్ గెలిచిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.



ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (107: 107 బంతుల్లో 9x4, 2x6), డేవిడ్ వార్నర్ (93 : 92 బంతుల్లో 12x4,1x6) తొలి వికెట్ కి 29.2 ఓవర్లలో 187 పరుగులు జతచేసి ఆసిస్ భారీ స్కోర్ దిశగా సాగించారు.  తర్వాత వచ్చిన ఆటగాళ్లలో బెయిలీ 10, ఫాల్కనర్ 0 పరుగులతో నిరాశ పరచారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ స్కోరు పెంచే క్రమంలో 51 పరుగులు సాధించి, ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివర్లో మాక్స్ వెల్ 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లల్లో ఇషాంత్ శర్మ 4 వికెట్లు పడగోట్టగా, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నారు. మరికాసేపట్లో 349 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నెల్లూరు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం పూడికుప్పం గ్రామంలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండిళ్లలో సోదాలు చేశారు. పి.రత్నం అనే వ్యక్తి ఇంట్లో నిల్వచేసిన 22 బస్తాల బియ్యం, మరొకరి ఇంట్లో నిల్వచేసిన 51 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. ఇవి ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రేషన్ బియ్యంగా అధికారులు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Friday, January 22, 2016

అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

అక్రోటుకాయలు శరీరానికి కావలసియన పోషకాలను అందించటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల పెరుగుదలను నియంత్రిస్తాయి. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇక్కడ తెలుపబడ్డాయి.



అక్రోటుకాయలు (వాల్నట్):

అక్రోటుకాయలు అనేవి సాధారణంగా అందరికి తెలిసిన పోషక విలువలు కలిగిన ఎండిన పండ్లు. అంతేకాకుండా, ఆరోగ్యాన్ని చాలా రకాలుగా పెంపొందిస్తుంది. అక్రోటుకాయల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ కొన్ని తెలుపబడ్డాయి.

రోగనిరోధక శక్తిని:

అక్రోటుకాయలు రోగ నిరోధక వ్యవస్థకు చాలా మంచివి. ఇవి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన, శరీర నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచి వ్యాధులకు దూరంగా ఉండేలా సహాయం చేస్తుంది. మీ భోజనంలో వీటిని కలుపుకోవటం వలన నిరోధక వ్యవస్థకు చాలా మంచిది.

రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ:

రక్తంలోని చక్కెర స్థాయిలకు సంబంధించిన సమస్యలను తగ్గించటంలో ఇవి సహయం చేస్తాయి. మీరు తినే భోజనంలో వీటిని కలుపటం వలన హృదయ నాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుంది అని పరిశోధనలలో వెల్లడయింది.

రొమ్ము క్యాన్సర్:

విత్తనాలలో ఆరోగ్యాన్ని పెంపొందించే వాటిలో ఇది ముఖ్యమైనది మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తాయి. రొమ్ము క్యాన్సర్ కలిగి ఉన్న ఆడవారు మరియు దీనికి చికిత్స చేపించుకునే వారు రోజు ఒక కప్పు అక్రోటుకాయలు తినటం వలన, ఇవి శక్తివంతంగా రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యం:

అక్రోటుకాయలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను పుష్కలంగా కలిగి ఉండి, హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతాయి. అక్రోటుకాయలు, రోజు తినటం వలన, రక్త పీడనం అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'ల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడి, గుండెను ఆరోగ్యకరంగా ఉంచే మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెంచుతుంది.

గర్భం :

గర్భ సమయంలో ప్రతి త్రైమాసిక దశలో పోషకాలు తప్పని సరిగా అవసరం. గర్భంతో ఉన్న స్త్రీలు రోజు తీసుకునే ఆహరంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు అధికంగా ఉండేలా చూసుకోండి. అక్రోటుకాయలు పుష్కలమైన ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉంటాయి ఇవి పిండ పెరుగుదలకు మరియు శిశువు ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, ప్రసవం ముందుగా అవకుండా, సరరైన సమయంలో ప్రసవం జరిగేలా చేస్తుంది.


జీవక్రియ: 

జీవక్రియకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మితిమీరిన రక్తంలోని ఫాట్, అధిక రక్త పీడనం, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు మరియు స్థూలకాయత్వం వంటి వాటిని నియంత్రిస్తుంది. నూతన పరిశోధనల వెల్లడి ప్రకారం రోజు ఒక ఔన్స్ అక్రోటుకాయలను 2 నుండి 3 నెలల పాటు తినటం వలన జీవక్రియ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

పిత్తాశయ రాళ్ళు:

'హావర్డ్' అనే బృందం ప్రచురించిన దాని ప్రకారం, ఎవరైతే వారం పాటూ 1 ఔన్స్ అక్రోటుకాయలను తినటం వలన వారిలో పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం 25 శాతం తగ్గుతుంది అని తెలిపారు. వారంలో కొన్ని అక్రోటుకాయలను తినటం వలన పిత్తాశంలో రాళ్ళు ఏర్పడటం నుండి రక్షణ పొందవచ్చు.


బరువు తగ్గుదల:

సాధారణంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు విత్తనాలను తినరు కారణం-అందులో ఉండే క్యాలోరీలు, నూతన పరిశోధనల ప్రకారం వారంలో రెండు సార్లు విత్తనాలను తినటం వలన 31 శాతం వరకు బరువు పెరుగుదలను నియంత్రిస్తాయి అని తెలిపారు.

క్యాన్సర్ నియంత్రణ:

అక్రోటుకాయలు 'ఫైటోన్యూట్రీఎంట్స్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి. ఒక కప్పు అక్రోటుకాయలను తినటం వలన చాలా రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి మిస్టరీ వీడింది...

లండన్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు యూకేకు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. 1945 ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి తైవాన్‌ రాజధాని తైపీ శివార్లలో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నేతాజీతో పాటు, అతని సన్నిహితుడు కల్నల్‌ హబిబర్‌ రెహ్మాన్‌ఖాన్‌ కూడా ఉన్నారు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఓ జపాన్‌ డాక్టర్‌ నేతాజీకి చికిత్స అందించారు. అనంతరం నేతాజీ కోమాలోకి వెళ్లిపోయారు. కాగా, కొద్ది సేపటికే ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడే పనిచేసిన నర్సు కూడా ధృవీకరించింది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేతాజీ ఓ ఇంగ్లీషు అనువాదకుడిని కోరినట్లు వారు చెబుతున్నారు.



ఆ సమయంలో.. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలానని, తన మరణవార్త భారత్‌కు తెలియజేయాలని నేతాజీ కోరుకున్నారు. ఈ విషయాన్ని నేతాజీ సన్నిహితుడు రెహ్మాన్‌ఖాన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఎప్పటికీ సేవలందించాలని ఆయన కాంక్షించినట్లు రెహ్మాన్‌ ఖాన్‌ తెలిపారు. కాగా, నేతాజీ మరణం తర్వాత జపాన్ అధికారులు, ఇతర సిబ్బంది ఆయన మృతదేహం వద్ద వరుసగా నిల్చుని సెల్యూట్ చేసి నివాళులర్పించారు. ఈ వివరాల ఆధారంగా నేతాజీ ఆ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు స్పష్టమవుతోందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

Thursday, January 21, 2016

చాముండేశ్వరి దేవాలయం – చిటూకుల్ గ్రామం



మెదక్ జిల్లా చితకుల్ గ్రామం లో సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం చాల అందంగా అద్బుతంగా ఉంటుంది.పదకొండు అడుగుల ఏకశిలా అమ్మవారి విగ్రహం శ్రీ చాముండేశ్వరి ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఎత్తులో ఏకశిలా విగ్రహం ఉండడం దేశంలోనే మొదటిదిగా చెప్పవచ్చు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు.

ఇక్కడ ప్రతిష్టించిన దేవి ఖడ్గాహస్తము తో దుష్ట శిక్షణ శిష్టా రక్షణ చేస్తూ దివ్యముర్తిగా దర్శనమిస్తుంది. దగ్గరలో ఉన్న మంజీరా నది లో స్నానం చేసి ప్రదిక్షణలు చేసి అమ్మవారని దర్శించుకొన్నారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాల ఘనంగా జరుగుతాయి.ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం. క్షేత్ర సందర్శన చేసుకొని అమ్మవారి ఆశిస్సులు పొందాలి.
వెళ్ళు మార్గం : జోగిపేట్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో ఉంటుంది.

పత్రం- పత్రాల ఔషధము

మాచీ పత్రం -నేత్రములకు మంచి ఔషధము.  ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి.  పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.



నేలమునుగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును.  శరీరమునకు దివ్యఔషధము. 

మారేడు ఆకులు - మూల శంక నయమగును.  రోజూ  రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి.  కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో  వేసుకుని తాగాలి.

జంటగరిక ఆకు - మూత్ర సంబంధ వ్యాధులు  తొలుగును.  పచ్చడి చేసుకొని తినవలెను.

ఉమ్మెత్త ఆకు - మానసిక రోగాలు తొలగును.  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.

రేగు ఆకు - శరీర సౌష్టవానికి శ్రేష్టం.  మితంగా తింటే మంచిది.

ఉత్తరేణి ఆకులు - దంతవ్యాధులు నయమగును.  ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.

తులసీ ఆకులు - దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి.  రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.

మామిడి ఆకు - కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును.  మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.



గన్నేరు ఆకు - జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]

అవిసె ఆకు - రక్త దోషాలు తొలగును.  ఆకు కూరగా వాడవచ్చు.

అర్జున పత్రం -మద్ది ఆకులు - వ్రణాలు తగ్గును.  వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.

దేవదారు ఆకులు - శ్వాశకోశ వ్యాధులు తగ్గును

మరువం ఆకులు - శరీర దుర్వాసన పోగొట్టును.  వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.

వావిలి ఆకు - ఒంటినొప్పులను తగ్గించును.  నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.

గండకీ ఆకు - వాత రోగములు నయమగును

జమ్మి ఆకులు - కుష్ఠు వ్యాధులు తొలగును.  ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.

జాజి ఆకులు - నోటి దుర్వాసన పోగొట్టును.  ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.

​రావి ఆకులు - శ్వాసకోశ వ్యాధులు తగ్గును.  పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది. ​

దానిమ్మ ఆకు - అజీర్తి, ఉబ్బసం తగ్గును.  పొడిచేసి కషాయంగా తాగవచ్చు. ​

జిల్లేడు ఆకులు - వర్చస్సు పెంచును.

Wednesday, January 20, 2016

అమరావతి గ్రామాల్లో రసాభాసగా సాగుతున్న అవగాహన సదస్సులు

ఆంధ్రా రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు.. డిసెంబర్ నెలాఖరు నాటికే రాజధాని ప్రాంతంలో సేకరించిన రైతులు వారి ప్లాట్లను అప్పగిస్తామని గతంలో ఏపీ సర్కారు పెద్దలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా ఆ పని ఇంకా పూర్తి కానే లేదు. కేపిటల్ మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యిందని చెబుతున్నా ఇంకా కార్యాచరణ మాత్రం ఆరంభం కాలేదు. 



ముందు ఏదో ఒక మూవ్ మెంట్ కనిపించాలి కాబట్టి అన్న ఉద్దేశ్యంతో సెక్రటేరియటన్ నిర్మాణానికి ఏపీ సర్కారు పూనుకొంది. దీనికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. ఈ లోపుగా రాజధాని మాస్టర్ ప్లాన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామంటూ సీఆర్ డీఏ అధికారులు రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 

ఈ అవగాహన సదస్సులు రసాభాసగా సాగుతున్నాయి. గతంలో మంత్రులు రాజధాని పల్లెల్లో తిరిగినప్పుడు ఎన్నో హామీలు గుప్పించారు. గ్రామ కంఠాలను కదపబోమన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల్లో హామీల వర్షం కురిపించారు. కానీ మాస్టర్ ప్లాన్ లో అవేమీ లేకపోవడంతో రైతుల ఆగ్రహం చెందుతున్నారు. 


మాస్టర్ ప్లాన్ లో రహదారులన్నీ సరళరేఖల్లా రూపొందించారు. దాన్ని యథాతథంగా అమలు చేస్తే గ్రామాల్లోని ఎన్నో కట్టడాలు కూల్చాల్సి ఉంటుంది. గ్రామాల జోలికి రామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఇలా ఎలా చేస్తారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఈ అవగాహన సదస్సుల్లో రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు పోలీసుల అండతో ఈ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మంగళవారం జరిగిన ఓ సదస్సులో.. పోలీసులు, రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కలగజేసుకొని రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 

గ్రామం మధ్యలోంచి రహదారి నిర్మాణానికి ఎట్టిపరిస్థితిలోనూ ఒప్పుకోబోమని రైతులు ఖచ్చితంగా చెప్పారు. గ్రామ కంఠాలపై స్పష్టత వచ్చిన తర్వాత మరో సారి రైతులకు అవగాహన కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన కమిషనర్ అక్కడ నుంచి బయటపడ్డారు. 

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ-సీ31

శ్రీహరికోట(సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ-సీ31 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)నుంచి బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు రెండో లాంచ్‌పాడ్ నుంచి ప్రారంభమైన ఈ ప్రయోగంలో భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ  విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతంతో షార్‌ శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీహరికోట శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.



అయితే ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చారు. నావిగేషన్ (దిక్సూచి) పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈరోజు పీఎస్‌ఎల్‌వీ సీ-31 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్లి రోదసీలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహం కావడం గమనార్హం. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో రెండు ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

ప్రయోగం ఇలా జరిగింది
ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కోర్‌అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్‌ఎల్ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను, 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేశారు. అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోమీటర్లలో అపోజి(భూమికి దూరంగా) 284 పెరిజీ(భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.
 
ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.
► రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి.
► ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

Tuesday, January 19, 2016

ఆరోగ్యానికి దివ్యఔషదం అంజీరా..!

ఈ మద్య కాలంలో మనిషి ఆరోగ్యం గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు పడుతున్నారు. శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉండటానికి యోగా,జిమ్, వాకింగ్ లాంటివి చేస్తూన్నారు..అయితే వీటితో పాటు మనం తీసుకునే ఆరోగ్యం పట్లకూడా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పండ్లు మంచి ఆరోగ్యాని ఔషదంలా పనిచేస్తాయి. ఇందులో కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి.

అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇటీ వలి ‘జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది అంజీరలోనేనని స్పష్టం చేశారు.


అంజీరా పండ్లల్లో 65 కేలరీలు ఉంటే, ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది. అంజీర పండ్లను విడిగానే కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 

ఆరోగ్యానికి అంజీర ఫలము : కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి.   అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.  కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది.  అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . 

కాల్ మనీ షాకింగ్: రూ.4 లక్షలు ఇచ్చి రూ.కోటి ఆస్తి తీసుకున్నారు!

విజయవాడ: కాల్ మనీ రాకెట్ కుంభకోణంలో తవ్విన కొద్ది షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మరో భాస్కర రావు అనే కాల్ మనీ వ్యాపారి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చి, రూ.కోటి ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భాస్కర రావు అనే వ్యక్తి ఓ వృద్ధ దంపతులకు నాలుగు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. దానికి వడ్డీతో సహా రూ.కోటి ఆస్తులు తీసుకున్నాడు. తుమ్మలపాలంలోని వృద్ధ దంపతుల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దాడి చేశారని ఫిర్యాదు 
తనపై దాడి చేశారని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై చిలకలపూడి స్టేషన్‌లో కేసు నమోదైంది. మందుల గూడెంకు చెందిన స్వామిపై పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని సమీప ప్రాంతానికి చెందిన వెంకన్నతో పాటు మరో ఇరువురు వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని మండవల్లి మండలంలోని మూడుతాళ్లపాడులో సంచలనం సృష్టించిన వివాహిత అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా భావిస్తున్న వారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నెల 10న మూడతాళ్లపాడుకు చెందిన కమతం సంధ్య అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ కేసును ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలేనని, వారు మానసికంగా, శారీరకంగా హింసించారనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఇన్ఫోసిస్ సుధామూర్తి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన

‘మహిళలకి ఇంటర్వ్యూ ఉండదా?!’ అని జేఆర్డీ టాటానే నిలదీసింది. గోల్డ్‌మెడలిస్ట్, ఇంజినీరింగ్‌లో టాపర్, పెద్ద ఉద్యోగం... అయినా మానేసుకుంది! వాళ్లాయన కోసం ఉద్యోగం మానేసుకుంది.  వాళ్ల ఇన్ఫోసిస్ ఇప్పుడు నక్షత్రాలతో ముగ్గులు వేసుకునేంత ఎత్తుకు ఎదిగింది. వెంటనే... సుధ మళ్లీ భూమికి దిగొచ్చేసింది. పిల్లల, పేదల, వృద్ధుల, మహిళల, విధివంచితుల ఆశల పల్లకీని మోస్తోంది. ప్రభుత్వాలకు, పెద్దపెద్ద సంస్థలకు సేవామార్గాలు వేస్తోంది. సదా మీ సేవలో... అనే సుధ తను. చదువుంది, డబ్బుంది, హోదా ఉంది, సేవా తత్వం ఉంది.. అయినా... మూడొందల అరవై ఐదు రోజుల్లో... 365 సినిమాలు చూస్తుంది! ఆమె వివిధ. మన వివిధ సుధ.


గోవాలోని పణజిలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు తొమ్మిదవ ‘కొశాంబీ ఫెస్టివల్’ జరుగుతోంది. డి.డి. కొశాంబీ (1907-1966) చరిత్రకారుడు. ఆలోచనాపరుడు. సంఘశ్రేయోభిలాషి. ఆయన ఆలోచనలపై ఈ ఐదు రోజులూ ఐదుగురు సుప్రసిద్ధులు ప్రసంగిస్తారు. వారిలో ఒకరు ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్’ చైర్‌పర్సన్ సుధామూర్తి కూడా ఒకరు. సుధ ప్రారంభోపన్యాసం చేస్తారు. ‘ది సర్కిల్ ఆఫ్ లైఫ్’ అనే అంశం మీద మాట్లాడతారు. ఈ సందర్భంగా సుధామూర్తి లైఫ్ సర్కిల్ చుట్టూ చిన్న రౌండప్.

శిలను ఉలి చెక్కుతుంది. ఉలిని ఆలోచన కదిలిస్తుంది. సుధామూర్తిని కూడా ఆమెకు ఎదురైన అనుభవాలు ఆలోచనలై మలిచాయి. పైకి ఆమె సాధారణ స్త్రీగా కనిపించవచ్చు. కానీ లోలోపల మూర్తీభవించిన ఒక సమున్నత సేవానురాగ వ్యక్తిత్వం ఆమె. సుధ అనుభవాలు కొన్ని.. ఆమె రాసిన ‘వైజ్ అండ్ అదర్‌వైజ్’ పుస్తకంలో ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ భాగం ఆమెకు తారసపడిన వ్యక్తులకు సంబంధించినవే.

హనుమంతప్ప అనే పిల్లవాడు ఉండేవాడు. అతడి చదువుకు, హాస్టల్ ఖర్చులకు సుధ డబ్బు పంపేవారు. ఓసారి ఆ డబ్బు వెనక్కి వచ్చేసింది! కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు సుధ. ‘స్కూల్‌కి సెలవులిచ్చారు. సెలవుల్లో డబ్బు అవసరం ఉండదు... అందుకే తిప్పి పంపాను మేడమ్. క్షమించండి’ అని ఆ పిల్లవాడి సమాధానం. ఆ నిజాయితీకి ఆమె కదిలిపోయారు. సుధను ఆమె జీవితంలో కదిలించిన సంఘటనల్లో రెండు రకాలవీ ఉన్నాయి. మంచివీ, చెడువీ! భోరున వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా, ‘వానా వానా వల్లప్పా..’ అని ఆనందంతో నృత్యం చేసిన ఓ నిరుపేద కుటుంబాన్ని చూసి తన స్నేహితురాలు మీరా... పేదరికానికీ, ఆనందానికీ సంబంధమే లేదన్న జీవిత సత్యాన్ని గ్రహించిన విషయాన్ని సుధ తన అనుభవాలలో రాసుకున్నారు. విమానంలో తన సహ ప్రయాణికులైన అపరిచిత యువ దంపతులు... ‘వీరనారి’ ఝాన్సీ లక్ష్మీబాయి పేరే వినలేదని తెలిసి విస్మయం చెందారు. ఇంకా... రక్షాబంధన్ రోజే ఓ తమ్ముడు తన అక్కను పడువు వృత్తిలోకి నడిపించడం, తమిళనాడులోని స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన  పూజారి.. తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసి, ‘అంత డబ్బును తనకు అక్కర్లేదు’ అని ఐదు పావలా బిళ్లలను మాత్రమే తీసుకోవడం వంటి పరస్పర విరుద్ధ సంఘటనలు సుధలో ఆలోచనలను రేకెత్తించి ఆమె వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి.

మహిళలు ఎందుకు వద్దు?
సుధా కులకర్ణి. బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్ విద్యార్థిని. లేడీస్ హాస్టల్లో ఉండి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఓరోజు ఆమె... లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్‌కు తిరిగి వెళుతుంటే నోటీస్ బోర్డులో టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్) కంపెనీ ఉద్యోగ ప్రకటన కనిపించింది. ‘‘కష్టించి పని చేయగల అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు టెల్కో ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగల గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అన్నది సారాంశం.దాని కిందే చిన్న నోట్ : మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయనవసరం లేదు.

నోట్ చదవగానే సుధ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అందులోని లైంగిక వివక్షను ఆమె సహించలేకపోతోంది. నిజానికి ఆమెకా ఉద్యోగం చెయ్యాలని లేదు. కానీ నోట్ చూశాక ఆ కంపెనీ యజమానికి కనువిప్పు కలిగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. హాస్టల్ గదికి రాగానే పోస్ట్ కార్డు అందుకుని జె.ఆర్.డి. టాటాకు ఉత్తరం రాయడం మొదలు పెట్టింది. టెల్కో టాటా వాళ్లది కాబట్టి, టాటాకు అధినేత జె.ఆర్.డి. కాబట్టి నేరుగా ఆయన్నే ఉద్దేశించే రాసింది. వాస్తవానికి అప్పటి టెల్కో ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్. ‘‘టాటాలంటే గొప్పవాళ్లు. ఇండియాకు రక్తమాంసాలు ఇచ్చినవాళ్లు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యాసంస్థల ఆవిర్భావం టాటాల పుణ్యమే. అదృష్టవశాత్తూ నేనక్కడే చదువుకుంటున్నాను. కానీ టెల్కో వంటి టాటా కంపెనీ లైంగిక వివక్షను పాటించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’.ఇంతవరకు రాసి సుధ ఆ ఉత్తరాన్ని డెరైక్టుగా జె.ఆర్.డి.కి పోస్ట్ చేశారు. తర్వాత ఆ విషయం మరిచిపోయారు.

వారం తర్వాత...
సుధకి టెలిగ్రామ్ వచ్చింది. టెల్కో ఇంటర్వ్యూకి రమ్మని!! పుణె దగ్గర పింప్రీలో ఇంటర్వ్యూ. సుధ వెళ్లింది. బోర్డు సభ్యులలో ఒకరు సుధను చూస్తూ -‘‘ఈ అమ్మాయే జె.ఆర్.డి.కి ఉత్తరం రాసింది’’అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పడం ఆమె గమనించింది. ఏదో పిలవడానికి పిలిచారు కానీ, తనకా ఉద్యోగం రాదని సుధ అనుకుంది. అందుకే నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చింది. పనిలో పనిగా అమ్మాయిలను ఉద్యోగాలకు వద్దనడం న్యాయమేనా? అని అడిగింది.ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్లలో ఒక పెద్దాయన సౌమ్యంగా సమాధానం చెప్పారు. ‘‘చూడమ్మా... ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాదు. కర్మాగారం. మీలాంటి ప్రతిభ గల అమ్మాయిల్ని రిసెర్చ్ లేబరేటరీలలోకి తీసుకోగలం కానీ, చూస్తూ చూస్తూ యంత్రాల మధ్యకు పంపలేం కదా. అందుకే అలా నోట్ పెట్టాం’’ అన్నారు.

‘‘ఎక్కడో ఒక చోట ఈ సంప్రదాయానికి బ్రేక్ పడాలి కదా’’ అంది సుధ. ఆమె అన్నట్లే బ్రేక్ పడింది. ఆమెకా ఉద్యోగం వచ్చింది. తర్వాత సుధా కులకర్ణి... సుధామూర్తి అయింది. అయితే పుణె నుంచి బాంబే బదలీ అయ్యేవరకు ఆమెకు జె.ఆర్.డి. దర్శనభాగ్యమే కలగలేదు. కంపెనీ ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్‌కు ఏవో నివేదికలు అందించడం కోసం బాంబే హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓరోజు అమెకు జె.ఆర్.డి. కనిపించారు. అదే మొదటిసారి సుధ ఆయన్ని చూడ్డం!

ఫస్ట్ ఉమన్ ఇంజినీర్

‘‘జే.. టెల్కో ఫ్యాక్టరీలో చేరిన మొట్టమొదటి ఉమన్ ఇంజినీర్’’ అంటూ సుధను పరిచయం చేశారు సుమంత్. సుధలో వణుకు మొదలైంది. దేవుడా పోస్ట్ కార్డ్ సంగతి ఎత్తకుండా చూడు అనుకుంది. జె.ఆర్.డి. చిరునవ్వు నవ్వి సుమంత్‌తో మాటల్లో పడిపోయారు.
 ఆ తర్వాత అప్పుడప్పుడు టాటాహౌస్‌లో జె.ఆర్.డి. తారసపడుతూనే ఉన్నారు సుధకు.

రాజీనామా!
1982లో టెల్కో నుంచి బయటికి వచ్చారు సుధ. నిజానికి అంతమంచి ఉద్యోగం మానేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఫైనల్ సెటిల్‌మెంట్‌లన్నీ అయ్యాక బాంబే హౌస్ మెట్లు దిగుతుంటే జె.ఆర్.డి. ఎదురయ్యారు ఆమెకు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకోవడం కోసం ఆగారు సుధ. ‘‘ఎలా ఉన్నావమ్మాయ్’’ అని అడిగారు జె.ఆర్.డి. ‘‘ఉద్యోగం మానేస్తున్నాను సర్’’ అని చెప్పింది సుధ.‘‘మానేసి?’’ ‘‘పుణె వెళ్లిపోతున్నాను సర్. నా హస్బెండ్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు ఇన్ఫోసిస్’’.
   
అరవై ఐదేళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘ఇన్ఫోసిస్ పౌండేషన్’కు ఛైర్ పర్సన్. ‘గేట్ ఫౌండేషన్’ సభ్యురాలు. అనాథాశ్రమాలను నడుపుతున్నారు. కంప్యూటర్ విద్యను ఒక ఉద్యమంలా కర్నాటక లోని ప్రభుత్వ పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు.  ఇవి వృత్తి వ్యాపకాలు. సుధ చక్కటి రచయిత్రి. కథలు రాస్తారు. కన్నడలో ఆమె రాసిన ‘డాలర్ సొసె’ ఇంగ్లిషు లోకి ‘డాలర్ బహు’ (డాలర్ కోడలు)గా తర్జుమా అయింది. జీ టీవీలో సీరియల్‌గా వచ్చింది. మరాఠీ సినిమా ‘పితృరూణ్’, కన్నడ చిత్రం ‘ప్రార్థన’లో ఆమె నటించారు. ఇవి ప్రవృత్తి జ్ఞాపకాలు. ఈ వ్యాపకాలు, జ్ఞాపకాల మధ్య సుధ తనని తాను నిత్యనూతనం చేసుకుంటున్నారు. సుధామూర్తికి ఇరవై వరకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. వాటిల్లో ఒకటి ‘పద్మశ్రీ’.

సామాజిక కార్యకర్తగా...
సుధ విషయంలో కార్యకర్త అనేమాట చిన్నదవుతుంది. ఏ పని చేసినా ఆమె దాన్నొక ఉద్యమంగానే నడిపారు. అలాగని తననొక ఉద్యమకారిణిగా ఆమె అంగీకరించరు. ఆరోగ్యం, విద్య, స్త్రీ సాధికారత, పరిశుభ్రత, కళలు-సంస్కృతి, పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. సుధ కృషి చేస్తున్న రంగాలు. ఆమె ప్రతి మాటా ఒక కోట్ లా ఉంటుంది. ‘పోరాటమే జీవితం’ అంటారు సుధామూర్తి. ‘మన పోరాటం మన జీవితం కోసం మాత్రమే కాకూడదు’ అని కూడా అంటారు. జె.ఆర్.డి. టాటా ఆమెకు ఆదర్శం. టెల్కోలో ఉద్యోగం మానేస్తూ బయటికి వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట సుధకు ఈనాటికీ వేద వాక్కు. ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు, ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి, ఆ సహకారాన్ని తిరిగి నువ్వు నీ సమాజానికి ఇవ్వాలి’ అని జేఆర్‌డీ చెప్పిన మాటను నేనెప్పటికీ మరువలేను అంటారు సుధామూర్తి తన ప్రతి ప్రసంగంలో, ప్రతి ప్రస్తావనలో.

చుట్టూ మసులుతున్న మనుషుల్లోని మంచితనాన్ని గమనించేంత సమయం, సానుకూల దృష్టి ఉంటే మనలో ప్రతి ఒక్కరి జీవితం సమాజానికి ఉపయోగపడుతుందన్నన్న విషయాన్ని సుధామూర్తి జీవనశైలి ప్రతిఫలిస్తుంది.

సుధ 1950 ఆగస్టు 19న షిమోగా (కర్నాటక)లో జన్మించారు. తండ్రి ఆర్.హెచ్. కులకర్ణి. తల్లి విమల కులకర్ణి. తమ్ముడు శ్రీనివాస్ కులకర్ణి. కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్. అక్కా తమ్ముడు చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఆ జ్ఞాపకాలతో సుధ ‘హౌ ఐ టాట్ మై గ్రాండ్‌మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్’. రాశారు. ఇవి పిల్లల కథలు. ఇదే ఆమె తొలి రచన. ఆ తర్వాత ఇప్పటి వరకు కన్నడంలో 16, ఇంగ్లిషులో 13 రచనలు చేశారు సుధ. ఆమె భర్త నారాయణమూర్తి ఐటీ దిగ్గజం. ఇన్ఫోసిస్ కో ఫౌండర్. సుధ కొడుకు రోహన్. కోడలు లక్ష్మీ వేణు. కూతురు అక్షత. అల్లుడు రిషి సునక్. రోహన్, అక్షత అక్కాతమ్ముళ్లు.

సినిమాలంటే ఇష్టం!

సుధామూర్తి దగ్గర 500 సినిమా డీవీడీలు ఉన్నాయి. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది. ‘‘రోజుకు కనీసం ఒక సినిమా అయినా చూస్తాను.  సినిమాలు నాకు ఎప్పటికీ బోరు కొట్టవు.  నిజానికి నేను సినిమా జర్నలిస్టును కావాలనుకున్నాను’’ అని ఓసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సుధ.

Monday, January 18, 2016

కాలేజి అమ్మాయిల కోసం కొత్త రకం స్కూటర్

మహీంద్రా టూ వీలర్స్ వారు తమ సరికొత్త గస్టో 125 స్కూటర్ ను జనవరి 11, 2016 న ఆవిష్కరించారు. దీనిని త్వరలో జరగబోయే 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. ఆటో షో తరువాత ఈ స్కూటర్‌ను దేశ వ్యాప్తంగా అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.



మైలేజ్ : ఇందులో గల ఇంజన్ సివిటి గేర్ బాక్స్ కలదు. ఇది లీటర్ కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది.

లభించు రంగులు : మహీంద్రా గస్టో 125 స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును. ఆరేంజ్ రష్ (డ్యూయల్ టోన్) బోల్ట్ వైట్ (డ్యూయల్ టోన్) మోనార్క్ బ్లాక్ రిగాల్ రెడ్

మహీంద్రా గస్టో 125 ఫీచర్లు : హైట్ అడ్జస్టబుల్ సీట్ రిమోట్ ఫ్లిప్ కీ ఫైండ్ మీ ల్యాంప్స్ ట్యూబ్ లెస్ టైర్లు






మెరిసే చర్మం కోసం నారింజ, నిమ్మ తొక్కలతో “ఫేస్ ప్యాక్”

సహజంగా మన ఏ పండ్లు తిన్నా వాటి పై తొక్కను తీసి పడేస్తాము, అయితే చాలా మందికి తెలియని, విషయం ఏమిటంటే, చెత్త అనుకునే ఆ పై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే..

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే…ఇలా
మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ C” మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.
ఈ “ఫేస్ ప్యాక్” ని ఉపయోగించే ముందు చర్మాన్ని శుబ్రం చేసుకుంటే దానివల్ల మీ చర్మం లోని చనిపోయిన, అనవసరమైన కణాలు తొలగిపోతాయి.
 ఈ నారింజ, నిమ్మ తొక్కల పొడి తయరు చేసుకోవడం ఎలా?
నారింజ, మరియు నిమ్మ తొక్కలని తీసి కొన్ని రోజులు ఎండపెట్టాలి, అవి గట్టిగా అయిన తరువాత మెత్తగా పౌడరు లాగా చేసి ఒక డబ్బాలో ఉంచాలి.అలా మీరు “ఫేస్ ప్యాక్” తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు”
 ఉపయోగించుకోవడం ఎలా??
ఈ పొడిని, కొంచెం పెరుగు, నీటిలో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ చర్మంలోని జిడ్డు తొలగిపోయి మిల మిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
కొంచెం పెసర పిండి, నిమ్మ రసం కలిపి ముఖానికి పట్టిస్తే అందమైన చర్మం కలిగి, మృదువుగా మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
ఈ పొడిని పసుపుతో కలిపి ఉపయోగించుకుంటే మొటిమల నుంచి, నల్లని మచ్చలనుంచి, చర్మం ముడతలు పడకుండా ఎంతగానో సహాయపడుతుంది.
ఈ పొడిని ఎక్కువగా చేసుకుని ఉంచుకోవడం మంచిది, ఇది పాడైపోతుందేమో అనే భయం అవసరం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎండిపొయిన పండ్ల తొక్కలతో తయారుచేసింది .
ఈ పై మిశ్రమం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఒక్కసారి ఉపయోగించి చూడండి,
వేసవిలో నారింజ మరియూ తేనె “ఫేస్ ప్యాక్”
1/4 కప్పు తేనె
1 1/2 టేబుల్ స్పూన్ నారింజ
ఈ పై వన్నీ కలిపి మీ ముఖానికి పట్టించి 20-30 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.