Saturday, February 20, 2016

శరీర బరువు నిర్వహణలో సహాయపడే జామా ఆకు

  • * జామ ఆకులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి.
  • * ఇతర సమస్యల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • * ఇవి ఇన్ఫ్లమేషన్ లను కూడా తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి.
  • * శరీర బరువు నిర్వహణలో  కూడా తగిన సహాయం చేస్తాయి.

  • చాలా మంది జామపండును ఇష్టపడతారు. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా, చాలా రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, మనలో చాలా మందికి, జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక పోవటం గమినించతగ్గ విషయంగా చెప్పవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

  • శరీరబరువును తగ్గిస్తుంది

  • జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులుస్ కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.


  • మధుమేహులకు ఉరట

  • జపాన్ లోని "యకుల్ట్  సెంట్రల్ ఇన్స్టిట్యూట్" వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.

  • గుండె సంబంధిత సమస్యల నుండి విముక్తి

  • జామ ఆకుల నుండి తయారు చేసిన టీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 2005 లో ఒక ప్రయోగశాల అధ్యయనం ప్రచురించిన దాని ప్రకారం, జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయని కనుగొనబడింది. జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.

  • డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం

  •  డయేరియా & రక్త విరేచనాలను తగ్గించుటలో జామ ఆకులు శక్తివంతమైన హెర్బల్ ఔషదంగా పని చేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో ఒక పిడికెడు బియ్యపు పిండి మరియు 30 గ్రాముల జామ ఆకులను వేడి చేయండి. రోజు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగటం వలన విరేచనల నుండి ఉపశమనం పొందుతారు. రక్త విరేచనలను తగ్గించుటకు- 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జామ వేర్లను మరియు ఆకులను కలిపి 20 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి, రక్త విరేచనాలు తగ్గే వరకు రోజు తాగండి.

  • జీర్ణక్రియలో మెరుగుదల

  • జామ ఆకుల నుండి తయారు చేసిన టీ, జీర్ణాశయంలో, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. జామ ఆకులు కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, జీర్ణాశయ గోడలపై ఉండే హానికర బ్యాక్టీరియాను మరియు వాటి నుండి విడుదలయ్యే రసాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. జామ ఆకులు వాంతులు మారియు డోకుల నుండి తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.

Friday, February 19, 2016

జాబ్స్ టు సిల్వర్ స్క్రీన్ స్టార్స్

ఇండియన్ సినిమా అంటే ఫేమ్, పవర్, మనీ. టాప్ స్టార్స్ ఒక్కో సినిమాకి పెద్ద పెద్ద సాలరీలు అందుకుంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లో స్పెసల్ రోల్స్ కూడా ప్లే చేస్తూ సంపాదిస్తున్నారు. అలాగే గెస్ట్ రోల్స్ తోనూ, స్పెషల్ అప్పియరెన్స్ తో సినిమాల్లో అలా తళుక్కుమంటున్నారు. అలా కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు.

వాళ్లంతా ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై ఓ వెలుగు వెలుగుతున్నారు. బ్లాక్ బ్లస్టర్ హిట్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. కానీ వీళ్లంతా పుట్టుకతోనే.. సెలబ్రిటీ హోదా సంపాదించలేదు. ఈ హోదా, గుర్తింపు సంపాదించడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే.. సినిమాల్లోకి రాకముందు వాళ్లు చేస్తున్న ఉద్యోగమే వాళ్ల టాలెంట్ చెబుతోంది. ఇంతకీ టాప్ ఇండియన్ యాక్టర్స్ సినిమాల్లోకి రాకముందు ఏ ప్రొఫెషన్ లో ఉండేవాళ్లు తెలుసుకోవాలని ఉందా.. ? అయితే.. ఓ లుక్కేయండి..



అక్షయ్ కుమార్: బాలీవుడ్ లో తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ సినిమాల్లోకి రాకముందు బ్యాంకాక్ లో చెఫ్ గా పనిచేశాడు. ఇండియాకి వచ్చిన తర్వాత మ్యార్టియల్ ఆర్ట్స్ లో టీచర్ గా కొంతకాలం పనిచేసి.. మోడలింగ్ లో రాణించాడు.





సూర్య: సూర్య సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో వస్ర్తవ్యాపారవేత్తగా ఉండేవాడు. 3ఏళ్లు ఈ బిజినెస్ చేశాక.. ఇక జీవితంలో ఈ వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో.. నటనలో తన సత్తా నిరూపించుకున్నాడు.




రజనీకాంత్: ఇండియన్ సినిమా తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్.. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో తారాస్థాయికి చేరుకున్నారు. స్టైల్, నటనతో.. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే.. సినిమా ప్రపంచం చూడక ముందు ఈ సూపర్ స్టార్ కూలీగా, బస్ కండక్టర్ గా పని చేసి.. జీవితం గడిపేవాడు. బెంగళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో వర్క్ చేశాడు. తర్వాత అపూర్వ రగంగల్ సినిమాతో సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇచ్చాడు.






ఆర్య: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసి.. సిల్వర్ స్ర్కీన్ కి ఎంటర్ అయిన హీరో ఎవరో కాదు.. ఆర్య. 2003లో ఉల్లమ్ కెట్కుమే సినిమా ఆడిషన్ కి వచ్చే వరకు అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు.









మాధవన్: మాధవన్ ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని లక్ష్యముండేది. కానీ.. 6 నెలలు వయసు తేడా వల్ల రిజెక్ట్ అయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ స్పీకింగ్ కోచ్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోచ్ గా పనిచేశాడు. ముంబైలో పనిచేస్తున్నప్పుడు పోర్ట్ ఫోలియో క్రియేట్ చేసి.. మోడలింగ్ ఏజెన్సీకి పంపాడు.










అజిత్ కుమార్: ప్రస్తుతం కోలీవుడ్ లో చెరగని స్థానం కొట్టేసిన స్టార్ అజిత్ కుమార్ మొదట్లో మోడలింగ్ లో పనిచేశాడు. అలాగే.. మెకానిగ్ గా ఫుల్ టైమ్ పనిచేశాడు. 1990లో మెకానిక్ పనిచేసి డబ్బులు సంపాదించి.. మోడలింగ్ లో సక్సెస్ అయ్యాడు. అలా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు.









విక్రమ్: సినీ వినీలాకాశంలో మెరిసిపోతున్న హీరో విక్రమ్. విక్రమ్ మొదట్నుంచి.. మోడలింగ్ రంగలోనే ఉన్నాడు. పలు ప్రచార కార్యక్రమాల్లో నటించాడు. చోలా టీ, టీవీఎస్ ఎక్సెల్, ఆల్విన్ వాచ్ వంటి బ్రాండ్స్ కి ప్రచారం చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సక్సెస్ అయ్యాడు.


Wednesday, February 17, 2016

వన దేవతల కరుణ కోసం.. తరలిన జనం

వరంగల్‌ జిల్లా కేంద్రానికి నూటపది కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం. తాడ్వాయి మండల పరిధిలోకి వస్తుందా ప్రాంతం. వరంగల్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా సుమారు తొంభై కిలోమీటర్లు ప్రయాణిస్తే తాడ్వాయి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో పద్నాలుగు కిలోమీటర్లు వెళ్తే మేడారం. అక్కడే వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదీరారు. మేడారానికి చుట్టూ ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలున్నాయి. పొరుగున చత్తీస్‌గఢ్‌ ఉంది. రెండు దశాబ్దాల క్రితమే సర్కారువారు, మేడారం జాతరని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. ఈ సారి, సంబురానికో ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...సమ్మక్క-సారలమ్మ జాతర జరగడం ఇదే తొలిసారి. కేసీఆర్‌ ప్రభుత్వం...భారీస్థాయిలో రూ.174 కోట్ల నిధులు కేటాయించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం...ప్రతి రెండేళ్లకోసారీ నాలుగు రోజుల పాటూ నిర్వహించే ఈ మహా జాతర ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో జరుగనుంది. పదిహేడో తేదీన సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దె మీదికి ఎక్కుతారు. పద్దెనిమిదిన సారలమ్మ గద్దె ఎక్కుతుంది. పందొమ్మిదిన, భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఇరవైన అధికారిక లాంఛనాలతో అమ్మలు వనప్రవేశం చేస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాలనుంచి వచ్చే లక్షలాది భక్తులతో మేడారం జనసంద్రంలా మారుతుంది. చెంచులూ వడ్డెలూ గోండులూ కోయలూ లంబాడీలూ భిల్లులూ రఫీస్తార్‌ గోండులూ సవర ఆదివాసులూ...ఇలా సమస్త గిరిజనమూ తరలివస్తుంది.



జాతరకు వచ్చే భక్తులు, తొలుత పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఆతర్వాతే సమ్మక్క-సారలమ్మల దర్శనానికి బయల్దేరతారు. వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంది. జాతర సమయంలో వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకూ సుమారు కిలోమీటరున్నర మేర కాలినడకనే వెళ్లాలి. అంత రద్దీగా ఉంటుందా ప్రాంతం. ప్రభుత్వం జంపన్నవాగుకు ఇరువైపులా స్నానఘట్టాలు నిర్మించింది. జల్లు స్నానాలకూ ఏర్పాటు చేసింది. సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెకు తీసుకువస్తున్నప్పుడు...జిల్లా కలెక్టర్‌, ఎస్పీ అక్కడే ఉంటారు. తల్లి సమ్మక్క గద్దె మీదికి వస్తున్నప్పుడు...జిల్లా పోలీసు ఉన్నతాధికారి గౌరవసూచకంగా గాలిలో కాల్పులు జరుపుతారు. మేడారం పరిసరాల్లో...నాలుగు కిలోమీటర్ల మేర బస చేసిన భక్తులకు అదే సంకేతం - అమ్మ గద్దె ఎక్కుతున్నట్టు. వెనువెంటనే జయజయధ్వానాలు మిన్నంటుతాయి.


గిరిజన సంప్రదాయంలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. వెదురు కర్ర, కుంకుమ భరిణె తదితర ప్రతీకలే ఉత్సవమూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే ఈనాటి గద్దె! మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపెల్లి నుంచి గిరిజనులు మేళతాళాలతో, డోలీ చప్పుళ్లతో సారలమ్మను తీసుకుని వూరేగింపుగా బయల్దేరతారు. సారలమ్మకు మొత్తం ఆరుగురు పూజారులు. పూజారుల సహాయకుడు -వడ్డె. ఇతనే సారలమ్మను గద్దెపైకి తెస్తాడు. సారలమ్మను బయటికి తెస్తున్నప్పుడు వందలాది భక్తులు కోర్కెలు తీర్చాలంటూ సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టు బొక్కబోర్లా పడుకుంటారు. పూజారులూ వడ్డే ఆ జనాన్ని తొక్కుకుంటూ సారలమ్మను తీసుకొస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకను బలివ్వడం సంప్రదాయం. అది కూడా మేక జడ్తీతోనే, బలికి అంగీకరిస్తున్నట్టు ‘మేమే...’ అంటూ తలూపితేనే! కన్నెపెల్లిలో ప్రారంభమైన వూరేగింపు సుమారు ఆరు గంటల తర్వాత మేడారానికి చేరుకుంటుంది. జాతరకు రెండ్రోజుల ముందే కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని పూజారి బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది. దాదాపు తొంభై కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికి వచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజూ ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజులు ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉంటాడు. జాతరరోజు ఉదయమే గ్రామస్థులంతా గోవిందరాజును తీసుకుని వూరేగింపుగా మేడారానికి బయల్దేరతారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు. మరుసటిరోజు...సమ్మక్కతల్లిని చిలకలగుట్ట పైనుంచి తీసుకొచ్చి, భక్తుల జయజయధ్వానాల మధ్య గద్దెపై కూర్చోబెడతారు. ‘సమ్మక్క కో....సారలమ్మ కో’...నినాదాలు సముద్ర ఘోషను తలపిస్తాయి. నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా జరిగే జాతర... దేవతల వనప్రవేశంతో పరిపూర్ణం అవుతుంది. కళ్లనిండా ఆ అమ్మల రూపాల్ని నింపుకుని భక్తజనం తిరుగు ప్రయాణం అవుతారు.

అమ్మలకు...బంగారం
‘అమ్మలూ ఆదిశక్తి స్వరూపాలూ...కష్టాల నుంచి గట్టెక్కించండి...నిలువెత్తు బంగారాన్ని ఇచ్చుకుంటాం...’ అంటూ భక్తులు సమ్మక్క-సారలమ్మలకు బంగారం సమర్పించుకుంటారు. బంగారమంటే రుచీపచీలేని లోహపు ముద్ద కాదు. కమ్మకమ్మని ఎర్ర బంగారం...బెల్లం! భక్తితో నివేదించే బెల్లమే, ఆ తల్లికి బంగారం కంటే విలువైంది. ఓసారి, సంపన్నులంతా స్వర్ణాభరణాలు సమర్పిస్తుంటే, ఓ నిరుపేద చిన్నబోయి చూశాడట. ‘బతుకే బరువైన పేదవాడిని తల్లీ! అంతంత బంగారం ఎక్కడి నుంచి తీసుకురానూ, నీ అనుగ్రహాన్ని ఎలా సంపాదించనూ’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. బిడ్డ బాధపడితే, తల్లి మనసు తట్టుకుంటుందా? ఆ రాత్రి కలలో కనిపించి ..‘బెల్లమిస్తే బంగారం సమర్పించినట్టే బిడ్డా!’ అని ప్రేమగా సెలవిచ్చిందట. దీంతో ఆ పేదవాడు నిలువెత్తు బంగారాన్ని నివేదించి నిజభక్తిని చాటుకున్నాడట. అమ్మకు భక్తి ముఖ్యం. భక్తిలోని తీయదనానికి బెల్లం ప్రతీక!

సమ్మక్కకు ఒడి బియ్యం
మేడారం జాతరలో ఒడి బియ్యానికి ప్రత్యేకత ఉంది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పజెప్పేందుకు ఇంటి నుంచి బయలుదేరే మహిళలు కొత్త గుడ్డలో ఒడి బియ్యాన్ని పోసుకుని, నడుముకు కట్టుకుని వస్తారు. ఒడి బియ్యం సమ్మక్కకు అత్యంత ప్రీతిపాత్రమని భక్తుల విశ్వాసం. కొత్త బట్టలో సుమారు మూడు కిలోల బియ్యం, పసుపు, కుంకుమతో కలిపి...రెండు ఎండు కొబ్బరి కుడకలూ, రెండు రవిక ముక్కలూ, రెండు పోకవక్కలూ, ఖర్జూరాలూ వేసి నడుముకు కట్టుకుంటారు. సమ్మక్క, సారలమ్మలు గద్దెకు చేరిన తర్వాత వాటిని సమర్పిస్తారు.

మొక్కులు...
అమ్మవార్లకు ఎన్నో మొక్కులు. వేటపోతుల్నీ కోడి పుంజుల్నీ బలిస్తారు. కొబ్బరికాయలూ వస్త్రాలూ సమర్పిస్తారు. అమ్మలకు సమర్పించిన వస్త్రాల కోసం భక్తులు పోటీపడతారు. ఆ వస్త్రాలు ఇంట్లో ఉంటే కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మకం. మిగతా పుణ్యక్షేత్రాల్లానే తలనీలాలు సమర్పిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్టే, కోడెలు కట్టే సంప్రదాయమూ ఉందిక్కడ. చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దెల మీదకు వచ్చే క్రమంలో ఎదురుకోడి పిల్లలు ఎగురవేస్తూ ఉంటారు. రూపాయి చెల్లించి సమ్మక్కకు ఎదురుగా కోడి పుంజును ఎగురవేస్తే అమ్మకు ఆరగింపు ఇచ్చినట్టే. మగవాళ్లు ఆడవేషం కట్టుకుని మొక్కులు చెల్లించుకుంటారు కూడా. ఆచారవంతుల వేషం వేసుకోవడం అంటే, సమ్మక్క-సారలమ్మల్ని ఆవాహన చేసుకోవడమే అన్న భావన. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించేవారూ, అన్నప్రాశనలు జరిపేవారూ ఎంతోమంది. ఇక్కడే పెళ్లిళ్లూ జరుగుతాయి. మేడారంలో శుభకార్యం పెట్టుకుంటే ముహూర్తాలతో పన్లేదు. ప్రతి రోజూ శుభదినమే. రాహుకాలాల ప్రస్తావనే లేదు. నవగ్రహాలూ ఆ తల్లుల కనుసన్నల్లోనే మెలుగుతాయంటారు.

హుండీలో గలగలలు!
మేడారం జాతరకు తరలివచ్చే ప్రవాసుల సంఖ్యా తక్కువేం కాదు. హుండీలో కనిపించే అమెరికా, సింగపూర్‌, యూకే, సౌదీ, దుబాయి, బహ్రేన్‌, రష్యా తదితర దేశాల కరెన్సీ కట్టలే అందుకు సాక్ష్యం. మొత్తంగా, మేడారం జాతర ఆదాయమూ క్రమంగా పెరుగుతోంది. 1968లో రూ.లక్షా 20 వేలతో ప్రారంభమైన రాబడి...2012 నాటికి రూ.5,91,41,875కు చేరుకుంది. 2014లో అయితే అక్షరాలా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు! ఈ ఏడాది పదికోట్ల రూపాయల్ని అవలీలగా దాటిపోవచ్చని అంచనా. డబ్బే కాదు...వెండితో చేసిన అమ్మవారి వూయలలూ, విగ్రహాలూ, ముక్కుపుడకలూ హుండీలో వేస్తారు. రెండేళ్ల క్రితం కెనడా నుంచి ఎమెలీ అనే యువతి జాతరకు వచ్చింది. ప్రవాస తెలంగాణ ప్రజలు కథలు కథలుగా చెబితే...కళ్లారా చూద్దామని బయల్దేరిందట.
నాటి కుగ్రామం...
ఒకప్పుడు, మహా అయితే ఓ పాతిక గుడిసెల కుగ్రామం మేడారం. పట్టపగలే పులులూ సింహాలూ ఏనుగులూ సంచరించేవట. గద్దెలచుట్టూ ప్రదక్షిణలు చేసేవట. గర్జనలతో ఘీంకారాలతో వనదేవతల్ని కీర్తించేవట. మేడారానికి ప్రయాణమంటే...కాలినడకనో, ఎడ్లబండి మీదో రావాల్సిందే. అందులోనూ అడుగడుగునా గండాలే. ‘సమ్మక్క రక్ష..సారలమ్మ ఆన’ అనుకోగానే ఎక్కడలేని ధైర్యం. నిర్విఘ్నంగా భక్తులు మేడారానికి చేరుకునేవారు. కానీ ఇప్పుడు, జాతర సమయంలో మేడారం మహానగరాన్ని తలపిస్తుంది. విశాలమైన రోడ్లు వచ్చేశాయి. విద్యుద్దీపకాంతులూ వాహనాల రొదలూ ప్రముఖుల కాన్వాయ్‌ కూతలూ...ఆ నాల్రోజులూ జిల్లా పాలన...ఇక్కడి నుంచే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. గగనతలంలో హెలీకాఫ్టర్లూ సంచరిస్తుంటాయి. కోయదొరల జోస్యాలూ, సర్వరోగాలకూ చెట్లమందులూ, కొత్త బెల్లం వాసనలూ, శివసత్తుల పూనకాలూ, ఎడ్లబండ్ల పరుగులూ...ఆ హడావిడి చూడాల్సిందే.

దారివెంట...దర్శనీయాలు
మేడారం యాత్రలో దారి పొడవునా దర్శనీయ స్థలాలున్నాయి. ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల్లోని అనేక ప్రాంతాలు పర్యటకుల్ని ఆకట్టుకుంటాయి. సమ్మక్క-సారలమ్మల దర్శనం చేసుకున్నాక, తిరుగు ప్రయాణంలో వరంగల్‌వైపు నుంచి వచ్చేవారు ఎన్నో పర్యటక ప్రాంతాల్ని సందర్శించవచ్చు.

* తాడ్వాయి-వరంగల్‌ మార్గంలో చల్వాయి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంది. దీనిపై ఏర్పాటు చేసిన...వేలాడే వంతెన పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అటవీప్రాంతంలో అందమైన కాటేజీలూ రెస్టారెంట్లూ ఉన్నాయి. హుషారుగా బోటు షికార్లూ చేసుకోవచ్చు.

* తాడ్వాయి-వరంగల్‌ మార్గంలో ములుగు కంటే కాస్త ముందే, జంగాలపల్లి క్రాసింగ్‌ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం...ఎడమ వైపు వెళితే రామప్పగుడి కనిపిస్తుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ఆలయం. అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గణపురం మండలంలో కాకతీయుల కాలం నాటి ‘కోటగుళ్లు’ ఆలయ సముదాయం ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పరకాల రోడ్డుకు చేరుకుని, వరంగల్‌ వెళ్లిపోవచ్చు.

* వరంగల్‌లో ప్రసిద్ధ వేయిస్తంభాల గుడి, కాకతీయుల రాజధాని ప్రాంతమైన ఖిలా వరంగల్‌, భద్రకాళి ఆలయం చూడదగినవి.

* మంగపేట ప్రాంతం నుంచి వచ్చే వారు...మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామిని కళ్లారా దర్శించుకోవచ్చు.

* చత్తీస్‌గఢ్‌తో పాటు ఖమ్మం జిల్లా వెంకటాపురం, పేరూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు... ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన సుమారు రెండు కిలోమీటర్ల భారీ వంతెన కూడా పర్యటక ప్రదేశమే.

Tuesday, February 16, 2016

చిన్న చిన్న సంతోషాలకు వందనం

కళింగాంధ్రలో రోడ్లు రక్తసిక్తం. ఫలానా ఈవెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం. ఫలానా పెద్దమనిషి మీద సెక్సువల్ హెరాస్‌మెంట్ కింద కేసు. బ్యాంకు లూటీ. నమ్మించి ముంచిన ఫలానా సంస్థ. ఈ సీజన్‌కు అంతు లేదు. కాని వీటన్నింటి మధ్య ప్రకృతి కటాక్షిస్తున్న ప్రమోదాలను మిస్ అవుతున్నామా? వాటికి ప్రకటించాల్సినంత కృతజ్ఞత ప్రకటిస్తున్నామా?
 
ప్రభాతం పావురాలది. అవే వేకువ వచ్చిందన్న సంగతిని బాల్కనీలో వాలి కువకువలతో తెలియచేస్తాయి. శ్రీ సూర్యనారాయణుడు... పొల్లు పోడు. వల్ల కాదు అని అనడు. ప్రతి నిత్యం ఉదయిస్తాడు. ఆయన ప్రసరింప చేసే కాంతి. ప్రాణం పోసే వెలుతురు. మరో ఉదయం. మరో ఊపిరి. సంపూర్ణంగా బతకడానికి మరో రోజు. ఎంత కటాక్షం ఇది. దేవుడా నీకు కృతజ్ఞతలు.
   
ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలి. సిగ్నల్ సరిగ్గానే దాటాము. హార్ష్‌గా ఓవర్ టేక్ చేసిన కుర్రాణ్ణి ఏమనకుండానే ఉన్నాము. ఒక కారు మనల్ని ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఒక టూ వీలర్‌ని మనం కూడా ఏమీ చేయకుండానే తప్పించాము. ఆఫీసుకు అలా వెంట్రుకవాసి అపాయం కూడా కలగకుండా చేరిపోయాం. రోజూ దక్కుతున్న వరం ఇది. రోజూ ప్రాణశక్తులు ప్రసాదిస్తున్న వరం. ఆ వరానికి కృతజ్ఞతలు.
 
తినడానికి ఆ పూటకు పప్పుచారు ఉంది. నంజుకోవడానికి అరటికాయ తాలింపు. తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు. తోడుగా కాస్త షేర్ చేసుకుంటారా అని స్నేహంగా పలకరించే కొలీగ్స్. ఒకరు వక్కపొడి ఇస్తారు. మరొకరు పన్ను మెరిసేలా నవ్విస్తారు. అద్భుతమైన మధ్యాహ్నం ఇది. ఎడారిలో ఉంచకుండా, దారుణమైన దుర్భిక్ష ప్రాంతంలో ఉంచకుండా, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని ప్రదేశంలో ఉంచకుండా, ప్రశాంతంగా కూచుని నాలుగు ముద్దలు తినే పరిస్థితి లేని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంచకుండా దైవం కల్పించిన వరం ఇది. ఇవాళ... మనకు మాత్రమే వరం. కృతజ్ఞతలు.

నాలుగ్గంటలప్పుడు ఫోన్ వస్తుంది. ఊళ్లో నుంచి అమ్మ పలకరిస్తుంది. పెరట్లోని జామచెట్టుకు మంచి మంచి కాయలు కాస్తున్నాయట. కోసి మూటగట్టి బస్సుకు వేస్తే ఉదయాన్నే తీసుకుని మనమలకు తినిపించాలట. నాన్న పలకరిస్తాడు. పంపిన డబ్బు సరిపోగా మిగిలిన వాటిని దాచి పెట్టి మనవరాలికి కాలి పట్టీలు కొన్నాడట. ఎందుకు నాన్నా... అంటే వినడు. ఈసారి వచ్చినప్పుడు తనే స్వహస్తాలతో తొడుగుతాడట. పలకరించడానికి అమ్మా నాన్నా ఉన్నారు.

సొంత ఊళ్లో హాయిగా ఉన్నారు. అక్కడి నుంచి ఆశీర్వచనం నిత్యం పలుకుతూనే ఉంటారు. వారు ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. మనం ఉండటం ఒక ప్రకృతి కటాక్షం. ఇరువురూ మాట్లాడుకోవడానికి ఈ సాయంత్రం ఉండటం ఎంతో దయామయమైన మరో కటాక్షం. దానికి వందనం.
   
పచ్చి మిరపకాయ ఆల్రెడీ మన కోసం పండి ఉంది. శనగ పప్పును కూడా మన కోసం ఎవరో పండించారు. ఆ రెంటినీ కలిపి కాసింత ఉప్పు జల్లించి పొయ్యి మీద బాణలి పెట్టి వేడి వేడిగా వేయించి పెట్టడానికి ఒక మనిషిని ఏ పుణ్యాత్ములో కని సిద్ధం చేసి ఉన్నారు. ఈ సాయంత్రం అతను ఉన్నాడు. ఈ సాయంత్రం మనం ఉన్నాం. అతని చేతి మీదుగా నాలుగు బజ్జీలను తినే అదృష్టం చిన్న అదృష్టం కాదు. అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది లేనప్పుడు దాని విలువ అమూల్యం. ప్రకృతి మనల్ని సంతోషపెట్టడానికి స్వాంతన పరచడానికి కాసింత సరదా పడటానికి అను నిత్యం వరాలు అందిస్తూనే ఉంటుంది. ఇదీ ఒకటి. వందనం.

ఇంటికి వెళితే భలేగా ఉంటుంది. పక్క ఫ్లాట్ పిల్లవాడి బర్త్ డే అట. వాడు కొత్త బట్టలు కట్టుకొని భలేగా ఉంటాడు. పక్కనున్న పిల్లలందరినీ పిలిచి భలేగా కనిపిస్తాడు. పిల్లలందరూ అద్భుతాలు. నవ్వితే రోగాలు పోతాయి. వారు తాకితే స్వస్థత పడతాము. వారి మాటలు సంగీతం. వారి అల్లరి ఆయుష్షు. అలాంటి పిల్లలతో గడితే ఆ కాస్త సమయం భలే బాగుంటుంది. కేక్ తినొచ్చు. చాక్లెట్ బుగ్గన పెట్టుకోవచ్చు. గొంతు ఏ మాత్రం బాగ లేకపోయినా జంకూ గొంకూ లేకుండా పెద్దగా హ్యాపీ బర్త్ డే టూ యూ పాడొచ్చు. ఈ సాయంత్రాన్ని వెలిగించడానికి ప్రకృతి కల్పించిన ఒక సందర్భం అది. కృతజ్ఞతలు.

శ్రీమతి ఆదరంగా మాట్లాడుతుంది. పిల్లలు ఆవేళ స్కూల్లో ఏమేం ఘనకార్యాలు చేశారో పూస గుచ్చుతారు. కొత్త సోఫా కొనడానికి ఇంకా ఎంత డబ్బు పోగేయ్యాలో కాసేపు లెక్కలు. ఈసారి వెచ్చాల్లో చేయవలసిన మార్పులు. డాబరా, పెప్సొడెంటా చిన్న పాటి తగువు. పిల్లల కొత్త షూస్ ప్రపోజల్ మీద సంతకం. అన్నీ అయ్యాక స్కూటర్ మీద అందరూ బజారు దాకా వెళ్లి అరటి పండ్లు, పాపిన్స్, మరుసటి రోజు ఉదయానికి ఆరంజి టిక్ టాక్స్....

తిరిగొచ్చి లిఫ్ట్ ఎక్కబోతుండగా వాచ్‌మెన్ వచ్చి కూతురి పెళ్లి అనంటే ఉన్నంతలోనే చేయదగ్గ సహాయం చేసేసి అతడు దండం పెడుతుంటే భలే వాడివే అంటూ భుజం మీద చనువుగా చేసే చరుపు.... చాలా చిన్న చిన్న అతి స్వల్పమైన ఆనందాలు... ప్రకృతి ఆ వేళకు సిద్ధం చేసిన అపురూపమైన క్షణాలు.... ఎవరికి దక్కుతాయివి... ఎంతమందికి దక్కుతున్నాయి... మనకే సొంతం... మనకు మాత్రమే సొంతం... దేవుడా నీకు వందనం.

రాత్రి వస్తుంది. రోడ్లను నెమ్మదింప చేయడానికి, పరుగును నెమ్మదింప చేయడానికి, వేడిని నెమ్మదింప చేయడానికి రాత్రి వస్తుంది. రిలీవర్‌గా తెల్లటి యూనిఫామ్‌లో చంద్రుడు డ్యూటీ ఎక్కుతాడు. గాలి నిదుర లేస్తుంది. ఉద్యోగం చేసి అలిసొచ్చిన తల్లి తన అలసటనంతా పిల్లలకు అన్నం తినిపించడంలో మరిచిపోతుంది. టీవీలో సంగీతం ప్రోగ్రామ్‌లో ఎవరో కాస్త మంచి పాటలే పాడతారు. మనింట్లో మన కుటుంబంతో మనకిష్టమైన భోజనం చేసే రాత్రి... ఎవరూ గమనించిన అపురూపమైన క్షణాలు...

ఎవరూ విలువ ఇవ్వని అమూల్యమైన ఘడియలు... మనల్ని ఉత్సాహపరచి గడిచిపోతాయి. ఇది వాట్సప్పులు కాసిన్ని జోకులు చూసి నవ్వుకునే సమయం. ఇది అయినవారితో కాసేపు చాట్ చేసే సమయం. ఇది ఏవో ఫన్నీ వీడియోలు చూసి కాసింత తెరిపిన పడే సమయం. ప్రకృతి మనల్ని సురక్షితంగా ఇల్లు చేర్చేసింది. తలుపుకు గడియ పెట్టి హాయిగా నిద్ర పొమ్మంటోంది. రోజు ప్రమోదంగా గడిచింది. తెలియకుండానే వరంగా గడిచింది. దేవుడా... వందనాలు.

నిద్రేమి తక్కువ కనికరం చూపుతుందా? దయ తలిచి మంచి మంచి కలలు ఇస్తుంది. చూడని ప్రదేశాలు తిప్పుతుంది. తీరని దప్పికలను తీర్చుతుంది. కనపడని మనుషులను కలుపుతుంది. వినపడని రాగాలను వినిపిస్తుంది. ఒక్క నిద్రలో వేయి జన్మలు. ఆ అనుభవాలన్నింటితోనూ దిగ్భ్రమను ప్రసాదిస్తుంది. వాహ్... ఏమి రాత్రి ఇది. భూకంపాలు రాని, బీభత్సాలు కాని, ఎటువంటి ఉత్పాతాలు, యుద్ధాలు, మర ఫిరంగులు చుట్టుముట్టని ప్రశాంతమైన రాత్రి. ఎంతమందికి ఇలాంటి రాత్రులు దొరుకుతున్నాయి. మనకు మాత్రమే సొంతం. మనకే ఈ వరం. దేవుడా ముమ్మాటికి నీకే కృతజ్ఞతలు.
   
మళ్లీ తెల్లారుతుంది. చాలా మామూలుగా అనిపించే ఒక గొప్ప ఉషోదయం పలకరిస్తుంది. ఇలా మామూలుగా గడిచిపోతే చాలు. ఈ సామాన్యమైన అపురూప క్షణాలను ప్రకృతి ప్రసాదిస్తుంటే అదే పది వేలు.

Monday, February 15, 2016

టమోటాలో దాగి ఉన్న బ్యూటీ సీక్రెట్స్

కొంతమందిని పొగిడేటప్పుడు నీ బుగ్గలు ఎర్రగా టమోటాల్లా ఉన్నాయి అని కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటాం. టేస్టీ, జ్యూసీ టమోటాలు చూడ్డానికే కాదు.. తినడానికి, అందానికి కూడా ఎట్రాక్టివే. ఎందుకంటే.. ఇందులో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి, అందానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.


ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్ 
చాలా వరకు అన్ని రకాల వంటకాల్లో టమోటాలను ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది పచ్చివే తినడానికి కూడా ఇష్టపడతారు. ఇవి రక్తం ఉత్పత్తి చేయడంలోనూ, రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మీ చర్మానికి కూడా హెల్త్ బెన్ఫిట్స్ చేకూర్చే సత్తా టమోటాల్లో దాగుంది.

టమోటో జ్యూస్ త్రాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్
టమోటాలను వండే సంగతి పక్కనపెడితే.. వీటిని రకరకాల పద్ధతుల్లో ఉపయోగించి మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. టమోటాలు తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందవచ్చు.

చర్మంపై గుంతలు :
నాలుగు చుక్కల టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కలిపి దూదితో ముఖానికి పట్టించాలి. లేదా స్మూత్ గా ముఖంపై మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ముఖంపై ఏర్పడిన గుంతలు మూసుకుపోతాయి.


గ్లోయింగ్ స్కిన్ :
టమోటాలు హెల్తీ డైట్ మాత్రమే కాదు.. ఇవి చర్మంపై చాలా వండర్స్ చేస్తాయి. టమోటా జ్యూస్ లేదా టమోటాలను నేరుగా ముఖంపై మసాజ్ చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే చర్మం హెల్తీగా నిగారిస్తుంది.

యాక్నే:
విటమిన్ ఏ, సి ఉండే ఆయింట్మెంట్స్, మెడిసిన్స్ ను యాక్నే నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ ఎసిడిక్ కంటెంట్ ఉన్న టమోటాలు యాక్నేతో చాలా న్యాచురల్ గా పోరాడతాయి. ఎక్కువగా యాక్నే సమస్య ఉంటే.. టమోటా తొక్కు తీసి.. ముఖానికి అప్లై చేయాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆయిల్ :
ముఖం ఆయిలీగా ఉంటే.. మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి మీది ఆయిలీ స్కిన్ అయితే.. 2 టమోటాల రసం, 4 టేబుల్ స్పూన్ల కుకుంబర్ రసం కలిపి.. ముఖానికి రోజూ టోనర్ లా ఉపయోగిస్తే.. ఆయిలీ స్కిన్ నుంచి బయటపడవచ్చు.

ఏజింగ్ :
చర్మంలో వయసు ఛాయలు కనిపించకుండా.. యంగ్ లుక్ సొంతం చేసుకోవడానికి టమోటాలు చక్కటి పరిష్కారం. కాబట్టి రెగ్యులర్ గా టమోటాతో ముఖానికి స్క్రబ్ చేయడం వల్ల ఏజింగ్ ను నిరోధించవచ్చు. Show Thumbnail

సన్ స్క్రీన్ లోషన్ :
అనేక అధ్యయనాల ప్రకారం టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి న్యాచురల్ సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తాయి. యూవీ రేస్ నుంచి టమోటా ద్వారా రక్షణ పొందవచ్చు.


బ్లీచింగ్ :
టమోటాలు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి. స్కిన్ టోన్ ని షైనింగ్ గా మార్చడానికి టమోటాలు చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. ఒక టీ స్పూన్ ఓట్ మీల్, ఒక టీ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే.. మీ చర్మంలో కొత్త మెరుపు వస్తుంది.

స్మూత్ స్కిన్ :
టమోటా రసం, తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారిపోతుంది.

మృతకణాలు :
చర్మాన్ని నిర్జీవంగా మార్చే మృతకణాలను టమోటాలు చాలా తేలికగా తొలగిస్తాయి. మిక్సీలో టమోటాలను బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి 1 టీస్పూన్ పంచదార కలిపి... ఫేస్ పై అప్లై చేసి.. గుండ్రంగా ముఖంపై మసాజ్ చేయాలి. లేదా టమోటాను కట్ చేసి.. షుగర్ లో అద్ది స్క్రబ్ లా ఉపయోగించినా సరిపోతుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.




తెల్లజుట్టు నల్లగా మార్చే ఇంట్లో ఉండే ఔషధం

జుట్టు తెల్లబడిందా ? తలలో ఒక తెల్లవెంట్రుక కనబడితే చాలు.. మార్కెట్ లో దొరకే హెయిర్ కలర్స్ ట్రై చేస్తారు. ఈ రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తే.. తాత్కాలికంగా జుట్టు రంగు మారి షైనింగ్ గా కనిపించినా.. వారానికే తెల్లజుట్టు మళ్లీ కనిపిస్తూ ఉంటుంది. దీంతో మరో బ్రాండ్ ట్రై చేయడం, అది కూడా సేమ్ రిజల్ట్సే ఇస్తుంది. ఇలా ఎన్ని వాడినా.. ఫలితం లేక మీరు కూడా ఢీలా పడుతున్నారా ?

వయసుపైబడుతున్న సమయం అంటే 40 ఏళ్లలో తెల్లజుట్టు కనిపిస్తే ఫర్వాలేదు. కానీ.. 20 లలోనే తెల్ల జుట్టు సమస్య వస్తోందంటే.. దానికి మనం ఫాలో అవుతున్న ఆహారపు అలవాట్లు, రోజు వారీ అలవాట్లే కారణం. కాబట్టి తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఉపయోగించే కెమికల్ ప్రాడక్ట్స్ అందరికీ సరిపడవు. కొంతమందికి అలర్జీలు, ముఖంపై దద్దుర్లు, తుమ్ములు వంటి సమస్యలు వస్తుంటాయి. తాత్కాలిక పరిష్కారంతో పాటు, సైడ్ ఎఫెక్ట్స్ చూపించే హెయిర్ కలర్స్ స్వస్తి చెప్పి.. ఎఫెక్టివ్ గా పనిచేసే హోం రెమిడీస్ ఫాలో అవండి. తెల్లజుట్టుని పర్మనెంట్ గా నల్లగా మార్చే.. టాప్ 10 హోం రెమిడీస్ మీ కోసం..

కొబ్బరినూనె, కరివేపాకు కరివేపాకు వంటకాల్లో ఎక్కువగా వాడతాం. ఇది జుట్టుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్లజుట్టు నల్లగా మార్చడానికి కరివేపాకు చాలా ఎఫెక్టివ్, న్యాచురల్ రెమిడీ. అలాగే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు కూడా. ఒక కప్పు కొబ్బరినూనె, గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి.. 6 నుంచి 8 నిమిషాలు బాగా మరిగించాలి. లేదా కరివేపాకు నల్లగా మారేవరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత వడకట్టి.. రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ ని తల మాడుకి, జుట్టుకి బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే హెర్బల్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు కంటిన్యూగా చేస్తే తెల్లజుట్టు ఖచ్చితంగా నల్లగా మారుతుంది.


ఉసిరి, మెంతుల ప్యాక్ ఎండిన ఉసిరికాయలు 6, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అరకప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. మెంతులను మెత్తగా పొడి చేయాలి. కొబ్బరినూనెలో ఎండిన ఉసిరికాయలు వేసి ఉడకబెట్టాలి. 6 నిమిషాలు బాగా మరిగిన తర్వాత మెంతుల పొడి ఆ ఆయిల్ లో కలపాలి. మరో నిమిషం పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి.. రాత్రి పడుకునే ముందు మాడుకి, జుట్టుకి పట్టించి ఉదయం హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే నల్లగా నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.


నిమ్మరసం, బాదాం నూనె బాదాం నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక కప్ లో బాగా మిక్స్ చేయాలి. తర్వాత తలకు, స్కాల్ఫ్ కి బాగా పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఉల్లిపాయ, నిమ్మరసం జుట్టు సమస్యలకు ఉల్లిపాయను పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా కూడా మారుతుంది. ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 4 నుంచి 5 సార్లు రెండు వారాలు కంటిన్యూగా చేస్తే.. తెల్లజుట్టుకి గుడ్ బై చెప్పవచ్చు.


బీరకాయ తెల్లజుట్టు నల్లగా మార్చడానికి బీరకాయ చాలా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా పనిచేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా ? ఒక్కసారీ ట్రై చేయండి ఈ సింపుల్ రెమిడీ. ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక కప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. ముందుగా బీరకాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన బీరకాయ ముక్కలను కొబ్బరినూనెలో మూడు రోజులు నానబెట్టాలి. తర్వాత అలాగే 6 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఆయిల్ ని వడగట్టి.. ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకి, స్కాల్ఫ్ కి రాత్రి పడుకునే ముందు బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే.. శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి రిజల్ట్స్ పొందవచ్చు.

మజ్జిగ మజ్జిగలో కరివేపాకు కలిపి పెట్టుకుంటే.. తెల్లజుట్టు నివారించడం చాలా సులువైన పని. గుప్పెడు కరివేపాకు, పావు కప్పు మజ్జిగ తీసుకోవాలి. ముందుగా కరివేపాకును బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. దాన్ని మజ్జిగలో కలుపుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి జుట్టుకి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

షీకాకాయ జుట్టు శుభ్రం చేసుకోవడానికి షీకాకాయను పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తెల్లజుట్టు నివారించడానికి షీకాకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. 5 షీకాకాయ ముక్కలు, పెరుగు అరకప్పు తీసుకోవాలి. షీకాకాయలను పొడి చేసుకోవాలి. పెరుగులో ఈ పొడి బాగా మిక్స్ చేస తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూ అవసరం లేకుండా.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. ఆరోగ్యంగానూ ఉంటుంది.

నల్లనువ్వులు నల్ల నువ్వులు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే ఇందులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒక టీస్పూన్ నల్ల నువ్వులను మూడు నెలల పాటు రోజూ తినడం మంచిది. అలాగే రెగ్యులర్ గా నువ్వుల నూనె అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.