Saturday, April 9, 2016

సమ్మర్ హీట్ జయించడానికి పెరుగు ఇలా కూడా తినవచ్చు


శీతాకాలం పోయింది, ఎక్కడ చూసినా ఎండలు భగభగమని మండుతున్నాయి.మరి ఇలాంటి ఎండలను తట్టుకోవాలంటే, శరీరానికి సరిపడా నీరు త్రాగాలి . వేడి నుండి ఉపశమనం పొందాలి .నీరు ఎక్కువగా త్రాగడంతో పాటు మంచి ఆహారాలను రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం చాలా అవసరం. హాట్ హాట్ గా చెమటలు కక్కించే వేడి వేసవి నుండి ఉపశమనం పొందాలంటే కూల్ కూల్ గా మజ్జిగ త్రాగాల్సి ఉంటుంది . 


పెరుగు లేదా మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే మనం ప్రొబయోటిక్స్ అనిపిలుస్తాము.ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియకు , జీర్ణవాహికలో బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది . శరీరంలో వ్యాధినిరోధకతను తగ్గించే బ్యాడ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి భోజనంలోనూ ఒక టేబుల్ స్పూన్ పెరుగు చేర్చుకోవడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు . 

పెరుగులో క్యాల్షియం, పొటాషియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . ఈ వైట్ యమ్మీ డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోటీనులు కూడా అధికంగా ఉన్నాయి . ఇది శరీరంను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, వేసవికాలం తీసుకొచ్చే అనేక జబ్బులను నివారించుకోవడానికి సహాయపడుతాయి . మరి మీరుకూడా ఈ వేసవిలో ఎండని తరిమి కొడుతుంది . మరి పెరుగును ఎలా తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను నివారించుకోవచ్చో తెలుసుకుందాం...

బట్టర్ మిల్క్: బట్టర్ మిల్క్ చిన్నవారికైనా మరియు పెద్దలకైనా మంచిదే. వేసవి కాలంలో రెండు కప్పలు బట్టర్ మిల్క్ ను రోజూ తాగడం వల్ల వేసవి వేడిని నివారించుకోవచ్చు . బట్టర్ మిల్క్ లో క్యాల్సియం అదికంగా ఉంటుంది . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.


పెరుగు అన్నం: మన ఇండియాలో పెరుగన్నం ఒక సాంప్రదాయ ఆహారం. బాగా పాపులర్ అయినటువంటి ఆహారం . రైస్ కు పెరుగు జోడించాలి . ప్లెయిన్ గా తినడం ఇష్టం లేకపోతే..ఈ పెరుగన్నంకు కొద్దిగా దానిమ్మ, ద్రాక్ష వంటివి జోడించి తీసుకోవచ్చు . అలాగే ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి



అవొకాడో రైతా: అవొకాడో రైతా మరో హెల్తీ ఆప్షన్ . వేసవిలో అవొకాడో తీసుకోవడం వల్ల అందులో మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి బరువు తగ్గిస్తాయి మరియు పెరుగు జోడించడం వల్ల వేసవి వేడిని తగ్గించడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.




ఫ్రోజోన్ పెరుగు: స్నాక్ కేక్స్ మరియు క్యాండీ బార్స్ గురించి ఆలోచిస్తే , ఫ్రోజోన్ పెరుగు కంటే హెల్తీ ఫ్రెష్ గా ఇంట్లో తయారుచేసిన పెరుగును ఒక కప్పు తీసుకుంటే మంచిది





ఓట్స్: ఒక బౌల్ ఓట్స్ ను ఒక కప్పు పెరుగుతో జోడించి , ఇష్టమైన పండ్లు జోడించి తీసుకోవడం వల్ల ఫైబర్ అందివ్వడంతో పాటు , పొట్టను నిండుగా ఉండేట్లు చేస్తుంది . అలాగే శరీరానికి ప్రోటీన్స్ మరియు విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి.




సాండ్విచ్ తో పెరుగు : మయోనైజ్ తినడం మీకు ఇష్టం లేకపోతే, మీ సాండ్విచ్ కు మరో బెటర్ఆప్షన్ పెరుగు , ఫైబర్ మీల్స్ కు ఒక టేబుల్ స్పూన్ పెరగు, కొద్దిగా ఉప్పు చేర్చి తీసుకోవడం వల్ల ఫైబరస్ మీల్ గా తయారవుతుంది.


స్మూతీ : పెరుగు తినడంలో బోర్ గా ఫీలవుతుంటే ప్లెయిన్ పెరుగును స్మూతీ రూపంలో తీసుకోవచ్చు . దీనికి కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు దాల్చిన చెక్క పౌడర్ వంటివి జోడించడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.


Thursday, April 7, 2016

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?


హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈ రోజుని ఉగాదిగా భావిస్తారు. కొత్త జీవితం ప్రారంభించడమనే అర్థం ఇందులో మిలితమై ఉంది. అలాగే ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం ( క్యాలెండర్ ) ప్రారంభమవుతుందని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు దేవాలయాల్లో పంచాగ శ్రవణం చదివి వినిపిస్తారు. ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో జరుపుకుంటారు. ఉగాది అనేది యుగ, ఆది అనే పదాల నుంచి వచ్చింది. అంటే.. కొత్త శకం ప్రారంభమని అర్థం వస్తుంది. అందుకే ఈ పండుగను ఉగాది అని పిలుస్తారు.


కొత్త సంవత్సరానికి గుర్తుగా.. మొదటి కాపుకి వచ్చిన వాటితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేప పూత, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పధార్థానికి ఒక విశిష్ఠత ఉంది. బెల్లం సంతోషానికీ, వేప దు:ఖానికి ప్రతీకలు. జీవితంలో సుఖాలనూ, దు:ఖాలనూ, సమభావంతో చూడాలన్నదే ఇందులోని అంతరార్థం. వేపపువ్వు దేహదారుఢ్యాన్ని కలిగించి సర్వారిష్టాలను తొలగించి పూర్ణాయుష్షును ప్రసాదిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి.


అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాం. ఒక్కో సంవత్సరం, ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత ? ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది ? అంటే.. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే.. ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో.. ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఈ ఏడాది వస్తున్న ఉగాది పేరు దుర్ముఖి నామ సంవత్సరం. ఇప్పుడు ఆయా ఉగాది సంవత్సరాలు, వాటి అర్థాలు..

  • దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ? ప్రభవ. ఈ పేరుకి అర్థం ఎక్కువగా యజ్ఞయాగాలు అని అర్థం. విభవ నామ సంవత్సరం అంటే.. ప్రజలకు సుఖసంతోషాలు అని అర్థం వస్తుంది. 
  • శుక్ల నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా పంటలు పండాలని సంకేతం. అలాగే ప్రమోద్యూత నామానికి అందరికీ ఆనందం అని అర్థం వస్తుంది.
  • ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటే.. అన్నింటా అభివృద్ధి చెందాలని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చే అంగీరస నామ సంవత్సరానికి భోగభాగ్యాల సిద్ధి అని అర్థం ఉంది.
  • శ్రీముఖ నామ సంవత్సరం అంటే వనరులు సమృద్ధిగా అందాలని చెబుతుంది. ఆ తర్వాత వచ్చే భావ నామ సంవత్సరానికి సద్భావనలు, ఉన్నత భావనలు కలిగి ఉండాలని అర్థం.
  • యువ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుఖంగా ఉండాలని తెలుపుతుంది. ధాత నామ సంవత్సరం అనారోగ్యబాధలు తగ్గుతాయని ఆశీర్వదిస్తుంది.
  • ఈశ్వర నామ సంవత్సరం అంటే.. క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బాహుధాన్య నామ సంవత్సరం దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని చెబుతుంది. 
  • ప్రమాది నామ సంవత్సరం అంటే.. వర్షాలు మధ్యస్థంగా ఉంటాయని తెలుపుతుంది. విక్రమ నామ సంవత్సరానికి సమృద్ధిగా పంటలు, విజయాలు సాధిస్తారనే అర్థం ఉంది.
  • వృష నామ సంవత్సరానికి సమృద్ధిగా వర్షాలు పడతాయని అర్థం ఉంది. ఆ తర్వాత వచ్చే చిత్రభాను నామం సంవత్సరం అంటే.. అంచనాలకు అందని ఫలితాలు పొందుతారని అర్థం.
  • స్వభాను నామ సంవత్సరం అంటే.. ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం. తారణ నామ సంవత్సరం అంటే.. సరైన సమయంలో సకాల వర్షాలు కురుస్తాయని అర్థం.
  • పార్థివ నామ సంవత్సరం అంటే.. ఐశ్వర్యం, సంపదలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఆ తర్వాత వచ్చే వ్యయ నామ సంవత్సరానికి అతివృష్టి, అధికఖర్చు అని అర్థం వస్తుంది.
  • సర్వజిత్ నామ సంవత్సరం అంటే.. సంతోకరంగా వర్షాలు వస్తాయని అర్థం. సర్వధారి సంవత్సరం అంటే.. దేశం సుభిక్షంగా ఉండాలనే అర్థం వస్తుంది.
  • విరోధి నామ సంవత్సరం అంటే.. వర్షాలు తగ్గుముఖం పడతాయని అర్థం. అలాగే వికృత నామ సంవత్సరం అంటే.. అశుభ ఫలితాలని అర్థం ఉంది.
  • ఖర నామ సంవత్సరం అంటే.. సామాన్య పరిస్థితులు అని అర్థం. ఆ తర్వత వచ్చే నందన నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం కలుగుతుందనే అర్థం వస్తుంది.
  • విజయ నామ సంవత్సరానికి శత్రుజయమని అర్థం. అలాగే జయ నామ సంవత్సరానికి కార్యసిద్ధి, ప్రజలకు లాభం కలుగుతుందని సూచిస్తుంది.
  • ఇక మన్మధనామ సంవత్సరానికి భోగభాగ్యాలు, ఆరోగ్యం అనే అర్థం ఉంది. ఇక ఈ ఏడాది వస్తున్న దుర్ముఖి నామ సంవత్సరానికి ఇబ్బందులు ఉన్నా క్షేమకర ఫలితాలు పొందుతారని సూచిస్తుంది.
  • హేవళంబి నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం, విళంబి నామ సంవత్సరానికి సుభిక్షంగా ఉంటారనే అర్థం వస్తుంది.
  • వికారి నామ సంవత్సరం అంటే.. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తుంది. శార్వరి నామ సంవత్సరం అంటే.. సామాన్యంగా పంటల దిగుబడి ఉంటుందని సూచిస్తుంది.
  • ప్లవ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా నీటి వనరులు అందుతాయని తెలుపుతుంది. శుభక్రుతు నామ సంవత్సరం అంటే.. ప్రజలకు ఆనందం అని సూచిస్తుంది.
  • ఆ తర్వాత వచ్చే శోభక్రుతు నామ సంవత్సరానికి ప్రజలకు సుఖ సంతోషాలు అందుతాయని సూచిస్తుంది. క్రోధి నామ సంవత్సరానికి కోపస్వభావంతో సామాన్యఫలాలు పొందుతారని అర్థం ఉంది.


సమ్మర్లో కూల్ కూల్ గా లస్సీ తాగండి..

 వేసవి తాపాన్ని తీర్చే వివిధ రకాల పానియాల్లో లస్సీ ఒక టేస్టీ కూల్ డ్రింక్. మన ఇండియాలో వేసవి కాలంలో మనకు అందుబాటులో ఉంటుంది. భగభగ మండే భానుడి వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల శీతల పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కమర్షియల్ డ్రింక్స్ కన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలనే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. సరిగ్గా అలాంటి కోవకే చెందినది ఒకటి లస్సీ. లస్సీ అంటానే నోరూరిపోతోందా? నిజమే. దాని రుచి మహత్యం అలాంటిది మరి.. అసలు ఈ లస్సీని ఎలా తయారుచేస్తారు? దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు అందుతాయి?వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే... 


ప్లెయిన్ స్వీట్ లస్సీ తయారీకి కావల్సినవి: యాలకులు: 2, పెరుగు: 1cup, క్యాస్టర్ షుగర్: 2tsp, రోజ్ వాటర్ 1tsp, చల్లటి నీళ్లు : 2 గ్లాసులు, పుదీనా ఆకులు: 4 



తయారీ విధానం: ముందుగా యాలకులను నుంచి గింజలు తీసి వాటిని, పెరుగు, చక్కెర, రోజ్ వాటర్ , నీళ్లతో పాటే ఒక పెద్దగిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమం సాప్ట్ గా అయ్యేంత వరకూ కవ్వంతో చిలకాలి. తర్వాత గ్లాసుల్లో పోసి ..పుదీనా ఆకులతో అలంకరించుకుంటే..చల్లచల్లటి ప్లెయిన్ స్వీట్ లస్సీ తయారువుతుంది . 


  • వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది: చల్లటి లస్సీ తాగితే...వేసవి తాపం నుంచి విముక్తి పొందడమే కాదు..మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలోనూ ఇది తోడ్పడుతుంది.
  • బరువు పెరగడానికి : సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో శరీరానికి కావాల్సిన కొవ్వులు, క్యాలరీలు ఉంటాయి.
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పాల పదార్థాలు ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతాయి. పెరుగుతో తయారుచేసే ఈ లస్సీలో కూడా జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ లు అధికంగా ఉండి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి ఈ లస్సీ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. 
  • శరీం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఈ కూల్ లస్సీలో ఉండే పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు, బి విటమిన్ (బి12)వంటి వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి దీన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సమ్మర్ డ్రింక్ అని కూడా అంటారు . 
  • బాడీ హీట్ ను తగ్గిస్తుంది ఇది ఒక బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రింక్. పెరుగుతో తయారుచేసే లస్సీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు ఇది సన్ స్ట్రోక్ నుండి మనల్ని రక్షిస్తుంది.
  • యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు: పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి.అంతే కాదు ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది.
  • చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది ఇది శరీరానికి అవసరమయ్యే బ్యాక్టీరియాను మాత్రమే మన దేహంలో ఉంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు లస్సీ సహాయపడుతుంది.
  • ఎనర్జీని అందిస్తుంది: శరీరానికి తక్షణ శక్తినిచ్చే పానీయం కాబట్టి, అలసిపోయినప్పుడు శ్రమ ఎక్కువైనప్పుడు దీన్ని తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • రెగ్యులర్ బౌల్ మూమెంట్ పెరుగులో హెల్తీ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్దంను నివారిస్తుంది. దాంతో రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది.
  • ఆకలిని కంట్రోల్ చేస్తుంది మీరు వెయింట్ లాస్ డైట్ లో ఉన్నట్లైతే మీరు ఖచ్చితంగా మీరు భోజనం తినడానికి అరగంట ముందు లస్సీని తీసుకోవచ్చు. అప్పుడు అది మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.
  • శరీర కణజాల అభివ్రుద్దికి , కండల పెరుగుదలకు శరీర కణజాల అభివ్రుద్దికి , కండల పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు లస్సీలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది బాడీ బిల్డర్లకు ఇది ఒక శక్తినిచ్చే పానీయంలా ఉపయోగపడుతుంది.
  • చూశారుగా ...లస్సీ తయారీ మరియు దీని వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు. చూశారుగా ...లస్సీ తయారీ మరియు దీని వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు...కాబట్టి మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ శీతల పానీయాన్ని తయారుచేసుకొని ఈ హాట్ హాట్ సమ్మర్ ని కూల్ కూల్ గా మార్చేసుకోండి.


సూర్యరశ్మి వలన కందిన చర్మాన్ని సరిచేసే ఆపిల్ సైడర్ వెనిగర్


  • ఎక్కువ సమయం పాటు ఎండలో నిలబడటం వలన చర్మం కందిపోతుంది.
  • తక్కువగా మెలనిన్ ఉత్పత్తి వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
  • అవసరం లేని సమయాలలో ఎండలో దూరంగా ఉండండి.
  • ఎల్లపుడు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.



సూర్యకాంతి వలన కలిగే చర్మ సమస్యలు ముఖ్యంగా వేసివికాలంలో చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి, చికాకులకు మరియు సమస్యలకు గురి చేస్తాయి. బీచ్ లేదా సముద్ర తీరంలో స్నానం, స్విమ్మింగ్ లేదా తరచుగా, ఎక్కువ సమయం ఎండల ఉండటం వలన చర్మం కంది పోతుంది. ఈ రకమైన సమస్యల నుండి ఉపశమనం పొందుటకు రసాయనిక క్రీములతో చికిత్స చర్మాన్ని ఆలర్జీలకు గురిచేసి, ముఖ్యంగా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు గురి చేస్తుంది. అందువలన, ఇలాంటి ఖరీదు గల చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సూర్యరశ్మి వలన కందిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో, అతినీలలోహిత కిరణాల వలన చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం, ఇది చర్మ, వెంట్రుకల మరియు కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో, మెలనిన్ సరిపోయేంత స్థాయిలో, వేగంగా ఉత్పత్తి చేయబడదు. ఫలితంగా, చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది. 

ఫలితంగా ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదం నుండి ఉపశమనం పొందుటకు ఇన్ఫ్లమేషన్ లకు గురవుతాయి. మరోవైపు, శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సార్లు ఈ రెండు పద్దతుల మధ్య సమతుల్యత లేని ఎడల చర్మ క్యాన్సర్ కలిగే ప్రమాదం కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం మరియు మీ చర్మ ధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది. ఒకవేళ మీ చర్మ ధోరణి తెలుపుగా ఉంటే, మధ్యాన్న సమయంలో కేవలం 15 నిమిషాల పాటు భయట ఉండటం వలన చర్మం కందిపోతుంది. దీర్ఘకాలిక సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతమవటం వలన చర్మంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి, చర్మంపై ఎరుపుదనాన్ని ఏర్పరుస్తాయి. ఎలా జరిగిన తరువాత అదే రోజున చర్మం కందిన లక్షణాలు బహిర్గతమవవు. చర్మం కందిన24 గంటల తరువాత లక్షణాలు బహిర్గతమవుతాయి మరియు 3 నుండి 5 రోజులలో ఈ స్థితిని మెరుగుపరచవచ్చు.

సూర్యరశ్మి వలన కందిన చర్మానికి వెనిగర్ వాడకం

సూర్యకాంతి వలన కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం ద్వారా సరి చేయవచ్చు మరియు దీని వలన చర్మ కణాలలో కలిగిన ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వెనిగర్ వాడకం గురించి కింద తెలుపబడింది.
స్ప్రే బాటిల్ లో కొద్దిగా వెనిగర్ ను తీసుకొని, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రభావిత ప్రాంతాలలో స్ప్రే చేయండి.
శుభ్రమైన గుడ్డను వెనిగర్ లో ముంచండి, ఈ గుడ్డతో చర్మంపై తుడవండి.  
డైల్యూటేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్నానం చేయండి.
ఇలా చేయటం వలన సూర్యకాంతి వలన ప్రమాదానికి గురైన చర్మం కొద్ది సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందటం మీరు గమనిస్తారు.  

కావున, సుర్యకాంతి వలన మారిన చర్మ రంగును తొలగించుటకు గానూ రసాయనిక క్రీములకు బదులుగా ఇంట్లో ఉండే ఔషదాలను వాడండి. వీటితో పాటుగా రోజులో ఎక్కువ సమయం పాటూ సూర్యకాంతిలో తిరగకండి మరియు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.

Wednesday, April 6, 2016

పచ్చి అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

అల్లం ట్రెడిషనల్‌ మెడిసిన్‌. మాంసాహారంలో అల్లం పడితే ఆ టేస్టే వేరు. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆ హాయి చెప్పనక్లర్లేదు. ఘాటుగా ఉండి వెజ్ నాన్వెజ్ తేడా లేకుండా అన్ని కూరలలో వాడేది అల్లం. అల్లం పచ్చడి గురించి చెప్పనవసరం లేదు.ఇద్లీలో, దోశలో నంచుకు తింటే అహా..!చెప్పనవసరంలేదుగా..!అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది.


అల్లంలో విటమిన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ లు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఒక హేర్బల్ మెడిసిన్ . ముఖ్యంగా ఇది ప్రేగుల్లోని గ్యాస్ ను నివారించడానికి సహాయపడుతుంది . మరియు ఇన్ టెన్షినల్ ట్రాక్ ను స్మూత్ చేస్తుంది, విశ్రాంతి పరుస్తుంది. అంతే కాదు అల్లం ఆకలిని పెంచుతుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది . శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఎక్సెస్ గ్యాస్ ను నివారిస్తుంది . ఆర్థరైటిస్ పెయిన్ నివారిస్తుంది. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరగింది.

డయాబెటిస్: డయాబెటిస్ ఉన్న వారు ఫ్రెష్ అల్లం నీటిని ఉదయాన్నే త్రాగడం వల్ల , బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటుంది.

బ్లడ్ సర్క్యులేషన్: అల్లం విటమిన్'లను, మినరల్స్ మరియు అమైనోఆసిడ్'లను కలిగి ఉండి రక్త ప్రసరణను మెరుగు పరచటం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అల్లం టీ తాగటం వలన గుండెని ఆరోగ్యకరంగా ఉంచి గుండెపోటు మరియు ఇతరేతర గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది

ఆకలి పెరుగుతుంది: ఆకలి కాకుండా , ఆహారం సరిగా తీసుకోనప్పుడు, ఆహారం తినడానికి అరగంట ముంది పచ్చి అల్లం ముక్కను కొద్దిగా తినాలి. దాంతో ఆకలి పెరుగుతుంది.

తలనొప్పి తగ్గుతుంది: ఎండిన లేదా పచ్చి అల్లాన్ని కొంచెం నీటితో కలిపి ముద్దగా తయారు చేసి దానిని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

దగ్గు: జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.

దంతాల నొప్పి: అల్లాన్ని ముద్దగా దంచి దంతాల మీద, చిగుళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే జలుబులో దంతాలు లాగటం, జివ్వుమనడం వంటి సమస్యలు తగ్గుతాయి.

వికారం తగ్గిస్తుంది: వికారం నుంచి ఉపశమనం: ప్రయాణం ముందు అల్లం టీ ఒక కప్పు త్రాగటం వలన మోషన్ అనారోగ్యంతో సంబంధం కలిగిన వికారం మరియు వాంతులను నిరోధిస్తుంది. ఈ రోగలక్షణం ఉపశమనానికి వికారం వచ్చేటప్పుడు ఉండే మొదటి సంకేత సమయంలో ఒక కప్పు టీ త్రాగాలి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జింజెర్ గాస్ట్రో ఇంటెస్టినల్‌ డిస్ట్రెస్‌ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది.

వాస్తు ప్రకారం ఆక్వేరియం ఉంటే దాని వలన కలిగే ప్రయోజనాలు

వాస్తవంగా ఎలాంటి ఆక్వేరియం అయిన పెద్ద నుండి చిన్న ప్రయోజనాలు ఉంటాయి. ఒక పెద్ద ఆక్వేరియం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ స్థలం పరిమితంగా ఉన్నప్పుడు ఒక చిన్న ఆక్వేరియంను ఉపయోగించవచ్చు. కాబట్టి, వాటి స్పష్టమైన అందం పాటు (వాటిని బాగా జాగ్రత్తగా తీసుకోవాలి.


ఆక్వేరియం ట్యాంకులు అనేక ఇతర మార్గాల్లో మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి.

మీరు పని నుండి ఇంటికి వచ్చినప్పుడు,మీరు చివరకు పిల్లలు మంచం మీద ఉన్నప్పుడు లేదా ... మీ పాదాలు అభ్యాసం మరియు మీ చేప మీ ఆక్వేరియం ద్వారా స్విమ్ దృశ్యం చూడటానికి, మొక్కలు లేదా లయబద్ధంగా చేయడంలో ... విశ్రాంతిగా మరియు ఆనందంగా ఉంటుంది. ఫిష్ అక్వేరియం ఉండుట వలన వాస్తు ప్రభావాలు ఫిష్ ఆక్వేరియం ఏదైనా వాస్తు లోపం లేకుండా ఉంటే ఒక మంచి నివారణా కొలతగా ఉంది. ఒక ఇంట్లో, ప్రతి వస్తువు మరియు దిశలో వాస్తు ప్రాముఖ్యత ఉంది.వాటిని ఉంచడం లేదా వాటిని వాస్తు సూత్రాలు ప్రకారం మీ జీవితం సానుకూల శక్తి తో బ్రుమింగ్ చేస్తుంది. వాస్తు, వైదిక సైన్స్ ఒక సంపన్న మరియు శ్రావ్యంగా సాగే జీవితం యొక్క అచరణలో ఇది ఒక ఆచరణాత్మక మరియు దాని ఫలితంగా ఆధారిత భావన ఉంటుంది. 

ఒక వ్యక్తి యొక్క జీవితంలో వచ్చే సమస్యలు సరైన వాస్తు లేకపోవడం వలన వస్తాయని నమ్ముతారు. ఒక వాస్తు కన్సల్టెంట్ సహాయం తీసుకుంటే , ఆరోగ్యం, ఆర్థిక మరియు అన్ని రోగాల నుండి దూరంగా మీకు ఉపశమనం కలుగుతుంది. ముందుగా చెప్పినట్లుగా, ఇంట్లో ప్రతి వస్తువు మరియు ప్రదేశంలో/దర్శకత్వం వాస్తు సంబంధం మరియు ఒక లోపభూయిష్టంగా వాస్తు ఉంటే అక్కడ సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు, వాస్తు నిపుణులు లోపభూయిష్ట వాస్తు కోసం కొన్ని సంకేతాలను సూచిస్తారు.

 వాస్తు నిపుణులు ప్రకారం, ఒక నివాసస్థలం లో ఒక చేప ఆక్వేరియం కలిగి ఉండటం వలన ఎటువంటి వాస్తు లోపం లేకుండా ఒక మంచి పరిష్కార ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఒక ఇంటిలో కానీ, ఒక ఆఫీసు, షాప్, పాఠశాల, ఫ్యాక్టరీ మరియు ఇతర నివసిస్తున్న ప్రదేశాల్లో కేవలం లోపభూయిష్ట వాస్తు సమస్యలను తొలగించడానికి ఆక్వేరియంను ఉంచవచ్చు. మీ ప్రదేశం వద్ద ఒక చేప ఆక్వేరియం కలిగి ఉండటం అనే ఈ వాస్తు సూత్రం అన్ని మతాల వారికి వర్తిస్తుంది. 

ఆక్వేరియంలో చేపల సంఖ్య తొమ్మిది ఉండాలి. ఎనిమిది డ్రాగన్ చేపలు లేదా బంగారం చేప గాని మరియు ఒక నల్ల చేప గాని ఉండవచ్చు. ఒక చేప మరణిస్తే, వెంటనే ఆ స్థానంలో మరొక చేపను పెట్టవచ్చు.చేప ఫీడ్ ప్రణాళిక మరియు ఒక వ్యక్తి ద్వారా మాత్రమే ఖచ్చితంగా మృదువుగా ఉండేలాగా చూసుకోవాలి. ట్యాంక్ లేదా బౌల్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఫిల్టర్లు అనేవి గాలిని నింపడం మరియు నీటి పంపిణీ వంటి అవసరమైన ఆవశ్యకతలకు మరియు ట్యాంక్ నడపటానికి అవసరం. మీ లివింగ్/డ్రాయింగ్ గదిలో తప్ప, ఆక్వేరియంను ఇతర గదిలో ఉంచటం సరి కాదు. దానిని మరింత ఆకర్షణీయంగా చేయడానికి మీరు రంగురంగుల లైట్లు మరియు ఇతర ఉపకరణాలను జోడించవచ్చు.

ఫిష్ అక్వేరియం ఉండుట వలన వాస్తు ప్రభావాలు



1. చేప ఆక్వేరియం మీ ఇంటి నుంచి మొత్తం చెడును బయటకు పంపటానికి మరియు నిర్మలమైన వాతావరణం కలిగి ఉండటానికి సహాయపడుతుంది.










2. ప్రతి సమయంలోను ఒక చేప సహజంగా మరణిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇంటిలో లేదా కార్యాలయంలో మీకు ఎటువంటి సమస్య లేదు.










3. ఇంటిలో లేదా ఆఫీస్ వద్ద సంపద యొక్క శక్తిని ఆకర్షించడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి.











4. అదనంగా, ఒక ఆక్వేరియం విశ్రాంతి మరియు మీ మనస్సుకు ఒక ప్రశాంతమైన వాతావరణంను సృష్టిస్తుంది.









5. మీకు ఇంటిలో లేదా ఆఫీస్ వద్ద సమస్యలు మరియు ఒక లోపభూయిష్టమైన వాస్తు ఫలితం ఉందని అంచనా ఉంటే, అప్పుడు ఒక చేప ఆక్వేరియంను ఉంచడం ఉత్తమ ఎంపిక. ఈ విధంగా చేయడం వల్ల మీ ఆర్థిక సంక్షోభం కూడా పరిష్కారం అవుతుంది.







6. ఒక చేప తినే ఆహారం వలన మీ ఇంటిలో చెడు పోయి మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెప్పుతారు. 









7. చేపలు దాదాపు రోజు మొత్తం ఉత్సాహంగా ఉండి, పరిశీలకులను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, మీరు కాసేపు ఈ చేపలను గమనిస్తూ ఉంటే , మీరు శక్తివంతముగా ఉంటారు. అలాగే మీకు కంగారు కూడా తగ్గుతుంది.



8. ఒక ఆక్వేరియం కలిగి ఉండటం వలన ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఆక్వేరియం ఒక సందర్శకుడు నుండి మొత్తం ఇంటి అపశకునమును మళ్ళిస్తుంది. ఇంటిలో ఉండే చెడు శక్తులను,రంగురంగుల ఆకర్షణీయమైన చేపలను చూడటం ద్వారా రూపాంతరం చేయవచ్చు. అవి క్రమంగా సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.


9. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక చేప ట్యాంక్ నీరు చాలా నిల్వ మరియు ఒక ఖచ్చితమైన బరువును సమతుల్యం చేయవచ్చు. బరువు సమతుల్యం చేయడానికి, ఒక చేప ట్యాంక్ వరండాలో లేదా ఒక హాల్ లో దక్షిణ-పశ్చిమ మూలలో ఉంచుకోవచ్చు. దీనిని ప్రతి సందర్శకుడు చూడగల ఒక ప్రముఖ స్థానంలో అమర్చాలి.



10. చైనీస్ ఫెంగ్ షుయ్ పద్ధతి ప్రకారం,ఒక తొట్టిలో చేపల యొక్క వేగవంతమైన ఉద్యమం "చీ" గా పిలువబడే చురుకైన శక్తిగా పెరుగుతుంది. దాని పలితంగా మీకు మంచి ఆరోగ్యం మరియు సంపద కలుగుతాయి.

ఉగాది రోజు ధ్వజారోహణం ఎందుకు చెయ్యాలి

మావిచిగురు తొడిగిన దగ్గరనుంచి మొదలవుతుంది ఉగాది శోభ. అప్పుడే వస్తున్న మామిడి పిందెలు, వినిపించే కోయిల పాటలు, విరబూసే వేప పువ్వు వాసనలు, కొత్తబెల్లం ఘుమఘుమలు ఎటు చూసినా పండగ వాతావరణమే.

మనకున్న అన్ని మాసాలలో ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఋతువుల్లో వసంత ఋతువుని నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడికి ఇష్టమైన వసంత కాలంలో మొదటి మాసమైన చైత్రం, మొదటి నక్షత్రం అయిన అశ్విని, మొదటి తిథి అయిన పాడ్యమి రోజున మనందరం జరుపుకునే పండుగే ఈ ఉగాది.  

కొత్తగా పండిన చెరుకుతో చేసిన బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, కారం, మామిడి పిందెల వగరు, చిరుచేదుగా ఉండే వేప పువ్వు అన్ని కలబోసి చేసే ఉగాది పచ్చడి తింటే దానికి సాటైనది మరొకటి ఉంటుందా అనిపిస్తుంది కదూ. మనం ఉగాది రోజు ఉదయాన్నే లేచి స్నానం, పూజ అయ్యాకా ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి అది తిన్న తర్వాతే ఏదైనా తింటాం. ఇక సాయంత్రం పండితులు పంచాంగ శ్రవణం చేస్తే అది విని మన భవిష్యత్తు కార్యక్రమాలను గురించి ఒక ప్రణాళిక తయారుచేసుకుంటాం.

ఇవే కాదండీ మనం ఉగాది రోజు చెయ్యాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. మన పూర్వికులు ఉగాది రోజున విధిగా చేస్తూ వచ్చిన కొన్ని పనులు కాలక్రమేణా మరుగున పడిపోయాయి. అవే దవనంతో దేవుడిని ఆరాదించటం, ధ్వజారోహణం, చత్రచామర వితరణ, ప్రసాదాన ప్రారంభం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయటం మొదలయినవి. ఉగాది రోజు ఈ సృష్టిని ప్రారంభించిన సృష్టికర్త అయిన బ్రహ్మను దవనంతో(మరువం లాంటిదే) పూజించాలిట. అలాగే ఉగాది రోజు ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. శుచిగా స్నానం చేసిన తరువాత ఇంటి ముందు ఒక వెదురు కర్రను నిలిపి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి, పైన రాగిచెంబు పెట్టి, పూవులను కట్టి పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందిట. ధ్వజారోహణ చేస్తే మొత్తం మనకున్న దేవతాగణాలనన్నిటిని పూజించినట్టు అవుతుందిట.

అలాగే ఉగాది రోజు చత్రచామర వితరణ అంటే విసినికర్రలు, గొడుగులు మన శక్తి ఉన్నంతమేర పేదవాళ్ళకి పంచుకుంటే మంచిదని చెపుతున్నాయి శాస్త్రాలు. ఎండలు మండిపోయే ఈ కాలంలో మన తోటివారికి సహాయం చెయ్యటమే దీని వెనక అంతరార్ధం అయి ఉండచ్చు. ప్రసాదాన వితరణ అంటే ఎండని భరించలేక తాపంతో ఉండేవాళ్ళకి మజ్జిగ, ఇతర చల్లని పానీయాలు ఇచ్చి కాస్త దాహం తీర్చటం. పూర్వం అటుగా వెళ్ళేవాళ్ళు కాసేపు సేదతీరటానికి ఎంతో మంది ఇంటి ముందు తాటాకు పందిర్లు కూడా వేసి ఉంచేవారట. మన శాస్త్రాలు ఏవి చెప్పిన అవి నలుగురికి ఉపయోగపడేవే చెప్తాయి అనటానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ప్రకృతిలో వేడి తాండవించే రోజుల్లో మన శాస్త్రాలు చెప్పిన పనులు చేయటం వల్ల మనకి పుణ్యం మన చుట్టూ ఉన్నవారికి సాయం చెయ్యటం వల్ల పురుషార్ధం రెండూ వస్తాయి.

Tuesday, April 5, 2016

సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ తో ఆరోగ్యం మెండు..

పండ్లు ,కాయలు మానవ ఆరోగ్యం కాపాడటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. వేసవి వచ్చిందంటే పుచ్చకాయ, సపోటా, చెరకు రసం, కీరా వంటి వాటికి భలే గిరాకీ ఉంటుంది. వీటితో పాటు నిత్యం లభ్యమయ్యే కొబ్బరి బొండాలతో అధికంగా ఉపయోగం ఉంటుంది. సహజ సిద్ధంగా లభ్యమయ్యే పండ్లు, కాయలు మానవ శరీరానికి కావలసిన ఖనిజాలు, లవణాలు, పోషకాలను అందించి అలసటను తీరుస్తున్నాయి. అంతే కాకుండా పలు వ్యాధులకు ఔషధాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. 

చెరుకు వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్‌, ప్రోటీన్స్‌, ఎలక్ర్టోలైట్స్‌ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్‌ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.


సపోటా వేసవి కాలంలో విరివిగా దొరికే పండు సపోటా....దీనిలో ఎక్కువ క్యాలరీలు ఉండటంతో అధిక శక్తిని ఇస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కేన్సర్‌ కారక విషపదార్థాల నుంచి పెద్దపేగును కాపాడుతుంది. అంతే కాకుండా అతిసారం, రక్తస్రావం కాకుండా పేగు వ్యాధులనుంచి కాపాడుతుంది.


మామిడిపండ్లు: మామిడిపండ్లును వేసవి సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి . ఇది శరీరంలో వేడి పుట్టించే ఫుడ్స్ అయినా, వేసవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అరటిపండ్లు: అరటిపండ్లలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ ఇండియన్ సూపర్ ఫుడ్ . 


ద్రాక్ష: ద్రాక్ష మహిళలకు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది


స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఈ సూపర్ ఫుడ్ సమ్మర్ సీజన్ ఒక ఒక ఉత్తమ ఫుడ్ అంతే కాదు వీటిలో క్యాల్షియం కంటెంట్ కూడా అధికంగా ుండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


నేడు బాబు జగ్జీవన్‌రాం జయంతి

జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.
బయొగ్రఫి పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు. విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు. చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు “కులం’ అణిచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్య్ర పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాడల నుండి ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో “కులం’ పొరల్ని ఛేదించుకుంటూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. 1935లో బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించిన పాలనాధికార అవకాశాన్ని, అందిపుచ్చుకొని 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి శాసనమండలి సభ్యునిగా, కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా ఇంకా కేబినెట్‌ హోదాల్లో పలు పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్‌ రామ్‌ అఖండ భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా నిజాయితీ, అంకితభావ సేవా తత్పరతలే కవచాలుగా చేసుకొని ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే నాటి దేశనాయకులచే “”దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న’’ బిరుదు పొందిన జగ్జీవన్‌ రామ్‌ది క్రమశిక్షణతో (కూడిన) మెలిగిన జీవితం. అర్దశతాబ్దం పైగా క్యాబినెట్‌ హోదాలో పలు పదవులు అలంకరించి మచ్చలేని నాయకుడుగా పేరొందిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. బాధ్యతల్ని చిత్తశుద్ధితో, నిబద్ధతగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసార్హంగా మెలగడంలో జగ్జీవన్‌ రామ్‌ నేటి యువతకు ఆదర్శం అయ్యారు. ఇది నేటి యువతకు ఉత్తేజాన్నిస్తుంది. ఘనమైన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల సరసన చేరిన జగ్జీవన్‌ రామ్‌ దార్శనీకత నేటి పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆదర్శాలను, నిస్వార్ధ రాజకీయ సేవను అమలు చేయడంలోప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకేయడమే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌’గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. అందుకే ఆయన జీవితం ఓ మహా కావ్యం. “”ఆలోచనల్లో దార్శనీకత, మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్ధులతో సైతం ఔరా అన్పించుకోగల్గిన రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన బాబూ జగ్జీవన్‌రామ్‌ మౌనం కూడా ఒక్కోసారి ఎదుటివారిని ఆలోచింపచేసింది. అనర్గళ వాక్పటిమతో, అంబేద్కర్‌ సమకాలికుడుగా (16 సంవత్సరాల తేడాతో) దళిత హక్కుల పరిరక్షణలో భుజం కలిపి తనదైన కోణంలో దళితోద్దారకుడుగా పేరొందిన జగ్జీవన్‌రాం ఏనాడూ ఎవ్వరికీ తలవంచని వ్యక్తిత్వంతో చివరికంటా నిలిచాడు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. తన పదునైన విమర్శలను ఇందిరాగాంధీపై సైతం ఎక్కుపెట్టిన జగ్జీవన్‌రామ్‌ ఆనాడే “ఆత్మగౌరవం’తో తిరుగులేని ధిక్కారాన్ని ప్రదర్శించారు. వ్యంగ్యంతో కూడిన చమత్కారం ఆయన ప్రసంగాలకు రత్నాలద్దినట్టుంటాయన్న నెహ్రూ మాటలు అక్షర సత్యం. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగ్జీవన్‌రామ్‌ సమానత్వం కోసం చివరికంటా పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజలమధ్య, ప్రజల కొరకు సేవ చేసిన ఆయన “1986 జులై 6’న ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. జాతీయవాదిగా, అవిశ్రాంత కృషిసల్పిన దేశ నాయకునిగా మన గుండెల్లో పదిలంగా ఉన్నారన్నది సత్యం. 78 యేళ్ళ ఆయన జీవితంలో 52 ఏళ్ళ రాజకీయ జీవితం ఎంతో విశిష్టమైంది, విలువైంది నేటితరాలు ఆదర్శవంతమైనదని చెప్పవచ్చు.

Monday, April 4, 2016

మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి...

మజ్జిగ అనేది పానీయం. ఇది పాల ఉత్పత్తుల నుండి తయారయ్యేవి. మజ్జిగ భారత దేశంలో ఒక ముఖ్యమైన పానీయం. దక్షిణ భారతదేశంలో వీటి వాడం ఎక్కువ. ఎందుకంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక పానీయం. మజ్జిగకు కొన్ని సుగంధ ద్రావ్యాలు జోడించి తయారు చేస్తారు.

మజ్జిగ తయారీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఉప్పు, పెప్పర్, పచ్చిమిర్చి , అల్లం జోడించి మసాలా మజ్జిగన తయారు చేస్తారు. మజ్జిగ - పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది.

ముఖ్యంగా ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. మీరు తీసుకునే ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. మజ్జిగ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలామంది అనుకుంటుంటారు. కాని నిత్యం మీరు తీసుకునే పాలకన్నా ఇందులో కొవ్వు, కెలొరీల శాతం చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలోనున్న వేడిని తగ్గించేందుకు మజ్జిగ ఉపయోగపడుతుంది. మజ్జిగలోని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..:

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి: నీళ్లు, పెరుగు, కొన్ని రకాల స్సైసెస్, ఉప్పుు కలిపి చేసే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన మజ్జిగ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్‌కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉప్పుు, నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి సమ్మర్‌లో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు.

బరువు తగ్గడానికి: ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఆహారాన్ని త్వరగా జీర్ణమవడానికి మజ్జిగ సహాయపడుతుంది. దీనివల్ల ఫ్యాట్ బయటకు పోయి బరువు తగ్గడం తేలికవుతుంది. మీరు కనుక డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలుతో తయారు చేసె పెరుగు లేదా మజ్జిగా డైటేరియన్స్ కు చాలా ఆరోగ్యకరం. ఇది బరువును తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది.


కొలెస్ట్రాల్: కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన గుణాలు మజ్జిగలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి న్యాచురల్ రెమిడీ. రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్ తగ్గుతాయి.

బోన్ హెల్త్ : జ్జిగ డైరీ ప్రొడక్ట్, ఇందులో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు అంతేకాదు. శరీరవృద్దికి బాగా సహాయ పడుతుంది. ఎముకలకు కావల్సిన బలాన్ని ఇచ్చి ఎముకుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంతో పాటు మజ్జిగ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

అసిడిటిని-వాపును తగ్గిస్తుంది: మీ శరీరంలో లాక్టోజ్ సరైనపాళ్ళలో లేనప్పుడు మజ్జిగ తాగినప్పుడు మీ కావల్సిన లాక్టోజ్ ను అందిస్తుంది. ఇది కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటి, వాతం, గుండెలో మంటగా ఉండటం వంటి వాటిని తగ్గిస్తుంది. అంతే కాదు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది.

అధిక విటమిన్స్ ఉన్న డ్రింక్: మజ్జిగలో అధిక శాతంలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్, నయాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుాయి.

మినిరల్స్: మజ్జిగలో మినిరల్స్ యొక్క ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఇది ఐరన్, భాస్వరం, జింక్, పొటాషయం అధిక శాతంలో కలిగి ఉంటాయి.

బ్లడ్ ప్రెజర్: మజ్జిగలో బయో యాక్టివ్ ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. రెగ్యులర్‌గా మజ్జిగ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడేవాళ్లకు మజ్జిగ ఎక్సలెంట్ హోం రెమిడీ.

బ్యాక్టీరియా: డైజెస్టివ్ ట్రాక్ హెల్తీగా ఉండటానికి మజ్జిగ సహాయపడుతుంది. చెడు బ్యాక్టీరియా తగ్గించి, గ్యాస్ట్రీక్ సమస్యలు దరిచేరకుండా అరికడుతుంది. క్యాన్సర్, డైయేరియా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలను నివారించడానికి మజ్జిగ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

వేసవి పానీయం: శరీరం శక్తిని కోల్పోయినప్పుడు, పొడిబారుతున్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తేమను అందించి శక్తి పుంజుకొనేలా చేస్తుంది. సూర్యతాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా మజ్జిగ ను తీసుకోవాలి.

హెయిర్ సమస్యలకు చెక్ పెట్టె ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం జుట్టుకి చాలా మంచిది, చాలా అద్భుతమైనదని పరిగణించవచ్చు. ఉల్లిపాయ రసాన్ని చిక్కని పేస్ట్ లా చేయండి, దీనిని పొడి జుట్టు (నూనె లేని జుట్టుకు) అప్లై చేసి, కనీసం అరగంట ఆరనివ్వండి, తరువాత గోరువెచ్చని నీటితో, ఇంట్లో తయారుచేసిన లేదా తక్కువ గాఢత కలిగిన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టుకి ఉల్లిపాయ రసం వాడడానికి కారణం ఏమిటంటే, దీనిలో ఉన్న ఘాటు లక్షణాలు జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

అధ్యయనాల ప్రకారం, ఎవరైతే జుట్టుకు ఇతర సహజ పదార్ధాలతో పాటు ఉల్లిపాయ రసాన్ని కూడా వాడతారో, నెలలోపే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు ఊడిపోవడం వల్ల కొంచెం బాధగానే ఉంటుంది, ప్రత్యేకంగా అది విపరీతంగా ఉన్నపుడు. మీ అందం తగ్గిపోతుంది, మిమ్మల్ని చూసుకుని మీరే అభద్రతకు లోనౌతారు. ఈ సమయాలు అన్నిటికీ పరిష్కారం ఉల్లిపాయ రసం. ఈ రసం నెరిసిన జుట్టును నల్లగా మారుస్తుంది, జుట్టు నేరవదాన్ని అరికడుతుంది కూడా.

మరోవైపు, జుట్టు మెరుస్తూ, కళ్ళు తిప్పకుండా చూడాలి అనిపిస్తుంది. అందువల్ల, ఒక్క నెలలో మీ జుట్టులో మార్పు కనిపించాలి అనుకుంటే, ఉల్లిపాయ రసం ఉపయోగించే 7 మార్గాలు ఇవ్వబడ్డాయి. జుట్టు బాగా కనిపించడానికి ఉల్లిపాయ రసంతో పాటు ఇతర పదార్ధాలను కలిపి చేసే 7 మార్గాలపై మీరు ఎందుకు దృష్టి పెట్టకూడదు.



కేవలం రసం: ఒక అచిన్న బౌల్ లో, తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా నీరు కలపండి. ఉల్లిపాయలను నీటిలో ఉడికించండి. మెత్తబడ్డాక, నీరు వడకట్టి, ఆ నీటి ద్రవాన్ని మీ మాడుకి మర్దనా చేసి, బాగా జుట్టు పెరగడానికి ముడి కట్టండి. ఒక గంట తరువాత, ఆ గాఢమైన వాసన పోవడానికి షాంపూతో జుట్టు కడగండి.



తల స్నానం తరువాత: తన స్నానం తరువాత, ఉల్లిపాయ రసంతో కడగండి. ఆ రసం మాడుకు పట్టేదాకా వదిలేయండి, తరువాత గోరువెచ్చని నీటితో, ఇంట్లో తయారుచేసిన షాంపూ తో జుట్టును కడగండి. ఇంట్లో తయారుచేసిన రసంతో తన స్నానం చేస్తే మీ జుట్టు బాగా మెరుస్తుంది.



ఆ రసాన్ని కొబ్బరి నూనెతో కలపడం: కొబ్బరి నూనె కూడా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు పెరుగుదల మెరుగుపరుచుకోవడానికి, గోరువెచ్చని కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలపండి, ఈ రెంటినీ బాగా కలిపి, మాడుకు, జుట్టు చివరలకు బాగా అప్లై చేయండి. ఇలా ఒక గంట ఉంచి, కడిగేయండి.


రమ్ కలపడం: ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం తీసుకుని, చిన్న మంటపై వేడిచేయాలి. ఈ ఉల్లిపాయ రసంలో 60ml రమ్ కలపండి. ఈ రెండు గాఢమైన పదార్ధాలను కలపండి, ఈ ద్రవంతో జుట్టును కడగండి. మీ జుట్టు వాసన అద్భుతంగా, తాజాగా ఉండడమే కాకుండా మీ జుట్టు పొడవు కూడా బాగా పెరుగుతుంది.




కొద్దిగా తేనె తో ప్రయత్నించండి: తేనె కూడా శక్తివంతమైన పదార్ధం, గాఢమైన ఒక కప్పు ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనెను కలపండి. తేనెను జుట్టుపై అప్లై చేయడం వల్ల అది బాగా మెరుస్తుంది, బలం పెరుగుతుంది, దాంట్లో ఉన్న ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.


ఆలివ్ ఆయిల్ గురించి: కొబ్బరి నూనె తరువాత వరుసలో వచ్చేది ఆలివ్ ఆయిల్. ఒక వరస ఆలివ్ ఆయిల్ ని మీ జుట్టుకు పట్టించండి. 15 నిమిషాల తరువాత, ఉల్లిపాయ రసంతో జుట్టును తడపండి. మాడుపై ఆరే వరకు ఉంచండి. 10 నిమిషాల తరువాత, మీ జుట్టును షాంపూ, గోరువెచ్చని నీటితో కడగండి. ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్ళకు పట్టడం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

బీర్ తో జతచేయండి: బీర్ జుట్టు కుదుళ్ళు గట్టిపడడానికి ఉపయోగించే ప్రసిద్ధ ద్రవం. మీ జుట్టును బీర్ తో కడగండి, 8 గంటల తరువాత, ఉల్లిపాయ రసంతో మీ జుట్టును, కుదుళ్ళను మర్దనా చేయండి. ఈ చికిత్సను అటుదిటు ఇటుదటు చేయోచ్చు, ముందు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి, చల్లని బీరుతో కడగడం. వేసవిలో జుట్టు పెరుగుదలకు ఇది చక్కని పరిష్కారం.

Sunday, April 3, 2016

లాఫింగ్ బుద్ద: ఏఏ రూపం ఎలాంటి లాభాలు అందిస్తాయి?

గుమ్మడికాయలా గుండ్రటి తల.. బానలాంటి పెద్ద పొట్ట.. మనసారా నవ్వుతూ కనిపించే గుండ్రటి ముఖం.. ఈ బొజ్జదేవయ్య ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు లోటుండదని విశ్వసిస్తారు. అతనెవరో కాదు హ్యాపీ బుద్ధా, లాఫింగ్‌ బుద్ధా, బుదాయ్‌గా చాలా ఇళ్లలో ఈ వింత రూపం కనిపిస్తూనే ఉంటుంది. అతనే లాఫింగ్ బుద్ద. లాఫింగ్ బుద్ధ గురించి వినే వుంటారు. లాఫంగ్ బుద్ద ఎక్కడు ఉంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం ఈ రెంటినీ లాఫింగ్ బుద్ధ అందిస్తుంది. అటు ఇంట్లో ఇటు మీ వ్యాపార సంస్థలో లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబపరంగా, వ్యాపారపరంగా మంచి మేలు జరుగుతుంది. మనం ప్రేమించే వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్ బుద్దను కొనిస్తే సరి. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్దడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం.

ఈ నిండుమనిషి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడని చెబుతుంటారు. భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన.. పిల్లలు ఏది అడిగినా జోలెలో నుంచి తీసిచ్చేవాడట. ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే.. ఆ రోజంతా హాయిగా గడిచిపోయేదట. జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా భావించి పూజించేవారు. థాయ్‌లాండ్‌లోనూ బుదాయ్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది. ఇక మన దేశంలోనూ లాఫింగ్‌ బుద్ధను సాక్ష్యాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు. సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు. ఈ నవ్వే దైవం విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలు ఉండవని విశ్వసిస్తారు. అందుకే శుభకార్యాలకు లాఫింగ్‌ బుద్ధుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా మారింది. అయితే విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో.. ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి అది ఎలాగో తెలుసుకుందాం...

నిల్చుంటే ఆరోగ్యం.. రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుదాయ్‌ ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుందట. అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదని చెబుతున్నారు బుదాయ్‌ ఫాలోవర్స్‌. ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉంచవచ్చు.

సువర్ణావకాశం.. బంగారు నాణేల మీద తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. కాసులపై కొలువుదీరిన హ్యాపీ బుద్ధాను వాయవ్య దిశలో.. ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. బంగారు రంగులో నిగనిగలాడే బుదాయ్‌ ప్రతిమ నెగెటివ్‌ సిగ్నల్స్‌ను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు. వాయవ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉంటే.. అప్పుడు ఈ ప్రతిమను ఆగ్నేయ దిశలో ఉంచితే మేలు.

విన్స్‌ ద కెరీర్‌.. డ్రాగన్‌ టార్టాయి్‌సపై దర్జాగా కూర్చున్న హ్యాపీ బుద్ధా కెరీర్‌లో విశేషమైన మార్పులకు నాంది పలుకుతాడట. ఆదాయ మార్గాలనూ అమాంతంగా పెంచేస్తాడట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉంచాలి.

పిల్లలకు పెన్నిధి.. చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే హ్యాపీ బుద్ధా ప్రతిమ చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. పిల్లల అభివృద్ధి నిరాటంకంగా సాగుతుందట. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.



జ్ఞాన ప్రదాత.. క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. తద్వారా వారి తెలివితేటలు ద్విగుణీకృతం అవుతాయని భావిస్తారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.



మరి లాఫింగ్ బుద్దను ఎలాంటి చోట ఉంచాలి? ఇళ్లలో అయితే టివి రూం, కామన్‌ హాల్‌లలో వీటిని పెట్టాలి మినహా బాత్‌ రూంలలో, డైనింగ్‌ హాళ్లలో, డ్రస్సింగ్‌ రూంలలో పెట్టకూడదని... అలాగే ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టకూడాదు అలా పెట్టడం వల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉందంటారు ఫెంగ్ షూయ్ నిపుణులు. ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధానికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులొనైనా ఉంచితే నిత్య సంతోషం అక్కడ తాండవిస్తుందని చెప్తారు. ఇంట్లో సంతోషానికి బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చుని, మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు. సుదీర్ఘ జీవితానికి తన టోపీతో కూర్చుని ఆనందంగా కనిపించే లాఫింగ్ బుద్దా ప్రతిమ.

దంతాలు మిళమిళ మెరవాల.. ?

అందమైన పళ్ల వరుసతో పాటు, ఆరోగ్యకరమైన దంతాలున్నప్పుడు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కాబట్టి, దంతాలు ఆరోగ్యంగా...అందంగా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎల్లప్పుడూ మెరిస్తుండే దంతాలు ఎదుటివారిని ఇట్టే ఆకరిస్తుంటాయి. మరి దంతాలు తెల్లగా తళతళ మెరిపింపచేయాలంటే ఏం చేయాలి !కొంత మంది వద్ద అందుకు సమాధానం ఉండదు. ? మరి ఏం చేయాలో ఈ క్రింది ఆర్టికల్ ను ఫాలో అవ్వాల్సిందే.. 


ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి. 

రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే సహజ వస్తువులతో.. కొంతకాలంలోనే మీ పళ్లను తెల్లగా మార్చేసే అద్భుతాలున్నాయి. మెరిసే దంతాల కోసం ఈ ఈజీ అండ్ హెల్తీ టిప్స్ మీ కోసం..

బేకింగ్ సోడ: ఈ రెండి పదార్థాలు ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులే . దంతామీద, మరియు లోపల నుండి మరకలను వదిలించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచుర్ ను బేకింగ్ సోడా న్యూట్రలైజ్ చేసి దంతాలను శుభ్రపరుస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ లా కలిపి బ్రెష్ తో దంతాల మీద రుద్ది 5నిముషాల తర్వాత నోటిని శుభ్రపరుచుకుంటే తళతళలాడే దంతాలు మీ సొంతమవుతాయి.





సాల్ట్ : మీ ఎల్లో దంతాలను తెల్లగా మార్చడానికి, ఉప్పును నీటిలో వేసి పుక్కలించి మౌత్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మౌత్ అల్సర్ సమస్యలను నివారిస్తుంది.ఉప్పుతో దంతాలను స్క్రబ్ లేదా రుద్దడం ద్వారా దంతాలు తెల్లగా మారుతాయి, అంతే కాదు దంతాలు మెరిలా చేస్తాయి. నిమ్మరసంతో ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.








లెమన్: నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.




స్ట్రాబెర్రీ: ఊ స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. అందుకోసం మీరేం చేయాలంటే... ఒక స్ట్రాబెర్రీ తీసుకుని మెత్తగా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేస్తే పళ్లు శుభ్రమవడమే కాకుండా మెరుస్తాయి. స్ట్రాబెర్రీ..బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు మెత్తగా చేసిన స్ట్రాబెర్రీ మిక్స్ చేసి, చేతి వేళ్ళతో దంతాల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి . రెగ్యులర్ టూత్ పేస్ట్ తో రుద్ది కడగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్: సిట్రస్ పండ్లు దంతాలకు చాలా మేలు చేస్తాయి. వీటిన తరచూ తినడం లేదా వీటి ఉపయోగించి పళ్ళు రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మరియు మెరుస్తుంటాయి. ఆరెంజ్ తొక్క లేదా ఆరెంజ్ తొన ఉపయోగించడం వల్ల నోటి శుభ్రతతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. సిట్రస్ పండ్లలో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మీ దంతాల మీద ఏర్పడ్డ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు . అందువల్ల ఆరెంజ్ మరియు నిమ్మరసం తిన్నప్పుడు నోట్లో నీళ్ళు పోసి బాగా పుక్కలించి ఊస్తే దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.