Saturday, April 30, 2016

తిరిగి ఇచ్చేయండి ..లేకపోతే లావై పోతారు

మన శరీరంలో 60శాతం వరకూ నీరే ఉంటుంది. శ్వాస తీసుకోకుండా మనం జీవించలేమన్న విషయం మీకు తెలిసిందే...అదే విధంగా నీరు లేకుండా కూడా మనం జీవించలేము.ఏ విధంగానైతే నీరు శరీరంపైవున్న మురికిని శుభ్రం చేస్తుందో అలాగే శరీరం లోపలి భాగంలోనున్న మలినాలను కూడా శుభ్రం చేయడానికి నీరు చాలా అవసరం.

నీరు అధికంగా తీసుకోవడంవలన ఎలాంటి నష్టం కలగదు. ఎలాగైనా ఆనీరు బయటకు వచ్చేసేదే. దీంతో పాటు మన శరీరానికి అవసరంలేని వ్యర్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా శరీరంలోనున్న మలిన పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. 

ఒక యువకుని బరువులో దాదాపు 65శాతం నీరువుంటుంది. అలాగే యువతి తన శరీరంలోని బరువులో 52 శాతంవరుకు నీరువుంటుందని నిపుణులు వివరించారు. మానవుని శరీరంలోనున్న ఎముకలు చాలా దృఢంగావుంటాయి. కాని వీటిలో 22 శాతం నీరువుంటుంది. దంతాలలో 10 శాతం, చర్మంలో20శాతం, మస్తిష్కంలో 74.5 శాతం, రక్తంలో 83 శాతం, కండరాలలో 75.6 శాతం నీరువుంటుందని వైద్యులు తెలిపారు. శరీరంలోని ప్రతి కణం,అవయవం మరియు కణజాలం నీటి మీద ఆధారపడి ఉన్నాయి. శరీరంలో నీరు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నీరు జీవమనుగడకు ముఖ్య ఆధారం. 

నీరు కీళ్ళలో లుబ్రికేషణ్ లాగా పని చేయటమే కాకుండా, శరీర అవయవాలు సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి, అంతేకాకుండా, శరీరంలో ఉండే విషపదార్థాలను భయటకు పంపటంతో పాటు, పేగు కదలికలను సరిగా నిర్వహించేలా చేస్తాయి. దాహమైనపుడు మాత్రమే నీరు తాగటం వలన చాలా రకాల అనారోగ్యలు కలుగుతాయి. దాహం అనిపించకముందే నీరు తాగటం వలన మీ శరీరం డీ హైడ్రేషన్ గురవకుండా కాపాడుకోవచ్చు. డీహైడ్రేషన్ కు గురైనప్పుడు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది మరి అవేంటో తెలుసుకుందా. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...


1. జీర్ణ వ్యవస్థలో లోపాలు: నీరు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మానవులలో జీర్ణక్రియ సరైన విధంగా కొనసాగించబడుటకు నీరు తప్పని సరి. ఒకవేళ మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది, ఇంతటితో ఆగకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. అల్సర్, అసిడిక్ రిఫ్లెక్షన్, మరియు గ్యాస్టిక్ వంటి సమస్యలకు దారితీస్తుంది . ఇలాంటీ జీర్ణ సమస్యలతో బాధపడుకూడదనుకుంటే రోజుకు సరిడేంత వాటర్ ను తీసుకోవాలి. ఆల్కలైన్ మినిరల్స్ మెగ్నీషియం, క్యాల్షియంను ఎక్కువగా తీసుకోవాలి.

2. మలబద్దకం: చాలా మంది ఎక్కువ సార్లు టాయిలెట్ కు వెళుతుంటారు మరియు పెయిన్ ఫుల్ గా బావిస్తుంటారు .అందుకు కారణం శరీరంలో నీరు లోపించడమే! కోలన్ ఎక్కువ నీరు గ్రహించడం వల్ల ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాంతో బాడీ ఫంక్షన్ ప్రొపర్ గా జరుగుతుంది . కోలన్ డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మలబద్దకం సమస్య ఉంటుంది.

3. కిడ్నీ సమస్యలు: ఇది కొద్దిగా భయపడాల్సిన విషయమే. మూత్రవిసర్జన సమయంలో కిడ్నీల్లో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది . ఇది కేవలం మీరు సరిగా నీరు త్రాగకపోవడం వల్ల, మూత్రపిండాల్లోని నీరు బయటకు పంపడానికి కష్టంగా మారినప్పుడు ఇలా జరుతుంటుంది, దాంతో అక్కడ బ్యాక్టీరియా చేరి యూరిన్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. దీర్ఘకాలంలో బ్లాడర్ కు కూడా ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది . కాబట్టి రోజులో ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది.

4. స్కిన్ డిజార్డర్స్: శరీరంలో నిల్వ ఉండే టాక్సిన్స్ కేవలం వాటర్ ద్వారా బయటకు వస్తాయి. మన శరీరంలో అత్యంత పెద్ద అవయం చర్మం అనే చెప్పవచ్చు . చర్మానికి తగినంత హైడ్రేషన్ అందకపోతే , చర్మంలో గ్లో తగ్గుతుంది మరియు చర్మరంగులో మార్పులు మరియు ముడుతలు ఏర్పడుతాయి . తర్వాత పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది .

5. హైబ్లడ్ ప్రెజర్: రక్తంలో 92శాతం నీరుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే . డీహైడ్రేషన్ కారణంగా బ్లడ్ చిక్కగా మారుతుంది. ఫలితంగా హైబ్లడ్ ప్రెజర్ , రక్తనాళాల్లో మరియు కణాల్లో ఎక్కువ ఒత్తిడికి గురికావల్సి వస్తుంది.

6. కొలెస్ట్రాల్ అధికం: డీహైడ్రేషన్ నుండి బయటపడటానికి ఇది శరీరంలో ఆటోమ్యాటిక్ మెకానిజం . . శరీరంలో కణాలు ఎక్కువ కొలస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి కావడం వల్ల హార్ట్ డిసీజ్, దాంతో వ్యక్తులు అధిక బరువు, ఊబకాయంకు గురి అవుతుంటారు.

7. ఆస్తమా మరియు అలర్జీలకు గురి అవుతారు: శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అధిక శాతంలో హిస్టమిన్ ఉత్పత్తి అవుతుంది . ఇది బాడీ మెకానిజమ్. హెయిర్ పాసేజ్ కు కూడా వాటర్ అవసరం అవుతుంది. అక్కడ కూడా డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఫలితంగా ఆస్తమా ..అలర్జీకి గురి అవుతుంది.

8. జాయంట్ స్టిఫ్ నెస్: జాయింట్ రిపేర్స్ చాలా నిధానంగా జరుగుతుంది . జాయింట్స్ లో కార్టిలేజ్ ప్యాడింగ్ వీక్ అవుతుంది. కార్టిలేజ్ కూడా వాటర్ తో నిండి ఉంటుంది కాబట్టి, డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది . జాయింట్ స్టిప్ గా మారితే పనిచేయడానికి కుదరదు మరియు నిద్రలేమి రాత్రులు గడపాల్సి వస్తుంది.

9. అలసట: శరీరానికి సరిగా నీరు అందకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఎంజమాటిక్ యాక్టివిటీస్ ఆలస్యం అవుతాయి . దాంతో ఎనర్జీ తగ్గుతుంది, దాంతో ఎప్పుడు చూసినా అలసటగా కనిపిస్తుంటారు.

10. బరువు పెరుగుతారు: డీహైడ్రేషన్ కారణంగా ఎనర్జీ సెల్స్ కోల్పోవడం జరుగుతుంది . దాంతో ఎక్కువ ఫుడ్ తినాలనిపించి ఫ్యాస్ట్ ఫుడ్స్, స్వీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలను శరీరంలో చేరుతాయి . కాబట్టి డ్రింక్ వాటర్ =హైడ్రేషన్ + 0క్యాలరీలు.

Friday, April 29, 2016

అయ్యో..చేతులారా విలువైనవి పడేసుకొంటున్నారా..!

నిమ్మరసం తీసేటప్పుడు విత్తనాలు పడేస్తాం. అలాగే పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలు పక్కన పెడతాం. అలాగే రకరకాల పండ్లలో ఉండే విత్తనాలను తీసేస్తూ ఉండటం కామన్. కానీ.. విత్తనాలు మాత్రమే కాదు.. విత్తనాలతో పాటు.. పోషకాలను కూడా పడేస్తున్నామని ఎప్పుడైనా గ్రహించారా ? అవును.. కొన్ని ఫ్రూట్ సీడ్స్ లో అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్ని రకాల పండ్లలో ఉండే విత్తనాలు తీసుకోవడం చాలా హెల్తీ అని.. నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫ్రూట్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి, మెదడుకి మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా.. ఈ పండ్లలోని విత్తనాలను బ్లెండ్ చేసి తీసుకోవచ్చట. మరి ఏ పండు విత్తనాలు.. ఎలాంటి బెన్ఫిట్స్ ఇస్తాయో తెలుసుకుందామా..


పుచ్చకాయ విత్తనాలు పుచ్చకాయనేమో హ్యాపీగా ఆరగించేస్తాం. ఈ ఫ్రూట్ తినేటప్పుడు అడ్డువచ్చే విత్తనాలను మాత్రం పక్కకుపడేస్తాం. కానీ.. ఈ విత్తనాలు తినడం వల్ల గోళ్లు, జుట్టు, చర్మం షైనీగా మారుతాయట. ఎందుకంటే.. ఈ పుచ్చకాయ విత్తనాల్లో జింక్, ఫైబర్, ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి.. ఇకపై ఈ సీడ్స్ పడేయరు కదూ..

నిమ్మకాయ విత్తనాలు జ్యూస్, సలాడ్స్ లో నిమ్మరసం వేసేటప్పుడు వాటి విత్తనాలను కలిపి.. బ్లెండ్ చేస్తే.. అద్భుతమైన హెల్త్ బెన్ఫిట్ పొందవచ్చు. ఇందులో ఎక్కువ మోతాదులో సలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎలాంటి నొప్పులనైనా తగ్గిస్తుంది.


బొప్పాయి విత్తనాలు సాధారణంగా బొప్పాయి పండులోని విత్తనాలను అందరూ పడేస్తుంటారు. కానీ.. వాటిని తినడం వల్ల మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు పొందవచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటియోలిక్ ఎంజైమ్స్ ఉండటం వల్ల శరీరంలో ఉండే నులి పురుగులను బయటకు పంపేస్తాయి.


కివీ సీడ్స్ చిన్నగా, నల్లగా ఉండే కివి సీడ్స్ లో విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు పొందడం వల్ల.. కాన్స్టిపేషన్ అరికడుతుంది. హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గిస్తుంది.


అవకాడో సీడ్ అవకాడో సీడ్స్ లో సొల్యుబుల్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి ద్వారా పొటాషియం పొందవచ్చు. అవకాడో సీడ్స్ లో ఉండే ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్.. హై బ్లడ్ ప్రెజర్, హై కొలెస్ట్రాల్ తగ్గించి.. ఇమ్యునిటీ పెంచుతాయి.


గుమ్మడి విత్తనాలు గుమ్మడి విత్తనాలను కొన్ని వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తాయి. డిప్రెషన్ తగ్గించడానికి కూడా గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి. వీటిని వేయించి సాల్ట్ అండ్ పెప్పర్ కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటాయి.


కర్భూజా విత్తనాలు కర్భూజా పండు కట్ చేసినప్పుడు ఆ విత్తనాలు తీసి చాలామంది ఎండబెట్టి తింటారు. ఇది మంచి అలవాటు. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇక కార్డియోవాస్కులర్ డిసీజ్ లు, పంటి సమస్యల నుంచి పోరాడతాయి.

యాపిల్ సీడ్స్ యాపిల్ సీడ్స్ లో క్యాన్సర్ సెల్స్ నాశనం చేసే సత్తా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో బి17 విటమిన్ లభిస్తుంది. కాబట్టి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చట.

Wednesday, April 27, 2016

తొక్కేం కాదు అనుకోకండీ..

సాధారణంగా కొన్ని పండ్లను తొక్కలతోనే తినేస్తుంటాం. మరికొన్నింటినీ.. తొక్క తీసేసి తింటూ ఉంటాం. కొన్ని పండ్ల తొక్కలు టేస్టీగానే ఉన్నప్పటికీ.. కొన్ని తొక్కలు తినాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే.. అవి వగరుగా, రుచి లేకుండా ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్ల తొక్కలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పడేయకుండా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

పండ్లు పోషకాలయాలు. వాటిలో అనేక రకాల హెల్త్, బ్యూటీ బెన్ఫిట్స్ ఇమిడి ఉంటాయి. అయితే పండ్ల పోషకాల గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ.. పండ్ల తొక్కలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని రకాల వ్యాధులను నయం చేసే సత్తా ఉందట. అందుకే.. ఏ పండు తొక్కలో ఏముందో తెలుసుకుందాం. ఏ పండు తొక్క తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు నివారించవచ్చో తెలుసుకుంటే.. ఇకపై తొక్కను నిర్లక్ష్యం చేయకుండా.. ఆరగించేస్తారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..

పుచ్చకాయ తొక్క పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఈ పీల్ ని చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకున్న డర్ట్ తొలగిపోతుంది. అలాగే చర్మం డ్యామేజ్ కి లోనవకుండా.. అరికడుతుంది.

నారింజ తొక్క బరువు తగ్గడానికి నారింజ తొక్క సరైన పరిష్కారం. అలాగే ఇది న్యాచురల్ స్క్రబ్ లా, బ్లీచింగ్ లా చర్మంపై పనిచేస్తుంది. అలాగే పంటి ఆరోగ్యానికి, శ్వాససంబంధిత సమస్యలకు, కాన్స్టిపేషన్ నివారించడానికి, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అలాగే ఆరంజ్ పీల్స్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.


దానిమ్మ తొక్క చూడగానే తినాలనిపించే దానిమ్మ గింజల్లోనే కాదు.. తొక్కలోనే ఆరోగ్య రహస్యాలున్నాయి. దానిమ్మ తొక్క యాక్నె, పింపుల్స్, రాషెష్, జుట్టు రాలడం, చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే హార్ట్ డిసీజ్, గొంతు నొప్పి నివారించడంలో దానిమ్మ తొక్క సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, పళ్ల పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది.




అరటితొక్క అరటితొక్క లోపలి భాగంతో.. పంటిపై రుద్దడం వల్ల పళ్లు న్యాచురల్ గా తెల్లగా మారుతాయి. అలాగే అరటితొక్కను కాలిన చర్మంపై పెట్టడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పగిలిన పాదాలపై అరటితొక్కతో రబ్ చేయడం వల్ల.. వారంరోజుల్లో అమోఘమైన ఫలితాలు చూస్తారు.







దోసకాయ తొక్క చాలా సందర్భాల్లో దోసకాయ తొక్కలను పడేస్తుంటాం. లోపల ఉండే పదార్థంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తాం. కానీ.. తొక్కలోనే హై ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గిస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ నివారిస్తుంది. అలాగే దోసకాయ తొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ కే ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, బ్లడ్ క్లాట్స్ నివారించడానికి, చూపు మెరుగుపరడానికి ఉపయోగపడుతుంది.

యాపిల్ తొక్క యాపిల్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.. అయితే యాపిల్ తొక్క తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, కెమికల్స్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. యాపిల్ పీల్ లో ఒబేసిటీని తగ్గించే గుణం ఉంటుంది.



నిమ్మ తొక్క నిమ్మ తొక్కలో అనేక బ్యూటీ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలుసు. అలాగే ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్, క్లెన్సర్ లా పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎముకల ఆరోగ్యానికి మంచిది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.

Tuesday, April 26, 2016

నేల మీద అయితే అంత బాగుంటుందా.

ఇప్పుడు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా.. అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్ కి బాగా అలవాటు పడిపోయాం. ఏ మాత్రం నడుము వంచకుండా.. అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాం. కానీ.. మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ మనం వాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. 

చాలామంది సంప్రదాయబద్ధం కింద నేలపై కూర్చుకుని భోజనం చేయడం చూస్తూ ఉంటాం. డైనింగ్ టేబుల్, చెయిర్ ఉన్నా కూడా మన పెద్దవాళ్లు దానిపై తినడానికి ఇబ్బందిగా ఫీలవుతారు. అందుకే.. పాత పద్ధతినే పాటిస్తూ కింద కూర్చుని తింటారు. అయితే ఈ కాలం పిల్లలకు, పెద్దవాళ్లకు టీవీ ముందు కూర్చుని, సోఫాలు, మంచాలు, కుర్చీలు.. ఏది అనుకూలంగా ఉంటే వాటిపై కూర్చుని ఆరగించేస్తుంటారు.

ఇలా కూర్చుని తినడం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ.. ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందివ్వదు. మనం నేలపై కూర్చుని తినాలని మన పెద్దవాళ్లు చెప్పిన పద్ధతి వెనక చాలా ప్రయోజనాలున్నాయి. కూర్చునే పద్ధతి కూడా రెండు కాళ్లు క్రాస్ గా మడతపెట్టి కూర్చుని తినాలి. ఇలా తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు మీరు విస్తుపోయేలా చేస్తాయి. మీరు ఖచ్చితంగా నేలపై కూర్చుని తినే అలవాటుకి మీ మనసు మారేలా చేసే కారణాలేంటో చూసేద్దామా..

జీర్ణక్రియ : 

  • తినడానికి నేలపై కూర్చునప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్లు మడతపెట్టి కూర్చుంటారు. అంటే.. దాన్నే సుఖాసన లేదా హాఫ్ పద్మాసన అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకి సంకేతాలు అందుతాయి.
  • ప్లేట్ ఫ్లోర్ పై ఉండటం వల్ల ఆటోమెటిక్ గా మీ శరీరం కిందకు వంగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కి కూర్చున్న పొజిషన్ కి వస్తుంది. ఇలా వెనక్కి, ముందుకి వెళ్లడం వల్ల.. పొట్టలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల ఆహారం త్వరగా, సులువుగా జీర్ణమవుతుంది.


బరువు తగ్గడానికి :

  • ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా కూర్చుని తినేటప్పుడు ఆహారంపై మెదడు ఫోకస్ పెడుతుంది. ఎంత పరిమాణంలో ఆహారం తిన్నారు అనే విషయాన్ని గుర్తించి.. పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.
  • సాధారణంగా పొట్ట నుంచి బ్రెయిన్ కి వాగస్ నెర్వ్ సిగ్నల్స్ అందజేస్తుంది. మీరు తిన్న ఆహారం మీ పొట్ట నింపిందా లేదా అనే విషయాన్ని ఈ సిగ్నల్స్ అందిస్తాయి. ఎప్పుడైతే కింద ఫ్లోర్ పై కూర్చుని తింటారో అప్పుడు ఈ నరం బాగా పనిచేసి.. ఎఫెక్టివ్ గా సిగ్నల్స్ అందిస్తుంది. టేబుల్ పై కూర్చుని తినడం కంటే.. కింద నిదానంగా తింటారు. దీనివల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.


అనుకూలంగా:

  • పద్మాసనంలో కూర్చుని తినడం వల్ల నడుము కింద భాగం, పెల్పిస్, పొట్ట చుట్టూ.. కండరాల నొప్పులు తగ్గుతాయి. మీ జీర్ణవ్యవస్థ రిలాక్స్ గా, నార్మల్ పొజిషన్ లో ఉండేలా సహాయపడతాయి. త్వరగా, వేగంగా జీర్ణమవడానికి ఈ పద్మాసనం సహాయపడుతుంది.



  • జాగ్రత్తగా తినడానికి ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచుకుంటారు. మీ శరీరం న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడానికి సహాయపడుతుంది. స్మెల్, టేస్ట్, టెక్చర్, ఎంత తింటున్నాం అనే విషయాలను ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గమనిస్తారని.. స్టడీస్ చెబుతున్నాయి.
  • కుటుంబంతో అనుబంధం సాధారణంగా ఫ్లోర్ పై కూర్చుని తినేది ఫ్యామిలీ యాక్టివిటీ. ఇది కుంటుంబంతో సంబంధం ఏర్పరచుకోవడానికి సరైన సమయం. కింద కూర్చుని తినడం వల్ల ప్రశాంతమైన, హ్యాపీ మూడ్ ఉంటుంది. ఇది కుటుంబంతో బాంధవ్యాన్ని పెంచుతుంది. అలాగే.. కింద కూర్చుని తినేటప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తినడం కూడా ఆనవాయితీ ఉంటుంది.
  • భంగిమ ఆరోగ్యంగా ఉండటానికి భంగిమ చాలా అవసరం. మంచి భంగిమ కేవలం ఆరోగ్యానికే కాదు.. గాయాలను తగ్గిస్తుంది. కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడకుండా నివారిస్తుంది. అలాగే రకరకాల బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులు రాకుండా అరికడుతుంది.
  • ఆయుష్షు ఇది నమ్మసక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని.. అధ్యయనాలు నిరూపించాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా పద్మాసనం వేసేవాళ్లు ఎక్కువకాలం బతుకుతారని ఈ స్టడీస్ వెల్లడించాయి.
  • మోకాళ్లు కీళ్ల ఆరోగ్యానికి పద్మాసనం శరీరం మొత్తానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. కీళ్లు ఆరోగ్యంగా, కదలికలు మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. మోకాళ్లు వంచడం, పాదాలు, పిరుదుల భాగాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
  • నరాలకు సుఖాసన లేదా పద్మాసనం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అందుకే ఫ్లోర్ పై కూర్చుని తినే సంప్రదాయం మన పూర్వీకులు కనుగొన్నారు. ఇలా కూర్చుని తినడం వల్ల మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. దీనివల్ల నరాలు ఉత్తేజితమవుతాయి.
  • రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యానికి తినేటప్పుడు శరీరంలో వేడిగా అనిపించడం గమనించారా ? కొన్ని సందర్భాల్లో చెమట కూడా పడుతుంది. ఇది ఎందుకంటే.. తినేటప్పుడు పొట్టకు ఎనర్జీ చాలా అవసరం. డైజెషన్ కి ప్రధానంగా బ్లడ్ సర్క్యులేషన్. కాబట్టి ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్ లేదా చెయిర్ పై కూర్చుంటే.. బ్లడ్ ఫ్లో హార్ట్ కి సరిగా ఉండదు. కాబట్టి నిత్యం ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల హెల్తీ హార్ట్, స్ట్రాంగ్ మజిల్స్ పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పద్ధతిని ఫాలో అయిపోతారు కదూ..


Monday, April 25, 2016

ఆ వారములో ఇతరులకు డబ్బు ఎందుకివ్వకూడదు? కారణం ఏమిటి?

మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.

ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.

తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో. మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు. శ్రీ కాళ హస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది. బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.

ఇవి పాటించవలసిన విషయాలేనా? ఇందులో ఎంత వరకూ నిజం వుంది? బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా..? చెడ్డదా..?

సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము..అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరుకి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.

శుక్రవారాల్లో ఇతరులకు డబ్బు ఎందుకివ్వకూడదు..?


  • ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట. అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా? మంగళవారం నాడు చెయ్యండి. ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.
  • అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.
  • ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.
  • అయితే మనకి వారాల పట్టింపు వుందని ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానెయ్యకూడదు. ఎందుకంటే అది వారి డబ్బు. వారు పని చెయ్యటం వల్ల సంపాదిచుకున్న డబ్బు. మనం వారికి బాకీ వున్నాము. దానికి వార వర్జ్యాలు చూడకుండా ఇచ్చెయ్యాలి.
  • ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటినుంచి పంపకూడదు.
  • అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు. కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించ కూడదు.
  • అందుకే ఏదీ గుడ్డిగా నమ్మక సమయానుకూలంగా, డబ్బుని ఎప్పుడు ఏ సమయంలో దేనికి వినియోగించాలో అలా వినియోగించాలి. ఆ ఆలోచన వుంటే ఆర్ధిక ఇబ్బందులే వుండవుకదా.


Sunday, April 24, 2016

ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది ?

వెల్లుల్లిని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. ఇది లేకుండా.. ఎలాంటి ఆహారం ఉండదంటే అతిశయోక్తి కాదు. మంచి సువాసన, ఘాటైన రుచి, అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్న వెల్లుల్లిని ట్రెడిషనల్ స్పైస్ గా చెప్పవచ్చు. కూరలైనా, చారులైనా, చట్నీలైనా, సాంబారైనా, పప్పు అయినా, పులుసు అయినా.. వెల్లుల్లి ఘాటు తగలాల్సిందే అంటారు.

వెల్లుల్లిని 5 వేల సంవత్సరాల క్రితం నుంచి పండిస్తున్నారు. వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. పురాతన కాలం నుంచి వెల్లుల్లికి వంటింట్లో అద్భుతమైన స్థానం ఉంది. అయితే వెల్లుల్లిని ఉదయాన్నే పరగడపున తీసుకోవాలని మీకు తెలుసా ? నిజమే ఉదయాన్నే ఒక ముక్క వెల్లుల్లి తీసుకోవడం వల్ల లెక్కలేనన్ని హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చట.



ఒక రెబ్బ వెల్లుల్లిలో 5 ఎమ్ జీ క్యాల్షియం, 12 ఎమ్ జీ పొటాషియం, 100 పైగా సల్ఫరిక్ ఉంటాయి. ఇన్ని గొప్ప గుణాలున్న వెల్లుల్లిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అందుకే వెల్లుల్లిని ఉదయాన్ని ఆస్వాదించాలని స్టడీస్ చెబుతున్నాయి. ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

జలుబు, ఫ్లూ వెల్లుల్లిలో ఇన్ఫెక్షన్లను దూరం చేసే గుణం ఉంది కాబట్టి. . ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే.. జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి.

నరాలకు ఉదయాన్నె వెల్లుల్లి తీసుకోవడం వల్ల.. నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు. ఒకవేళ మీరు నరాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తగ్గిపోతాయి.

కొలెస్ట్రాల్ వెల్లుల్లి బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుని వెల్లుల్లి తినడంతో ప్రారంభించండి.

ఇమ్యునిటీ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.