Saturday, April 9, 2016

సమ్మర్ హీట్ జయించడానికి పెరుగు ఇలా కూడా తినవచ్చు


శీతాకాలం పోయింది, ఎక్కడ చూసినా ఎండలు భగభగమని మండుతున్నాయి.మరి ఇలాంటి ఎండలను తట్టుకోవాలంటే, శరీరానికి సరిపడా నీరు త్రాగాలి . వేడి నుండి ఉపశమనం పొందాలి .నీరు ఎక్కువగా త్రాగడంతో పాటు మంచి ఆహారాలను రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం చాలా అవసరం. హాట్ హాట్ గా చెమటలు కక్కించే వేడి వేసవి నుండి ఉపశమనం పొందాలంటే కూల్ కూల్ గా మజ్జిగ త్రాగాల్సి ఉంటుంది . 


పెరుగు లేదా మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే మనం ప్రొబయోటిక్స్ అనిపిలుస్తాము.ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియకు , జీర్ణవాహికలో బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది . శరీరంలో వ్యాధినిరోధకతను తగ్గించే బ్యాడ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి భోజనంలోనూ ఒక టేబుల్ స్పూన్ పెరుగు చేర్చుకోవడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు . 

పెరుగులో క్యాల్షియం, పొటాషియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది . ఈ వైట్ యమ్మీ డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోటీనులు కూడా అధికంగా ఉన్నాయి . ఇది శరీరంను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, వేసవికాలం తీసుకొచ్చే అనేక జబ్బులను నివారించుకోవడానికి సహాయపడుతాయి . మరి మీరుకూడా ఈ వేసవిలో ఎండని తరిమి కొడుతుంది . మరి పెరుగును ఎలా తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను నివారించుకోవచ్చో తెలుసుకుందాం...

బట్టర్ మిల్క్: బట్టర్ మిల్క్ చిన్నవారికైనా మరియు పెద్దలకైనా మంచిదే. వేసవి కాలంలో రెండు కప్పలు బట్టర్ మిల్క్ ను రోజూ తాగడం వల్ల వేసవి వేడిని నివారించుకోవచ్చు . బట్టర్ మిల్క్ లో క్యాల్సియం అదికంగా ఉంటుంది . కాబట్టి, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.


పెరుగు అన్నం: మన ఇండియాలో పెరుగన్నం ఒక సాంప్రదాయ ఆహారం. బాగా పాపులర్ అయినటువంటి ఆహారం . రైస్ కు పెరుగు జోడించాలి . ప్లెయిన్ గా తినడం ఇష్టం లేకపోతే..ఈ పెరుగన్నంకు కొద్దిగా దానిమ్మ, ద్రాక్ష వంటివి జోడించి తీసుకోవచ్చు . అలాగే ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి



అవొకాడో రైతా: అవొకాడో రైతా మరో హెల్తీ ఆప్షన్ . వేసవిలో అవొకాడో తీసుకోవడం వల్ల అందులో మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి బరువు తగ్గిస్తాయి మరియు పెరుగు జోడించడం వల్ల వేసవి వేడిని తగ్గించడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.




ఫ్రోజోన్ పెరుగు: స్నాక్ కేక్స్ మరియు క్యాండీ బార్స్ గురించి ఆలోచిస్తే , ఫ్రోజోన్ పెరుగు కంటే హెల్తీ ఫ్రెష్ గా ఇంట్లో తయారుచేసిన పెరుగును ఒక కప్పు తీసుకుంటే మంచిది





ఓట్స్: ఒక బౌల్ ఓట్స్ ను ఒక కప్పు పెరుగుతో జోడించి , ఇష్టమైన పండ్లు జోడించి తీసుకోవడం వల్ల ఫైబర్ అందివ్వడంతో పాటు , పొట్టను నిండుగా ఉండేట్లు చేస్తుంది . అలాగే శరీరానికి ప్రోటీన్స్ మరియు విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి.




సాండ్విచ్ తో పెరుగు : మయోనైజ్ తినడం మీకు ఇష్టం లేకపోతే, మీ సాండ్విచ్ కు మరో బెటర్ఆప్షన్ పెరుగు , ఫైబర్ మీల్స్ కు ఒక టేబుల్ స్పూన్ పెరగు, కొద్దిగా ఉప్పు చేర్చి తీసుకోవడం వల్ల ఫైబరస్ మీల్ గా తయారవుతుంది.


స్మూతీ : పెరుగు తినడంలో బోర్ గా ఫీలవుతుంటే ప్లెయిన్ పెరుగును స్మూతీ రూపంలో తీసుకోవచ్చు . దీనికి కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు దాల్చిన చెక్క పౌడర్ వంటివి జోడించడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.


No comments:

Post a Comment