Saturday, January 30, 2016

కొత్తిమీర వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

ఇందులో రుచికరమైన, ఆరోగ్యానికి ఉపయగపడే అధ్బుతమైన హెర్బల్స్ చాలా ఉన్నాయి. కొత్తిమీరను సాధారణంగా, రుచి కోసమే కాకుండా వైద్యసంబంధమైన ఔషదాల తయారీలలో కూడా వాడతారు. సాధారణంగా కొత్తిమీర వలన కలిగే ఉపయోగాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.


క్రొవ్వు నియంత్రణ:


కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.


చర్మాన్ని కాపాడుట:


చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవును.

సేధతీర్చుట:


కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి,  మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును.

పోషకాల విలువలు:


విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది

జీర్ణక్రియను పెంచును:


కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును.


కంటికి ఉపయోగం:


కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.

నొప్పిని తొలగించును:


కీళ్ళ నొప్పులతో భాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా  కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనోప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును.

మధుమేహం:


కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా?  అవును ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.

గాంధీ హత్యకు.. కుట్ర జరిగిందిలా..!


జాతిపిత మహాత్మా గాంధీ జనవరి 30న హత్యకు గురయ్యారు. దేశవిభజన అనంతర పరిణామాల నేపథ్యంలో గాంధీ తీరు రుచించని అతివాదులు ఆయన్ను కాల్చి చంపారు. ఆయన హత్య ఒక్క ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1948, జనవరి 30న ఆయన హత్యకు గురయ్యారు. వరుస ఉద్యమాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన గాంధీ శరీరం మూడంటే మూడు తూటాలకు కుప్పకూలింది. ఆయన హత్యకు దారి తీసిన తక్షణ పరిస్థితులు, అంతకుముందు జరిగిన పరిణామాలపై వివరంగా తెలుసుకుందాం.


విభజన జరగకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దీంతో ఇష్టం లేకున్నా గాంధీ విభజనకు అంగీకరించారు. ఆ సమయంలో వేరుపడిన పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రూ.75 కోట్లు ఇవ్వాలి. విభజన సమయంలో రూ.20 కోట్లు ఇచ్చిన భారతదేశం మిగిలిన డబ్బును ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇస్తే.. ఆ డబ్బుతో తిరిగి భారత్‌పైనే యుద్ధానికి దిగుతుందన్న భయమే కారణం. అయితే, ఈ డబ్బు ఇవ్వకపోతే అంతకుమించిన నష్టం జరుగుతుందని గాంధీ ఆందోళన చెందారు. అందుకే బాకీ డబ్బులు చెల్లించాలంటూ 1948, జవనరి 13న దీక్షకు దిగారు.

దీంతో డబ్బు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. పాకిస్తాన్ కోసం గాంధీ దీక్షకు దిగడం దేశంలో చాలామందికి రుచించలేదు. భారత్‌లో విలీనమైన కశ్మీర్‌ను సగం ఆక్రమించుకుని, పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కుల ఊచకోతకు పాల్పడుతున్న శత్రుదేశానికి ఆర్థిక సాయం కోసం దీక్షకు దిగడాన్ని కొందరు అతివాదులు ఖండించారు. ఈలోగా నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే నేతృత్వంలో గాంధీ హత్యకు కుట్ర సిద్ధమైంది.



మీకు తెలుసా?
 1. గాంధీ హత్య ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.
 2. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే గాంధీని హత్య చేసేందుకు బొంబాయి నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు.
 3. జనవరి 20న బాంబు పేల్చిన మదన్‌లాల్ ధైర్యవంతుడైన కుర్రాడు అని గాంధీ అభివర్ణించాడు.
 4. గాడ్సే కాల్చిన తూటాల్లో ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లింది. మిగిలిన రెండు పొట్టలోకి చొచ్చుకెళ్లాయి.
 5. ఈ కుట్రలో పాల్గొన్న వారంతా ముంబై రాష్ట్రానికి చెందినవారే.
 6. గాంధీని చంపడానికి మొత్తం 5 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి.
 7. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలను 1949, నవంబరు 15న ఉరితీశారు.
 
 పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో..!
 తొలిప్రయత్నం విఫలంకావడం, మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోవడంతో మిగిలిన వారు పరారయ్యారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి పథకం విఫలం కాకూడదని నాధూరం గాడ్సే కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా పదిరోజుల అనంతరం 1948, జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా.. ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అఛా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీస్.. పోలీస్! అని అరుస్తూనాధూరాం గాడ్సే లొంగిపోయాడు.



కుట్ర పన్నింది వీరే:
 గాంధీ హత్యలో నాధూరం గాడ్సే, నారాయణ్ ఆప్టేతోపాటు మిత్రులు సావర్కర్, విష్ణు కర్కరే, శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్‌లాల్ బహ్వా, దిగంబర్ బడ్గే చేతులు కలిపారు. అంతా కలిసి ఎలాగైనా గాంధీని అంతమొందించాలని సిద్ధమయ్యారు. హత్య జరిగిన తరువాత పారిపోకూడదని, తమ ఉద్దేశం అందరికీ తెలియపరిచేలా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు. కానీ, అది మరీ ఎత్తుగా ఉండటంతో అతనికీ సాధ్యపడలేదు. దీంతో వేదిక వద్ద కూర్చున్న మదల్‌లాల్ బాంబు విసిరాడు. కానీ, హత్యాప్రయత్నం విఫలమైంది. మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోయాడు.



 గాంధీజీ జీవితంలోని కొన్ని విశేషాలు:
  • గాంధీజీ ఐదుసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఒక్కసారైనా పురస్కారం దక్కలేదు.
  • 4 ఖండాల్లోని 12 దేశాల్లో పౌరహక్కుల ఉద్యమాలు కొనసాగడానికి గాంధీజీనే స్ఫూర్తి.
  • గాంధీజీ అంతిమయాత్ర దాదాపు 8 కిలోమీటర్లకు పైగా కొనసాగింది.
  • గాంధీ మరణాంతరం 21 ఏళ్లకు ఆయన స్మారకార్థం బ్రిటన్ ప్రభుత్వం తపాలా బిళ్ల విడుదల చేసింది.
  • గాంధీజీ రోజుకు దాదాపు 18 కిలోమీటర్లు నడిచేవారు. తన జీవితకాలంలో ఆయన నడిచిన దూరాన్ని లెక్కిస్తే అది భూమండలాన్ని రెండుసార్లు చుట్టి రావడానికి సమానం అవుతుంది.
  • గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవిద్య అభ్యసించేటపుడు అక్కడ జరిగిన బోయెర్ యుద్ధంలో పాల్గొన్నారు. సైన్యంలో వైద్య సేవలందించే బృందంలో వలంటీర్‌గా పనిచేశారు. ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూడడంతోనే ఆయన అహింసావాదిగా మారిపోయారు.
  • మహాత్మాగాంధీ వివిధ దేశాల ప్రముఖులతో ఉత్తర ప్రత్త్యుత్తరాలు జరిపేవారు. వీరిలో లియోటాల్‌స్టాయ్, ఐన్‌స్టీన్, హిట్లర్ తదితరులు ఉన్నారు.
  • దేశానికి స్వాతంత్య్రం  వచ్చిన అనంతరం జాతిని ఉద్దేశించి నెహ్రూ చేసిన మొట్టమొదటి ప్రసంగం సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు.
  • గాంధీజీ మరణించే సమయంలో ఆయన ధరించిన వస్త్రాలు ఇప్పటికీ మధురైలోని గాంధీ మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో  గాడ్సే తుపాకీతో కాల్చడంతో రక్తపు మరకలు ఏర్పడిన వస్త్రాలూ ఉన్నాయి.
  • గాంధీజీ తన జీవితాంతం ఏ రాజకీయ ప్రధానమైన పదవినీ స్వీకరించలేదు.
  • కాంగ్రెస్ పార్టీని రద్దుచేయాలనితన మరణానికి ఒక్క రోజు ముందు గాంధీజీ అనుకున్నారు.
  • గాంధీజీ ఎప్పుడూ గుండ్రటి ఫ్రేమున్న కళ్లద్దాలనే ధరించేవారు. ఆయనంటే విపరీతమైన అభిమానమున్న ‘ఆపిల్’ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ అచ్చం అలాంటి కళ్లద్దాలనే వాడేవారు. దీనిని గాంధీజీకి తాను ఇచ్చే గౌరవంగా స్టీవ్‌జాబ్స్ భావించేవారు.
  • గాంధీజీ ఇంగ్లిష్ ఉచ్ఛరణ ఐరిష్ యాసను పోలి ఉండేది. తనకు మొట్టమొదట ఆ భాషను నేర్పిన ఉపాధ్యాయుడు ఐరిష్ దేశస్థుడు కావడమే ఇందుకు కారణం.
  • గాంధీజీ పేరు మీద భారత్‌లో 53 ప్రధాన రహదారులకు ఆయన పేరు పెట్టారు. విదేశాల్లో దాదాపు 48 రోడ్లకు ఈ గౌరవం దక్కింది.
  • దక్షిణాఫ్రికాలో మూడు ఫుట్‌బాల్ క్లబ్‌లు ఏర్పడడానికి గాంధీజీయే కారణం. డర్బన్, ప్రిటోరియా, జొహాన్నెస్‌బర్గ్‌లోని ఈ మూడు క్లబ్‌లకు విచిత్రంగా ఒకే పేరును గాంధీజీ సూచించారు. అదే ‘పాసివ్ రెసిస్టర్స్ సాకర్ క్లబ్’.

‘గ్రాండ్’ హ్యాట్రిక్...

సానియా-హింగిస్ జంటకే మహిళల డబుల్స్ టైటిల్
వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ

మెల్‌బోర్న్: ఊహించిన ఫలితమే వచ్చింది. కొంతకాలంగా మహిళల డబుల్స్ టెన్నిస్‌ను శాసిస్తోన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ ఖాతాలో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గిన ఈ ద్వయం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అజేయంగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ‘హ్యాట్రిక్’ సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-6 (7/1), 6-3తో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించి చాంపియన్‌గా అవతరించింది.



గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే లభించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. దాంతో  తొలి సెట్‌లో ఏకంగా ఎనిమిది సార్లు సర్వీస్‌లు బ్రేక్ అయ్యాయి. తుదకు టైబ్రేక్‌లో సానియా జంట పైచేయి సాధించి తొలి సెట్‌ను 62 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలోనే హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట తర్వాత అదే జోరును కొనసాగించి 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో హింగిస్ తన సర్వీస్‌ను కోల్పోయినా... తొమ్మిదో గేమ్‌లో హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ ద్వయం విజయాన్ని దక్కించుకుంది.
 
విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 6,35,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బహుమతి ప్రదానోత్సవంలో ఇద్దరికీ కలిపి ఒకే ట్రోఫీ అందజేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు ఇద్దరికీ వేర్వేరుగా ఒక్కో ట్రోఫీని ఇస్తారు.
 
మిక్స్‌డ్ డబుల్స్‌లో నిరాశ: మహిళల డబుల్స్‌లో టైటిల్  నెగ్గిన సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 5-7, 6-7 (4/7)తో ఐదో సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 39,250 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 18 లక్షల 90 వేలు)ప్రైజ్‌మనీ దక్కింది.
 
36 వరుసగా సానియా-హింగిస్ సాధించిన విజయాలు.
ఈ ఇండో-స్విస్ జంట ఖాతాలో చేరిన వరుస టైటిల్స్ సంఖ్య.
6 మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ను కలిపి సానియా సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.
21 సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో కలిపి హింగిస్  నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.

Friday, January 29, 2016

బాదం పాలతో జ్ఞాపకశక్తి


నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో నిత్యం మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి మందగిస్తోంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే జ్ఞాపకశక్తి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు బాదంపాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందట. అంతేకాదు బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు బాదంపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. బాదంలో ఉండే క్యాల్షియం ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది. బాదంపప్పులో ఐరన్‌, ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇంతటి మేలు చేసే బాదం పాలను ప్రతిరోజూ తాగడంఎంతో శ్రేయస్కరం.

ఎపిలో స్మార్ట్‌ సిటీలుగా విశాఖ, కాకినాడ

* 20 నగరాలతో తొలి జాబితా
* తిరుపతి పేరు గల్లంతు శ్రీ త్వరలో ఎస్పీవీల ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న స్మార్ట్‌ సిటీల జాబితాను గురువారం విడుదల చేసింది. రాష్ట్రం నుంచి విశాఖపట్నం, కాకి నాడ నగరాలు జాబితాలో చోటుదక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. స్మార్ట్‌సిటీల కింద అభివృద్ధి చేసేందుకు తిరుపతిని కూడా ఎంపిక చేసినప్పటికీ, తొలి జాబితాలో ఈ నగరం పేరు గల్లంతైంది. స్మార్ట్‌సిటీ పను లను పర్యవేక్షించడానికి కేంద్రం ప్రత్యేకంగా ఎస్పీవీని ఏర్పాటు చేయనుంది. ఒక్కో నగరానికి ఒక్కో ఎస్పీవీ ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనులన్నీ దీని పర్యవేక్షణలోనే కొనసాగనున్నాయి. ఎస్పీవీలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ, ప్రైవేటు రంగాలకు వాటా కల్పించారు. 40:40:20 లేదా 30: 30:40 నిష్పత్తిలో నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం గ్రాంటు రూపంలో ఈ నిధులను రాష్ట్రానికి అందజేస్తుంది. ఎస్పీవీలకు ఛైర్మన్‌గా సంబంధిత జిల్లా కలెక్టర్‌ లేదా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించనుంది. ఎస్పీవీల ఏర్పాటుపై మున్సిపల్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్‌సిటీల జాబితాలో తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలకు చోటు దక్కింది. దీనితో స్మార్ట్‌సిటీల ఏర్పాటు దిశగా తదుపరి చర్యలను తీసుకోవడానికి మున్సిపల్‌ శాఖ సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా తొలుత ఎస్పీవీలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్మార్ట్‌సిటీకి ఒక్కో ఎస్పీవీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఎస్పీవీకి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో ఆర్థికం, ప్రణాళిక, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారి ఒకరిని ఇందులో ఈ స్టీరింగ్‌ కమిటీలో నియమిస్తారు. మార్గదర్శకాలను ఈ కమిటీని నిర్ధరిస్తుంది. మార్గదర్శకాల రూపకల్పనలో నగరస్థాయి కమిటీకీ భాగస్వామ్యాన్ని కల్పిస్తారు. ఈ కమిటీలో సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌, సాంకేతిక నిపుణులను ఇందులో చోటు కల్పిస్తారు.

స్మార్ట్‌సిటీ కార్యకలాపాల పర్యవేక్షణపై సర్వాధికారాలను కేంద్రం ఎస్పీవీలకు కల్పించింది. సాధారణంగా స్థానిక సంస్థలు చేసే రోజువారీ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకునే అధికారం దీనికి ఉంటుంది. సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతితో పన్నుల వసూళ్లు, యూజర్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలను కూడా వసూలు చేసే హక్కు దీనికి ఉంటుందని సమాచారం. ఎస్పీవీలను ఏర్పాటు చేస్తూ పెట్టే పెట్టుబడిలో ప్రైవేటు రంగానికి 20 లేదా 40 శాతం వాటా కల్పించినందున, స్మార్ట్‌సిటీల్లో వసూలయ్యే పన్నులు, యూజర్‌ ఛార్జీలు నేరుగా ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Thursday, January 28, 2016

పంచదారకు బదులు వీటిని ట్రై చేయండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

తియ్యగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్స్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే... చెంచాల కొద్దీ చక్కెర కలిపి తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు, పళ్ల రసాలు, బేకరీ ఐటమ్స్ అంటే మనకెంతో ఇష్టం. అయితే ఇలా చక్కెర వాడకం పెరుగుతూ పోతే మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. ఫ్రూట్‌ జ్యూసులు, డెజర్టులు చక్కెరతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ చక్కెర ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. రకరకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతున్న కొద్దీ మన ఒంట్లో జీవ క్రియలు అస్తవ్యస్తం అవుతాయి. బరువు అదుపు తప్పుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్‌ నిరోధకత వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... చక్కెర కూడా మద్యంతో సమానమే అంటారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం మేలు. హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి... అందుకే శరీరంలో బ్లడ్‌ షుగర్‌ పెరగకుండా సహజ తీపిదనాన్ని కలిగి ఉండే తేనె, పళ్ల లాంటి వాటిని వాడితే శరీరానికి ఎంతో మంచిది. స్వీటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ... వాటిని చక్కెరతో తయారుచేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెరకు బదులు ఆర్గానిక్‌ బెల్లం, చెరుకురసం, ద్రాక్షపళ్లు, తేనె, ఖర్జూరం, ఎండుద్రాక్ష, ఆప్రికాట్స్‌, తాజా పళ్లను పదార్థాల్లో వాడితే ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేలాగో చూద్దాం...

బ్రౌన్ షుగర్: ఒక కప్పు టీకి 1టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ జోడించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే బ్రౌన్ షుగర్ లో మినిరల్స్(క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్)లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకతను పెంచి, వ్యాధులను దూరంగా ఉంచుతాయి.


ఖర్జూరం: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరియు డయాబెటిక్ పేషంట్స్ కు ఇవి చాలా సురక్షితమైనవి. ఖర్జూరాలను నేరుగా అలాగే తీసుకోవడం లేదా సిరఫ్ లాగా తయారుచేసుకొని టీ లేదా కాఫీలకు ఉపయోగించుకోవచ్చు. 


తేనె : పంచదారకు బదులు తేనె వాడకం చాలా మంచిది. రోజూ కొద్దిగా తేనె తింటే గుండెకు మంచిది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి దరిచేరవు. అంతేకాదు శరీరంలోని రక్తాన్ని అది శుభ్రం చేస్తుంది. కడుపులో ఎసిడిటీ, గ్యాస్‌లాంటి సమస్యలు తలెత్తవు. 


పచ్చి కొబ్బరి : పచ్చికొబ్బరి తురుము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. షుగర్ కు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. అలాగని, టీ, కాఫీలలో దీన్ని చేర్చలేరు, కానీ ఇతర స్వీట్ డిష్ లకు కొబ్బరిని చేర్చుకోవచ్చు.


డ్రై ఫ్రూట్స్ : డ్రైఫ్రూట్స్‌ అంటే ఎండు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్‌ వంటి వాటిని చక్కెరకు బదులు వాడొచ్చు. ఖర్జూరంలో పొటాషియం, ఐరన్‌, విటమిన్‌-బి, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తినే పదార్థాలకు ఎండు ద్రాక్షను జోడించి తింటే స్వీటు తినాలన్న మీ కోరిక కూడా తీరుతుంది. ఎండుద్రాక్షలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అజీర్తితో బాధపడేవాళ్లు అంజీర తింటే మంచిది. ఉబ్బసంతో బాధపడేవారికి కూడా అంజీర ఎంతో మంచిది. దగ్గు, జలుబులతో బాధపడేటప్పుడు అంజీర తింటే ఎంతో ఆరోగ్యం. కఫం కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాదు ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేట్టు చేస్తాయి. ఎప్పుడైనా స్వీట్లు తినాలనిపిస్తే డ్రైఫ్రూట్లు తినండి. మనం చేసే స్వీట్లలో చక్కెరకు బదులు డ్రై ఫ్రూట్లను వాడొచ్చు. చక్కెరతో పనిలేకుండా డ్రైఫ్రూట్‌తో చిక్కి చేయొచ్చు.


చెరుకురసం : చక్కెరకు బదులుగా చెరకు రసాన్ని కూడా వాడుకోవచ్చు . చెరుకురసంలో విటమిన్‌-బి, విటమిన్‌-సిలు ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనత , జాండీ‌స్ వంటి వ్యాధులతో బాధపడేవారిని చెరుకురసం ఎక్కువగా తీసుకోమంటారు. అల్లం, నిమ్మకాయ లాంటి ఫ్లేవర్లు ఏమీ లేకుండా తాజా చెరకురసం తాగితే ఒంటికి మంచిది.


బెల్లం : పంచదారకు బదులుగా బెల్లం వాడుకోవడం ఎప్పుడూ మంచిదే. దీన్ని మెడిసెనల్‌ షుగర్‌ అని కూడా పిలుస్తుంటారు. దగ్గు, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చక్కెరకు బదులు బెల్లాన్ని విరివిగా వాడొచ్చు. బెల్లం పొడిరూపంలో, ఘన, ద్రవ రూపాల్లో కూడా దొరకుతుంది. బెల్లంతో చిక్కీలను తయారుచేయడం అందరికీ తెలిసిందే. అంతేకాదు పప్పు, కూరల్లో కూడా కొంతమంది బెల్లం వేస్తుంటారు. అవి తీయగా ఉండి రుచిగా అనిపిస్తాయి.


పళ్లు లేదా పండ్ల రసాలు : కొన్ని రకాల వంటల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ జ్యూస్ లను ఉపయోగించుకోవచ్చు . ఫ్రూట్ జ్యూస్ లలో న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. పంచదారకు బదులుగా మనకు అందుబాటులో దొరికే పళ్ళను కూడా వాడుకోవచ్చు. ఇలా సహజసిద్దంగా లభించే వాటిని చక్కెరకు బదులుగా వాడుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యల భయం తగ్గుతుంది. మన ఆరోగ్యము బేషుగ్గా ఉంటుంది. అలాంటి పండ్లలో మామిడి, అరటి, కేరట్‌, బొప్పాయి, యాపిల్‌, పుచ్చకాయలాంటివి బాగా తీయగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలేమీ తలెత్తవు. బ్లడ్‌ షుగర్‌ ఎక్కువ కాదు.పళ్ల ప్రత్యేకత ఏమిటంటే అవి జీరో ఫ్యాట్‌.

ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేదు!

రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై తగ్గుతున్న ఆదరణ


♦ ఆరేళ్లుగా కన్వీనర్ కోటాలో తగ్గుతున్న ప్రవేశాలు
♦ 2010లో 69 వేలకుపైగా భర్తీ.. ఈసారి 56 వేలకే పరిమితం
♦ వచ్చే విద్యా సంవత్సరంలోనూ భారీగా తగ్గనున్న ప్రవేశాలు
♦ సీట్లను తగ్గించేందుకు ఏఐసీటీఈ చర్యలు
♦ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్.. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజీ కోర్సు. ఏ తల్లిదండ్రులను అడిగినా తమ పిల్లాడిని ఇంజనీరింగ్ చదివిస్తామని.. ఏ విద్యార్థిని అడిగినా వారి టార్గెట్ ఒక్కటే ఇంజనీర్ అవుతామని చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతోంది. గడిచిన ఐదేళ్లలో ఇంజ నీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమం గా తగ్గుతూ వస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలు.. అధ్యాపకులు లేకపోయినా కాలేజీలను కొనసాగిస్తున ్న యాజమాన్యాల వైఖరితో ఇంజనీరింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్న నిరాసక్తత తల్లిదండ్రుల్లోనూ.. విద్యార్థుల్లోనూ పెరుగుతోంది.


 నాణ్యతా ప్రమాణాలపై దృష్టి
 రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా ఇంజనీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. ఏటా 40 శాతం మేర ఖాళీగా ఉంటోన్న ఇంజనీరింగ్ సీట్లను తగ్గించే దిశగా కసరత్తు చేస్తోంది. దీంతోపాటు ఇష్టారాజ్యంగా అనుమతులివ్వొద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ సహస్రబుద్దే ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ముగిసిన తర్వాత(గత డిసెంబర్ నాటికి) సీట్లు మిగిలిపోయిన 556 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు 1,422 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.

మరోవైపు నాణ్యతా ప్రమాణాలపై గతంలో చూసీచూడనట్లు వ్యవహరించిన రాష్ట్ర అధికారులు ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కా చర్యలపై దృష్టిసారించారు. మొత్తంగా అటు దేశవ్యాప్తంగా.. ఇటు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కుదింపుపై ప్రభుత్వాలు పక్కా చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కాలేజీల అనుమతుల ప్రక్రియను పక్కాగా చేపట్టాలని నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో(2016-17) కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు ప్రక్రియపై జేఎన్‌టీయూ ఈసారి ముందుగానే చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా కాలేజీల రద్దు, కోర్సుల రద్దు, సీట్ల తగ్గింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఏఐసీటీఈ అనుమతుల తర్వాత జేఎన్‌టీయూ చేపట్టాల్సిన అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ముందుగానే అఫిలియేషన్ ప్రొసీజర్ అండ్ రెగ్యులేషన్స్-2016ను సిద్ధం చేసింది.

 కాలేజీల తీరే కారణం..
 ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని విద్యను గాలికొదిలేసిన యాజమాన్యాల వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీలు విద్యా బోధనపై దృష్టి పెట్టలేదు. ఫీజుల కోసమే కాలేజీలను నడుపుతూ ఇంజనీరింగ్ విద్యను వ్యాపారంగా మార్చుకున్నాయి. అధ్యాపకులను నియమించకుండా, బీటెక్ వారితోనే మమా అనిపించేస్తూ ఇంజనీరింగ్ విద్యను భ్రష్టు పట్టించాయి. దీంతో అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పడిపోయాయి. పేరున్న కాలేజీల్లో తప్ప మిగతా కాలేజీల్లో రిక్రూట్‌మెంట్ జరగడంలేదు.
 
దీంతో ఇంజనీరింగ్ చేసినా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్‌రంగంలో నెలకు రూ.5 వేలు, రూ.10 వేలకు పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఏటా 90 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా 15 వేల మందికి కూడా తగిన ఉద్యోగం లభించడం లేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల వల్ల విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు భాషా నైపుణ్యాలు లేకపోవడమే దీనికి కారణం. యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్, చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో వెనుకబడి ఉన్నట్లు స్పష్టమైంది.

 తగ్గిపోతున్న సీట్లు...
 ఆరేళ్ల కిందట(2010-11) కన్వీనర్ కోటాలో 69,690 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరితే.. గత ఏడాది (2014-15) కన్వీనర్ కోటాలో 57,925 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఇక 2015-16లో అయితే 56,017 మంది విద్యార్థులే కాలేజీల్లో చేశారు. విచిత్రం ఏంటంటే ఆరేళ్ల కిందట కన్వీనర్ కోటాలో తక్కువ సీట్లు ఉన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేశారు. (87,793 సీట్లలో 69,690 మంది చేరారు) ఆ తర్వాత నుంచి సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా.. కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
 
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఇంజనీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించిన కారణంగా కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా సీట్లు రద్దు చేసుకోగా, మరికొన్నింటిలో నాణ్యతా ప్రమాణాల మేరకు జేఎన్‌టీయూహెచ్ సీట్లకు అనుమతిచ్చింది. దీంతో 2015-16లో సీట్ల సంఖ్య తగ్గింది. అయినా వాటిల్లో చేరే వారు లేకుండా పోయారు. కన్వీనర్ కోటాలో 86,313 సీట్లకు అనుమతి ఇచ్చినా 56,017 మంది మాత్రమే చేరారు. 30 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి.

Wednesday, January 27, 2016

సూర్య నమస్కారంలో ఉన్న ముఖ్య దశలు

  • * సూర్య నమస్కారం, యోగాసనాలలో లాభదాయకమైన భంగిమ.
  • * ఐదు రకాలుగా శరీరానికి మంచి చేస్తుంది.
  • * ఈ ఆసనాన్ని అనుసరించే ముందు పూర్తి శ్రద్ధతో అనుసరించాలి.
  • * ఈ ఆసనంలో చాలా రకాల భంగిమలు ఉన్నాయి.

సూర్య నమస్కారం అనేది, యోగాసనాలలో ఉన్న ముఖ్యమైన మరియు లాభదాయకమైనదిగా చెప్పవచ్చు. ఈ యోగాసనంను రోజు అనుసరించటం వలన అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఇందులో ఉండే ప్రతి దశ నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండి, ఆచరించే సమయంలో పూర్తి ఏకాగ్రతతో చేయాలి. భౌతిక శరీరం, శ్వాస వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, బుద్ధి మరియు శారీరక పెరుగుదల వంటి 5 రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.




సూర్యనమస్కారంలో ఉన్న 7 భంగిమలు

మొదటి దశ

ఈ భంగిమలో సూర్యుడి వైపు నిలబడి, మీ చేతులను నమస్కార భంగిమలోకి తీసుకురండి లేదా చేతులను ముడిచి చాతి దగ్గర ఉంచండి, దాదాపు చాతిని తాకించే భంగిమలో ఉంచండి. గాలిని లోపలి పీలూస్తూ చేతులను భుజాల వారకి తీసుకురండి మరియు గాలిని భయటకు వదిలే సమయంలో చేతులను చాతి వద్దకు తీసుకురండి.

రెండవ దశ

గాలిని పీలూస్తూ, మీ చేతులను సూటిగా ఉంచి, వాటిని పైకి లేపండి. తరువాత, భుజాలతో పాటుగా వెనక్కి వంచండి. భుజాలను పూర్తిగా వంచటానికి ప్రయత్నించండి.

మూడవ దశ

మీ మోకాళ్లను నిటారుగా ఉంచి, నడుమును వంచి, కాలి వెళ్ళను అరచేతులతో తాకటానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియ శ్వాస తీసుకుంటూ చేయాలి, అంతేకాకుండా, శ్వాస వదులుతూ యధా స్థానానికి రావాలి.

నాలుగవ దశ

మీ ఎడమ కాలిని వెనకకు లాగండి, తరువాత మీ అరచేతులను నేలపై ఉంచి, తలను పైకెత్తి సూర్యుడిని చూడండి. ఈ భంగిమ అనుసరించే సమయంలో శ్వాస తీసుకోండి.

ఐదవ దశ

మీ చేతులను నేలపై ఉంచి, కుడి కాలును ముందుగానూ మరియు ఎడమ కాలును వెనుకగానూ ఉంచి, వంగి ఉండండి, ఈ భంగిమలో చేతులు కాళ్ళు నిటారుగా ఉండేలా జాగ్రత్త పడండి మరియు ఈ భంగిమ కొనసాగించే సమయంలో శ్వాస తీసుకోండి.

ఆరవ దశ

నేలపై పడుకొని, పాదాలు, మోకాళ్ళు, తొడలు, చాతి మరియు తల అన్ని శరీర భాగాలు నేలకు తాకించి పడుకోండి. తరువాత మీ తలను కుడి మరియు ఎడమ వైపులకు తిప్పుతూ, చెవులను నేలకు తాకించండి. ఈ భంగిమలో కూడా శ్వాస తీసుకోండి.

ఏడవ దశ

మీ తలను ఎట్టి, అరచేతులను నేలపై తాకించి, సాధ్యమైనంత వరకు నడుమును పైకి ఎత్తండి. ఈ భంగిమ అనుసరించే సమయంలో కూడా గాలిని పీల్చండి.
ఇక్కడ తెలిపిన ప్రతి భంగిమ ప్రత్యేకతను కలిగి ఉండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారం చేసే సమయంలో ఏకాగ్రతతో అనుసరించాలి మరియు అనుసరించే ముందు ఎలాంటి అవాంతరాలు లేని ప్రాంతాన్ని ఎంచుకోవటం మంచిది.

Monday, January 25, 2016

ఆరోగ్యంగా ఉంచే 7 రకాల అలవాట్లు

  • * ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం వలన జీవితంలో చాలా మార్పులు వస్తాయి.
  • * రోజు ఉదయాన మీ రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించండి.
  • * రోజు వ్యాయామాలను చేయండి.
  • * మంచి పాటలను లేదా సంగీతాన్ని వినండి.

  • రోజు కొన్ని రకాల అలవాట్లను అనుసరించటం వలన మీ జీవన శైలిలో మార్పులు కలిగి, రోజును సంతోషంగా ప్రారంభిస్తారు మరియు ముగిస్తారు. ఈ చిన్న చిన్న అలవాట్లను అనుసరించటం వలన మీ జీవితంలో మంచి మార్పులను జరిగి, శారీరకంగానూ, మానసికంగాను చాలా ప్రయోజనాలను పొందుతారు.
  • ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లను అనుసరించటం వలన మీ జీవితంలో అద్బుత మార్పులు సంభవిస్తాయి కావున మంచి అలవాట్లను మరియు సరైన అలవాట్లను ఎంచుకోండి. కొన్ని ముఖ్యమైన నియమాలు, వాటిని అనుసరించటానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు అని చెప్పవచ్చు. ఈ నియమాలు పాటించటం సులభం కావున ఇలాంటివి అనుసరించటం ఇబ్బందిగా భావించారు. మీరు పాటించాల్సిన 7 ఆరోగ్యకర అలవాట్లు ఇక్కడ తెలుపబడ్డాయి.

    రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించండి

    మీరు రోజు ఉదయాన లేసిన తరువాత రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించటం ముఖ్యమైనది. ఉదయాన లేచిన తరువాత మీ జీవితం ఆనందంగా ఉంది, జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి వాటిని సాధించి, సంతోషంగా ఉన్నాము అనే ఉద్దేశంతో ఉదయాన్ని ప్రారంభించండి. మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి, వృత్తిలో సరైన విధంగా నడుచుకుంటూ, విజయం సాధించిన వాటికి గర్వపడుతూ ఉండండి. ఇలా మనసులో భావిస్తూ, ఉదయాన ఒక కప్పు టీ లేదా కాఫీ త్రాగి మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే అల్పాహారాన్ని సేకరించి, తరువాతి పనిని కొనసాగిస్తూ శిఖరాలను అధిగమించండి.

    స్నానం

    మీరు ఉదయాన లేవగానే ఇది తప్పనిసరి ప్రక్రియగా చెప్పవచ్చు. మీరు స్నానం చేసేటపుడు ఎలాంటి సమస్యల గురించి ఆలోచించకుండా కేవలం స్నానం పైన దృష్టి పెట్టండి. స్నానం సమయంలో సబ్బుతో మీ శరీరాన్ని గట్టిగా రాయకుండా మృదువుగా మీ చర్మానికి సబ్బు రాస్తూ, చేసే స్నానాన్ని ఆస్వాదించండి. మీరు వాడే సబ్బు సువాసనను వేలువరిచేదిగా ఉండాలి మరియు రోజు మొత్తం ఆ వాసన వచ్చేదిగా ఉండాలి. కావున మంచి సబ్బులను వాడండి. మీరు ఆరోగ్యంగా ఉండటంలో ఇవి కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.


  • మ్యూజిక్ వినండి

    రోజు మీరు చేసే పనిలో చాలా బిజీగా ఉంటున్నారా! ఇలాంటి సమయంలో మీకు ఇష్టమైన పాటలను వింటూ పని చేయటం వలన, ముఖ్యంగా మంచి సంగీత పాటలు, విశ్రాంతి చేకూర్చే పాటలను వినండి. ప్రతి రోజు సంగీతాన్ని వినటానికి ప్రయత్నించండి, కాస్త సమయం పాటూ మీ పని పక్కన పెట్టి కొద్ది సమయం పాటు సంగీతాన్ని ఆస్వాదించండి. కొన్ని రకాల శాస్త్రీయ సంగీతాలు లేదా ఫోక్ సాంగ్స్, ఇలా మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఉండండి. కానీ మీరు సంగీతాన్ని వినేటపుడు మాత్రం ఎలాంటి భంగాలు కలుగకుండా చూసుకోండి.

    కాఫీకి బదులుగా టీ తాగండి

    ఏది ఏమైనా కొంత మంది ఎక్కువ కప్పుల కాఫీ తాగటం వలన వారి ఆరోగ్యానికి మంచిది అని భావిస్తుంటారు. కానీ ఇలా చేయటం వలన నిద్రకు తప్పని సరిగా భంగం కలుగుతుంది మరియు మీరు ఒత్తిడి, ఉద్రేకతలకు గురవుతుంటారు. ఉదయాన లేదా ఎపుడైన ఒక కప్పు కాఫీ తాగటం వలన ఎలాంటి ప్రమాదం లేదు కానీ రోజు మొత్తం కాఫీ మాత్రం తాగకండి. మీకు కాఫీ తాగటం ఎక్కువ అలవాటు ఉన్నట్లయితే, కాఫీకి బదులుగా టీ తాగటానికి ప్రయత్నించండి. గ్రీన్ టీ లేదా ఇతర రూపాలలో ఉన్న టీలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లు ఉంటాయి. కావున కాఫీకి బదులుగా టీ తాగటం శ్రేయస్కరం.

    ఆహరం నెమ్మదిగా నమలండి

    కొంత మంది చాలా వేగంగా ఆహరాన్ని నములుతూ, తింటూ ఉంటారు, ఇలా వేగంగా లేదా సరిగా ఆహారాన్ని నమలకపోవటం వలన జీర్ణ వ్యవస్థకు సమస్యలు కలిగే అవకాశం ఉంది. కారణం జీర్ణ వ్యవస్థలో ఉండే లాలాజలం జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటుంది. కావున ఆహరాన్ని నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా నమలటం వలన జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. ఆహరం పెద్ద ముక్కలుగా ఉన్నట్లయితే జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు ఆహరం తినేటపుడు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి.

  • మెట్లు ఎక్కండి
  • మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎలివేటర్ మరియు ఎస్కలేటర్లు వంటివి కాకుండా మెట్లను ఉపయోగించి ఎక్కండి. ఇలా మెట్లు ఎక్కటం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వీలుపడినపుడల్లా మెట్ల ద్వారా వెళ్ళటానికి ప్రయత్నించండి, దీని వలన మీ పాదాలకు రక్తప్రసరణ జరుగుతుంది, రోజు మొత్తం ఎక్కవగా నడవటానికి ప్రయత్నించండి. మీ శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గే అవకాశంతో పాటూ, శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

    వ్యాయామాలు

    వ్యాయామాలు అనగానే అందరు చాలా నిరాశకు గురవుతుంటారు, కారణం ఉదయాన లేచి వ్యాయామాలు చేయటం బద్దకంగా అనిపిస్తుంది. తీవ్రమైన లేదా కష్టతరమైన వ్యాయామాలను కాకుండా రోజు ఉదయాన చిన్న చిన్న వ్యాయామాలను చేయండి. ఈ సమయంలో మీరు వ్యాయామాల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాల గురించి గుర్తించనట్లయితే, భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాయామాల వలన మెడ నొప్పి, వెన్ను నొప్పులు మరియు కీళ్ళ నొప్పుల వంటి ఇబ్బందులకు గురవరు. కావున రోజు వ్యాయామాలు చేయటానికి ప్రయత్నించి, రోజులో కలిగే ఒత్తిడిల నుండి ఉపశమనం పొందండి.
    ఆరోగ్యంగా జీవించటం అనేది గొప్ప విషయం లేదా పెద్ద సమస్య కూడా కాదు. మీరు చేసే పనుల మరియు అనుసరించే నియమాల పైన మాత్రమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు పాటించే నియమాలు మీ శరీరానికి ఉపయోగపడేవిగా ఉండాలే కానీ అనారోగ్యాలకు గురి చేసేవిగా ఉండకూడదు.

మలేషియా గ్రాండ్ ప్రి టైటిల్‌ విజేతగా భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

* మలేసియా మాస్టర్స్ టైటిల్ సొంతం
* ఫైనల్లో కిర్‌స్టీ గిల్మౌర్‌పై విజయం
* కెరీర్‌లో ఐదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్



గతేడాది గాయాల కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. స్వదేశంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అజేయంగా నిలిచిన ఈ తెలుగు అమ్మాయి అదే జోరును మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లోనూ కొనసాగించి చాంపియన్‌గా నిలిచింది.

పెనాంగ్: నిలకడగా రాణిస్తే అంచనాలకు అనుగుణమైన ఫలితాన్ని సాధించడం కష్టమేమీ కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరూపించింది. సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి ఫిట్‌నెస్ సంపాదించిన ఈ తెలుగు అమ్మాయి ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే విజేతగా అవతరించింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సింధు చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-15, 21-9తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై గెలిచింది. తద్వారా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ చేతిలో ఎదురైన ఏకైక పరాజయానికి బదులు తీర్చుకుంది.

విజేతగా నిలిచిన సింధుకు 9000 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎనిమిదేళ్ల చరిత్ర కలిగిన మలేసియా మాస్టర్స్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండుసార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. 2013లో సింధు మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను తొలిసారి సాధించి సీనియర్ స్థాయిలోనూ గొప్ప విజయాలు సాధించే సత్తా తనలో ఉందని చాటిచెప్పింది.

సెమీఫైనల్లో టాప్ సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించిన సింధు... ఫైనల్లోనూ ఆద్యంతం నిలకడగా ఆడింది. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడిన అనుభవమున్న సింధు ఈసారి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్ షాట్‌లతో పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో తొలుత 5-2తో.. ఆ తర్వాత 12-6తో... 18-10తో సింధు ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆటతీరుకు గిల్మౌర్ వద్ద సమాధానం లేకపోయింది.

మొదట్లో సింధు 9-6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు నెగ్గి 16-6తో ముం దంజ వేసింది. గిల్మౌర్‌కు ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు తుదకు 32 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి తన ఖాతాలో టైటిల్‌ను జమచేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సింధు  మూడు గంటల 46 నిమిషాలపాటు కోర్టులో గడిపింది. తన ప్రత్యర్థులకు కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-18, 21-11తో జైనుద్దీన్‌పై గెలిచి టైటిల్ నెగ్గాడు.

సింధుకు జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్న పి.వి.సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే క్రీడా పోటీలన్నింటిలోనూ ఆమె విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

‘బాయ్’ నజరానా రూ. 5 లక్షలు
మలేసియా ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇదే విధంగా రాణిస్తూ మున్ముందు ఆమె మరిన్ని టైటిల్స్ గెలవాలని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా ఆకాంక్షించారు.

ఇదో గొప్ప విజయం. కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. ఫైనల్‌తో పోలిస్తే శనివారం టాప్ సీడ్ సుంగ్ జీ హున్‌తో జరిగిన సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను. ఫైనల్లో ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకున్నాను. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడినా... అప్పటికి ఇప్పటికీ నా ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఈనెల 26న లక్నోలో మొదలయ్యే సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాను.