Saturday, July 2, 2016

పేస్ట్ కు అంత సీన్ ఉందా..?

మన అమ్మమ్మలు చెప్పే బ్యూటీ సీక్రెట్స్ గుర్తున్నాయా ? వాళ్లు చెప్పే సలహాల్లో ట్రెడిషనల్ రెమిడీస్ ఎక్కువగా ఉంటాయి. అవైతేనే.. ఎఫెక్టివ్ ఫలితాలు ఇస్తాయి. అందుకే.. వాటిని ప్రయత్నించమని సలహా ఇస్తుంటారు. కానీ.. చాలామంది వాటిని పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ.. వాటిని ఫాలో అయితే మాత్రం.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 



చర్మం సంరక్షణకు, జుట్టు సంరక్షణకు మన బామ్మలు చెప్పిన రెమిడీస్.. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాస్మొటిక్స్ కంటే.. ఇవి చాలా న్యాచురల్ గా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు. చాలా సందర్భాల్లో చర్మం ఆరోగ్యాన్ని, నిగారింపును కోల్పోతుంది. దీనికి కాలుష్యం, పూర్ డైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సన్ ట్యాన్ వంటివి కారణాలు.



మీకు తెలుసా.. తేనె, వేప మిశ్రమం రకరకాల చర్మ సమస్యలను నివారిస్తుందని..? నిజమే.. ఈ ట్రెడిషన్ హోం రెమెడీ ఉపయోగించడం వల్ల చర్మంలో అద్భుతమైన ప్రయోజనాలు చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కావాల్సిన పదార్థాలు :
వేప ఆకులు 3 నుంచి 4 
తేనె 1 టేబుల్ స్పూన్ 



ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం 
ముందుగా వేప ఆకులను నీటిలో 20 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు వేప ఆకులు, తేనెను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. 
15 ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో, మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల పొందే 7 గ్రేట్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

యాక్నె తగ్గించడానికి: 
వేప, తేనె మిశ్రమం యాక్నె నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. యాక్నెతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. యాక్నెకి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

మాయిశ్చరైజర్:
తేనె చర్మానికి న్యాచురల్ గా హైడ్రేటింగ్ అందిస్తుంది. దీన్ని వేపతో కలిపి పట్టించుకోవడం వల్ల.. ఇది చర్మంలోని ప్రతి కణానికి మాయిశ్చరైజర్ అందించి.. చర్మం సాఫ్ట్ గా మారేలా చేస్తుంది.

గాయాలకు:
తేనె, వేప మిశ్రమం ఏదైనా గాయాలు అయినప్పుడు, బ్లడ్ కారుతున్నప్పుడు, కాలినప్పుడు ఉపయోగించడం వల్ల.. మంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

ర్యాషెస్ నివారించడానికి:
అర్టికేరియా, ర్యాషెస్, దురద వంటి స్కిన్ అలర్జీలను కూడా.. ఈ ప్యాక్ ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి:
చర్మంలో ఉండే బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో ఇది చాలా పవర్ ఫుల్ న్యాచురల్ ప్యాక్. ఇది చర్మంలోపలి వరకు వెళ్లి.. బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఎపెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆయిలీ స్కిన్:
వేప, తేనె మిశ్రమం.. చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మంలో ఆయిలీ నెస్ నివారించవచ్చు.

సోరియాసిస్:
తేనె, వేప మిశ్రమం.. హీలింగ్ నేచర్ కలిగి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. సోరియాసిస్, ఎగ్జిమా వంటి వాటిని ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.
















Friday, July 1, 2016

టేస్టీ టేస్టీ.... పుదీనా చట్నీ

చట్నీ లేదా పచ్చడి పాపులర్ ఇండియన్ సైడ్ డిష్. పచ్చడి లేని భోజనం... చేవచచ్చిన జీవితం. అంటుంటారు. ఎందకంటే మనిషన్నాక ఉప్పకారం తినాలి అంటారు అందుకు. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టించి తయారు చేసే ఈ పచ్చళ్ళు రుచితో పాటు రంగు, వాసనలు కూడా అద్భుతంగా ఉంటాయి.



పచ్చళ్ళు రోటి, రైస్, చాట్స్, స్నాక్స్ , బ్రేక్ ఫాస్ట్ వంటివాటికి చక్కటి కాంబినేషన్. అంతే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లల్లో ముఖ్యమైనవి కొత్తిమీర, పుదీనా, టమోటో పచ్చళ్ళు. పుదీనా చట్నీ చేస్తే గది మొత్తం ఘుమఘుమలాడాల్సిందే.

అంతే కాదు సూపర్ టేస్ట్ కూడా.. అంతే కాదు, ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల వల్ల దీన్ని ఏసీజన్లో తీసుకొన్న కొన్ని బాడీఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ పుదీనా చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...


కావల్సిన పదార్థాలు: 
ఫ్రెష్ గా ఉండే పుదీనా: రెండు కట్టలు: 1 cup(శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి) 
కొబ్బరి తురుము 1/2cup 
ఎండు మిర్చి: 8-10
వెల్లులి రెబ్బలు: 4
ఫ్రెష్ జింజర్ (అల్లం): 1 cup 
కొత్తిమీర తరుగు: 1/4 cup 
ఉప్పు: రుచికి సరిపడా 
పంచదార: 1/4 tsp 
చింతపండు రసం: 1 tsp 
నీళ్ళు: సరిపడా


తయారుచేయు విధానం: 
1. ముందుగా పుదీనా శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. నీరు మొత్తం వడలిపోయే వరకూ పక్కన పెట్టుకోవాలి 2. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, మొదట ఎండు మిర్చి వేగించి పక్కన పెట్టుకోవాలి. 
3. అదే నూనెలో పుదీనా మెత్తబడే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. మద్యమద్యలో కలియబెట్టడం వల్ల పాన్ కు అట్టుకోకుండా ఉంటుంది. 
4. తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసి ఒకనిముషం లైట్ గా వేగించుకోవాలి.
5. ఇప్పుడు వేగించుకొన్నపదార్థాలను మిక్సీ జార్లో వేయాలి,. వీటితో పాటు లిస్ట్ లో ఉన్న మిగిలిన పదార్థాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 
6. స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. 
7. అంతే టేస్టీ అండ్ హెల్తీ గ్రీన్ పుదీనా చట్నీ రెడీ. అవసరం అయితే పోపులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ ఇండియన్ గ్రీన్ చట్న, వేడి వేడి దోస, ఇడ్లీ, చపాతీ, మరియు సమోసాలకు గ్రేట్ కాంబినేషన్. 

Thursday, June 30, 2016

దీంట్లో వంద వ్యాధులను నయం చేసే సత్తా ఉందా...?

మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదూ. అయితే.. ఈ మునక్కాడలే కాదు.. మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. దీన్ని మోరింగా, హార్స్ రాడిష్ ట్రీ అని పిలుస్తారు. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. 

4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు. మ‌రి మున‌గ ఆకులో దాగున్న ఔష‌ధ‌గుణాలేంటో ఇప్పుడు చూద్దాం..


మునగ విత్తనాలు మునగ విత్తనాలు నీటిని శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట. ఇతర పద్ధతుల కంటే.. మునగ విత్తనాలను ఉపయోగిస్తే.. ఎక్కువ ఫలితాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎండిన మునగ ఆకు :
మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఎండిన మునగ ఆకు నుంచి క్యారట్ల ద్వారా పొందే విటమిన్ ఏ ని 10 రెట్లు ఎక్కువగా పొంద‌వ‌చ్చు.



క్యాల్షియం:
పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

ప్రొటీన్స్:
పెరుగు నుంచి పొందే ప్రొటీన్స్ 9 రెట్లు ఎక్కువగా పొంద‌వ‌చ్చు.



పొటాషియం:
అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా ఎండిన మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

విటమిన్ సి:
ఆరంజ్ ల నుంచి పొందే విటమిన్ సిని 12 రెట్లు ఎక్కువగా పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.



షుగర్ లెవెల్స్:
మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట.

మహిళలకు:
మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్ లు సూచిస్తున్నారు.

థైరాయిడ్ :
థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు.

క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు:
మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాగే ఐదు రకాల క్యాన్సర్ లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది.

లంగ్, లివర్ లంగ్:
లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.







Wednesday, June 29, 2016

నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి

బాదాం అంటేనే ఆరోగ్యకరం. వీటిని తినడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఇంట్లోవాళ్లు, న్యూట్రీషన్స్ చెబుతుంటారు. అయితే వీటిని ఒట్టిగా తినడం కంటే.. నానబెట్టి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ పోషక విలువలు పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే.. నానబెట్టే ఎందుకు తినాలి అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. 



రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే బాదాం గింజలు తింటే ఆరోగ్యానికి మంచిదని వింటూ ఉంటాం. వీటిని నానబెట్టి తినడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుందని చెబుతుంటారు. కానీ.. పూర్తీగా ఎవరూ వివరించరు. కాబట్టి.. బాదాంగింజలను నానబెట్టి తినడం వల్ల పొందే గ్రేట్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..



నానబెట్టే ఎందుకు:
బాదాంలో అత్యంత అవసరమైన విటమిన్ ఈ, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలన్నింటినీ పొందాలంటే.. వాటిని రాత్రంతా నానబెట్టాలి. అందుకే నానబెట్టిన బాదాం తినడమే ఎక్కువ ప్రయోజనకరం అని చెబుతుంటారు.

జీర్ణమవడం:
బ్రౌన్ కలర్ లో రఫ్ గా ఉండే బాదాంత స్కిన్ లో ఒక ఎంజైమ్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా తినడం వల్ల జీర్ణమవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి.. వీటిని నానబెట్టి తీసుకుంటే.. గింజ సాఫ్ట్ గా మారి.. తేలికగా జీర్ణమవుతుంది. నానబెట్టిన బాదాంలో ఫ్యాట్ ని కరిగించే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి.. డైజెషన్ ని మెరుగుపరచడంతో పాటు, పోషకాలు గ్రహించడానికి సహాయపడతాయి.



కడుపులోని బిడ్డ గ్రోత్ కి:
నానబెట్టిన బాదాం తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది కడుపులో బిడ్డ మెదడు,నరాల వ్యవస్థ డెవలప్ మెంట్ కి చాలా అవసరం. బాదాం నానబెట్టిన తర్వాత జీర్ణమవడానికి తేలికగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలకు నానబెట్టిన ఆల్మండ్స్ తీసుకోవడమే శ్రేయస్కరం.



బ్లడ్ ప్రెజర్ :
బాదాం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడంలోనూ గ్రేట్ గా సహాయపడతాయి. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే టొకొఫెరాల్ బాదాంలో లభిస్తుంది. ముఖ్యంగా బీపీతో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా బాదాం తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న మగవాళ్లకు బాదాం చాలా అవసరం.


గుండె హెల్త్:
ఆల్మండ్స్ లో ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ గ్రహించడాన్ని నివారిస్తాయి. ఇది గుండె, గుండె సంబంధిత వ్యవస్థలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ హార్ట్ డిసీజ్ తో బాధపడేవాళ్లు.. డైలీ డైట్ లో ఆల్మండ్స్ చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.



బ్యాడ్ కొలెస్ట్రాల్:
హైకొలెస్ట్రాల్ అనేది ఇండియాలో ప్రధాన సమస్యగా మారింది. హైకొలెస్ట్రాల్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు హార్ట్ డిసీజ్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆల్మండ్స్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే సత్తా ఉంటుంది. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది.



బరువు తగ్గడానికి:
రెగ్యులర్ గా నానబెట్టిన ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. లో క్యాలరీ డైట్ లో ఆల్మండ్స్ ని కూడా చేర్చుకుంటే.. బరువు తగ్గడానికి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చట. అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది.











Tuesday, June 28, 2016

కంటిచూపుని ఎఫెక్టివ్ గా మెరుగుపరిచే ఆయుర్వేదిక్ రెమిడీస్..

ఇటీవల కాలంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి. ఐదేళ్లు కూడా నిండకముందే.. కంటిచూపు సమస్య అనేది ప్రస్తుతం చాలా కామన్ గా మారిపోయింది. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు 
కంటిచూపుని బలహీనంగా మారుస్తున్నాయి. మనం టీవీ చూడటానికి, కంప్యూటర్స్ చూడటానికి కేటాయిస్తున్న సమయమే దీనికి కారణం అని చెప్పడంలో ఆశ్చర్యంలేదు. 

కంటిచూపు సమస్య ఉందంటే.. అది లాంగ్ సైట్ లేదా షార్ట్ సైట్ అయి ఉండవచ్చు. కంటిచూపు మందగించడానికి చాలా కారణాలుంటాయి. జెనటికల్ రీజన్స్, ఏజింగ్, కళ్లపై ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కంటిచూపులో సమస్యలు ఎదురవుతాయి. 

ఒకవేళ మీరు బ్లర్ విజన్ తో బాధపడటం, కంటిలో నుంచి నీళ్లు కారడం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నాయంటే.. మీరు బలహీనమైన కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారని గుర్తించాలి. ఇలాంటప్పుడు వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే.. సమస్య మరింత ఎక్కువ అయి.. 

కంటిచూపుని మసకబరిచే శుక్లం సమస్య వస్తుంది. కంటిచూపు సమస్యలను లేజర్ సర్జరీ, లెన్సెస్, గ్లాసెస్ తో నివారించవచ్చు. కానీ న్యాచురల్ రెమిడీస్, ఆయుర్వేదిక్ హెర్బ్స్ ద్వారా కంటిచూపుని మెరుగుపరుచుకోవచ్చు. ఇది చక్కటి పరిష్కారం. మరి కంటిచూపుని మెరుగుపరుచుకునే.. ఆయుర్వేదిక్ రెమిడీస్ ఏంటో చూద్దామా..


త్రిఫల రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడంలో త్రిఫలం మ్యాజిక్ హెర్బ్ గా చెప్పవచ్చు. ఈ మూడింటి మిశ్రమం కంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం ఒక టేబుల్ స్పూన్ త్రిఫలాన్ని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి.. కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా త్రిఫలం నానబెట్టిన నీటితో శుభ్రం చేసుకుంటే.. కంటిచూపు మెరుగుపడుతుంది.



ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కంటిచూపుకి సంబంధించిన సమస్యలను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ మీరు కంటిచూపు సమస్యతో బాధపడుతుంటే.. డైట్ లో ఉసిరిని చేర్చుకుంటే సరిపోతుంది. డ్రై ఆమ్లా పౌడర్, లేదా క్యాప్సూల్ లేదా జ్యూస్ తీసుకోవచ్చు. ఉపయోగించే విధానం తాజాగా తయారు చేసుకుని ఉసిరి జ్యూస్ ని ప్రతి రోజూ తాగాలి. లేదా1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకుంటే.. కంటిచూపు మెరుగుపడుతుంది.


క్యారట్ 
క్యారట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలాగే అనేక పోషకాలు, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. అనేక పోషక విలువలు ఉండటం వల్ల.. క్యారట్ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ఉపయోగించే విధానం ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగితే.. ఎలాంటి కంటి సమస్యలైనా తగ్గుతాయి. లేదా సలాడ్స్ రూపంలో, భోజనం సమయంలో తీసుకున్నా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.



బాదాం:
కేవలం టేస్టీగానే కాదు.. అవి విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కంటిచూపు మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఉపయోగించే విధానం గుప్పెడు బాదాం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం తొక్క తీసేసి.. పేస్ట్ చేసుకోవాలి. ఒక గ్లాసు పాలతో.. ఈ పేస్ట్ కలిపి ప్రతిరోజూ ఉదయం తాగుతూ ఉంటే.. కంటిచూపు మెరుగవుతుంది.



భ్రింగరాజ్:
ఆయుర్వేదిక్ హెర్బ్. ఇది కంటిసంబంధిత సమస్యలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం కంటిచూపు మెరుగుపరచడానికి భ్రింగరాజ్ హెర్బ్ ని పేస్ట్ చేసి.. కళ్లపై అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. కంటి చూపు పెరుగుతుంది.



లికోరైస్:
లికోరైస్ ని ములెథి అని కూడా పిలుస్తారు. రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల కంటిచూపు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఉపయోగించే విధానం ఒక టీస్పూన్ లికోరైస్ పౌడర్ ను ఆవు పాలు లేదా నెయ్యి లేదా తేనె తో కలిపి తీసుకోవడం వల్ల కంటిచూపు పెరుగుతుంది.



వెల్లుల్లి:
ఆహారాల్లో టేస్ట్ కి మాత్రమే కాదు.. కంటిచూపు మెరుగుపరచడానికి కూడా వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ వెల్లుల్లి జ్యూస్ తీసుకోవడం వల్ల కంటిచూపుని మెరుగుపరచవచ్చు.






Monday, June 27, 2016

ఇవి తింటే జుట్టు తొందరగా పెరుగుతుంది

పట్టుకుచ్చులా ఉండే కేశాలతో పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే ఎంతకీ పెరగని జుట్టుతో మదిలో మదనపడుతుంటారు. కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని ఉన్నా శిరోజాలు ఒత్తుగా లేక వెనకుడుగు వేస్తుంటారు. వీటితోపాటు జుట్టు పొడిబారిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచేలా చేస్తుంది.

వీటన్నింటికీ కారణం ఒత్తిడి, అనారోగ్యాలు, జీవనశైలిలో మార్పులు. అయితే సరైన పోషకాహారం తీసుకొన్నట్టైతే వీటన్నింటికి అడ్డు కట్ట వేయవచ్చు. శరీరంలో జింక్ లోపం ఉన్నట్లైతే జుట్టు పెరుగుదల సరిగా ఉండదు. అలాగే జుట్టు పెరుగుదలకి విటమిన్ బి1, విటమిన్ సి, లైసీన్, నయాసిన్ లు ముఖ్యంగా అవసరం. బీటా కెరటిన్ ఫ్యాటీ ఆమ్లాలు సరిగా అందకపోతే చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది.



జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.

జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...



కోడిగుడ్డు: గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల పట్టుకుచ్చులాంటి కేశాలతో పాటు ఆరోగ్యమవంతమైన గోళ్ళు కూడా సొంతమవుతాయి.



ఖర్జూరం: ఖర్జూరంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఈ ఇనుము అందకే చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. రోజుకో ఖర్జూరం తింటే ఎంతో మేలు. డ్రైఫ్రూట్స్, నల్లటి ఎండు ద్రాక్ష, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు ఉసిరి వంటివి ఇనుమును అందించే ఇతర పదార్థాలు.



జుట్టు చివర్లు చిట్ల ఇబ్బంది పడుతుంటే జామకాయలు తింటే మంచిది. జామలోని విటమిన్ సి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఇనుము గ్రహిస్తుంది. జామతో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి ఇందుకు సహకరిస్తాయి. నయాసిన్ విటమిన్ మాంసం, మొలకెత్తిన గింజలు, పచ్చిబఠాణి, ఆకుపచ్చ బఠాణి, వేరుశెనగ, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ఈ విటమిన్ జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా కాపాడుతుంది.



మాంసకృత్తులు: కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచుతుంది.



సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది. ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.



ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.



పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది