Friday, March 18, 2016

మీ ఫోన్ ఎంత స్మార్టో మీకేమైనా తెలుసా...!

ప్రస్తుతం జేబులో పెన్ను ఉన్నా లెకున్నా సెల్ ఫోన్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా సెల్ ఫోన్ లేకుండ అడుగు పడటం లేదు ఈ కాలం మనుషులకు . అయితే అంతగా వాడే సెల్ ఫోన్ సుబ్రంగా ఉందా అని మాత్రం ఎవరూ ఆలోచించరు. కాలక్రమంలో వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంటున్నారు నిపుణులు. ఈ బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి టాయిలెట్ కి వెళ్లినప్పుడు కన్నా ఎక్కువగా అంటే 18 రెట్లు మీ మొబైల్ లో బ్యాక్టీరియా ఉంటుంది.


ఈ బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు. మొబైల్స్ మీద ఈ కోలి అదే విధంగా ఇన్ఫ్ల్యూయాంజ, యంఆర్ఎస్ఎ వంటి బ్యాక్టీరియాల్లెన్నో ఫోన్ల మీద తిష్టవేస్తున్నాయి . ఇవన్నీ రాషెస్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తున్నాయి . ఈ కోలి డయోరియా, పొట్ట ఉదరంలో క్రాంప్స్, వామిటింగ్ ఇన్ఫ్ల్యుయాంజీ వైరస్ వల్ల ఫ్లూ మరియు రెస్పరేటరీ సమస్యలకు కారణం అవుతుంది . ఇవి మరిన్ని ఇన్ఫెక్షన్స్ కు గురిచేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్కిన్ కు దగ్గరిగా ఫోన్ మాట్లాడితున్నప్పుడు ఫోన్ మీద ఉండే మురికితో పాటు, బ్యాక్టీరియా చర్మం రంద్రాల్లో చేరి మొటమలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటికి దారితీస్తాయి . అది అలాగే చేతి వేళ్ళ గుండా ఫోన్ కు అంటుకొని స్ప్రెడ్ అవుతుంది . అంతే కాదు ఈ బ్యాక్టీరియా ముఖం, ముక్కు, పెదాలకు కూడా పాకడం వల్ల ఇన్ఫెక్షన్స్ డబుల్ గా పెరిగే అవాకాశాలున్నాయి. మరి అలాంటప్పుడు మీరు జలబు, ఇన్ఫెక్షన్స్ వచ్చనిప్పుడు వాతావరణం కారణంగా చెప్పకుండా ఫోన్ ను కూడా గమనించండి. మరి ఇంకా ఫోన్ ఏవిధంగా మురికిపడుతుందో తెలుసుకుందాం...

ఫోన్ ఎలాంటి ప్రదేశంలో పెడుతున్నారు :
ఫోన్స్ ను కేవలం మాట్లాడటానికి కాదు, మాట్లాడిన తర్వాత ఫ్లోర్ మీద, లేదా బల్ల మీద, కుర్చీలు మీద పెట్టడం , చాట్ చేయడం ఇవన్నీ స్కీన్ టచ్ మీద ఆధారపడి ఉంటుంది . మరి ప్రతి సారి మన చేతులకు , ఫ్లోర్కు అంటిన క్రిములు మనకు తెలియకుండా ఫోన్ కు అంటుకోవడం వల్ల మురికి పడుతుంది.

భోజనం తర్వాత ఉపయోగించడం : 
భోజనం చేసిన తర్వాత మీ చేతులను శుభ్రం చేసుకుంటారు. మరి వెంటనే ఫోన్ టచ్ చేయడం వల్ల చేతికున్న ఆయిల్, ఫుడ్ పార్టిక్ల్స్ ఫోన్ స్ర్కీన్ మరియు ఇతర ప్రదేశాల్లో చేరతాయి .

రెస్ట్ రూమ్ ఇన్ అండ్ అవుట్ ఉపయోగించడం:
రెస్ట్ రూమ్ కు వెళ్లి వచ్చిన వెంటనే ఫోన్స్ ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం . మిలియన్స్ లో క్రిములకు ఆహ్వానం పలికినట్లే . ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించినప్పుడు , సర్ఫేస్, సీట్స్, హ్యాండిల్స్ మొదలగునవి ముట్టుకోవడం వల్ల ఇతరుల టచ్ చేసిన వాటిటిని టచ్ చేయడం వల్ల క్రిములు ఒకరి నుండి మరొకరి చేతులకు అంటుకొని ఫోన్లవరకూ బ్యాక్టీరియా పాకుతుంది

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్:
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించే వారి ఫోన్స్ మీద ఎక్కువ క్రిములు చేరుతాయి. బస్సుల్లో ప్రయాణించే వారు వారు సపోర్ట్ గా పట్టుకొనే పోల్స్, సీట్స్, హ్యాండిల్స్ వంటి వాటిమీద వేలకొద్ది క్రిములు, డస్ట్ చేరి ఉండటం వల్ల , ఫోన్లు పట్టుకోవడం వల్ల చాలా వేగంగా బ్యాక్టీరియా చేరుతుంది.

చెమట:
ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడటం వల్ల ఫోన్ స్క్రీన్ మీద క్రిములు చెమట రూపంలో చేరుతాయి .

పెట్స్ తో ఆడిన వెంటనే : 
ఇంట్లో పెంపుడు జంతువులతో ఆడిన వెంటనే మొబైల్ ఫోన్ టచ్ చేసిన ప్పుడు వాటి మీద ఉండే డస్ట్ మరియు క్రిములు చేతుల ద్వారా ఫోన్ మీదకు బ్యాక్టీరియా చేరుతుంది.

ఇతరలు వాడినప్పుడు: 
మన ఫోన్ మనం కాకుండా వేరే వారు ఉపయోగించినప్పుడు వారి చేతుల నుండి బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం.

ఫ్లోర్ మీద పెట్టినప్పుడు: 
ఫ్లోర్ మీద మనకు కనబడని ఎన్నో క్రిములు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవన్నీ ఫోన్ మీద చాలా సులభంగా చేరే అవకాశాలున్నాయి.






No comments:

Post a Comment