Saturday, March 26, 2016

నిర్విషీకరణ కోసం పుచ్చకాయ స్మూతీస్ రెసిపీ

చాలా మంది శరీరాన్ని నిర్విషీకరణ చేసుకోవాలంటే బరువును తగ్గించే కార్యక్రమం ప్రారంభించటం ఒక్కటే అద్భుతమైన మార్గం అని భావిస్తున్నారు . కాని కెమికల్స్ ఉపయోగించి చేసే నిర్విషీకరణ వ్యవస్థలు ఖచ్చితంగా సమాధానం కాదు! ఒక డెటాక్సిఫికేషన్ ఆహారప్రణాళిక పూర్తిగా సహజంగా ఉంటుంది మరియు దీనివలన శరీరానికి ప్రమాదకరమైన పదార్థాల ఒత్తిడి లేకుండా సాధ్యపడుతుంది. 


ఒక సహజ నిర్విషీకరణ ఆహారప్రణాళిక తాజా కూరగాయలను మరియు పండ్లు తగిన పరిమాణంలో తీసుకోవటంపై ఆధారపడి ఉంటుంది. అల్పాహారంగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవటం లేదా మధ్యాహ్న భోజన సమయంలో తాజా కూరగాయలు మరియు తాజా పండ్లు ఉపయోగించవచ్చు. స్మూతి కూరగాయలు మరియు పండ్లు తీసుకోవటం వలన శరీరం నుండి విషాన్ని బయటకు నెట్టివేయబడుతుంది మరియు శరీరంలో శక్తి పెరుగుతుంది. నిజానికి ఇది ఒక సులభమైన ప్రత్యామ్నాయం.

స్మూతీస్ ఎంపిక పండ్లు, రసాలు, కూరగాయలు మరియు పాలు....ఇలా విస్తారంగా చేసుకోవచ్చు. ఇవి మీ జీవక్రియ ప్రక్రియ పెంచడానికి మాత్రమే కాదు. మీ శరీరం మంచి ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఆక్సీకరణ మరియు పోషకాలు అందుతాయి. 

మీరు నిజంగా మీ డెటాక్సిఫికేషన్ ఆహారం ప్రణాళికను ఆపుచేయకుండా స్మూతీస్ వివిధ రకాలుగా చేయవచ్చు. బెర్రీ, క్యారెట్లు లేదా పాలకూర వంటి ముదురు ఆకుకూరలలో విస్తృతమైన శ్రేణిలో మీ శరీర పోషణకు కావలసిన స్మూతీస్, జీర్ణక్రియకు అవసరమైన్ ఫైబర్ కలిగి ఉంటాయి.. మలబద్ధక ప్రభావాన్ని క్రాన్బెర్రీస్, పుచ్చకాయ, పైనాపిల్, కివి లేదా కాన్తలొఉపి వంటి పండ్లు తగ్గిస్తాయి. 

నిర్విషీకరణ అంటే అదేమీ తీవ్రమైన సమస్య కాదు మరియు మిమ్మలిని ఏమి చికాకు పరచదు. సరైన కాంబినేషన్ లో తీసుకుంటే, ఇది చాలా సహజంగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మరియు ఆరోగ్యకరమైనది కూడా. మీ ఆహారం మరియు స్మూతీస్ రెండింటికీ మరింత అవసరమైన పోషకాలు జోడించడానికి ఒక సమర్థవంతమైన మార్గం కూడా ఉంది.

మీ మొత్తం పండు స్మూతీస్ కి 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలను కలపండి. వీటిలో సాల్మన్ కంటే 8 రెట్లు ఎక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, పాలకంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం, బచ్చలికూర కంటే 3 రెట్లు ఎక్కువ ఐరన్, అరటిపండ్ల కంటే 2 రెట్లు ఎక్కువ పొటాషియం, బ్రోకలీ కంటే 15 రెట్లు ఎక్కువ మెగ్నీషియం, బ్రాన్ రేకుల కంటే 2 రెట్లు ఎక్కువ ఫైబర్, కిడ్నీ బీన్స్ కంటే 6 రెట్లు ఎక్కువ ప్రోటీన్, అవిసె గింజల కంటే 4 రెట్లు ఎక్కువ సెలీనియం, ఒక కప్పు పాల కంటే 9 రెట్లు అధికంగా భాస్వరం మరియు బ్లూ బెర్రిస్ కంటే ఎక్కువ అనామ్లజనకాలు ఉన్నాయి. 

చియా విత్తనాలకు సొంత వాసన అంటూ ఏమి ఉండదు అందువలన మీ స్మూతీ వంటకాలలో బాగా కలుస్తుంది. ఈ అల్పాహారం స్మూతీని ట్రై చేయండి మరియు మీరు రోజంతా అదనపు శక్తితో ఉండి మీరే ఆశ్చర్య పడతారు. ఇక్కడ 2 అద్భుతమైన పుచ్చకాయ స్మూతీ వంటకాలు ఎలా చేయాలో ఇస్తున్నాము. వీటిని మీరు పైన పేర్కొన్న విస్తారమైన పోషక ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నించండి. మీ స్మూతీస్ లో చియా విత్తనాలను కలపటం మర్చిపోకండి, అలాగే దాని నుండి అన్ని అవసరమైన పోషకాలను పొందండి.



Friday, March 25, 2016

ఏం చేయాలో ధోనీకి తెలుసు, అలా సాహసం చేశాడు'

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ సందర్భంగా మన కెప్టెన్ సింగ్ ధోనీ వ్యవహారం సోషల్ మీడియా క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు తెరలేపింది. హార్డిక్ పాండ్య చివరి బంతిని సంధించినప్పుడు ధోనీ తన కుడి చేతికున్న గ్లోవ్‌ను తీసేశాడు. దీంతో పాండ్య సంధించిన లోబౌన్సర్ ఒడిసి పట్టి బ్యాట్స్‌మన్‌తో సమానంగా పరిగెత్తి రనవుట్ చేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 


కీపర్ అలా గ్లోవ్ తీసేయొచ్చా? నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? అంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి కొందరు సమాధానం ఇస్తూ... ధోనీ గ్లోవ్స్ మొత్తం తీసేయలేదని పేర్కొంటున్నారు. గ్లోవ్స్‌కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలు ఏం లేవని, రక్షణ కోసం కొన్ని ధరించవచ్చు, సౌకర్యం కోసం తీసేయొచ్చు అని మరికొందరు సమాధానం చెబుతున్నారు. 



అంతిమంగా ఆటగాడి రక్షణే ఉద్దేశ్యమని చెబుతున్నారు. వాటిని ధరించాలా? తీసివేయాలా? అనేది ఆయా ఆటగాడి విచక్షణ అని పలువురు సమాధానం చెబుతున్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్ సమయంలో ధోనీ పక్కా ప్లాన్ ప్రకారం నడుచుకున్న విషయం తెలిసిందే. చివరి బంతికి అతను గ్లోవ్స్ తీశాడు. 



ధోనీకి అందుకే చిర్రెత్తుకొచ్చింది మరోవైపు, మ్యాచ్ అనంతరం ధోనీ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆగ్రహించిన విషయం తెలిసిందే. అయితే, ఆ విలేకరి అడిగిన ప్రశ్న ధోనీకి కోపం తెప్పించింది. ఆ మీడియా ప్రతినిధి ఏం అడిగారన్నది మొదట తెలియరాలేదు. అయితే, అతను అడిగిన ప్రశ్న ధోనీకి కోపం తెప్పించింది. ఆ విలేకరి 'బంగ్లాదేశ్ పై టీమిండియా ప్రదర్శించిన ఆటతీరు తో మీరు సంతోషంగా ఉన్నారా?' అని ప్రశ్నించాడని తెలుస్తోంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ధోనీ.. 'ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం నాకు చాలా అసంతోషంగా ఉంద'ని సీరియస్‌గా సమాధానమిచ్చాడు. మీకు సంతోషంగా లేనట్లుగా ఉందని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.





బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ గెలుపు నేపథ్యంలో కెప్టెన్ ధోనీ పైన ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు ధోనీని ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా, మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కితాబిచ్చాడు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడుతూ... ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ధోనీకి తెలుసునని చెప్పాడు. అతని ప్రణాళికలు చూస్తుంటే అతని దూకుడు అర్థమవుతోందని అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటగాళ్ల చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నాడు. చివరలో ముష్ఫికర్, మహ్మదుల్లాలు భారీ షాట్లకు వెళ్లారని, అది సరికాదని ఆయన అన్నాడు.



పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా ధోనీకి కితాబిచ్చాడు. బౌలింగ్ మార్పు ద్వారా ధోనీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించాడు. భారత్ మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా కూడా ధోనీకి కితాబిచ్చారు.

భారత్ - బంగ్లా మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏమాత్రం అనుభవం లేని పేసర్ పాండ్యను ఎంచుకున్నాడు. అంతేకాదు, చివరి బంతికి సూచనలు కూడా చేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్   బంగ్లా విజయానికి 11 పరుగుల దూరంలో ఉంది. ఎలాంటి ప్రయోగానికి పోలేదు ధోని. పాండ్యకు బంతి ఇచ్చాడు. ఏమవుతుందో అని తీవ్ర ఒత్తిడితో ఎక్కడి వారు అక్కడ కదలకుండా మ్యాచ్‌ చూస్తుండగా.. సరదాగా నవ్వుతూ బంతి అందుకున్నాడు పాండ్య.

భారత్ - బంగ్లా మ్యాచ్   తొలి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా మహ్మదుల్లా ఒక పరుగు చేశాడు. రెండో బంతిని స్లో బాల్‌ వేయగా ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా బౌండరీ బాదేశాడు ముష్ఫికర్. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. ఆఫ్‌స్టంప్‌ ఆవల వేసిన బంతిని ముష్పికర్‌ స్వీప్‌ చేయడంతో మరో ఫోర్.

భారత్ - బంగ్లా మ్యాచ్   ఈ సమయంలో మ్యాచ్ భారత్ చేజారినట్లే కనిపించింది. మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు. ఈ దశలో భారత్‌ గెలుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ అద్భుతం జరిగింది. నాలుగో బంతికి పాండ్య స్లో బాల్‌ వేయగా ముష్ఫికర్‌ పుల్‌ షాట్‌ ఆడాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్   క్యాచ్‌ అందుకోవడంలో శిఖర్ ధావన్‌ పొరపాటు చేయలేదు. ఐదో బంతికి ఫుల్‌ టాస్‌ బంతిని మహ్మదుల్లా భారీ షాట్‌ కొట్టగా జడేజా చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు.  

భారత్ - బంగ్లా మ్యాచ్ ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే బంగ్లా గెలుపు. టై అయినా భారత్‌కు మేలే. ఆస్ట్రేలియాపై గెలిస్తే చాలు.. సెమీస్‌ చేరుకోవచ్చు. ఇలా అభిమానులు అంచనాల లెక్కలు వేసుకుంటున్న సమయంలో పాండ్య ఆఫ్‌స్టంప్‌కు దూరంగా బంతి వేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్ వికెట్ల వెనక బంతి అందుకున్న ధోని ఎలాంటి పొరపాటు చేయకుండా పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేశాడు. భారత్‌ ఒక్క పరుగుతో గెలిచింది.

దుస్తుల మీద పడ్డ వివిధ రకాల మరకలను తొలగించడానికి సులభ చిట్కాలు

శుచి, శుభ్రత మనకే కాదు బట్టలకు కూడా కావాలి.బట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్‌లో రకరకాల స్టెయిన్‌ రిమూవర్‌ లిక్విడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. బట్టలపై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. 

ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ మరియు రస్ట్‌ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ క్రింది చిట్కాలను పాటించి చూడండి. అయితే ఒకమరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయక పోవచ్చు. 

అంతే కాదు , ఇంట్లో పిల్లలుంటే , కార్పెట్స్, మ్యాట్స్, బెడ్ షీట్స్, గ్లిట్టర్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్ , మట్టి, మురికి మరియు వివిధ రకాల మరకలను పట్టిస్తాయి . ఈ మొండిమరకలను తొలగించడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఈ హోం రెమెడీస్ ఉపయోగించిన తర్వాత మన్నికైన డిటర్జెంట్స్ తో దుస్తులను శుభ్రం చేయడం మంచిది . ఇలాంటి వాటిని మెషిన్ లో పెట్టడం కంటే హ్యాండ్ వాష్ చేయడం మంచిది . స్కబ్బింగ్ చేయడకంటే చేతి రుద్ది ఉతకడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా మరకలు తొలగిపోతాయి. దుస్తుల మీద పడ్డ వివిధ రకాల మరకలను ఎలా వదలగొట్టాలో చూద్దాం...


ఇంక్ మరకలు: ఇంక్ మరకలు తొలగించడానికి మరకల మీద హ్యాండ్ శానిటైజర్ ను అప్లై చేయాలి. తర్వాత టూత్ బ్రష్ తో బష్ చేసి , తర్వాత వెంటనే బేకింగ్ సోడా అప్లై చేసి 15నిముషాల తర్వాత , దుస్తులను వేడినీళ్ళలో డిప్ చేసి వాష్ చేయాలి.





పెయింట్ మరకలు: పెయింట్ మరకల మీద ఆల్కహాల్ లేదా హ్యాండ్ శాటిటైజర్ ను అప్లై చేసి 5నిముషాల తర్వాత రుద్దడం వల్ల పెయింట్ డిజాల్వ్ అయ్ త్వరగా మరకలు తొలగిపోతాయి.

మడ్ మరకలు: మట్టి మరకలు మెండిగా మారిన మట్టిమరకలను తొలగించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లీచింగ్ పౌడర్. 2 టేబుల్ స్పూన్ల బ్లీచింగ్ పౌడర్ మరియు వాటర్ మిక్స్ చేసి మరకల మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది .


కెచప్ : దుస్తుల మీద పడ్డ కెచప్ మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరకల మీద వైట్ వెనిగర్ ను పోసి, టూత్ బ్రష్ తో రుద్ది డిటర్జెంట్ పౌడర్ తో వాష్ చేయాలి. 



చాక్లెట్స్: దుస్తుల మీద పడ్డ చాక్లెట్ మరకలను నివారించడానికి అమ్మోనియం గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా మెద్దుబారిన చాకుతో చాక్లెట్ మరకల మీద రుద్దితర్వాత నేరుగా అమ్మోనియం వేసి చేత్తో లేదా టూత్ బ్రష్ తో రుద్ది శుభ్రం చేయాలి.




జ్యూస్: దుస్తుల మీద ఏర్పడ్డ జ్యూస్ మరకలను నివారించడానికి అమ్మోనియం గ్రేట్ గా సహాయపడుతుంది . మొదట మరకలను నీటితో శుభ్రంగా కడిగి తర్వాత అమ్మోనియంను వేసి రుద్ది కడగాలి.







ఐస్ క్రీమ్: దుస్తుల మీద ఏర్పడ్డ ఐస్ క్రీమ్ మరకలను నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మరకల మీద నేరుగా కొన్ని చుక్కల నిమ్మరసం వేసి చేత్తో రుద్ది తర్వాత సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి.



వాంతులు: డిటర్జెంట్ మరియు నిమ్మరసం రెండు చాలా ఎఫెక్టివ్ గా మరకలను తొలగిస్తాయి. వెంటనే మరకలను మాయం చేసే ది బెస్ట్ కాంబినేషన్

బ్లడ్ మరకలు: దుస్తుల మీద ఏర్పడ్డ బ్లడ్ మరకలను తొలగించడానికి సాల్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది . దుస్తుల మీద రక్తం మరకలు పడిన వెంటనే ఆ దుస్తులను సాల్ట్ వాటర్లో డిప్ చేసి 15 నిముషాల తర్వాత వాష్ చేయాలి.


Thursday, March 24, 2016

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి తొలిదర్శనం ఎవరికీ...? వారికే ఎందుకంత ప్రాధాన్యత..?

తిరుమలలో శ్రీవారి దర్శనమంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది. అది ఒకటి, రెండు సార్లు కాదు. జీవితాంతం వారే తొలిదర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు. ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి?


సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీస్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు. అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో... మరి తిరుమలలో ఏం జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది. శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది.

అయితే ఎవరు తలుపులు తెరుస్తారు.? తొలిదర్శనం ఎవరు చేసుకుంటారు. ప్రతీ రోజూ ఒకే ఒకాయన తలుపు తెరుస్తారు. ఆయనే తొలిదర్శనం చేసుకుంటారు. ఎవరాయన అంటే సన్నిధి గొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా..? అంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.



  • ఎప్పటి నుంచో స్వామి వారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే.. ఆలయాన్ని కొందరు చూసేవారు. పూజాధి కార్యక్రమాలు అర్చకులు చేస్తారు. 
  • ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు.
  • అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
  • ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేపట్టుకుని 3 గంటల సమయంలో కుంచెకోల(తాళాలు ఉండేది తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు.
  • అందరు కలసి ఆలయం వద్దకు వెళ్ళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్లసన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు.
  • దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది. ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళతారు.
  • తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళతారు.


Wednesday, March 23, 2016

హోళీ రంగులను తొలగించటానికి 8 హోమ్ మెడ్ పేస్ పాక్స్

భారత దేశంలోని పండుగలలో దీపావళి రోజున దీపాలు,హోలీ రోజున రంగులతో ఉల్లాసంగా గడుపుతారు. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఒక అద్భుతమైన అనుభూతితో జరుపుకుంటారు.



దేశంలో ప్రతి రాష్ట్రానికి హోలీ పండుగ ఆచారాల్లో తేడాలు ఉంటాయి. కానీ సందర్భం మాత్రం ఒకటే. ఎవరైనా సరే ఈ పండుగ రోజున రంగులను ఉపయోగించవలసిందే. ఈ పండుగ రోజు ఆత్మీయులకు రంగులను పూస్తారు.

సాదారణంగా హోలీ రోజున ప్రజలు రంగులను పొడి మరియు ద్రవాల రూపంలో ఉపయోగిస్తారు. అయితే ఈ రంగులను చర్మం నుండి వదిలించుకోవటం చాలా కష్టం. ముఖ్యంగా పొడి చర్మం వారికీ ఈ రంగుల కారణంగా చర్మం చికాకు, ఎరుపు, దురద మరియు అనేక ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ముఖం మీద హోలీ రంగులను వదిలించుకోవటానికి 8 సహజ మార్గాలను తెలుసుకుందాం. ఈ మార్గాల ద్వారా ముఖం మీద రంగులను సమర్ధవంతంగా తొలగించుకోవచ్చు. నేడు మార్కెట్ లో మూలిక రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవు. అందువల్ల ఈ రంగులను ఉపయోగించటానికి ప్రయత్నించండి.

హోలీ రంగులను వదిలించుకోవటానికి 8 సమర్ధవంతమైన ఇంటి పాక్స్ ఉన్నాయి. ఈ రంగులను తొలగించటానికి చర్మాన్ని రుద్దనవసరం లేదని గుర్తుంచుకోండి.

ఈ ఫేస్ పాక్స్ వాడుట వలన చర్మానికి ఎటువంటి హాని కలగదు. కొన్ని రోజుల్లోనే హోలీ రంగు పోతుంది. కాబట్టి ఇక్కడ చెప్పుతున్న ఇంటి ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించండి.

1. హోలీ ముందు ఫేస్ ప్యాక్ రాయటం వలన రంగులను ఖచ్చితంగా తొలగించలేము. కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రంగులను సులభంగా తొలగించుకోవచ్చు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో హోలీ పండుగను జరుపుకొనే ముందు చర్మం మీద ఆలివ్ లేదా కొబ్బరి నూనెను రాయాలి. పురుషులు హోలీకి రెండు రోజుల ముందు షేవ్ చేసుకోకూడదు. హోలీ తర్వాత షేవ్ చేసుకుంటే రంగులు సులభంగా బయటకు వస్తాయి.

2. శనగ పిండి, పెరుగు ప్యాక్ మీ చర్మం పొడి చర్మం అయితే, రంగులు చర్మాన్ని మరింత పొడిగా మార్చేస్తాయి. శనగపిండిలో పెరుగు,కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారుచేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.




3. బాదం మరియు హనీ ప్యాక్ హోలీ రంగులను తొలగించటానికి ఇంటిలో తయారుచేసే పాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా? బాదాం పొడిలో తేనే, కొంచెం పాలు,కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.




4. మసూర్ దాల్ మరియు ఆరెంజ్ పీల్ ప్యాక్ ఇది జిడ్డు చర్మం కల వారిలో హోలీ రంగులను తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మసూర్ దాల్ మరియు ఎండిన నారింజ పై తొక్కలను పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిలో రోజ్ వాటర్,కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి.




5. అరటి ప్యాక్ హోలీ రంగులను తొలగించుకోవటానికి మరొక సమర్ధవంతమైన ఫేస్ ప్యాక్. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి దానిలో తేనే,పాలను సమాన పరిమాణంలో కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


6. శనగ పిండి, బియ్యం పిండి ప్యాక్ శనగ పిండి, బియ్యం పిండిలను సమాన పరిమాణంలో తీసుకోని దానిలో అరస్పూన్ పసుపు కలపాలి. దీనిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా చేయాలి. పసుపు ఏంటి సెప్టిక్ ఏజెంట్ గా పనిచేసి చర్మం మీద దద్దుర్లు రాకుండా చేస్తుంది.


7. నిమ్మరసం మరియు కలబంద జెల్ కలబంద జెల్ లో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాల్ సాయంతో ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.







8. ముల్తాన మిట్టీ ప్యాక్ ముల్తాన మిట్టీలో నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మెడ మరియు ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

దిక్కులకు అందని ఆనందం... ఎల్లలు దాటిన సంబరం ... కల్లలెరగని కమనీయం...


 

1. ‘మథుర’మైన ఉత్సవం...
ఉత్తరాన యమునా నదిపై వీచే చల్లని గాలులు వేణుగానమై వీనులకు విందుచేస్తుండగా ద్వారకాధీశుడి జన్మస్థలమైన మధురలో రంగుల కేళీ విన్యాసాలు మన్నూ మిన్నూ ఏకం చేస్తుంటాయి. ఎన్నో ప్రత్యేకతలు గల దేవాలయాలు ఉన్న పట్టణం మథుర. ఇక్కడ ప్రతి గృహం, భవనం నుంచి చిన్నా పెద్ద దేవాలయాలు, ఘాట్లు, షాప్‌లు.. అంతా రంగులతో వర్ణశోభితమై నల్లనయ్యను తమ హృదయలోలుడిగా కీర్తిస్తూ భజనలు చేస్తూ భక్త బృందాలు పులకించిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని కృష్ణుడి జన్మస్థలమైన మథురలో ఆరు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. కృష్ణుడి బాల్యం గడిచిన ‘బృందావనం’లో హోలీ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. హోలీ రోజుల్లో సందడంతా కృష్ణాలయాల్లోనే కనిపిస్తుంది.
 
ఇక్కడ గల ద్వారకాధీశ మందిరంలో కృష్ణాష్టమి, దీపావళి, హోలీ వేడుకులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.  బృందావనంలో కొలువుదీరిన రాధారమణ దేవాలయం అత్యంత ప్రాముఖ్యత గలది. ప్రధాన మూర్తులు గోస్వామి, రాధాదేవి.  జుగల్ కిశోర్ దేవాలయం అతి ప్రాచీనమైనదిగానే కాదు ఇక్కడి మురళీధరుడు అత్యంత ప్రాశస్థ్యం గల దైవంగా పూజలు అందుకుంటున్నాడు.  దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ దేవాలయం నమూనాలో ఉంటుంది రంగ్‌జీ దేవాలయం. ఇక్కడ భారీ రథయాత్ర, బ్రహ్మోత్సవాలు ప్రతి యేటా మార్చి-ఏప్రిల్‌లో జరుగుతుంటాయి.  మథుర పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ‘బర్సానా’ గ్రామం. రాధ పుట్టిన ప్రాంతంగా ఈ ఊరుకి పేరు. ఇక్కడికి స్వయంగా కృష్ణుడే వచ్చి హోలీ ఆడుతాడని అంతా భావిస్తారు. పురుషులు కృష్ణుడిగా, అమ్మాయిలు రాధగా భావించుకుంటారు. హోలి రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కర్రలను అడ్డుకుంటారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ హోలీ సరదా సరదాగా సందడి సందడిగా ఉంటుంది. సమీప కృష్ణమందిరాలలో ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి.
 

2. గుజరాత్‌లో ద్వారకాధీశుడు
గుజరాత్‌లోని గోమతి నదీ తీరాన ద్వారక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ ఆలయం పక్కనే అష్టభార్యల మందిరాలూ ఉన్నాయి. రాధాకృష్ణుల మందిరం, మిగతా దేవేరుల మందిరాలూ ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ గోమతి సంగమ్ ఘాట్ విశిష్టమైనది. ఈ ఘాట్ నుంచి 56 మెట్లు ఎక్కి పైకి వెళ్ళితే ద్వారాకాధీశుని ఆలయ స్వర్గ ద్వారం వస్తుంది. ఇక్కడ హోలీ రోజున ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు.
 
3. తూర్పు-పడమరలను కలిపిన దైవం
బెంగాల్‌లో ‘బసంత్ ఉత్సవ్’ పేరిట వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ అమ్మాయిలు అబ్బాయిలు సంతోషంగా ఈ వేడుకను జరపుకుంటారు. అయితే వీరు రంగులు చల్లుకోరు. పాటలు, నృత్యాలు, శ్లోక పఠనం.. అంతా శాంతినికేతన్ పద్ధతుల్లో వేడుక సాగుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే విద్యార్థులు కుంకుమపువ్వు రంగు దుస్తులను, సువాసనలు వెదజల్లే పువ్వుల దండలను ధరిస్తారు. సంగీత వాద్యాలను మీటుతూ, పాటలు పాడుతారు. వీళ్లు హోలీని ‘డోలా జాత్రా, డోలా పూర్ణిమ’గా ఊయలోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యమైన వీధులలో రాధాకృష్ణుల ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఆడవాళ్లు నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ల చుట్టూ తిరుగుతూ భక్తి పాటలు పాడతారు. పురుషులు రంగు నీటిని, రంగు పొడిని జల్లుకుంటారు. కుటుంబపెద్దలు కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి, ఖీర్ (పాయసం), సందేశ్, కుంకుమపువ్వు, పాలు వంటి మధుర పదార్థాలను నివేదిస్తారు. ఒడిశాలో హోలీ సందర్భంగా జగన్నాథుడి ఆలయాల్లోను, కృష్ణాలయాల్లోను ప్రత్యేక పూజలు చేస్తారు. పంజాబ్‌లో సిక్కులు హోలీని ‘హోలా మోహల్లా’ అంటారు. భారతదేశంలో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగే ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు. వ్యవసాయంలో రబీ పంటలకు ఇది సూచనప్రాయంగా ఉంటుంది. వీధులలో మంటలు వేసి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగ నింపి వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగులకొట్టడానికి పోటీపడుతుంటే అమ్మాయిలు వారిపై నీళ్లు విసురుతారు. చివరకు కుండను పగులకొట్టిన యువకుడిని ‘హోలీ రాజు’గా సత్కరిస్తారు. మహారాష్ట్రలో హోలీ పౌర్ణమికి సాయంత్రం మంటలు వెలిగించి, తినుబండారాలను, భోజనాన్ని అగ్నికి అర్పిస్తారు. ఈ సమయంలో ‘హోలీరే హోలీ పురాణచిపోలీ’ అని పాడతారు. దీంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. పంచమి రోజున రంగులతో ఆడుకుంటారు.
 
4. వెన్నెల రాత్రులలో
మణిపూర్‌లో ఆరు రోజులు హోలి పండగను జరుపుకొంటారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు రాత్రి జానపద నృత్యాలతో, పాటలతో డోలు వాయిస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగిమంటలకు ఎండుగడ్డిని, రెమ్మలను ఉపయోగిస్తారు. తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజు కృష్ణ ఆలయం ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ కొచిలోనూ, కాశ్మీర్‌లోనూ ఎండాకాలానికి ప్రారంభంగా, పంటలు కోయడానికి సూచనగా హోలీ పండగను జరుపుకుంటారు. రంగుపొడిని, రంగునీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు.
 
5. గిరిజనుల కోలాహలం
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న గిరిపుత్రుల హోలీ పండగ ప్రత్యేకంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. మామిడిపూత, గింజధాన్యాల రాకతో కొత్త జీవితానికి గుర్తులుగా భావిస్తారు వీరు. అగ్ని చుట్టూ చేరి, బిగ్గరగా ఏడుస్తారు. ఆ విధంగా చెడు తమ నుంచి దూరం అవుతుందని భావిస్తారు. హోలీ పండగ తమ జీవితంలో గొప్ప ఆనందాన్ని నింపుంతుందని భావిస్తారు.
 
మన దేశంలోనే కాదు పురాణేతిహాసాలలో ప్రఖ్యాతిగాంచిన హోలికా దహనం, రాధాకృష్ణుల వసంతకేళీ కథనాలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. గడప గడపకూ చేరి మన సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ వేడుకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి మన దేశానికి విదేశీయులూ వరస కడుతున్నారు. ఎక్కడైనా చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ పండగ భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీక.
 
 దక్షిణాన రంగుల దీవెన: హోలీ నాడు దేశమంతటా రాధాకృష్ణుల దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది, చిన్న చిన్న సమూహాలుగా చేరి పాటలు పాడి ఆనందిస్తారు. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అంత వేడుకగా ఈ పండగను జరుపుకోరు. తెలుగు రాష్ట్రాలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలలో చిన్న స్థాయిలోనే హోలీని జరుపుకుంటారు. కొన్ని చోట్ల పెద్దల పాదాలమీద గులాల్ చల్లి, వారి దీవెనలు తీసుకుంటారు. గిరిజనులు మాత్రం పున్నమి రాత్రి కామదహనం పేరుతో పెద్ద పెద్ద మంటలు వేసి, మరుసటి రోజు తమ తెగ నృత్యాలతో హోలీని సంబరంగా జరుపుకుంటారు.

Tuesday, March 22, 2016

సమ్మర్లో చర్మం నల్లబడకుండా చర్మానికి రక్షణ కల్పించే ఫేస్ ప్యాక్స్

వేసవికాలం మొదలయిన వెంటనే ప్రతిఒక్కరు తమ అందం, ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలను పాటిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో దేనికైనా వెనుకాడరు. వేసవికాలంలో సూర్యుడు, భూమికి కొంచెం దగ్గరగా రావడం వల్ల..సూర్యుని నుంచి వచ్చే కిరణాలు నేరుగా శరీరం మీద పడటంతో అనేక రకాల వ్యాధులుసంక్రమిస్తాయి. అందులో ముఖ్యంగా సూర్యుని నుంచి ప్రసరించే అతినీలలోహితకిరణాలు చాలా హానికరమైనవి. ఇవి చర్మానికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని కలుగచేస్తుంది.

సాధారణంగా వేసవికాలంలో వుండే వేడితాపంవల్ల ప్రతిఒక్కరు నల్లబడతారు. సూర్యుని కిరణాలలో వుండే శక్తి అధికంగా వుండటం వల్ల.. చర్మంలో వుండే కణాలు దెబ్బతింటాయి. అలాగే కొన్ని పోషకాలనుకూడా కోల్పోవడంతో చర్మం తొందరగా నల్లబడటం మొదలవుతుంది. అలాగే పొడిబారడంకూడా జరుగుతుంది. సహజంగా ప్రతిఒక్కరు తమ కార్యకలాపాలను నిర్వర్తించుకోవడంకోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే బయటకు వెళ్లగానే ఎండతాపంతో చర్మంపైమంటగా అనిపిస్తుంది. అటువంటి చోటే చర్మం ఎక్కువగా నల్లగా మారడం జరుగుతుంది.ఫలితంగా అక్కడ మచ్చలు ఏర్పడుతాయి. 

చర్మసంరక్షణకు సంబంధించి వేసవికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.లేకపోతే చర్మ నిగారింపును, అందాన్ని తిరిగి పొందడటానికి చాలా సమయం పడటమేకాకుండా, అధికంగా డబ్బులను వెచ్చించుకోవాల్సి వస్తుంది. వేసవిలోచర్మసౌందర్యం దెబ్బతింటుందనే భావంతో చాలామంది బయటకు వెళ్లడానికి కూడాభయపడుతుంటారు. అటువంటి సమయాల్లో కొన్ని ముందుజాగ్రత్తలు పాటిస్తే.. చర్మంనల్లబడకుండా, పొడిబారకుండా, సౌందర్యం దెబ్బతినకుండా వుండొచ్చు. మరి సమ్మర్లో స్కిన్ టాన్ నివారించే ఫేస్ ప్యాక్ లు మీకోసం...


మింట్ ప్యాక్: ఈ ప్యాక్ సమ్మర్ హీట్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పదీనా ఆకులను కొద్దిగా తసుకిని అందులో కొద్దిగా పసుపు, గోరువెచ్చని నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.





మిల్క్ క్లెన్సింగ్ : చర్మానికి రెగ్యులర్ క్లెన్సింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సమ్మర్ సీజన్లో చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక కాటన్ పీస్ తీసుకొని, పాలలో డిప్ చేసి ముఖం మొత్తం తుడవాలి . చర్మంలో దాగి ఉన్న మన కంటికి కనబడిని మురికిని శుభ్రం చేసి తొలగిస్తుంది.


బాదం ఆయిల్ థెరఫీ : ఈ హోం మేడ్ థెరపీ మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా సున్నితమైన చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చిన్న కాటన్ పీస్ తీసుకొని బాదం నూనెలో డిప్ చేసి ముఖం మొత్తం తుడవాలి . బాదం ఆయిల్ థెరఫీతో ఎఫెక్టివ్ క్లెన్సింగ్ జరిగి, కంటికి కనబడని మురికి తొలగిస్తుంది. చర్మంను శుభ్రం చేసి క్లియర్ చేస్తుంది.



సోయాబీన్ మరియు లెంటిల్ ప్యాక్ : సోయాబీన్ లో ఐసోఫ్లేవాన్ అధికం మరియు ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఏజింగ్ స్కిన్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. 50గ్రాముల సోయాబీన్ లేదా పెసరపప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా కాచిన పాలు, బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 




కీరదోస ఫేస్ ప్యాక్: ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది మరియు సమ్మర్లో స్కిన్ స్మూత్ గా మార్చుతుంది. కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా సుగర్ వేసి మిక్స్ చేసి , ఫ్రిజ్ లో ఉంచి చల్లారనివ్వాలి. 20నిముషాల తర్వాత బయటకు తీసి ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



టమోటో ఫేస్ ప్యాక్ : ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ టాన్ తొలగిస్తుంది . హెల్తీ స్కిన్ అందిస్తుంది. టమోటోను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.




ఓట్ మీల్ ప్యాక్: వేసవిలో డ్రై స్కిన్ తో బాధపడే వారికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు ఓట్ మీల్ పౌడర్ కు కీరదోస పేస్ట్ మిక్స్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని ఫేషియల్ స్కిన్ కు అప్లై చేయాలి. 30 గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే డార్క్ స్కిన్ నివారిస్తుంది.



బనానా ఫేషియల్ మాస్క్: ఇది చాలా సులభంగా ఉపయోగించే ఫేస్ ప్యాక్ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సమ్మర్లో చర్మానికి రక్షిస్తుంది. సగం బనానాను మెత్తగా మ్యాష్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటిలో డిప్ చేసిన క్లాత్ తో ముఖం శుభ్రంగా తుడవాలి.



మిల్క్ మరియు హనీ బ్లీచ్: ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . సన్ టాన్ నివారిస్తుంది. పాలు, తేనె, నిమ్మరసం సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సమ్మర్లో చర్మం నల్లగా మారకుండా ఉంటుంది.




ఎగ్ మాస్క్: స్మూత్ అండ్ ఆయిల్ స్కిన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గడ్డు మిశ్రమంలో నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.




బేసిన్ మ్యాజిక్: వేసవిలో చర్మంలో మొటిమలు నివారించడానికి ఈ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ ప్రొపర్టీస్ మొటిమలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. శెనగపిండిలో గోరువెచ్చని తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.




చాక్లెట్ ఫేస్ మాస్క్: డెలిషియస్, టెంప్టిగ్ ఫేస్ ప్యాక్ . స్కిన్ కు తెల్లగా మార్చే గ్రేట్ ఫేస్ ప్యాక్. ఒక చెంచడా డార్క్ చాక్లెట్ లేదా ఒక చెంచడా కోకోపౌడర్ లో 5చెంచాలా తేనె మిక్స్ చేసి 2చెంచాల పాలు మిక్స్ చేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వాటర్ మెలోన్ ఫేస్ మాస్క్: ఇది స్మూతింగ్ ఫేస్ మాస్క్ . సమ్మర్లో చర్మాన్ని కూల్ గా ఉంచుతుంది . చర్మానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. ఇది చర్మం క్లియర్ చేస్తుంది, సన్ టాన్ నివారించి స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. 2 చెంచాలా కీరదోసకాయరసం, రెండు చెంచాలా వాటర్ మెలోజ్ జ్యూస్, ఒక చెంచా పెరుగు, 1 చెంచా పాలపౌడర్ మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుమ్మడి ఫేస్ ప్యాక్: గుమ్మడిలో నేచురల్ ఎక్స్ ఫ్లోయేటింగ్ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్ానయి . ఈ ఫేస్ మాస్క్ ఉపయోగించడ వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది . చర్మం సాఫ్ట్ గా కనబడుతుంది. సన్ డ్యామేజ్ నివారిస్తుంది. గుమ్మడిని మెత్తగా పేస్ట్ చేసి అందులో గుడ్డు వేసి మిక్స్ చేయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఓమేగా రిచ్ బాదం మిల్క్, హనీ కూడా జోడించివచ్చు. ఈ మివ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తరవ్ాత చల్లటి నీటితో కడిగేసి , మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.

అలోవెర జెల్ ప్యాక్: అలోవెరలో స్మూతింగ్ ప్రొపర్టీస్ ఎక్కువ. ఈ మాస్క్ సెన్సిటివ్ స్కిన్ ను ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి చేతిమీద ప్యాచ్ టెస్ట్ చేసి, తర్వాత అప్లై చేసుకోవచ్చు. అలోవెర జ్యూస్ తీసి ముఖానికి నేరుగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Monday, March 21, 2016

5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ డ్రింక్ ...

బెల్లీ ఫ్యాట్ చాలా మెండి ఫ్యాట్ మరియు దీన్నితగ్గించుకోవడం అంతే సులభం కాదు . ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అయ్యే ఓపిక, మరియు వ్యాయామం చేసే లక్షణాలు మీలో లేనట్లైతే , కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఈ రెమెడీని ఫాలో అయితే చాలు, 5 రోజుల్లో మీ బెల్లీ ఇట్టే కరిగిపోతుంది. ఈ సింపుల్ రెమెడీ చాలా నేచురల్ రెమెడీ. దీనికోసం మీరు ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు . దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ భయం మీకు అవసరం లేదు.

అందుకు మీకు కావల్సిందల్లా నిమ్మకా మరియు పార్ల్సీ . కొద్దిగా పార్ల్సీ ని జ్యూస్ చేసి అందులో నిమ్మరసం జోడించి , ఈ మిశ్రమానికి ఒక గ్లాసు నీళ్ళు చేర్చి , బాగా మిక్స్ చేసి నిద్రలేవగాన కాలి పొట్టతో దీన్ని తాగాలి. ఇలా రెగ్యులర్ గా క్రమం తప్పకుండా త్రాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. 5 రోజుల్లోపలే మీరు ఫలితాన్ని గ్రహిస్తారు.

ఈ నేచురల్ డ్రింక్ రెమెడీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ సహాయపడటంతో పాటు, అనేక విటమిన్స్ మరియు మినిరల్స్ ను అందిస్తుంది. మరియు పార్ల్సీ జీర్ణక్రియను ప్రోత్సహించడంతో పాటు , శరీరంలో అదనపు నీటిని తొలగించి కడుపుబ్బరం మరియు శరీరం యొక్క ఉబ్బును తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తీసుకుంటూనే కొన్నింటికి దూరంగా ఉన్నట్లైతే చాలా వేగంగా బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

షుగర్స్ కు దూరంగా ఉండాలి: స్వీట్స్, పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి, పూర్తిగా వీటికి దూరంగా ఉన్నట్లైతే బెల్లీ ఫ్యాట్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు . బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని కోరుకునే వారు, షుగర్ ప్రొడక్ట్స్, సాప్ట్ డ్రింక్స్, మరియు షుగర్ జ్యూస్ లకు దూరంగా ఉండాలి.

ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మరియు మద్యహ్నా భోజంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల . బెల్లీ ఫ్యాట్ ను వేగంగా కరిగించుకోవచ్చు.









అన్నం తగ్గించాలి: సాధ్యమైనంత వరకూ బియ్యంతో వండిని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే అన్నం తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.




ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి: రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగించుకోవచ్చని చాలా పరిశోధనలు కూడా వెల్లడి చేశాయి.



పరుగు: కిలోమీటర్లు, లేదా మైల్స్ పరుగుపట్టక్కర్లేదు. లేదా గంటలు గంటలు పరిగెత్తక్కర్లేదు. ఒక రోజుకు 5 నుండి పదినిముషాలు పరిగెత్తితే చాలు , మార్పును మీరు గమనిస్తారు.






నీరు ఎక్కువగా త్రాగాలి: రోజులో ఎక్కువగా నీరు త్రాగాలి. శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి మరియు ఆకలిని తగ్గించుకోవడానికి నీరు గ్రేట్ గా సహాయపడుతుంది . దీని వల్ల మీరు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు.



గ్రీన్ టీ: గ్రీన్ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు శరీరంలో నయమయ్యే గుణాలు ఎక్కువగా కనబడుతాయి . గ్రీన్ టీలో ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి.