మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ? లేదా హెల్తీగా ఉంటే చాలు అనుకుంటున్నారా ? ఈ రెండూ మంచివే. ఎందుకంటే.. సరైన బరువు ఉంటే.. హెల్తీగా ఉన్నట్టే. కానీ కొంతమంది వాళ్ల హైట్ కి తగ్గ బరువే ఉంటారు. కానీ.. పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి బరువు సమస్యతో పాటు బాడీ ఫ్యాట్ తో ఇబ్బందిపడుతూ ఉంటారు.
శరీరంలో హానికారక మలినాలను బయటకు పంపడానికి నీళ్లు తాగే విధానం అన్నింటికీ మంచి పద్ధతి. రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉండి.. మీ అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. అయితే ప్లెయిన్ వాటర్ తాగాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే తాగినప్పుడలా ఒక సిప్ తాగి.. నేను నీళ్లు బాగానే తాగుతున్నా అంటుంటారు.
ఇలాంటి వాళ్లు మంచి నీళ్లను కూడా డెలీషియస్ గా మార్చుకుంటే.. హ్యాపీగా 8 గ్లాసులు కాకపోతే 10 గ్లాసులైనా తాగేస్తారు. నీళ్లు కూడా అద్భుతమైన రుచిని అందించడానికి చాలా పద్ధతులున్నాయి. ఈ డెటాక్స్ డ్రింక్స్ ద్వారా శరీరంలో మలినాలను ఈజీగా బయటకు పంపేయవచ్చు. ఈ డెటాక్స్ వాటర్ తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పనే. కాబట్టి శరీరంలోని హానికారక మలినాలు తొలగించి, బాడీ ఫ్యాట్ కరిగించే.. టేస్టీ డెటాక్స్ వాటర్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకుని ట్రై చేయండి..
ఫ్రూట్స్ డెటాక్స్ వాటర్:
మీ డైట్ లో ఫ్రూట్స్ చాలా అవసరం. అయితే వాటిని జ్యూస్ చేసి తీసుకోవడం మంచిది కాదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ.. నీటిలో యాడ్ చేసి తీసుకుంటే.. యమ్మీగా ఉంటాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. వాటర్ మిలాన్, స్ట్రాబెర్రీ, కివి ఫ్రూట్స్ ని ముక్కలు కట్ చేసి.. ఒక బాటిల్ నీటిలో వేయాలి. ఇలానే కొన్ని గంటలు నీటిలో ఉంచి.. తర్వాత తాగితే.. టేస్టీగా ఉండటమే కాదు.. ఫ్యాట్ కూడా కరుగుతుంది.
నిమ్మ, పుదీనా, దోసకాయ :
స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా ? అయితే ఈ యమ్మీ డ్రింక్ ట్రై చేయండి. ఎక్కువ నీళ్లు తాగిగే మంచిది. దానికి ఇంకా కొన్ని ఆరోగ్యకరమైనవి కలిపితే.. అది మరింత హెల్తీగా మారుతుంది. గుప్పెడు పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు ఒక బాటిల్ నీటిలో కలపాలి. కొన్ని గంటల తర్వాత ఈ నీటిని తాగితే.. మెటబాలిజం పెరిగి, మలినాలు బయటకుపోతాయి.
ఆపిల్, దాల్చిన చెక్క డ్రింక్:
జీరో క్యాలరీ డ్రింక్ ఇది. దీన్ని చాలా తేలికగా మీరే తయారు చేసుకోవచ్చు. యాపిల్ ని చాలా పలుచటి ముక్కలు చేసుకోవాలి. అలాగే కొన్ని దాల్చిన చెక్క ముక్కలు తీసుకోవాలి. ఒక బాటిల్ నీటిలో వీటిని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. యాపిల్, చెక్కను మీ టేస్ట్ కి తగ్గట్టు ఎన్ని కావాలనుకుంటే అన్ని కలపవచ్చు.
అలోవెరా డ్రింక్ :
డెటాక్స్ చేయడంతో పాటు ఇమ్యునిటీ పెంచుతుంది అలోవెరా వాటర్ డ్రింక్. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అలోవెరాను ముక్కలుగా కట్ చేసి.. గుజ్జు తీయాలి. నిమ్మ, అలోవెరా జెల్ ని సమానంగా తీసుకుని.. ఒక కప్పు నీళ్లు కలిపి.. మిక్సీలో వేయాలి. అంతే.. అలో డెటాక్స్ వాటర్ రెడీ.
నిమ్మ, అల్లం:
వాటర్ ఒక బాటిల్ నీళ్లు తీసుకుని.. అర నిమ్మకాయ రసం, కొద్దిగా అల్లం తురుము కలపాలి. అల్లం తాజాగా ఉండాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డెటాక్స్ వాటర్ తీసుకుంటే.. టాక్సిన్స్ ని బయటకు పంపడం తేలికవుతుంది.
వాటర్ మిలాన్ :
వాటర్ విటమిన్స్, మినరల్స్ వాటర్ మిలాన్ లో ఎక్కువగా ఉండటం వల్ల మలినాలను బయటకు పంపుతుంది. ఒక బాటిల్ నీటిలోకి కొన్ని వాటర్ మిలాన్ ముక్కలు కట్ చేసి కలపాలి. ఈ నీటిని కొన్ని గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత తాగాలి.
నిమ్మరసం:
హానికారక మలినాలను బయటకు పంపడానికి ఇంతకంటే.. సింపుల్ డెటాక్స్ వాటర్ ఉండదేమో. ఒక నిమ్మకాయ రసంను ఒక గ్లాస్ నీటిలో కలిపి.. ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది.
మ్యాంగో, జింజర్ వాటర్ :
కొద్దిగా అల్లం, ఒక కప్పు మామిడిపండు. అల్లంను పొట్టు తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలోకి కట్ చేసిన మామిడిపండు ముక్కలు కలపాలి. నీళ్లు కలపడానికి ముందు ఐస్ మిక్స్ చేయాలి. మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తాగితే మంచిది.
నిమ్మ, వెనిగర్ :
రెండు టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ నీటిని తాగడం వల్ల ఫ్యాట్ తేలికగా కరుగుతుంది.
హబ్బ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఫోటోలు. ఇంకా మీ వివరణ కూడా బావుంది. ఇంట్లో అల్లోవేరా ఉండనే ఉంది.... మంచి టాపిక్ ధన్యవాదాలు.
ReplyDelete