Saturday, April 23, 2016

గ్రీన్ ఫుడ్స్ తింటే... బరువు తగ్గుతారట..!

బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఒక డిసీజ్ గా ఫీలవుతారు. ముఖ్యంగా చాలా మంది నడుము చుట్టుూ ఉండే ఎక్స్ ట్రా ఫ్యాట్ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఫుడ్స్ లో గ్రీన్ ఫుడ్స్ ది బెస్ట్ ఫుడ్స్ గా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకొనే వారికి ఈ గ్రీన్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. 

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో గ్రీన్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల 90శాతం మెటబాలిజం రేటు పెరుగుతుందని, 93శాతం వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఈ గ్రీన్ ఫుడ్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే చాన్సెస్ ఉండవు. 

మీరు అధిక బరువుతో విసుగు చెందుతున్నా , మీ బరువు మీకు అసౌకర్యంగా , ఇబ్బందికలిగిస్తున్నా...వెంటనే మీ లైఫ్ స్టైల్లో మరియు డైట్ లో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన గ్రీన్ ఫుడ్స్ బరువు తగ్గించడం మాత్రమే కాదు , ఇవి న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి . బరువు తగ్గించడంలో శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి. 

ఇంకా ఈ గ్రీన్ ఫుడ్స్ వల్ల బరువు తగ్గించుకొనే క్రమంలో మీ శరీరానికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను ఎక్కువగా అందిస్తాయి . మరి ఇంకెందుకు ఆలస్యం ? మీ లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని గ్రీన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి . నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రీన్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోవడంతో పాటు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి . 

వాక్ చేయడం, లేదా 20 నిముషాలు రన్నింగ్ చేయడం వల్ల మీ శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ ఫుడ్స్ ఫాలో అవుదాం..

బరువు తగ్గించే గ్రీన్ ఫుడ్స్


గ్రీన్ పెప్పర్: గ్రీన్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఈ గ్రీన్ ఫుడ్స్ విటిమన్ సి అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ బర్న్ అవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది.



గ్రీన్ ఆపిల్: సహజంగా ఎర్రగా ఉండే ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మనం అనుకుంటాం కాదా? అయితే రెడ్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్లో చాలా తక్కవ క్యాలరీలుండటం చేత ఆరోగ్యానికి మరింత బెటర్ గా సహాయపడుతుంది.


గ్రీన్ చిల్లీస్: స్పైసీఫుడ్ శరీరానికి మంచిదే . స్పైసీస్ ఎక్కువగా తినడం వల్ల , అంతే విదంగా బరువు తగ్గించుకోవచ్చు . స్పైసీ ఫుడ్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. అదే విధంగా లోయర్ బెల్లీని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.


గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఫైబర్ మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి . ఈ గ్రీన్ ఫుడ్స్ ను వారంలో రెండు తీసుకోవడం చాలా ఫర్ఫెక్ట్ గా భావిస్తాము . బాగా ఉడికించిన బీన్స్ ను తినడం వల్ల బరువు తగ్గుతారు.


బ్రొకోలీ: బ్రొకోలీ తినడానికి అందరూ ఇష్టపడరు, కానీ విటమిన్ కె వెజిటేబుల్స్ చాలా హెల్తీగా మరియు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి . బ్రొకోలీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. క్యాన్సర్ దూరం చేస్తుంది.

ఆకుకూరలు: గ్రీన్ లీపీ వెజిటేబుల్స్ లో విటమిన్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో అతి తక్కువ క్యాలరీలుంటాయి . ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఫుడ్.

గ్రీన్ క్యాబేజ్: క్యాబేజ్ సూప్ గురించి మీరు వినే ఉంటారు. బాయిల్ చేసి క్యాబేజ్ సూప్ ను రెండు వారాలకొకసారి తీసుకోవడం మంచిది . మీరు త్వరగా బరువు తగ్గించుకోవాలంటే జీర్ణశక్తికి ఇది చాలా మేలు చేస్తుంది.

Thursday, April 21, 2016

ప్రొద్దున్నే ఆ ఒక్క పని చేస్తే చాలు.. రోజంతా ఉల్లాసమే

జీవితం అంటే పొద్దున్నే ఆరాటంగా లేవటం..మన వాళ్లకోసం హాడావిడిగా పరుగులు పెట్టడం కానే కాదు. ఇలా చేసేవారు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కాని మనం నిద్ర లేచిన పద్దతిబట్టే ఆ రోజు ఆధారపడి ఉంటుందట. కాదని ఆదరాబాదరగా రోజును మొదలుపెడితే చేయ‌బోయే ప‌నుల‌పై ప్రభావం ఉంటుందని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. రోజూ మన జీవితంలోకి తూర్పు కిరణాలతో సూర్యుడు ఉత్సాహంగా గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా మనం అంతే ఉత్సాహంగా ఉండాలి. మరి దానికోసం ఇలా చేయండి. ఉత్సాహ‌వంత‌మైన వెలుగునే మీ మ‌న‌సులో నింపుకోండి.


  • పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్‌ చెక్‌ చేయకండి.ఇవి కొన్నిసార్లు మూడ్‌ని పాడుచేస్తాయి.
  •  నిద్రలేవ‌గానే ఓ జోక్ చ‌ద‌వ‌డం, అద్దంలో మీ ముఖం చూసుకొని బ‌ల‌వంతంగానైనా 20సెక‌న్లు న‌వ్వండి. 
  • లేవగానే మీ ఇంట్లో వారికి గుడ్ మార్నింగ్ చెప్పడం వంటివి చెయ్యండి.
  • నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాస‌క్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది. 
  • రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. 
  • పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శ‌రీరాన్ని స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. మ‌న‌కు కొండంత ఎన‌ర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయి.. 
  • ప్రతీ రోజు నిద్రలేచే స‌మ‌యం క‌న్నా మ‌రో గంట ముందుగా నిద్రలేచే అల‌వాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవ‌డం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. 
  •  నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయ‌డం మీ అల‌వాట్లో లేక‌పోతే, ఆ అల‌వాటును అల‌వ‌రుచుకోండి. 
  • రోజు హాయిగా ఉండడానికి ఉద‌యం పూట మెలోడీ, భక్తి సంగీతం వినడం మంచిది. సంగీతం మ‌న‌లో చైతన్యం పెంచుతుంది.‎ అంతేకాకుండా మ‌న మూడ్ రొటీన్‌గా ఉండ‌కుండా సంగీతం సాయం చేస్తుంది.

Wednesday, April 20, 2016

ఈ కాఫీ తాగితే బరువు తగ్గోచ్చట...!

కాఫీ తాగే అలవాటు ఉందా ? అయితే మీరు డిఫరెంట్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. అది చాలా ఈజీగా మీ బరువుకి చెక్ పెడుతుంది. అదేదో డిఫరెంట్ కాఫీ అంటే.. ఎలా ఉంటుందో అని కంగారు పడాల్సిన పనిలేదు. కేవలం పంచదారకు బదులు బట్టర్ మిక్స్ చేసుకోవమే. దీన్నే బట్టర్ కాఫీ అని పిలుస్తారు. ఈ బట్టర్ కాఫీ మీ బరువును చాలా ఈజీగా, వేగంగా తగ్గించేస్తుందట.


సాధారణంగా అందరికీ నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు బెడ్ కాఫీ తాగితే.. మరికొందరు టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా కాఫీ తాగాలని ఆసక్తి చూపుతారు. అయితే.. ఇలా ప్రతిసారీ కాఫీలో చక్కెర కలుపుకుని తాగడం వల్ల రుచికరంగానే ఉంటుంది కానీ.. మీ శరీరంలో క్యాలరీలు పెరగడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా మీరు వెయిట్ పెరిగిపోతారు. 


అందుకే బట్టర్ ని కాఫీలో మిక్స్ చేసుకుని తాగితే.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అదేంటి బటర్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కదా.. ఇది బరువు పెంచుతుంది కదా అని ఆలోచిస్తున్నారా ? నిజమే ఇది సాధారణంగా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కాఫీలో కలుపుకుని తాగడం వల్ల ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. ఎక్కువ సమయం ఏమీ తినాలనిపించకుండా చేస్తుంది. దీనివల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందకుండా అరికట్టవచ్చు. అలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బట్టర్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాదు.. మీ మెదడు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి. దాదాపు 200 మందిపై పరిశోధన నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని రివీల్ చేశారు. మామూలు షుగర్ కాఫీ తాగిన వాళ్ల కంటే.. బట్టర్ కాఫీ తాగిన వాళ్లు బరువు తగ్గారు. అలాగే వాళ్ల బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉందని తేల్చారు. కాబట్టి బట్టర్ కాఫీ అలవాటు చేసుకుని.. మీ బరువు తగ్గే పని మొదలుపెట్టండి.

Tuesday, April 19, 2016

ఆ రెండు ఫ్రూట్స్ తింటే వేసవితాపం తగ్గిపోతుందా..?


నోరూరించే స్వీట్స్ తినాలంటే షుగర్.. వేడి వేడి సమోసాలు, బజ్జీలు ఆరగిద్దామంటే.. ఊబకాయం... స్పైసీ ఫుడ్ తినాలంటే.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్.. ఇలా ఆహారం విషయంలో చాలా నిబంధనలు వెంటాడుతున్నాయి. కాబట్టి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే.. సీజనల్ ఫ్రూట్స్ మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. ఎలాంటి ఫ్రూట్ తిన్నా.. ఏ సమస్య ఉండకపోగా, ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు. 


వేసవిలో అందరికీ తినాలనిపించే పండ్లు చాలా రకాలుంటాయి. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ చాలానే అందుబాటులో ఉంటాయి. వాటిలో వాటర్ మిలాన్ ( పుచ్చకాయ ), మస్క్ మిలాన్ ( కర్బూజా ) ముఖ్యమైనవి. ఈ రెండు ఫ్రూట్స్ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా... వేసవితాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలో కర్భూజా అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్.



వేసవిలో లభించే పండ్లలో కర్బూజ ఒకటి. రుచిలోనే కాదు.. పోషకాలలోనూ ఈ పండుకు సాటిలేదు. వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్భూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 92శాతం నీరే ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చు. 

వేసవిలో మండే ఎండల్లో కాసేపు తిరిగినా.. చాలా అలసిపోతాం. ఎన్ని శీతల పానీయాలు తాగినా దాహం తీరదు. ఇలాంటప్పుడు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే.. మంచి ఫలితం లభిస్తుంది. రోడ్లపై విరివిగా లభించే మస్క్ మిలాన్ లేదా కర్బూజాలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • తక్షణ శక్తి : కర్బూజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ పండు అంటే.. చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది.
  • టాక్సిన్స్ : కర్బూజాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో పోషకవిలువలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ ‌ను బ్యాలెన్స్‌ చేస్తాయి.
  • గుండె ఆరోగ్యానికి ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు.
  • హై బ్లడ్ ప్రెజర్ అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది కర్బూజా.
  • కంటి ఆరోగ్యానికి కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్‌ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.
  • కిడ్నీల్లో స్టోన్స్ కర్బూజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అజీర్తి, ఎగ్జియా, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కర్బూజా చక్కటి పరిష్కారం.
  • బరువు తగ్గడానికి కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే కర్బూజా విత్తనాల్లో కూడా పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.
  • డయాబెటిస్ కర్బూజ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి.
  • కొలస్ట్రాల్ కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి.. ఎవరైనా.. నిర్మొహమాటంగా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
  • వ్యాధినిరోధక శక్తి కర్బూజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
  • అల్సర్స్ కర్బూజాలో అత్యంత ఎక్కువగా ఉండే విటమిన్ సి.. ఎలాంటి అల్సర్స్ నైనా నివారించడానికి సహాయపడుతుంది.
  • కాన్స్టిపేషన్ కర్బూజాలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కాన్స్టిపేషన్ నివారించవచ్చు.
  • నిద్రలేమి మస్క్ మిలాన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నరాలు, కండరాలను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల.. చాలా రిలాక్స్ గా నిద్రపడుతుంది.
  • పంటినొప్పి కర్బూజా తొక్కలో ఉండే పోషకాలు పంటి నొప్పి నివారిస్తాయి. కాబట్టి నీటిలో కర్బూజా తొక్కను ఉడికించాలి. తర్వాత ఆ నీటితో మౌత్ వాష్ చేసుకుంటే.. పంటినొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • హైడ్రేట్ కర్బూజాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హాట్ సమ్మర్ సీజన్ లో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలో హీట్ తగ్గించడానికి సహాయపడుతుంది.


ఫుల్ న్యూట్రీషియన్స్, కార్బోహైడ్రేట్స్ ను అందించే స్నాక్ డిస్

ఆలూ పనీర్ ఫ్రైడ్ స్టిక్ ఇది చాలా బేసిక్ రిసిపి. అంతే కాదు, ఫుల్ న్యూట్రీషియన్స్, కార్బోహైడ్రేట్స్ ను అందించే స్నాక్ డిస్ . ఈ స్పెషల్ కాంబినేషన్ ఆలూ మరియు పనీర్ ఫ్రైడ్ స్టిక్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ రిసిపి చాలా టేస్టీ అండ్ కరకరలాగే డిష్ . మీరు ఇంతవరకూ టేస్ట్ చేసుండరు.

ఈ స్పైసీ డిష్ ను ఆప్టిటైజర్ గా అందివ్వొచ్చు . లేదా ఈవెనింగ్ స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. ఆలూ మరియు పనీర్ ఫ్రైడ్ స్టిక్ తయారుచేయడం చాలా సులభం . ఈ వంటను తయారుచేయడానికి కావల్సిన పదార్థాలను ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది మరి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు: బంగాళదుంప - 3 పన్నీర్ - 200 g ఉల్లిపయాలు - 1/2 cup పచ్చిమిర్చి పేస్ట్ - 1/4th teaspoon రెడ్ చిల్లీ పౌడర్ - 1/2 teaspoon కార్న్ ఫ్లోర్ - 1 cup మైదా - 1/4th teaspoon మైదా - 1/2 cup నూనె:సరిపడా ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
 1. బంగాళదుంపను మరియు పనీర్ ను స్లైస్ గా కట్ చేసుకోవాలి.
 2. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మార్చుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, కారం, మైదా, గరం మసాలా మరియు ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా నీరు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీనికి వాటర్ జోడించాల్సిన పనిలదు.
4. కార్న్ ఫ్లోర్ ఆలూ మరియు పనీర్ కు బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. 5. నూనె వేడి అయిన తర్వాత అందులో ఆలూ మరియు పన్నీర్ స్టిక్స్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో వేగే వరకూ వేగించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత టేస్టీ అండ్ ట్యాంగీ సాస్ తో సర్వ్ చేయాలి. అంతే డీ ఫ్రైడ్ స్నాక్ రిసిపి రెడీ...

Monday, April 18, 2016

ఇండియాలో సెలబ్రేట్ చేసుకునే 8 రకాల న్యూ ఇయిర్స్ ఏంటి ?

సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలతో భారతదేశ కీర్తి చాలా గొప్పస్థానికి వెళ్తుంది. ఇండియా ఒక దేశమైనా.. పలు జాతులు, ప్రాంతాలు, వివిధ ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం. అందుకే.. న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకునే విధానంలో ఇండియా చాలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఎక్కడలేని విధంగా ఇండియాలో కొత్త ఏడాదికి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది రకాలుగా వెల్ కమ్ చెప్తారు.

ప్రపంచంతో పాటు ఇండియా కూడా.. జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది. దేశమంతా.. కొత్త ఏడాదితో ఎంతో సంతోషంగా, గ్రాండ్ గా స్వాగతం పలుకుతారు. అయితే.. అలాగే.. వివిధ రాష్ట్రాలు తమ పంట చేతికి వచ్చిన సమయాన్ని బట్టి, లేదా వాళ్ల వాళ్ల ఆచారాలు, పంచాగాన్ని బట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే న్యూ ఇయర్ విశేషాలు మీ కోసం..


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వాసులు కొత్త ఏడాదిని ఉగాదిగా జరుపుకుంటారు. చైత్రమాసంలో అంటే మార్చ్ లేదా ఏప్రిల్ ఈ పండుగ జరుపకుంటారు. ఈ పర్వదినాన కుటుంబ సభ్యులంతా కలిసి గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ ఉగాదికి ప్రత్యేకంగా తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు కలిసిన పచ్చడి చేసుకుని తినడం ఆనవాయితీ. అలాగే ఈ పండుగ రోజు ఆలయాల్లో పంచాగ శ్రవణం ప్రత్యేకమైనది.

తమిళనాడు
తమిళుల క్యాలండర్ ప్రకారం న్యూ ఇయర్ ను వాళ్ల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ మధ్యలో చేసుకుంటారు. ఇదే వాళ్లకు కొత్త ఏడాది ప్రారంభమైనట్టు. న్యూ ఇయర్ ను పుత్తండు లేదా వరుష పిరప్పు అని పిలుస్తారు. ఈ పండుగ రోజు ఒక ప్లేట్ లో 3 రకాల పండ్లు ముఖ్యంగా మామిడి, అరటి, పనసపండ్లు, పూలు, తమలపాకులు, అద్దం.. అన్నింటిని తమిళుల న్యూ ఇయర్ రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తారు. తర్వాత రోజు ఉదయం లేవగానే ఈ ట్రే చూడటం వాళ్ల సంప్రదాయం. ఎంట్రెన్స్ లో రకరకాల రంగు రంగుల ముగ్గులతో అలంకరిస్తారు.

కేరళ

కేరళలో న్యూ ఇయర్ ని విష్ణు అని పిలుస్తారు. ఈ పండుగ రోజు.. ఉదయం నిద్రలేవగానే విష్ణువుని చూస్తే.. ఏడాదంతా.. వాళ్లు అనుకున్నది జరుగుతుందని నమ్ముతారు. ఈ సంప్రదాయాన్ని విష్ణుక్కాని అంటారు.




గుజరాత్
గుజరాతీయులు దీపావళి మరుసటి రోజుని న్యూ ఇయర్ గా అంటే.. బెస్తు వారాస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. రకరకాల ఆచార సంప్రదాయాలు, పద్ధతులతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. ఈ న్యూ ఇయర్ రోజు శ్రీకృష్ణుడికి 56 లేదా 108 రకాల వంటకాలు సమర్పించడం గుజరాతీయుల ఆచారం.

పంజాబ్
  బైసఖిగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు సిక్కులు. మనుషులంతా సమానమని నమ్ముతూ 10వ గురువు గురు గోబింద్ సింగ్ కలశ స్థాపన చేసిన రోజుకి బైసఖిగా జరుపుకుంటారు. ఈ న్యూ ఇయర్ రోజున పంజాబ్ లో అన్ని గురుద్వార్ లు చాలా గ్రాండ్ గా డెకరేట్ చేస్తారు. ప్రజలంతా సందర్శిస్తారు. అలాగే డ్యాన్సింగ్, సింగింగ్ వంటి కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు.


మహారాష్ట్ర
మహారాష్ట్రలో కూడా న్యూ ఇయర్ ని పంట పండుగగా జరుపుకుంటారు. వీళ్లు న్యూ ఇయర్ ని గుడి పడ్వా అని పిలుస్తారు. మార్కెట్ లో ఎక్కువగా మామిడిపండ్లు వచ్చే సమయాన్ని బట్టి ఈ పండుగ డేట్ ని ఫిక్స్ చేస్తారు. శివాజీ మహరాజ్ కి గుర్తుగా ఈ పండుగ రోజు ద్వారాలకు పసుపు రంగు క్లాత్ కడతారు. అందరూ శివాజీకి గ్రాండ్ గా సంతాపం తెలుపుతారు.


అస్సాం
 అస్సాంలో కొత్త ఏడాదిని రొంగాలి బిహు లేదా బొహగ్ బిహు అని పిలుస్తారు. ఏప్రిల్ మధ్యలో అస్సామీయులు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే వీళ్లకు వ్యవసాయానికి సంబంధించిన సీజన్ ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజుకి వ్యవసాయదారులంతా.. పొలాలను పంటకు రెడీ చేస్తారు. ఆడవాళ్లు బియ్యం, కొబ్బరితో పితా, లారస్ వంటకాలు తయారు చేస్తారు.


బెంగాల్
బెంగాలీయులు న్యూ ఇయర్ ని పొహెలె బయోశఖ్ అని పిలుస్తారు. బెంగాల్ లో ఇది చాలా పెద్ద పండుగ. ఇక్కడ న్యూ ఇయర్ కి కల్చరల్ ఫెయిర్స్, షాపింగ్, పూజలు, పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పొహెలె అంటే మొదటి అని, బయోశఖ్ అంటే..మొదటి నెల అని అర్థం.