Sunday, April 3, 2016

దంతాలు మిళమిళ మెరవాల.. ?

అందమైన పళ్ల వరుసతో పాటు, ఆరోగ్యకరమైన దంతాలున్నప్పుడు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కాబట్టి, దంతాలు ఆరోగ్యంగా...అందంగా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎల్లప్పుడూ మెరిస్తుండే దంతాలు ఎదుటివారిని ఇట్టే ఆకరిస్తుంటాయి. మరి దంతాలు తెల్లగా తళతళ మెరిపింపచేయాలంటే ఏం చేయాలి !కొంత మంది వద్ద అందుకు సమాధానం ఉండదు. ? మరి ఏం చేయాలో ఈ క్రింది ఆర్టికల్ ను ఫాలో అవ్వాల్సిందే.. 


ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి. 

రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే సహజ వస్తువులతో.. కొంతకాలంలోనే మీ పళ్లను తెల్లగా మార్చేసే అద్భుతాలున్నాయి. మెరిసే దంతాల కోసం ఈ ఈజీ అండ్ హెల్తీ టిప్స్ మీ కోసం..

బేకింగ్ సోడ: ఈ రెండి పదార్థాలు ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులే . దంతామీద, మరియు లోపల నుండి మరకలను వదిలించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచుర్ ను బేకింగ్ సోడా న్యూట్రలైజ్ చేసి దంతాలను శుభ్రపరుస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ లా కలిపి బ్రెష్ తో దంతాల మీద రుద్ది 5నిముషాల తర్వాత నోటిని శుభ్రపరుచుకుంటే తళతళలాడే దంతాలు మీ సొంతమవుతాయి.





సాల్ట్ : మీ ఎల్లో దంతాలను తెల్లగా మార్చడానికి, ఉప్పును నీటిలో వేసి పుక్కలించి మౌత్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మౌత్ అల్సర్ సమస్యలను నివారిస్తుంది.ఉప్పుతో దంతాలను స్క్రబ్ లేదా రుద్దడం ద్వారా దంతాలు తెల్లగా మారుతాయి, అంతే కాదు దంతాలు మెరిలా చేస్తాయి. నిమ్మరసంతో ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.








లెమన్: నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.




స్ట్రాబెర్రీ: ఊ స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. అందుకోసం మీరేం చేయాలంటే... ఒక స్ట్రాబెర్రీ తీసుకుని మెత్తగా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేస్తే పళ్లు శుభ్రమవడమే కాకుండా మెరుస్తాయి. స్ట్రాబెర్రీ..బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు మెత్తగా చేసిన స్ట్రాబెర్రీ మిక్స్ చేసి, చేతి వేళ్ళతో దంతాల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి . రెగ్యులర్ టూత్ పేస్ట్ తో రుద్ది కడగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్: సిట్రస్ పండ్లు దంతాలకు చాలా మేలు చేస్తాయి. వీటిన తరచూ తినడం లేదా వీటి ఉపయోగించి పళ్ళు రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మరియు మెరుస్తుంటాయి. ఆరెంజ్ తొక్క లేదా ఆరెంజ్ తొన ఉపయోగించడం వల్ల నోటి శుభ్రతతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. సిట్రస్ పండ్లలో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మీ దంతాల మీద ఏర్పడ్డ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు . అందువల్ల ఆరెంజ్ మరియు నిమ్మరసం తిన్నప్పుడు నోట్లో నీళ్ళు పోసి బాగా పుక్కలించి ఊస్తే దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.

No comments:

Post a Comment