Saturday, April 2, 2016

యవ్వనంగా ఉండాలని ఉందా..? అయితే ఇలా చేయండి...

  • సరైన ఆహార పదార్థాల ద్వారా జీవితకాలాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
  • సేంద్రియ పాలలో 40-50 శాతం అధిక యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి.
  • ఫ్రీ రాడికల్ ల వినాశనానికి యాంటీ ఆక్సిడెంట్ లు తప్పక అవసరం.
  • విత్తనాలలో ఉండే ఫైటోకెమికల్ లు వృద్దాప్యాన్ని ఆలస్యపరుస్తాయి.


సరైన ఆహార పదార్థాలను పాటించే ఆహార ప్రణాళికకు కలుపుకోవటం ద్వారా మీ జీవతకాలాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అవును, ఆరోగ్యకర జీవనశైలి, ఉత్సాహవంతంగా ఉండటం వంటివి సహాయపడతాయి కానీ, వృద్దాప్యానికి చేరే సమయాన్ని ఆలస్యపరచుటకు, పోషకాలతో నిండిన ఆహారాలు, యాంటీ ఆక్సిడెంట్ లతో నిండిన ఆహర పదార్థాలు కూడా తప్పని సరి అవసరం. ఫ్రీ రాడికల్ ల వలన శరీరానికి కలిగే ప్రమాదాలను ఈ యాంటీ ఆక్సిడెంట్ లు నివారించి, వివిధ రకాల వ్యాధులు కలగకుండా కాపాడతాయి. ఈ చర్యల ఫలితంగా మీరు వృద్దాప్యానికి చేరే ప్రక్రియ ఆలస్యపరచబడుతుంది. దీర్ఘకాలిక సమయం పాటు యవ్వనంగా కనపడటానికి కింద పేర్కొన్న ఆహార పదార్థాలను పాటించే ఆహార ప్రణాళికలలో కలుపుకోండి.

ఆలివ్ ఆయిల్
వృద్దాప్య సంబంధిత వ్యాధులను కలగకుండా కాపాడే ఫాలీఫినాల్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ లో కనుగొనబడిన మోనోసాచురేటేడ్ కొవ్వు పదార్థాలు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచటమేకాకుండా, క్యాన్సర్ కు గురయ్యే అవకాశాలను కూడా దాదాపు తగ్గించి వేస్తాయి. 40 సంవత్సరాల క్రితం ఏడు దేశాల వారు జరిపిన పరిశోధనలలో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది.

సేంద్రియ పాలు
పాశ్చురైజేషణ్ చేసిన పాలకు బదులుగా రోజు సహజ పాలను తాగండి. సహజ పాలు పూర్తీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆవులు సహజ సేంద్రీయ పదార్థాలు అయినట్టి గడ్డి, ఆకుపచ్చని ఆకులను తినటం వలన వీటి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ లు అధిక మొత్తంలో ఉంటాయి. కృత్రిమ పద్దతుల ద్వారా పెంచే ఆవుల నుండి సేకరించిన పాల కన్నా, సహజ పద్దతుల ద్వారా పెంచే ఆవు పాలలో 40 నుండి 50 శాతం అధిక యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. ఉపభాగాలు, ధాన్యాలను తినే ఆవుల కన్నా, సహజ గడ్డితినే ఆవు పాలు చాలా విధాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

యోగ్ హార్ట్
ఒక కప్పు పెరుగు ద్వారా, ఒక కప్పు ఉడికించిన పాలకూర నుండి పొందే 'రిబోఫ్లావిన్' లకు సరి సమానంగా పొందవచ్చు. రిబోఫ్లావిన్ (విటమిన్ 'B') లు యాంటీ ఆక్సిడెంట్ లు శక్తివంతంగా పని చేయటానికి అవసరం. వీటి ప్రమేయం లేకుండా, 'గ్లూటాథయోన్ యాంటీ ఆక్సిడెంట్'లు శరీరంలో చేసే ఫ్రీ రాడికల్ లను వినాశనం చెందించలేవు. తిరిగి శరీరం ఉత్సాహవంతంగా మారటానికి రిబోఫ్లావిన్ లు అవసరం ఎందుకంటే, ఇవి నీటిలో కరిగి మరియు కొద్ది గంటలలోనే శరీరాన్ని తిరిగి పునరుద్దపరుస్తుంది.

సహజ చక్కెరలు
పాటించే ఆహార ప్రణాళిక నుండి అదనపు చక్కెరలను తొలగించారా! అయితే బ్రౌన్ షుగర్, మాపిల్ సిరప్, తేనె మరియు చెరకు మడ్డి వంటి సహజ చక్కెరలను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించాకుండా, చక్కెరపై ఉన్న మక్కువను సంతృప్తి పరుస్తాయి. "వర్జీనియా టెక్ యూనివర్సిటీ" వారు జరిపిన అధ్యయనంలో, చెరకు మడ్డి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుందని కనుగొన్నారు.

గింజలు మరియు విత్తనాలు
ఇవి అధిక మొత్తంలో అన్-సాచురేటేడ్ కొవ్వులను కలిగి ఉండి, ఆలివ్ ఆయిల్ వలే ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా, విటమిన్, మినరల్ మరియు వృక్షఆధారిత రసాయనాలను (ఫైటోకెమికల్) లను కలిగి ఉండి, వృద్దాప్యాన్ని నివారిస్తాయి. 

ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చిది..?

ఏడు కొండలు...ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.. 

వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే... భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషబాధ్రి అయ్యాడు, హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. 

స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల... నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవచేస్తున్నాడు. ఇక నారాయణాద్రి,వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ, విజయులకు ప్రతిరూపాలు. తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు . వెంకన్న కొలువై వున్నా ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు )మాత్రమె కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి . అవి


వృషభాద్రి పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు "తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది "అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది .


నీలాధ్రి స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొండలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే..


గరుడాద్రి: శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందు వల్ల అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది. మరో విధంగా కూడా చెబుతారు. దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.


అంజనాద్రి : వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి, చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .


నారాయణాద్రి : విష్ణుదర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది . నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.


వేంకటాద్రి: కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి..వేం అనగా సమస్త పాపాలను కటః అనగా దహించునది అంటే స్వామి వారి సమక్షంలో పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .

శేషాద్రి : ఏడుకొండలలో ప్రధానమైనది శేషాద్రి. ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . "నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు "అంటూ ఆదిశేషుడు వెంకటాచాలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా భాదతో వున్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,"నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది .

శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ప్రదేశం ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చిది..? ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు .

Friday, April 1, 2016

వడ్డీరేట్ల కోత నేటి నుంచే...

న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై శుక్రవారం నుంచీ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై 1.3 శాతం వరకూ వడ్డీరేటు తగ్గనుంది. ప్రతి త్రైమాసికానికీ... ముందు నెల 15వ తేదీ చిన్న పొదుపులపై రేట్లను సమీక్షిస్తారు.

దీని ప్రకారం జులై నుంచి సెప్టెంబర్ మధ్య అమలయ్యే వడ్డీరేటు జూన్ 15న నిర్ణయమవుతుంది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర వ్యాధులు, పిల్లల విద్య వంటి తప్పని అవసరాలకైతే పీపీఎఫ్ అకౌంట్ల ముందస్తు ఉపసంహరణలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో ఒకశాతం జరిమానాగా ఉంటుంది.

 తగ్గే రేట్లు ఇలా...
♦ కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటు తగ్గటంతో 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతున్న పొదుపు ఇకపై 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు రెట్టింపవుతుంది.
♦ తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది.
♦ {పజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది.
♦ ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది.
♦ పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఇకపై ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.
♦ సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్షలో మినహాయించిన సుకన్యా సంమృద్ధి యోజనపై వడ్డీని కూడా 9.2 నుంచి 8.6 శాతానికి తగ్గించారు.
♦ గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన  ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. మార్చి 18నే ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది.
♦ ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్  డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి అందదు.
♦ ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించిన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరిట దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పీపీఎఫ్‌ల విషయంలో వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ తర్వాతి త్రైమాసికంలో (మార్చి 18న తీసుకున్న నిర్ణయం ప్రకారం) ఈ మినహాయింపులు తొలగించడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.