Friday, September 16, 2016

డార్క్ స్కిన్ వైట్ గా మార్చే బీట్ రూట్ శెనగపిండి ఫేస్ మాస్క్


ఫెయిర్ స్కిన్ పొందాలనుకునే వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.మార్కెట్లో వచ్చే ప్రతి క్రీమ్ టెస్ట్ చేసుంటారు, ఇంట్లో వివిధ రకాలుగా ఫేస్ ప్యాక్ లు, చిట్కాలను, హోం రెమెడీస్ ను ఉపయోగించి ఉంటారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా మార్పు కనిపించినా ఒకటి రెండ్రోజుల తర్వాత తిరిగి స్కిన్ యాథావిధంగాతయారవుతుంది. అయితే మీరు వీటన్నింటితో విసిగిపోయి, ఒక కొత్త చర్మం, క్లియర్ గా , హెల్తీగా మరియు బ్రైట్ గా ఉండే స్కిన్ టోన్ ను కోరుకుంటున్నట్లైతే మీకు ఇక అద్భుతమైన హోం రెమెడీ ఉంది. అదే బేసన్ బీట్ రూట్ ఫేస్ మాస్క్ , ఇది చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం శుభ్రం పడుతుంది. చర్మం క్లియర్ గా కనబడుతుంది. ఈ ఫేస్ మాస్క్ కు ఇతర పదార్థాలు కూడా చేర్చుకోవచ్చు. 



నిమ్మరసం,శెనగపిండి, తేనె మరియు టమోటో జ్యూస్ వంటివి చేర్చుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపడుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్స్ వల్ల బీట్ రూట్ ఫేస్ మాస్క్ లో కలపడం వల్ల ఇది ఇన్ స్టాంట్ గా ఫేయిర్ నెస్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మంలోని మచ్చలును మాయం చేస్తుంది. స్కిన్ టోన్ క్లియర్ చేస్తుంది. 



టమోటోలో బీటాకెరోటిన్ మరియు లికోపిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది, సెబమ్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. స్కిన్ లోపలి వరకూ వెళ్ళి, చర్మానికి తగిన పోషణను అందిస్తుంది .చర్మం రేడియంట్ గా మారుతుంది. 



బీట్ రూట్ అండ్ బేసన్ మాస్క్. స్కిన్ లైట్ గా మార్చుతుంది. శెనగపిండిలో ఉండే క్లెన్సింగ్ లక్షణాలు చర్మంలో దాగున్న మురికిని తొలగిస్తుంది. చర్మ రంద్రాలు మూసుకునేలా చేస్తుంది. చర్మం బ్రైట్ గా మార్చుతుంది. ఈ గ్రేట్ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలి. ఏవిధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం.. 

కావల్సినవి: 
బీట్ రూట్ జ్యూస్ : ఒక టీస్పూన్ 
శెనగపిండి: ఒక టేబుల్ స్పూన్ 
టమోటో జ్యూస్ ఒక టీస్పూన్ 
తేనె: ఒక టీస్పూన్ 
నిమ్మరసం: అరటీస్పూన్ 

తయారీ: ఒక బౌల్ తీసుకుని అందులో టమోటో, బీట్ రూట్ రసం, శెనగపిండి వేయాలి. ఉండలు లేకుండా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. అన్ని కలగలుపుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ముఖం తేమ లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను రోజూ అప్లై చేసి బెస్ట్ రిజల్ట్ పొందుతారు .

Wednesday, September 14, 2016

రాత్రి భోజనం తర్వాత ఫ్రూట్స్ తినడం హానికరమా ?

ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వీటిలోని విటమిన్స్ అన్ని వయసుల వాళ్ల ఆరోగ్యానికి మంచిది. అయితే పండ్లు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే దానిపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఫ్రూట్స్ తినవచ్చా ? తినకూడదా ? అనేది చాలామందిని వేధించే అనుమానం. 



సాధారణంగా పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మధ్యలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. కానీ రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఫ్రూట్ లోనూ ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. 

మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే.. ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది. అది తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రిపూట అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో.. తక్షణ శక్తి మంచిది కాదు. అందుకే నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 

పండ్లు తీసుకున్నగంట తర్వాతే మధ్యాహ్న భోజనం చేయాలి. వారాంతాల్లో అల్పాహారానికి బదులుగా 90 శాతం పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. యాపిల్‌, బొప్పాయి వంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కానీ ఉదయం అల్పాహారంతో కానీ, మధ్యాహ్నం భోజనంతో కానీ పండ్లు తీసుకోవడం మంచిది కాదు. 

భోజనం చేసిన తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవడానికి ఇబ్బందిగా మారుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ తీసుకోకూడదు. అయితే.. సలాడ్ రూపంలో ఒకటి రెండు ముక్కలు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.

Monday, September 12, 2016

ఎంత ప్రయత్నించిన గాఢ నిద్ర పట్టట్లేదా...!


రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి. సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతే.. కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది. నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే. నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించి నిద్రపోయేందుకు బాగా సహాయపడుతాయి. ఈ ఆహారాలు రాత్రుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం... 

పాలు: గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు (చక్కెర గాని మరే తీపి పధార్థమైన కాని చేర్చకుండా) రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా, లేదా మీ రాత్రి భోజనంలో పనీర్లాటివి తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటొఫాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ ట్రైటొఫాన్ ఉంటుంది. 

అరటిపండ్లు : అరటిపండ్లు మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. చర్మ సమస్యలు.. అత్యంత భయంకరమైన వ్యాధులకు సంకేతాలా ? వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉంటే శ్రేయస్కరం ? బ్లాక్ హెడ్స్ ని సులువుగా తొలగించే.. టెస్టెడ్ హోం రెమిడీస్ 



చమోమెలీ టీ : ఆశ్చర్యం కదా!అంటే డీ కేఫీనెటెడ్ టీ అనగా చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. వీటిలో థైమిన్ అనే మూలకం నిద్రపొందుటకు బాగా సహాయపడుతాయి. 



తేనె మిల్క్: తేనె మరియు పాల మిశ్రమం నిద్రబాగా పట్టేలా చేస్తుంది. బాగా నిద్రపట్టాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె మిక్స్ చేసి, అంతర్గతంగా బాడీ టెంపరేచర్ ను పెంచుకోవాలి. ఇది బాడీని రిలాక్స్ చేస్తుంది. తేనెలో ఉండే అమినోయాసిడ్స్ స్లీప్ సైకిల్ ను రెగ్యులేట్ చేస్తుంది. 



చేపలు: చాలా వరకూ అన్ని రకాల చేపలు ముఖ్యంగా సాల్మన్ మరియు తున చేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండి నిద్రపట్టేందుకు బాగా సహకరిస్తాయి. కాబట్టి నిద్ర పట్టాలంటే ఈ ఫుడ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.. 



గుడ్డు: ఉడికించిన గుడ్లును ఫ్రీ బెడ్ టైమ్ స్నాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది అంతే కాదు ఎక్కువ సమయం నిద్రించేందుకు సహాయపడుతుంది. 



ఓట్ ధాన్యపు గింజలు - సాధారణంగా ఓట్ గింజలను ఉదయంవేళ బ్రేక్ ఫాస్ట్ లో వాడతాము. అయితే, వీటిని సాయంత్రంవేళ స్నాక్స్ గా కూడా వాడవచ్చు. వీటిలో సహజమైన మెలటోనిన్ పుష్కలంగా వుండి గాఢ నిద్రను పట్టిస్తుంది. ఓట్ల ను పాలతో కలిపి తింటే అది ట్రిప్టోఫాన్ కూడా అందించి మరింత మెరుగుగా నిద్రకు పనిచేస్తుంది. 




అవిసె గింజలు: వీటిలో నిద్రను కలిగించే ట్రిప్టోఫాన్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. నిద్రను నియంత్రించే సెరోటోనిన్ స్ధాయిని శరీరంలో అధికం చేస్తుంది. నిద్ర మాత్రమే కాక అవిసె గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గించటంలో తోడ్పడతాయి.