Friday, March 18, 2016

మీ ఫోన్ ఎంత స్మార్టో మీకేమైనా తెలుసా...!

ప్రస్తుతం జేబులో పెన్ను ఉన్నా లెకున్నా సెల్ ఫోన్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా సెల్ ఫోన్ లేకుండ అడుగు పడటం లేదు ఈ కాలం మనుషులకు . అయితే అంతగా వాడే సెల్ ఫోన్ సుబ్రంగా ఉందా అని మాత్రం ఎవరూ ఆలోచించరు. కాలక్రమంలో వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంటున్నారు నిపుణులు. ఈ బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి టాయిలెట్ కి వెళ్లినప్పుడు కన్నా ఎక్కువగా అంటే 18 రెట్లు మీ మొబైల్ లో బ్యాక్టీరియా ఉంటుంది.


ఈ బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు. మొబైల్స్ మీద ఈ కోలి అదే విధంగా ఇన్ఫ్ల్యూయాంజ, యంఆర్ఎస్ఎ వంటి బ్యాక్టీరియాల్లెన్నో ఫోన్ల మీద తిష్టవేస్తున్నాయి . ఇవన్నీ రాషెస్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తున్నాయి . ఈ కోలి డయోరియా, పొట్ట ఉదరంలో క్రాంప్స్, వామిటింగ్ ఇన్ఫ్ల్యుయాంజీ వైరస్ వల్ల ఫ్లూ మరియు రెస్పరేటరీ సమస్యలకు కారణం అవుతుంది . ఇవి మరిన్ని ఇన్ఫెక్షన్స్ కు గురిచేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్కిన్ కు దగ్గరిగా ఫోన్ మాట్లాడితున్నప్పుడు ఫోన్ మీద ఉండే మురికితో పాటు, బ్యాక్టీరియా చర్మం రంద్రాల్లో చేరి మొటమలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటికి దారితీస్తాయి . అది అలాగే చేతి వేళ్ళ గుండా ఫోన్ కు అంటుకొని స్ప్రెడ్ అవుతుంది . అంతే కాదు ఈ బ్యాక్టీరియా ముఖం, ముక్కు, పెదాలకు కూడా పాకడం వల్ల ఇన్ఫెక్షన్స్ డబుల్ గా పెరిగే అవాకాశాలున్నాయి. మరి అలాంటప్పుడు మీరు జలబు, ఇన్ఫెక్షన్స్ వచ్చనిప్పుడు వాతావరణం కారణంగా చెప్పకుండా ఫోన్ ను కూడా గమనించండి. మరి ఇంకా ఫోన్ ఏవిధంగా మురికిపడుతుందో తెలుసుకుందాం...

ఫోన్ ఎలాంటి ప్రదేశంలో పెడుతున్నారు :
ఫోన్స్ ను కేవలం మాట్లాడటానికి కాదు, మాట్లాడిన తర్వాత ఫ్లోర్ మీద, లేదా బల్ల మీద, కుర్చీలు మీద పెట్టడం , చాట్ చేయడం ఇవన్నీ స్కీన్ టచ్ మీద ఆధారపడి ఉంటుంది . మరి ప్రతి సారి మన చేతులకు , ఫ్లోర్కు అంటిన క్రిములు మనకు తెలియకుండా ఫోన్ కు అంటుకోవడం వల్ల మురికి పడుతుంది.

భోజనం తర్వాత ఉపయోగించడం : 
భోజనం చేసిన తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకుంటారు. మరి వెంటనే ఫోన్ టచ్ చేయడం వల్ల చేతికున్న ఆయిల్, ఫుడ్ పార్టిక్ల్స్ ఫోన్ స్ర్కీన్ మరియు ఇతర ప్రదేశాల్లో చేరతాయి .

రెస్ట్ రూమ్ ఇన్ అండ్ అవుట్ ఉపయోగించడం:
రెస్ట్ రూమ్ కు వెళ్లి వచ్చిన వెంటనే ఫోన్స్ ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం . మిలియన్స్ లో క్రిములకు ఆహ్వానం పలికినట్లే . ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించినప్పుడు , సర్ఫేస్, సీట్స్, హ్యాండిల్స్ మొదలగునవి ముట్టుకోవడం వల్ల ఇతరుల టచ్ చేసిన వాటిటిని టచ్ చేయడం వల్ల క్రిములు ఒకరి నుండి మరొకరి చేతులకు అంటుకొని ఫోన్లవరకూ బ్యాక్టీరియా పాకుతుంది

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్:
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించే వారి ఫోన్స్ మీద ఎక్కువ క్రిములు చేరుతాయి. బస్సుల్లో ప్రయాణించే వారు వారు సపోర్ట్ గా పట్టుకొనే పోల్స్, సీట్స్, హ్యాండిల్స్ వంటి వాటిమీద వేలకొద్ది క్రిములు, డస్ట్ చేరి ఉండటం వల్ల , ఫోన్లు పట్టుకోవడం వల్ల చాలా వేగంగా బ్యాక్టీరియా చేరుతుంది.

చెమట:
ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడటం వల్ల ఫోన్ స్క్రీన్ మీద క్రిములు చెమట రూపంలో చేరుతాయి .

పెట్స్ తో ఆడిన వెంటనే : 
ఇంట్లో పెంపుడు జంతువులతో ఆడిన వెంటనే మొబైల్ ఫోన్ టచ్ చేసిన ప్పుడు వాటి మీద ఉండే డస్ట్ మరియు క్రిములు చేతుల ద్వారా ఫోన్ మీదకు బ్యాక్టీరియా చేరుతుంది.

ఇతరలు వాడినప్పుడు: 
మన ఫోన్ మనం కాకుండా వేరే వారు ఉపయోగించినప్పుడు వారి చేతుల నుండి బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం.

ఫ్లోర్ మీద పెట్టినప్పుడు: 
ఫ్లోర్ మీద మనకు కనబడని ఎన్నో క్రిములు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవన్నీ ఫోన్ మీద చాలా సులభంగా చేరే అవకాశాలున్నాయి.






వాటర్ మెలోన్ మరియు స్ట్రాబెర్రీ స్మూతీ

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కంటే...ఏ ఎండకు ఆ షేక్స్ తాగడం బెటర్. షేక్స్‌తో ఎండలకు షాకివ్వవచ్చు. సమ్మర్‌ని షేక్ చేయవచ్చు. మిల్క్ షేక్‌లు..స్మూతీలు ..కడుపును చల్లగా ఉంచుతాయి. ఒంటికీ చలవ చేస్తాయి. పాలూ పండ్లతో ఒక షేక్. చాకో కోకోలతో ఇంకో షేక్. ఐస్ క్రీములతో మరో షేక్..షేక్. ఎండల్ని రుచికరంగా చల్లబరుచుకోండి. ఈ సమ్మర్‌ను వశపరుచుకోండి. ఇక అప్పుడే మార్కెట్లో వాటర్ మెలోన్, స్ట్రాబెర్రీలు దర్శనమిస్తుననాయి. పిల్లలు అలాగే తినమంటే తినరు. ఎలా అనుకుంటూ పాల..ఐస్ క్రీమ్ తో స్మూతీ చేసిఇవ్వొచ్చు. పాలు, పళ్లు రెండు ఒకేసారి పిల్లలకు, పెద్దలకు కూడా ఇలా ఇవ్వొచ్చన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం..మరియు ఇష్టంగాను తాగేస్తారు..మరీ మీరు తయారు చేయండి ఈ సింపుల్ అండ్ టేస్ట్ వాటర్ మెలోన్ -స్ట్రాబెర్రీ స్మూతీని..



కావల్సిన పదార్థాలు:
స్ట్రాబెర్రీస్ - 1 cup
వాటర్ మెలోన్ - 2 cup
యాలకలు - 2 to 3
పెప్పర్ - చిటికెడు
షుగర్ - 1/2 cup
ఐస్ - 1/2 cup
తయారుచేయు విధానం:
1. ముందుగా వాటర్ మెలోన్ మరియు స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిలో విత్తనాలు తొలగించాలి.
2. తర్వాత ఈ ఫ్రూట్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేయాలి.
3. తర్వాత ఈ స్మూతీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు బయట అలాగే ఉంచాలి.
4. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతిని మిక్సీ జార్లో వేసి , స్మూతీతో పాటు, ఐస్ క్యూబ్స్, యాలకలు, మరియు పంచదార వేసి మరో సారి గ్రైండ్ చేయాలి.
5. తర్వాత ఈ స్మూతీని సర్వింగ్ గ్లాసులోకి మార్చుకొని చిటికెడు పెప్పర్ పౌడర్ ను చిలకరించి, కూల్ కూల్ గా ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కు సర్వ్ చేయడమే ఆలస్యం.

అరటి తొక్కలతో మీ పెరటిలోని మొక్కలను ఆరోగ్యంగా పెంచడం ఎలా...

అరటిపండ్లు శక్తి కలగటానికి ఒక అద్భుతమైన మూలం మరియు వీటిని మధ్యాహ్న చిరుతిండిగా ప్రజలందరు అభిమానిస్తారు. మీరు తొక్కను దూరంగా విసిరేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఇంట్లో ఆకుపచ్చని చెట్లు ఉంటే, ఈ అరటితొక్కలు మీ మొక్కలకు అద్భుతమైన ఎరువుగా తయారు చేయవచ్చు, ఆలోచించండి. ఇవి మీ శరీరం పోషకాహారంగా మాత్రమే కాదు, మీ మొక్కలకు కూడా సమానంగా ఉపయోగకరంగా ఉంటాయి. అరటి ఎరువు లేదా కంపోస్ట్, మూడు విధాలుగా తయారు చేయవచ్చు:



అరటి బేసిక్స్ - మీరు తొక్కలను చిన్న చిన్న భాగాలుగా కట్ చేయండి మరియు వీటిని మీ రెగ్యులర్ కంపోస్ట్ లో లేదా నేరుగా మట్టితో కలపండి. ఇవి కొన్ని రోజుల్లో కంపోస్ట్ గా మారిపోతాయి మరియు స్వయంచాలకంగా మీ మొక్కలు పెరగడానికి తగినంత శక్తి ఇవ్వడం ప్రారంభమౌతుంది.

పిచికారీ చేయటం వలన కంపోస్ట్ తయారు చేయవచ్చు -అరటి తొక్కలను చాప్ చేయండి మరియు వీటిని ఒక స్ప్రే క్యాన్ లో ఉంచండి - . కాన్ సగం వరకు గోరువెచ్చని నీటిని పోయండి . నీటిలో పీల్స్ బాగా నానేవరకు ఒక వారం రోజులపాటు అలానే ఉంచండి. తరువాత ఈ మిశ్రమాన్ని మీరు కొన్ని టిఎల్సి మరియు శక్తితో మీ మొక్కలకు పిచికారీ చేయండి. అరటి పీల్స్ షేక్ - అవును మీరు సరిగానే చదివారు! మీరు కంపోస్ట్ తయారీ కోసం చూస్తున్నట్లయితే, కేవలం కొంత వేడి నీటితో అరటి పీల్స్ కలపండి మరియు ఇక మొక్కలకు వేయటానికి సిద్ధపడండి!

Thursday, March 17, 2016

సపోటాలో దాగున్న మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు

సపోటా రుచికరమైన హెల్తీ ఫ్రూట్ . అంతే కాదు ఇందులో న్యూట్రీషియనల్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి .ఇది మామిడిపండ్లు, అరటిపండ్లు, మరియ జాక్ ఫ్రూట్ వంటి కోవలోకి వస్తాయి . ఇవన్నీ తక్కువ క్యాలరీలను అందిస్తాయి. ఇది ఒక మంచి ఉత్తమమైన ఫ్రూట్ . ఇది తక్షణ శక్తిని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

 ఈ పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ లు ఎనర్జీ బూస్టర్స్ గా పనిచేస్తాయి . సపోటా పండ్లలో అనేక న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ఎ, మరియు సిలు కూడా పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇది కాపర్ కు మంచి మూలం వంటిది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా ఫైూబర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇది ల్యాక్సేటివ్. సపోటాలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని మరియు మ్యూకోస ను కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది . అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ లంగ్ మరియు ఓరల్ క్యావీటి క్యాన్సర్ ప్రమాధాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. సపోటాలో ఉండే టానిన్ కంటెంట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ , యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అంతే కాదు, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం...

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది: సపోటాపండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది: సపోటాలో ఉండే ఫైబర్ మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్ క్రోనిక్ మలబద్దకాన్నినివారిస్తుంది .

ఇన్ఫ్లమేషన్ దూరం చేస్తుంది: సపోటాపండ్లలో ఉండే టానిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కండరాల సలుపులు, నొప్పులను నివారించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గా సపోటాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది శరీరంలోని వాపు మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది: ఈ పండు కిడ్నీ స్టోన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోవతాయి. ముఖ్యంగా సపోటా పండులోని విత్తనాలను పొడి చేసి, గ్లాసు నీటిలో వేసి త్రాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ నివారించబడుతాయి . సపోటాలో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీలోని స్టోన్స్ ను నివారిస్తుంది.

బోన్స్ స్ట్రాంగ్ గాఉంచుతుంది: సపోటాలో ఉండే క్యాల్షియం మరియు ఇతర మినిరల్స్ ఫాస్పరస్, మరియు ఐరన్ వంటివి బోన్స్ ను స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుతాయి . సపోటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బోన్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఇది బోన్ హెల్త్ మరియు క్వాలిటీని మెరుగుపరుస్తాయి.