Saturday, October 31, 2015

వీణా - వాణీల పరిస్థితి అంతేనా? స్పందించని ఎయిమ్స్.. చలనం లేని రాష్ట్ర సర్కారు?

అవిభక్త కవలలు వీణా-వాణీ (13)లు పడుతున్న నకరయాతన నుంచి స్వేచ్ఛాజీవితం ప్రసాదించడం ఓ కలగానే మిగిలిపోయేలా ఉంది. ఈ కవల పిల్లలకు చేయాల్సిన ఆపరేషన్‍‌‌పై స్పష్టత కరువైంది. దీనికి ప్రధాన కారణం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఓ కారణం కాగా, తెలంగాణ రాష్ట్ర సర్కారు మరోకారణంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
 
ఈ అవిభక్త కవలలకు శస్త్రచికిత్స చేసేందుకు లండన్‌ వైద్యులు ముందుకు వచ్చారు. అయితే, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సంస్థకు అప్పగించింది. ఆ సమయంలో ఎయిమ్స్ వైద్యులు... లండన్ డాక్టర్లను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. 
 
అయితే, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం... శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలను ఆరా తీస్తే... ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసినట్టుగా ఉందని పేర్కొంటున్నాయి.

Thursday, October 29, 2015

చంద్రబాబు మహేష్ బాబుతో పోటీ పడ లేక చేతులెత్తేశారా..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహేష్ బాబుకి సంబంధం ఏమిటి అనే డౌటు కల్గ వచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్టు ఏమిటంటే గ్రామాల్ని దత్త త తీసుకోవటమే. 
గ్రామాల అభివ్రద్దికి ప్రతీ ఒక్కరూ  ముందుకు రావాలని, ప్రతీ ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రతిపాదించారు. అనటమే కాదు ఆర్బాటంగా చంద్రబాబు  కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఏజన్సీలోని అరకు మండలం పెదలబుడు పంచాయతీ ని ఆయన దత్తత తీసుకొన్నారు. ఈ సంగతి తెలియగానే పెదలబుడు గ్రామస్తుల ఆనందానికి అంతే లేదు.
పెదలబుడు గ్రామం రూపురేఖలు మారిపోతాయని, అభివ్రద్ది పరగులు తీస్తుందని అంతా ఆశించారు. కానీ అటువంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. దత్తత తీసుకొన్నప్పుడు గ్రామం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మొత్తంగా ఇక్కడ 43 పనులు అవసరం అవుతాయని గ్రామస్తులు కలిసి ప్రతిపాదనలు తయారుచేశారు.

ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో నీటి సమస్యను తీర్చాలని విన్నవించుకొన్నారు. అదిగదిగో సురక్షిత తాగునీటి పథకం అన్నారు తప్పితే గొంతు తడిపే మార్గం లేదు. దీంతో గ్రామస్తులు ఎక్కడెక్కడ నుంచో నీరు తెచ్చుకొంటున్నారు. రహదారులు నిర్మించాలని ఎంత మొత్తుకొంటున్నా పట్టించుకొనే వారు కరవయ్యారు. ఈ గ్రామాన్ని కలిపేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. అవన్నీ గోతులు గా మారి శిథిలావస్థలో ఉన్నాయి. పసి పిల్లలకు ఆహారం సమకూర్చే అంగన్ వాడీ భవనాలు శిథిల నిర్మాణాల్లో కునారిల్లుతున్నాయి.
దత్తత ప్రకటన అయితే విడుదల అయింది తప్పితే చంద్రబాబు గత ఏడాది కాలంలో ఇటువైపు చూసిన దాఖలాలు లేనేలేవు.
ఏరియా ఆస్పత్రి సమీపంలో బస్ షెల్టర్ నిర్మాణాన్న సంకల్పించారు. కానీ దాన్ని అలాగే వదిలేశారు.

సులబ్ కాంప్లెకస్ నిర్మాణానికి ప్రతిపాదనలు పేపర్ మీదనే ఉండిపోయాయి. ముందుకు కదలలేదు
అంబేద్కర్ సామాజిక భవనం నిర్మిస్తామని హామీలు గట్టిగా గుప్పించారు. పునాది రాయి పడింది తప్పితే ఫలితం లేదు.
కళ్యాణమండపం నిర్మిస్తామని గోడల వరకు కట్టించారు. తర్వాత 
పట్టించుకోకపోవటంతో పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మారింది.

మరి, రాష్ట్రమంతా తిరిగి నీతులు చెప్పే చంద్రబాబు .. తాను దత్తత తీసుకొన్న గ్రామాన్ని ఎందుకు గాలికి వదిలేసినట్లు. ఈ ప్రశ్న గ్రామస్తుల మనస్సులో మెదలుతున్నప్పటికీ పైకి మాత్రం అడగలేరు కదా.

పొట్ట వస్తోందా... ? అయితే రాకుండా చేసుకోండి ఇలా...

పొట్ట తగ్గించుకునే ఆహార చిట్కాలను పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవేమిటంటే...........,
1. మసాలాలు ఎక్కువగా దట్టించిన నాన్ వెజ్ ఆహారాన్ని తగ్గించుకోవాలి.
2. ఆమ్లెట్లకు దూరంగా ఉండండి. ఉడికించిన కోడిగుడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
3. పచ్చి బటానీలు , పెసులు , మినుములు ఉడకబెట్టినవి తీసుకోవడం మంచిది.
4. పచ్చి కూరగాయలు కొవ్వును బాగా తగ్గిస్తాయి. క్యారెట్ , కాలీ ఫ్లవర్ , కీర దోస , పచ్చి కూరలు తీసుకోండి.
5. బార్లీ కొవ్వును బాగా కరిగిస్తుంది . బార్లీ జావ , బార్లీ నీళ్ళు ఊబకాయాన్ని దూరం చేస్తాయి.
6. గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యానికి , నాజూకైన శరీరానికి ఎంతగానో పనికొస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకుంటే మీ శరీరం కొవ్వుకు దూరంగా ఉంటుంది.

Wednesday, October 28, 2015

Quote of the day

ఆధ్యాత్మిక వికాసం అనేది మీతో పాటు మీ చుట్టూ ఉన్న అందరితోనూ ఆనందమయమైన అనుభూతులను పాలుపంచుకోవడమే." ~ శ్రీ శ్రీ

కొత్తిమీర వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

కొత్తిమీర సాధారణంగా దీనిని రుచికోసం ఆహార తయారీలలో వాడుతూ ఉంటాము. కానీ కొత్తిమీర వలన రుచి మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వాటిని ఇది చదివి తెలుసుకోండి.


క్రొవ్వు నియంత్రణ

కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

చర్మాన్ని కాపాడుట

చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవును.

సేధతీర్చుట

కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి,  మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును.

పోషకాల విలువలు

విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది.


జీర్ణక్రియను పెంచును

కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచును. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించును.


కంటికి ఉపయోగం

కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.


Tuesday, October 27, 2015

వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర

మహిళలు త్వరలో యుద్ద విమానాల్లో దూసుకెళ్తూ ధైర్య సాహసాలు చాటనున్నారు. యుద్ధ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్న చిరకాల ప్రతిపాదన అమలు దిశగా తొలి అడుగు పడింది. 
 
 
భారత యుద్ధ విమానాల్లో మహిళా పైలట్ల నియామక ప్రతిపాదనను కేంద్రం శనివారం నాడు ఆమోదించింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్ నుంచి 2016 జూన్ నాటికి మహిళా పైలట్లను నియమించనున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2017 జూన్ నాటికి పూర్తిస్థాయి పైలట్లుగా నియమిస్తారు.

వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ద్వారా... సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పని చేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైమానిక అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లో నుంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపిక చేయనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Monday, October 26, 2015

Quote of the Day

అహింసాయుతమైన సమాజం, ఆరోగ్యవంతమైన జీవనం, సహజసిద్ధమైన శ్వాస, నిస్సంకోచమైన బుద్ధి మరియు సంతోషకరమైన జ్ఞాపకాలు ప్రతి మానవునికి జన్మసిద్ధమైన హక్కు." ~ శ్రీ శ్రీ

గుండెపోటు నియంత్రణకు అరటిపండు

రోజూ 3 అరటిపండ్లతో గుండె పోటుకు బై బై చెప్పేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిపోయింది. రోజూ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్‌కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
 
 
కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజూవారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటి వాటిని చాలామటుకు తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని తాజా పరిశోధన తేల్చింది.