Monday, February 15, 2016

తెల్లజుట్టు నల్లగా మార్చే ఇంట్లో ఉండే ఔషధం

జుట్టు తెల్లబడిందా ? తలలో ఒక తెల్లవెంట్రుక కనబడితే చాలు.. మార్కెట్ లో దొరకే హెయిర్ కలర్స్ ట్రై చేస్తారు. ఈ రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తే.. తాత్కాలికంగా జుట్టు రంగు మారి షైనింగ్ గా కనిపించినా.. వారానికే తెల్లజుట్టు మళ్లీ కనిపిస్తూ ఉంటుంది. దీంతో మరో బ్రాండ్ ట్రై చేయడం, అది కూడా సేమ్ రిజల్ట్సే ఇస్తుంది. ఇలా ఎన్ని వాడినా.. ఫలితం లేక మీరు కూడా ఢీలా పడుతున్నారా ?

వయసుపైబడుతున్న సమయం అంటే 40 ఏళ్లలో తెల్లజుట్టు కనిపిస్తే ఫర్వాలేదు. కానీ.. 20 లలోనే తెల్ల జుట్టు సమస్య వస్తోందంటే.. దానికి మనం ఫాలో అవుతున్న ఆహారపు అలవాట్లు, రోజు వారీ అలవాట్లే కారణం. కాబట్టి తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఉపయోగించే కెమికల్ ప్రాడక్ట్స్ అందరికీ సరిపడవు. కొంతమందికి అలర్జీలు, ముఖంపై దద్దుర్లు, తుమ్ములు వంటి సమస్యలు వస్తుంటాయి. తాత్కాలిక పరిష్కారంతో పాటు, సైడ్ ఎఫెక్ట్స్ చూపించే హెయిర్ కలర్స్ స్వస్తి చెప్పి.. ఎఫెక్టివ్ గా పనిచేసే హోం రెమిడీస్ ఫాలో అవండి. తెల్లజుట్టుని పర్మనెంట్ గా నల్లగా మార్చే.. టాప్ 10 హోం రెమిడీస్ మీ కోసం..

కొబ్బరినూనె, కరివేపాకు కరివేపాకు వంటకాల్లో ఎక్కువగా వాడతాం. ఇది జుట్టుకి, ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్లజుట్టు నల్లగా మార్చడానికి కరివేపాకు చాలా ఎఫెక్టివ్, న్యాచురల్ రెమిడీ. అలాగే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు కూడా. ఒక కప్పు కొబ్బరినూనె, గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి.. 6 నుంచి 8 నిమిషాలు బాగా మరిగించాలి. లేదా కరివేపాకు నల్లగా మారేవరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత వడకట్టి.. రాత్రి పడుకునే ముందు ఈ ఆయిల్ ని తల మాడుకి, జుట్టుకి బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే హెర్బల్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు కంటిన్యూగా చేస్తే తెల్లజుట్టు ఖచ్చితంగా నల్లగా మారుతుంది.


ఉసిరి, మెంతుల ప్యాక్ ఎండిన ఉసిరికాయలు 6, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అరకప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. మెంతులను మెత్తగా పొడి చేయాలి. కొబ్బరినూనెలో ఎండిన ఉసిరికాయలు వేసి ఉడకబెట్టాలి. 6 నిమిషాలు బాగా మరిగిన తర్వాత మెంతుల పొడి ఆ ఆయిల్ లో కలపాలి. మరో నిమిషం పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి.. రాత్రి పడుకునే ముందు మాడుకి, జుట్టుకి పట్టించి ఉదయం హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే నల్లగా నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.


నిమ్మరసం, బాదాం నూనె బాదాం నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక కప్ లో బాగా మిక్స్ చేయాలి. తర్వాత తలకు, స్కాల్ఫ్ కి బాగా పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఉల్లిపాయ, నిమ్మరసం జుట్టు సమస్యలకు ఉల్లిపాయను పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా కూడా మారుతుంది. ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకి బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 4 నుంచి 5 సార్లు రెండు వారాలు కంటిన్యూగా చేస్తే.. తెల్లజుట్టుకి గుడ్ బై చెప్పవచ్చు.


బీరకాయ తెల్లజుట్టు నల్లగా మార్చడానికి బీరకాయ చాలా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా పనిచేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా ? ఒక్కసారీ ట్రై చేయండి ఈ సింపుల్ రెమిడీ. ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక కప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. ముందుగా బీరకాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన బీరకాయ ముక్కలను కొబ్బరినూనెలో మూడు రోజులు నానబెట్టాలి. తర్వాత అలాగే 6 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఆయిల్ ని వడగట్టి.. ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకి, స్కాల్ఫ్ కి రాత్రి పడుకునే ముందు బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే.. శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేస్తే మంచి రిజల్ట్స్ పొందవచ్చు.

మజ్జిగ మజ్జిగలో కరివేపాకు కలిపి పెట్టుకుంటే.. తెల్లజుట్టు నివారించడం చాలా సులువైన పని. గుప్పెడు కరివేపాకు, పావు కప్పు మజ్జిగ తీసుకోవాలి. ముందుగా కరివేపాకును బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. దాన్ని మజ్జిగలో కలుపుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి జుట్టుకి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత హెర్బల్ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

షీకాకాయ జుట్టు శుభ్రం చేసుకోవడానికి షీకాకాయను పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తెల్లజుట్టు నివారించడానికి షీకాకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. 5 షీకాకాయ ముక్కలు, పెరుగు అరకప్పు తీసుకోవాలి. షీకాకాయలను పొడి చేసుకోవాలి. పెరుగులో ఈ పొడి బాగా మిక్స్ చేస తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూ అవసరం లేకుండా.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. ఆరోగ్యంగానూ ఉంటుంది.

నల్లనువ్వులు నల్ల నువ్వులు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే ఇందులో ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒక టీస్పూన్ నల్ల నువ్వులను మూడు నెలల పాటు రోజూ తినడం మంచిది. అలాగే రెగ్యులర్ గా నువ్వుల నూనె అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


No comments:

Post a Comment