Thursday, March 3, 2016

పరగడపున వేడినీళ్లు తాగితే...అద్భుతమైన ప్రయోజనాలు..!

ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. అంతేకాదు.. రోజూ ఇది కంపల్సరీ. ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే.. ఏం తోచదు. కానీ... ఉదయాన్నే పరగడపున వేడి నీళ్లు తాగితే.. అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. వేడినీళ్లు తీసుకుంటే.. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.


సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే.. చల్లటినీళ్లు తాగుతాం. వీటినే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇవి రిఫ్రెష్ చేస్తాయి. కానీ.. ఉదయాన్నే పరగడపున వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది.

అలాగే.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆర్టికల్ చదివాక మీరు తప్పకుండా.. ఉదయాన్నే వేడినీళ్లు తాగడం మొదలుపెడతారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి అనుకుంటున్నారా ? ఇందులో ప్రయోజనాలు అంత అమూల్యమైనవి కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆర్టికల్ చదివేయండి...

రక్తప్రసరణ:
పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే.. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.


అవయవాలను శుద్ధిచేస్తుంది :
ఒక కప్పుు వేడినీళ్లు పరగడపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిస్తుంది. పొట్టలోని ఆహారం, లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

నొప్పి :
రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని వేడినీళ్లు చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఉదయాన్నే వేడినీళ్లు తాగితే.. కండరాలు సాంత్వన పొంది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే వేడినీళ్లు కేవలం రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులనే కాదు.. అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.

బరువు తగ్గడానికి :
ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది. దీనివల్ల కిడ్నీలకు, ఇతర అవయవాలకు మంచిది.



మెటబాలిజం :
ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపునొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కడుపునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.

ఏజింగ్ :
చిన్నవయసులోని వయసు ఛాయలు కనిపించడాన్ని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా మహిళలు ఏమాత్రం ఒప్పుకోరు. కాబట్టి.. ఉదయాన్నే వేడినీళ్లు తాగితే.. చర్మంపై ముడతలు నివారించవచ్చు. మలినాలు బయటకు వెళ్లడం ద్వారా ఏజింగ్ ప్రాసెస్ ని అరికట్టవచ్చు. అంతేకాదు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

మలబద్ధకం :
మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల అనేకమంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. పైల్స్ ఉన్నవాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడుతాయి. ఈజీగా జీర్ణమవుతుంది.

గొంతునొప్పి :
దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడినీళ్లు చక్కటి పరిష్కారం. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి.. శ్వాస తేలికగా ఆడటానికి సహాయపడుతుంది.

Tuesday, March 1, 2016

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా...?

యూత్ ని ఎక్కువగా ఇబ్బందిపెడుతున్న సమస్య డాండ్రఫ్. దీన్ని నివారించుకోవడానికి యువకులు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. ఎన్ని షాంపూలు, హెయిర్ మాస్క్ లు ఉపయోగించినా.. ఫలితం కనిపించదు. కాలుష్యం, ఒత్తిడి, తలలో జిడ్డు తనం వంటి సమస్యల కారణంగా ఎక్కువగా చుండ్రు సమస్య వస్తుంది. 

చుండ్రు ఎక్కువగా ఉంటే.. జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఫాలో సమస్య ఎదురవుతుంది. కాబట్టి చుండ్రు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అలోవెరా. చుండ్రుకి చెక్ పెట్టడంతోపాటు.. జుట్టుకి మంచి పోషణను అందించి.. మెరిసిపోయేలా చేస్తుంది. రోజూ అలోవెరా హెయిర్ ప్యాక్స్ ట్రై చేసి చూడండి.. చుండ్రు సమస్య తగ్గి మీ జుట్టు ఎలా మెరిసిపోతుందో. అలోవెరాను చుండ్రు నివారించడానికి ఉపయోగించే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం..

అలోవెరా, పెరుగు 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అరకప్పు పెరుగులో కలపాలి. అలోవెరా జెల్ కానీ, అలోవెరా ఆకుల నుంచి తీసిన గుజ్జు కానీ ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు జుట్టుకి అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, మెంతులు మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని, 2 స్పూన్ల మెంతుల పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ కి అప్లై చేసి.. కాసేపటి తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు క్రమంతప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 4 స్పూన్ల అలోవెరా జెల్ కి, 10 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్ కి పట్టించాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, నిమ్మరసం అలోవెరా ఆకుల నుంచి జెల్ తీయాలి. అందులో సగం నిమ్మచెక్క రసం తీసి కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్ కి పట్టించాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, వెల్లుల్లి 5 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కి, 2 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు కలపాలి. రెండింటినీ పేస్ట్ లా తయారు చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ట్రై చేస్తే చుండ్రు వదిలించవచ్చు.

అలోవెరా, కొబ్బరినూనె అలోవెరా ఆకుల నుంచి తీసిన అలోవెరా జెల్ కి, కొబ్బరినూనె కలపాలి. రెండింటినీ మిక్స్ చేసి.. తక్కువ మంటపై 20 నుంచి 30 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత స్కాల్ఫ్ పై కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. గంట, రెండు గంటల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చుండ్రు నివారించవచ్చు.

అలోవెరా జెల్ తీసుకుని.. స్కాల్ఫ్ కి అప్లై చేయాలి. తలపై మసాజ్ చేసి.. గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ని తలకు చుట్టాలి. కొన్ని నిమిషాలు అలానే వదిలేసి.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.


జింజర్ టర్మరిక్ టీ తయారీ మరియు ప్రయోజనాలు

దినచర్యను ఎనర్జిటక్ గా మొదలు పెట్టాలంటే, వేడి వేడిగా ఒక కప్పు టీతో స్టార్ట్ చేయాలి. అంతే కాదు, ఫ్రెండ్స్ ను కలిసిస్తే చాలు ఒక కప్పు టీతో ఎంజాయ్ చేసేస్తుంటారు.ఈ నార్మల్ టీతో పాటు, వివిధ రకాల టీలు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ హోటల్ లేదా కాఫీడే, లేదా స్ట్రీట్ స్టాల్స్ కు వెళ్ళిన అక్కడ గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, రుచికరమైన టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. టీ ప్రియులకోసం అని కొన్ని టీలకు కొన్ని ప్రత్యేకమైన ఫ్లేవర్స్ ను జోడించి మరీ అందుబాటులో ఉంచుతున్నారు.

ఒక కప్పు బ్లాక్ టీతో డే మొదలుపెడితే వ్యాధినిరోధకతను మెరుగుపరచడంతో పాటు శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంచడానికి... ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. ఒక కప్పు నార్మల్ టీకి కొద్దిగా పాలు జోడించడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. డైరీ ప్రొడక్ట్స్ క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల బోన్ హెల్త్ ను ప్రమోట్ చేస్తుంది. ఒక కప్పు బ్లాక్ లేదా మిల్క్ టీ తీసుకొన్నా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం జింజర్ టర్మరిక్ టీ త్రాగడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని నిర్ధారించారు.?ఎందుకంటే జింజర్ టర్మరిక్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

 'టర్మరిక్ టీ’ ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్......... ఇందులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నా, ఈ టీ యొక్క కలర్ వల్ల కొద్దిగా ఇష్టపడకపోవచ్చు . బ్రైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది కానీ, ఇందులో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టీని గుటలువేస్తూ త్రాగడం కంటే, కొద్దికొద్దిగా టీని ఆశ్వాదిస్తూ త్రాగడం వల్ల ఎక్కువ రిలాక్స్ అవ్వొచ్చు. అయితే టీ తయారుచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో కొద్దిగా లవంగాలు మరియు మిరియాలు చేర్చి తయారుచేసుకుంటే రుచికి రుచి, మంచి సువాసన, మరియు హెల్త్ బెనిఫిట్స్ రెట్టింపు అవుతుంది.

జింజర్ టర్మరిక్ టీ ఎలా తయారుచేయాలి? కావల్సిన పదార్థాలు: అరకప్పు నీరు, అరటీస్పూన్ పసుపు, 1/4టీస్పూన్ అల్లం పౌడర్, 1/8టీస్పూన్ దాల్చిన చెక్కపౌడర్ మరియు 1/2టీస్పూన్ తేనె. తయారీ: చిన్న సాస్ పాన్ లో వేసి మీడియం మంట మీద ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దగా నీళ్ళను స్టౌ మీద పెట్టి మరిగించి అందులో ఈ పౌడర్ మిక్స్ చేసి తక్కువ మంట మీద ఉడికించాలి. అవసరం అయితే పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంతే హెల్తీ జింజర్ టర్మరిక్ టీ రెడీ.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మన ఇండియన్ ఫుడ్స్ లో చాలా వరకూ గ్యాసీ ఫుడ్స్ ఉంటాయి. కాబట్టి, భోజనం తర్వాత ఏదైనా తినమని లేదా త్రాగమని సలహాలిస్తుంటారు . భోజనం తర్వాత ఒక కప్పు జింజర్ టర్మరిక్ టీ త్రాగడం వల్ల స్టొమక్ అప్ సెట్, డయోరియా, వికారం, గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు.

ఫ్యాట్ బర్న్ చేస్తుంది: ఈ ఫ్యాట్ బర్నింగ్ బెవరేజ్ గురించి మీకు తెలుసా. ఎందుకంటే ఈ బెవరేజ్ లో పసుపు, అల్లం, ఉండటం వల్ల, ఈ రెండింటి కాంబినేషన్ ఎనర్జీని మెరుగుపరుస్తుంది. అంటే జీవక్రియలను వేగాన్ని పెంచుతుంది. అదే క్రమంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కోల్డ్ నివారిస్తుంది: ఈ వండర్ ఫుల్ బెవరేజ్ లో అల్లం ఉండటం వల్ల ఇది ఒక నేచురల్ ఔషధి . కాబట్టి, ఇది నేచురల్ గా శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది . అంతే కాదు, ఈ టీకి కొద్దిగా తేనె కూడా చేర్చడం వల్ల వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జలుబు తగ్గిస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది: కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర కలిగిన వారు ఉన్నట్లైతే , ఆ కుటుంబంలోని వారు టర్మరిక్ టీ త్రాగడం వల్ల క్యాన్సర్ తో పోరాడుతుంది . పసుపులో ఉండే కుర్కమిన్ అనే కంటెంట్ క్యాన్సర్ సెల్ గ్రోత్ ను నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్ లెవల్స్ మరియు ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది . దాని వల్ల క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . క్రోనిక్ పెయిన్ తో బాధపడే వారు డైలీ డైట్ లో దీన్ని తీసుకోమని సూచిస్తున్నారు . పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ప్రొలైఫరేటివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

గర్భణీలకు సురక్షితమైనది: గర్భిణీలలో వికారంను మరియు వాంతులను తగ్గించడానికి అల్లం గ్రేట్ గా సహాపడుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లైతే కొద్ది అల్లం, పసుపు చేర్చిన టీని త్రాగాలని సలహాలిస్తున్నారు. 9 నెలల వరకూ కూడా దీన్ని త్రాగవచ్చు.

బ్రెయిన్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది: టర్మరిక్ టీ త్రాగడం వల్ల బ్రెయిన్ కు ఆక్సిజన్ తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది . మరియు అన్ని రకాల బ్రెయిన్ ఫంక్షన్స్ మరియు ప్రొసెస్ ను మెరుగుపరుస్తుంది. అదే విధంగా మెమరీ పవర్ పెంచుతుంది.

డయాబెటిస్ కు మంచిది: జింజర్ టర్మరిక్ టీ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతుంది . అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారికి , ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ వారికి పసుపు యాంటీ డయాబెటిక్ మరియు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

డిప్రెషన్ : పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ కేవలంలో పసుపులోనే కనేగొనబడినది. కాబట్టి, రెగ్యులర్ గా జింజర్ టర్మరిక్ టీ తీసుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గిస్తుంది . మనస్సు మార్చి, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.