Saturday, May 14, 2016

ఫ్యాట్ కరిగించే టేస్టీ డ్రింక్స్..!!

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ? లేదా హెల్తీగా ఉంటే చాలు అనుకుంటున్నారా ? ఈ రెండూ మంచివే. ఎందుకంటే.. సరైన బరువు ఉంటే.. హెల్తీగా ఉన్నట్టే. కానీ కొంతమంది వాళ్ల హైట్ కి తగ్గ బరువే ఉంటారు. కానీ.. పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి బరువు సమస్యతో పాటు బాడీ ఫ్యాట్ తో ఇబ్బందిపడుతూ ఉంటారు.

శరీరంలో హానికారక మలినాలను బయటకు పంపడానికి నీళ్లు తాగే విధానం అన్నింటికీ మంచి పద్ధతి. రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉండి.. మీ అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. అయితే ప్లెయిన్ వాటర్ తాగాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే తాగినప్పుడలా ఒక సిప్ తాగి.. నేను నీళ్లు బాగానే తాగుతున్నా అంటుంటారు. 

ఇలాంటి వాళ్లు మంచి నీళ్లను కూడా డెలీషియస్ గా మార్చుకుంటే.. హ్యాపీగా 8 గ్లాసులు కాకపోతే 10 గ్లాసులైనా తాగేస్తారు. నీళ్లు కూడా అద్భుతమైన రుచిని అందించడానికి చాలా పద్ధతులున్నాయి. ఈ డెటాక్స్ డ్రింక్స్ ద్వారా శరీరంలో మలినాలను ఈజీగా బయటకు పంపేయవచ్చు. ఈ డెటాక్స్ వాటర్ తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పనే. కాబట్టి శరీరంలోని హానికారక మలినాలు తొలగించి, బాడీ ఫ్యాట్ కరిగించే.. టేస్టీ డెటాక్స్ వాటర్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకుని ట్రై చేయండి..



ఫ్రూట్స్ డెటాక్స్ వాటర్: 
మీ డైట్ లో ఫ్రూట్స్ చాలా అవసరం. అయితే వాటిని జ్యూస్ చేసి తీసుకోవడం మంచిది కాదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ.. నీటిలో యాడ్ చేసి తీసుకుంటే.. యమ్మీగా ఉంటాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. వాటర్ మిలాన్, స్ట్రాబెర్రీ, కివి ఫ్రూట్స్ ని ముక్కలు కట్ చేసి.. ఒక బాటిల్ నీటిలో వేయాలి. ఇలానే కొన్ని గంటలు నీటిలో ఉంచి.. తర్వాత తాగితే.. టేస్టీగా ఉండటమే కాదు.. ఫ్యాట్ కూడా కరుగుతుంది.



నిమ్మ, పుదీనా, దోసకాయ :
స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఈ యమ్మీ డ్రింక్ ట్రై చేయండి. ఎక్కువ నీళ్లు తాగిగే మంచిది. దానికి ఇంకా కొన్ని ఆరోగ్యకరమైనవి కలిపితే.. అది మరింత హెల్తీగా మారుతుంది. గుప్పెడు పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు ఒక బాటిల్ నీటిలో కలపాలి. కొన్ని గంటల తర్వాత ఈ నీటిని తాగితే.. మెటబాలిజం పెరిగి, మలినాలు బయటకుపోతాయి.



ఆపిల్, దాల్చిన చెక్క డ్రింక్:
జీరో క్యాలరీ డ్రింక్ ఇది. దీన్ని చాలా తేలికగా మీరే తయారు చేసుకోవచ్చు. యాపిల్ ని చాలా పలుచటి ముక్కలు చేసుకోవాలి. అలాగే కొన్ని దాల్చిన చెక్క ముక్కలు తీసుకోవాలి. ఒక బాటిల్ నీటిలో వీటిని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. యాపిల్, చెక్కను మీ టేస్ట్ కి తగ్గట్టు ఎన్ని కావాలనుకుంటే అన్ని కలపవచ్చు.



అలోవెరా డ్రింక్ :
డెటాక్స్ చేయడంతో పాటు ఇమ్యునిటీ పెంచుతుంది అలోవెరా వాటర్ డ్రింక్. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అలోవెరాను ముక్కలుగా కట్ చేసి.. గుజ్జు తీయాలి. నిమ్మ, అలోవెరా జెల్ ని సమానంగా తీసుకుని.. ఒక కప్పు నీళ్లు కలిపి.. మిక్సీలో వేయాలి. అంతే.. అలో డెటాక్స్ వాటర్ రెడీ.



నిమ్మ, అల్లం:
వాటర్ ఒక బాటిల్ నీళ్లు తీసుకుని.. అర నిమ్మకాయ రసం, కొద్దిగా అల్లం తురుము కలపాలి. అల్లం తాజాగా ఉండాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డెటాక్స్ వాటర్ తీసుకుంటే.. టాక్సిన్స్ ని బయటకు పంపడం తేలికవుతుంది.



వాటర్ మిలాన్ :
వాటర్ విటమిన్స్, మినరల్స్ వాటర్ మిలాన్ లో ఎక్కువగా ఉండటం వల్ల మలినాలను బయటకు పంపుతుంది. ఒక బాటిల్ నీటిలోకి కొన్ని వాటర్ మిలాన్ ముక్కలు కట్ చేసి కలపాలి. ఈ నీటిని కొన్ని గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత తాగాలి.



నిమ్మరసం:
హానికారక మలినాలను బయటకు పంపడానికి ఇంతకంటే.. సింపుల్ డెటాక్స్ వాటర్ ఉండదేమో. ఒక నిమ్మకాయ రసంను ఒక గ్లాస్ నీటిలో కలిపి.. ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది.


మ్యాంగో, జింజర్ వాటర్ :
కొద్దిగా అల్లం, ఒక కప్పు మామిడిపండు. అల్లంను పొట్టు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలోకి కట్ చేసిన మామిడిపండు ముక్కలు కలపాలి. నీళ్లు కలపడానికి ముందు ఐస్ మిక్స్ చేయాలి. మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తాగితే మంచిది.



నిమ్మ, వెనిగర్ :
రెండు టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ నీటిని తాగడం వల్ల ఫ్యాట్ తేలికగా కరుగుతుంది.




Friday, May 13, 2016

ఎండల్లోనూ ముఖం మెరిసిపోయే మార్గం ఉందా

ఏంజిల్ లుక్ సొంతం చేసుకోవడానికి న్యాచురల్ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నారా ? గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ పొందడానికి టమోటా, కుకుంబర్ మంచి పరిష్కారం. ఈ రెండూ.. స్కిన్ ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.



సాధారణంగా ఫేస్ లో గ్లో రావడానికి ఫేషియల్స్ లేదా ఫేస్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఫేషియల్స్ అంటే ప్రతి సారి చేయించుకోవడానికి డబ్బుతో కూడిన పని. కాబట్టి.. ఫేస్ ప్యాక్ లను ఇంట్లోనే తయారు చేసుకుని వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అయితే న్యాచురల్ గ్లో పొందడానికి, చర్మంలో ప్రకాశం ఎక్కువ సమయం ఉండటానికి కుకుంబర్, టమోటా ఫేస్ ప్యాక్ లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.


కుకుంబర్:
చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూర్చే గుణం కుకుంబర్ లో ఉంటుంది. చర్మానికి సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో పాటు, అనేక చర్మ సమస్యలను మాయం చేస్తుంది. యాక్నె, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, ట్యాన్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, కళ్లకింద నల్లటి వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సత్తా.. కుకుంబర్ లో దాగుంది. అలాగే ఇందులో లభించే సిలికా.. ముడతలను నివారించడానికి సహాయపడి.. యంగ్ లుక్ అందిస్తుంది.

యాక్నె:
కుకుంబర్, ఎగ్ వైట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం, పసుపు, కొద్దిగా నిమ్మరసం తీసుకుని.. అన్నింటినీ.. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించడం వల్ల యాక్నె నివారించడంతో పాటు, ఆయిలీ స్కిన్ నివారించవచ్చు.



ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఒక కుకుంబర్, రెండు టీ స్పూన్ల తేనె, 4 టీ స్పూన్ల పచ్చి పాలు లేదా పెరుగు, ఒక కప్పు ఓట్స్ కలిపి అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.


రిలాక్సేషన్:
కుకుంబర్, నిమ్మ, తెనె, పుదీనా ఆకులు తీసుకున.. అన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మానికి రిలాక్స్ గా అనిపిస్తుంది.

టమోటా:
టమోటా ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల.. గ్లోయింగ్ అండ్ యంగర్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.

సన్ డ్యామేజ్:
ఒకటి లేదా రెండు ఫ్రెష్ టమోటాలు తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా ఓట్ మీల్ మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. 5 నుంచి 10 నిమిషాలు అలానే వదిలేసి.. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ సన్ డ్యామేజ్ అయిన చర్మాన్ని క్యూర్ చేయడంతో పాటు, గ్లోయింగ్ అందిస్తుంది.



యాక్నే:
యాక్నే నివారించడానికి టమోటా ఫేస్ ప్యాక్ అద్భుత ఫలితాలిస్తుంది. టమోటా గుజ్జు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఫేస్ కి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల యాక్నె తొలగించడంతో పాటు, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ని కూడా అరికట్టవచ్చు.

ప్రకాశవంతమైన చర్మానికి :
ఒక టేబుల్ స్పూన్ చందనం, టమోటా రసం, నిమ్మరసం తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.

టమోటా, దోసకాయ ఫేస్ ప్యాక్:
ట్యాన్డ్ స్కిన్ ఉన్న వాళ్లకు ఈ ఫేస్ట ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా జ్యూస్, దోసకాయ జ్యూస్ రెండూ సమానం తీసుకుని.. ట్యాన్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంపై ట్యాన్ తొలగిపోయి.. ప్రకాశవంతంగా మారుతుంది.



Thursday, May 12, 2016

సెంచరీలు కొట్టే స్టార్స్ క్రికెటర్లు ఫాలో అయ్యే సెంటిమెంట్స్..!!

ఇండియాలో సినీ స్టార్స్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్నవాళ్లు ఎవరంటే.. క్రికెటర్స్. గ్రౌండ్ లో సిక్స్ లు, ఫోర్లతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే ఈ సూపర్ స్టార్స్ క్రికెటర్స్ అంటే.. ఫ్యాన్స్ కి ఫుల్ క్రేజ్. క్రికెట్ అంటే.. అంతులేని అభిమానం ఇండియన్స్ లో ఉంది. అయితే ఈ క్రికెటర్స్ కి సంబంధించి మీకు వాళ్ల బ్యాటింగ్, ఫీల్డింగ్ హిస్టరీ గురించి తెలిసి ఉండవచ్చు. కానీ.. మీకు తెలియని ఇంకా ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి.

మీకు ఇష్టమైన క్రికెట్ స్టార్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం. చాలా వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మూఢ నమ్మకం ఫాలో అవుతుంటారు. లేదా సెంటిమెంట్ బాగా నమ్ముతారు. మన జీవితంలో సక్సెస్ అవడానికి మనం మంచి రోజు, మంచి సమయం, లక్కీ థింగ్ గురించి ఆలోచిస్తాం. మరి ఇండియా మొత్తం ఆరాధించే క్రికెటర్స్ నమ్మే సెంటిమెంట్ ఏంటి ? మీ ఫేవరేట్ క్రికెటర్ ఫాలో అయ్యే లక్కీ ఛార్మ్ ఏంటి ? తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలిచే సచిన్ టెండూల్కర్ ఫాలో అయ్యే సెంటిమెంట్ మిమ్మల్ని ఆశ్చరపరుస్తుంది. ఈ క్రికెటర్ రైట్ ప్యాడ్ ముందుగా కట్టుకోవడాన్ని లక్కీగా ఫీలవుతాడట.


రాహుల్ ద్రావిడ్ తన బ్యాటింగ్ సమయానికి వచ్చే సరికి రాహుల్ ద్రవిడ్ కూడా సెంటిమెంట్ కి ఇంప్రెస్ అయిపోతాడు. అందుకే.. తన కుడి కాలుకే మొదటగా తై ప్యాడ్ కట్టుకుంటాడు.


సౌరవ్ గంగూలి సౌరవ్ గంగూలి తన పాకెట్ లో ఎప్పటికీ.. తన గురూజీ ఫోటో పెట్టుకుంటాడు. ఏ మ్యాచ్ జరిగినా.. ఆ ఫోటో తనతో పెట్టుకోవడం తన విజయానికి ప్రోత్సాహాన్నిస్తుందని నమ్ముతాడు.



వీరేంద్ర సెహ్వాగ్ మొదట్లో వీరేంద్ర సింగ్ సెహ్వాగ్.. 44 వ నంబర్ జాకెట్ వేసుకోవడం లక్కీగా ఫీలయ్యేవాడు. కానీ తర్వాత తన న్యూమరాలజిస్ట్ సలహాతో.. ఏ నెంబర్ లేని జాకెట్ వేసుకుంటున్నాడు.



యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ 12 వ తేదీ, 12వ నెల, మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అలా అన్నింటిలోనూ 12 ఉండటంతో.. యువరాజ్ కి 12 అదృష్ట సంఖ్యగా మారిపోయింది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ల అమ్మ యువరాజ్ చేతికి నలుపు రంగు దారం కట్టింది. ఈ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతాడు ఈ క్రేజీ క్రికెటర్.



విరాఠ్ కోహ్లీ విరాఠ్ కోహ్లీ తన చిన్నతనం నుంచే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. రన్స్ ఎక్కువగా చేసినప్పుడు వేసుకున్న గ్లౌజులనే ఉపయోగించడం ఇతని సెంటిమెంట్.


ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో తనకు సక్సెస్ తీసుకొచ్చిన నంబర్ 7. తాను జులై 7న పుట్టాడు. అందుకే.. ఈ స్టార్ క్రికెటర్.. తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. 7 నెంబర్ ఉన్న జాకెట్ మాత్రమే వేసుకుంటాడు. అదే ధోనీ ఫాలో అయ్యే సెంటిమెంట్ కాబోలు.


ఝహీర్ ఖాన్ ప్రతి ముఖ్యమైన కాంటెస్ట్ కి.. ఝహీర్ ఖాన్ ఎల్లో కలర్ హ్యాండ్ కర్చీఫ్ పట్టుకెళ్లడం తన సెంటిమెంట్.



రవి ఆశ్విన్ 2011 వరల్డ్ కప్ ఆడేటప్పుడు రవి అశ్విన్ ఒక బ్యాగ్ తీసుకెళ్లాడు. అంతే అప్పటి నుంచి ఏ మ్యాచ్ కి వెళ్లినా.. ఆ బ్యాగ్ తనతో కంపల్సరీ ఉండాల్సిందే అని భావించాడు. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.



సునీల్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ ఎంత చలిగా ఉన్నా.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. తాను మాత్రం జాకెట్ లేకుండా మ్యాచ్ ఆడేవాడు. ఢిల్లీ క్లైమెట్ లో కూడా.. స్వెట్టర్ లేకుండానే మ్యాచ్ ఆడటం ఈ క్రికెటర్ అలవాటు. దీనివెనక ఉన్న అసలు రహస్యం సెంటిమెంట్. స్వెటర్ లేకుండా ఆడితే సక్సెస్ వస్తుందనే గవాస్కర్ సెంటిమెంట్.



అనిల్ కుంబ్లే అనిల్ కుంబ్లే తన క్యాప్, స్వెటర్ పట్టుకోవడానికి సచిన్ కి ఇవ్వడం సెంటిమెంట్ గా నమ్ముతాడు.

Wednesday, May 11, 2016

ప్రొద్దున్నే చేసే ఆ పొరపాట్లే కొంప ముంచుతాయా ?

మీరు రోజు ప్రారంభించే దాన్ని బట్టి.. రోజంతా ఆధారపడి ఉంటుంది. రోజు ఆరంభించేటప్పుడు మీరు హెల్తీగా, హ్యాపీగా ఉంటే.. పూర్తీ రోజంతా ఎలా గడుపుతారనే దానిపై ప్రభావం ఎలా ఉంటుందో గమనించవచ్చు. రోజుని మీరు సరైన పద్ధతిలో ప్రారంభించడానికి కొన్ని విషయాలు సహాయపడతాయి.



ప్రస్తుతం చాలా మంది నిద్రలేస్తూనే చేసే పని ఫోన్ చూసుకోవడం. ఉదయాన్నే ఇలాంటి అన్ హెల్తీ హ్యాబిట్ మీ మూడ్ తో పాటు, మీ ఆరోగ్యంపైన కూడా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి నిద్రలేచేటప్పుడు ఫాలో అయ్యే అలవాట్లు మీ రోజుని అద్భుతంగా మారుస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ నిద్రలేచేటప్పుడు అంటే ఉదయం తొమ్మిది గంటల లోపు చేసే పొరపాట్లు ఏంటి ? ఎలాంటి అలవాట్లు హెల్తీ అండ్ హ్యాపీ మూడ్ తీసుకొస్తాయి..?



నిద్రలేచేటప్పుడు మీ పిల్లలను స్కూల్ కి పంపాలి, బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయాలి అన్న తొందరలో.. బెడ్ రూమ్ నుంచి డైరెక్ట్ గా వంట గదిలోకి పరుగుపెడుతున్నారా ? అది అతి పెద్ద పొరపాటు. ఉదయం నిద్రలేవగానే.. శరీరానికి కాస్త రెస్ట్ అవసరం. కాబట్టి ఒక్కసారి శరీరాన్ని వెనక్కి వంపి.. సేద తీర్చాలి.

శరీరం కళ్లు తెరవగానే ఫ్లోర్ పై కాళ్లు పెట్టడం వల్ల వెన్నెముక కండరాలు దెబ్బతింటాయి. అలాగే బ్లడ్ కాళ్లకు చేరిపోయి.. నొప్పికి కారణమవుతాయి. కాబట్టి కళ్లు తెరిచిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. నిద్రలేచిన వెంటనే శరీరాన్ని అన్ని డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే రక్త ప్రసరణ శరీరమంతా వ్యాపించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకలి పనుల్లో నిమగ్నమై.. 
ఆకలిగా లేదంటూ చాలామంది రోజులో చాలా ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్ ని మానేస్తుంటారు. లేదా ఇతర పనులు చేస్తూ.. గాబరా ఏదో కొంచెం తినేస్తుంటారు. కానీ నిద్రలేచిన తర్వాత మెటబాలిజం స్లోగా ఉంటుంది. అది రీస్టార్ట్ అవ్వాలంటే శక్తి అవసరం. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ సరైన దారిలోకి రావాలంటే.. ఆహారం అవసరం.

బ్రేక్ ఫాస్ట్
నిద్రలేచిన తర్వాత 45 నిమిషాల నుంచి గంటలోపు ఏదో ఒకటి తీసుకోవాలి. ఎగ్స్, ఫ్రూట్ బౌల్, పాలు, నట్స్ ఇలా ఏదో ఒకటి తినడం చాలా ముఖ్యం. అలాగే ఉదయాన్నే పరకడుపున 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీకోసం కాస్త సమయం ఉదయం లేవగానే ఫోన్ చూసి మెయిల్స్ చెక్ చేసి, రిప్లై ఇచ్చేసి, పిల్లలను స్కూల్ కి పంపించి, రెడీ అవడం, హడావుడిగా బ్రేక్ ఫాస్ట్ చేయడం.. ఇలా ఫుల్ హైరానా పడుతూ.. రోజుని ప్రారంభించేస్తున్నారా ? ఇలా గాబరాగా అన్ని పనులు చేసేసి ఆపీస్ కి వెళ్తే మధ్యానానికి మీ స్టామినా పడిపోవడం ఖాయం. ఇది సరైన అలవాటు కాదు.

ఏం చేయాలి ?
ఉదయం నిద్రలేవగానే కాసేపు మీకోసం టైం స్పెండ్ చేయండి. లాంగ్ వాక్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్, రీడింగ్.. ఇలా ఏదో ఒక అలవాటుకి కొంచెం టైం కేటాయించండి.



అలారమ్
చాలా మందికి అలారమ్ ను రెండు నిమిషాలు, ఐదు నిమిషాల తేడాతో అంటే.. 6:30, 6:45, 6:50.. ఇలా పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. కానీ.. ఇలా పెట్టుకోవడం మంచిది కాదని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

ఏం చేయాలి ? 
మీరు ఏ సమయానికి లేవగలరో ఆ సమయానికి అలారమ్ పెట్టుకోవడం, అలారమ్ మోగిన వెంటనే లేచే విధంగా శరీరానికి మైండ్ సెట్ చేయడం చాలా అవసరం. అలారం మోగిన వెంటనే లేని.. బెడ్ పైనే శరీరానికి స్ట్రెచ్ ఇవ్వండి. డీప్ బ్రీత్ ఇవ్వండి. ఇలా రోజు ప్రారంభించి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.



వ్యాయామం
వ్యాయామం చేయడానికి ఉదయం సరైన సమయం. కానీ కొంతమంది ఉదయం నిద్రలేవడానికి బద్ధంగా అనిపించి.. సాయంత్రం పూట వ్యాయామాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. రాత్రి పూటే వ్యాయామానికి లేదా జాకింగ్ కి సంబంధించి క్లాత్స్ తీసిపెట్టుకోవాలి. ఉదయం లేవగానే.. వ్యాయామం చేయండి. దీనివల్ల రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటారు.

Tuesday, May 10, 2016

అబ్బో.. అంత చదివాక వచ్చి ఇక్కడ ఇరుక్కొన్నారా

ఇండియన్స్ పొలిటీషియన్స్, పాలిటిక్స్ అంటే స్కాంలకు పెట్టింది పేరు. ప్రతి ఏడాది ఏదో ఒక స్కాంతో.. రచ్చ అవుతూ ఉంటుంది. పబ్లిక్ అవసరాలు తీర్చే నాయకుల కంటే.. కుంభకోణాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తారు మన ఇండియన్ పొలిటీషియన్స్. ఇలా స్కాంలలో ఇరుక్కునే రాజకీయ నాయకులకు చదువు లేదా అంటే.. ఫేమస్ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి పట్టాలు అందుకుని మరి.. ఇక్క పబ్లిక్ లో పరువు పోగొట్టుకుంటున్నారు.

వాళ్లంతా గొప్ప గొప్ప యూనివర్సిటీలు, కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఏదో సాధిద్దామనే ఆలోచనలు, దేశాన్ని అత్యుతన్నత స్థానానికి తీసుకెళ్తామనే వాగ్ధానాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పొలిటీషియన్స్.. ఆ రంగంలోకి రాగానే స్కాంలతో ఫేమస్ అవుతున్నారు. కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటే.. మరికొందరు పీజీలు చేశారు. మరి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పొలిటీషియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం..

మన్మోహన్ సింగ్:


భారత 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ? ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. ఇంత గొప్ప క్వాలిఫికేషన్ ఉండి కూడా.. 1.86 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ లో ఇరుక్కున్నారు.

పవన్ కుమార్ బన్సాల్: 


పవన్ కుమార్ బన్సాల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ అండ్ లా. చట్టాలు, న్యాయాల గురించి చదువుకున్న ఈ గ్రేట్ పొలిటీషియన్ కూడా.. రైల్వే బ్రైబరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాజా: 


2జీ స్పెక్ట్రం కేసులో ఇరుక్కున్న రాజా బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేశారు. దేశంలో రెండో అతి పెద్ద స్కాం అయిన 2జీ స్పెక్ట్రం కేసులో మొదటి నిందితుడిగా రాజా ఉన్నారు. ఈ స్కాం విలువ 1.76 లక్షల కోట్లు. ప్రస్తుతం రాజా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది.

కపిల్ సిబాల్: 


మాజీ మానవవనరుల శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యునికేషన్స్ అండ్ ఐటి, లా అండ్ జస్టిస్ మంత్రి కపిల్ సిబాల్. అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన ఈ పొలిటీషియన్ జీరో లాస్ థియరీ పేరుతో.. మాయాజాలం ప్రదర్శించారు.

లాలూ ప్రసాద్ యాదవ్: 


పాట్నా యూనివర్సిటీ నుంచి బ్యాచ్ లర్ ఆఫ్ లా పూర్తి చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే ఈయన పొలిటీషియన్ కంటే బీహార్ గుండా రాజ్ గా ఎక్కువ ఫేమస్ అవుతున్నారని వార్తలున్నాయి. మంచి పొలిటీషియన్ గా కంటే కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఇతనిపై ఎక్కువగా విమర్శలున్నాయి.

షీలా దీక్షిత్: 


షీలా దీక్షిత్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ అందుకున్నారు. ఈ లేడీ పొలిటీషియన్ కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. 2013లో ఈమెపై ఎఫ్ఆర్ఐ కూడా నమోదైంది. అలాగే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు షీలాపై ఆరోపణలున్నాయి.

సురేష్ కల్మాడీ:  


సురేష్ కల్మాడీ పూనెలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆరేళ్లు సేవ చేసిన ఈయనకు కూడా కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి.


అశోక్ ఛావన్మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఛావన్ ఎమ్ బీ ఎమ్ చేశారు. ఇంతటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పొలిటీషియన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఛావన్ ఎమ్ బీ ఎమ్ చేశారు. ఇంతటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పొలిటీషియన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.



Monday, May 9, 2016

అక్షయ తదియ రోజు చేయాల్సింది ఏమిటి..మనం చేస్తున్నది ఏమిటి..!

అక్షయతృతీయ వైశాఖ మాసంలో శుక్షపక్షంలో మూడవ రోజు వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాధించే శ్రీ మహాలక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ రోజు అక్షయ తృతియ పర్వదినం. ఈ రోజు అక్షయతృతీయను పసిడిరాసుల పర్వదినంగా భావిస్తారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్ధం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువుతీరుతుందని చాలా మంది విశ్వాసం.

ఈ అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి...


అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? దానం చేయాలా?

1. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ద తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు. అది దేవలోహం. బంగారానికి ‘హిరణ్మయి'అనే మరో పేరు కూడా ఉంది.


2. ‘హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదన:' అని విష్ణు సహస్రనామం చెబుతుంది. ‘విష్ణువు' హిరణ్యగర్భుడు. అంటే ‘గర్భం నుందు బంగారం కలిగిన వాడని' అర్థం. బంగారం విష్ణువుకు ప్రతి రూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షతృతీయ అందరికీ పండుగే మరి!



3. అక్షయ అంటే.. తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా వుండేది. అందువల్లే ఈరోజు ప్రతిఒక్కరు ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే.. ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే.. అక్షయ తృతీయరోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసివస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.



మరి ఈ పర్వదినం రోజున ఏం చేయాలి? 

4. ఈ రోజు అక్షయ తృతీయ పసిడిరాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకుని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణెలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరచి పసుపు వినాయకుడని ప్రతిష్టించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలనూ, బంగారాన్నీ కలశం ముందు పెట్టి చెంకరపొంగలితో నైవేద్యం పెట్టాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యధాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలూ సమకూరుతాయి. చాలా మంది ఈ రోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి, వసుదేవున్ని పూజిస్తారు.



5. మరి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? లేదా దానం చేయాలా? అక్షయతృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలనీ, అలా కొన్న వారింట బంగారం అక్షయంగా వృద్ది చెందుతుందనీ చాలా మంది నమ్మకం. ఇందులో కొంత వరకూ నిజం ఉంది. ఈ రోజు కొద్ది మొత్తంలో అయినా బంగారాన్ని కొని, దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్ముణుడికి దానం ఇవ్వాలని అంటారు. ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు. చాలా మంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు.



6. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంథం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలలోకానీ, రాగి పాత్రలలో కాని నీళ్లు పోసి దానిలో తులసి దళాలుకానీ, మారేడుదళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని శాస్ర్తాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి.



7. అక్షయ తృతీయ రోజున ఎలాంటి పనులు చేపట్టవచ్చు? అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.



8. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.



9. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

10. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.

11. పురాణాల్లో ఈ రోజు విశిష్టత వేదవ్యాసుడు ఈరోజు మహా భారతాన్ని ఏకబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహా భారతాన్ని రాయడం మెదలు పెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్ర్తాపహరణం జరిగినది అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీ కృష్ణుడిని ప్రార్థింంచగా చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు.

12. అత్యంత ప్రముఖమైన పురాణ గాథ శ్రీ కృష్ణుడు సుదాముని కథలో బాల్య స్నేహితుడు సుదాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరుతాడు.