కాఫీ తాగే అలవాటు ఉందా ? అయితే మీరు డిఫరెంట్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. అది చాలా ఈజీగా మీ బరువుకి చెక్ పెడుతుంది. అదేదో డిఫరెంట్ కాఫీ అంటే.. ఎలా ఉంటుందో అని కంగారు పడాల్సిన పనిలేదు. కేవలం పంచదారకు బదులు బట్టర్ మిక్స్ చేసుకోవమే. దీన్నే బట్టర్ కాఫీ అని పిలుస్తారు. ఈ బట్టర్ కాఫీ మీ బరువును చాలా ఈజీగా, వేగంగా తగ్గించేస్తుందట.
సాధారణంగా అందరికీ నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు బెడ్ కాఫీ తాగితే.. మరికొందరు టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా కాఫీ తాగాలని ఆసక్తి చూపుతారు. అయితే.. ఇలా ప్రతిసారీ కాఫీలో చక్కెర కలుపుకుని తాగడం వల్ల రుచికరంగానే ఉంటుంది కానీ.. మీ శరీరంలో క్యాలరీలు పెరగడానికి కారణమవుతుంది. ఖచ్చితంగా మీరు వెయిట్ పెరిగిపోతారు.
అందుకే బట్టర్ ని కాఫీలో మిక్స్ చేసుకుని తాగితే.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అదేంటి బటర్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కదా.. ఇది బరువు పెంచుతుంది కదా అని ఆలోచిస్తున్నారా ? నిజమే ఇది సాధారణంగా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కాఫీలో కలుపుకుని తాగడం వల్ల ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. ఎక్కువ సమయం ఏమీ తినాలనిపించకుండా చేస్తుంది. దీనివల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందకుండా అరికట్టవచ్చు. అలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బట్టర్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాదు.. మీ మెదడు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి. దాదాపు 200 మందిపై పరిశోధన నిర్వహించిన తర్వాత ఈ విషయాన్ని రివీల్ చేశారు. మామూలు షుగర్ కాఫీ తాగిన వాళ్ల కంటే.. బట్టర్ కాఫీ తాగిన వాళ్లు బరువు తగ్గారు. అలాగే వాళ్ల బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉందని తేల్చారు. కాబట్టి బట్టర్ కాఫీ అలవాటు చేసుకుని.. మీ బరువు తగ్గే పని మొదలుపెట్టండి.
No comments:
Post a Comment