Saturday, June 4, 2016

మొటిమలు ఇక మటు మాయం

ముఖంపై ఒక్క మొటిమ వచ్చినా.. అది ముఖం మొత్తం వ్యాపింపజేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఏర్పడ్డాయంటే.. ముఖ వర్చస్సు తగ్గిపోయి, జిడ్డుగా మారి.. బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి మొటిమలు నివారించుకోవడానికి రకరకాల మందులు, ఫ్రెండ్స్, బంధువులు చెప్పిన రకరకాల క్రీములు వాడి విసిగిపోయి ఉంటారు.

శరీరంలో ఇంబ్యాలెన్స్ వాతదోషం వల్ల మొటిమలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. వాత దోషం ఇంబ్యాలెన్స్ గా ఉంటే.. జీర్ణక్రియ సరిగా ఉండదు. శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లవు. దీనివల్ల సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలా మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది.

ఎన్ని రెమిడీస్ వాడినా.. పరిష్కారం లభించకుండా.. ఇంకా మొటిమలతో బాధపడుతుంటే.. చాలా సింపుల్ టిప్స్ మీ ముందు ఉన్నాయి. ఆయుర్వేదం మీ మొటిమలను పర్మనెంట్ గా తొలగించేస్తుంది. మరి మొటిమలతో పోరాడే.. న్యాచురల్ హెర్బ్స్, అలాగే అందరికీ అందుబాటులో ఉండే.. రెమిడీస్ పై ఒక్క సారి కన్నేయండి. మీ పింపుల్స్ మాయమవడం ఖాయం.


తులసి : ఆధ్మాత్మికంగా ఎంతో విలువ ఇచ్చే తులసి ఆకులో మెడిసినల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మొటిమలు, మచ్చలు తొలగించడానికి ఇది చాలా పవర్ ఫుల్ మెడిసిన్.

ఉపయోగించే విధానం : తులసి ఆకులను నీళ్లు కలుపుతూ.. పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి 10 నిమిసాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 4 నుంచి 5 సార్లు ఇలా అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.


చందనం : ఆయుర్వేదంలో చందనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది స్మూత్ గా మార్చడంతో పాటు, కూలింగ్ నేచర్ కలిగి ఉంటుంది. మొటిమలు నయం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఉపయోగించే విధానం : కొద్దిగా చందనం తీసుకుని.. రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసుకోవాలి. దీన్ని రాత్రి పడుకోవడానికి ముందు మొటిమలపై రాసుకుని రాత్రంతా ఆరనివ్వాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవడమే కాదు.. చర్మం నిగారిస్తుంది.

వేప : ఇండియాలో ఎక్కువగా వేప చెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా ? మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల వేప ఎక్కువగా అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు మన పూర్వీకులు. మొటిమలు, మచ్చలు నివారించడంలో వేప అద్భుతం చేస్తుంది.

ఉపయోగించే విధానం : వేప ఆకులకు నీళ్లు కలుపుతూ పేస్ట్ చేసుకోవాలి. మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

నువ్వులు : మొటిమలు, మచ్చలు నివారించడంలో నువ్వులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరోసారి పింపుల్ రాకుండా.. నివారిస్తాయి.

ఉపయోగించే విధానం : రాత్రంతా నువ్వులను నీళ్లలో నానపెట్టాలి. ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మొటిమలు, మచ్చలపై రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే.. చర్మం క్లియర్ గా మారుతుంది.

పుదీనా : ఘాటైన సువాసన కలిగిన పుదీన ఆకుల్లో మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు.. మెడిసినల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కూలింగ్, ఆస్ట్రిజెంట్ గుణాలు పింపుల్ నుంచి మంచి రిలీఫ్ ని ఇస్తాయి. కాబట్టి పుదీనా ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే చాలు.. మొటిమలు మాయమవుతాయి.


అలోవెరా ; ఒకప్పుడు ఒక అమ్మాయి చాలా ఎక్కువ మొటిమలతో బాధపడేదట. దీంతో ఆమె దేవుడిని ప్రార్థించిందట. అప్పుడు దేవుడు ఆమెకు అలోవెరాను ప్రసాదించాడట. అలా బ్యూటీ ఎక్స్ పర్ట్ గా అలోవెరా మారిపోయింది.

ఉపయోగించే విధానం : కొద్దిగా అలోవెరా జెల్ తీసుకుని మొటిమలు, మచ్చలపై అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాదు.. మళ్లీ రాకుండా చేస్తుంది. అలోవెరా జ్యూస్ తీసుకుని.. గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

Friday, June 3, 2016

ఈ చిన్న పని చేస్తే చాలు.. ఆయిలీ హెయిర్ ఆమడదూరం


సాధారణ జుట్టు సమస్యల్లో ఆయిలీ హెయిర్ ఒకటి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేస్తున్నా, జుట్టు ఎప్పుడూ జిడ్డుగా కనబడుతుంటుందా ? తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కేశాల మీద ప్రభావం చూపుతుంది. 

నూనె వల్ల జుట్టు మరింత మురికిగా, జిడ్డుగా కనబడేలా చేస్తుంది. అలాగే మరికొంత మందిలో జీన్స్, హార్మోనుల ప్రభావంతో పాటు, అసాధారణ ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా జుట్టు జిడ్డుగా మారే అవకాశాలున్నాయి. 

ముఖ్యంగా ఆయిలీ హెయిర్ జుట్టుకు సంబంధించిన చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జుట్టు నిర్వాహణ కోసం ఒక సులభమైన, పవర్ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాం. ఇది ఆయిల్ జుట్టుకు ఉపయోగించి, ఆయిలీ హెయిర్ నునివారించుకోండి.



ఆయిల్ హెయిర్ నివారించుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. వంటగదిలో ఉండే ఎగ్ వైట్, ఉప్పు, నిమ్మరసం వీటన్నింటిలో, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు లోపల నుంచి పోషణను అందిస్తాయి. 

అలాగే తలలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తాయి. ఈ పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడతాయి. ఆయిలీ హెయిర్ ను నివారించుకోవడానికి ఇంట్లో మీరు ఉపయోగించాల్సిన ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్. దీన్ని ఎలా తయారుచేయాలి, ఏఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం... 
పదార్థాలు: 
గుడ్డు 1 
ఉప్పు: 2 టేబుల్స్ స్పూన్లు 
నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు 
ఎలా ఉపయోగించాలి: *ముందుగా గుడ్డు సొన ఒక బౌల్లో తీసుకొని, అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. *ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని తలకు మొత్తం అప్లై చేసి 10 నుంచి 15 నిముషాల వరకూ మసాజ్ చేయాలి. *తర్వాత షవర్ క్యాప్ తో తలను కవర్ చేయాలి. *ఇలా షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి కొద్దిగా తడి ఆరిన తర్వాత మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి. *తర్వాత కండీషనర్ ను అప్లై చేయాలి. ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల క్రమంగా తలలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడేలా చేస్తుంది.

Thursday, June 2, 2016

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అంటారో తెలుసా

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు.



మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు.



మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...



అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?


  • మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.

  • మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
  • దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: | దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ||
  • బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

  • మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందింపకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్యభంగాన్ని కలిగిస్తుంది.

  • ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డచుట్టుకుని, చెప్పులు, బూట్లు వేసుకుని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. మంచంపైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు.
  • భోజనం ఆకుల్లో పెట్టడమే మంచిది. అది ఆరోగ్యప్రదం. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతస్సాయం సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి "న సంధ్యయోర్నమధ్యాహ్నే నార్థరాత్రే కదాచన" సంధిసమయాల్లో, అర్థరాత్రిలో భుజింపరాదు. అర్థరాత్రి సూర్యసంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించి ఉంటుంది. కాబట్టి అర్థరాత్రి భోజనం నిషేధమని పండితులు అంటున్నారు.

  • నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు.
  • అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. 
  • ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.
  • బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు.
  • భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.


Wednesday, June 1, 2016

కిడ్ని స్టోన్స్ సమస్యకి నివారణ

విటమిన్ డి, పోషక లోపంతో బాధపడే వారిలో, డీహైడ్రేషన్, గౌట్ పెయిన్ ఉన్నవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అయితే ఇవి ఒక్కసారి ఏర్పడిన తర్వాత సర్జరీ చేయాలని చాలామంది సూచిస్తుంటారు. కానీ.. కిడ్నీ స్టోన్స్ ని గుర్తించిన వెంటనే.. హోం రెమిడీస్ ద్వారా కూడా వాటిని కరిగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి సింపుల్ గా 6 రోజుల హోం ట్రీట్మెంట్ చాలాని లేటెస్ట్ స్టడీ చెబుతోంది. ఇంట్లోనే తయారు చేసుకున్న రెసిపీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కిడ్నీలో తిష్ట వేసిన స్టోన్ ని తొలగించడానికి ఇది చాలా సింపుల్ అండ్ అమేజింగ్ సొల్యూషన్. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలికైన పని. మరి కిడ్నీల్లో స్టోన్స్ ని ఆరు రోజుల్లో తొలగించే హోంమేడ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం..



కావాల్సిన పదార్థాలు :
బీర్ 100 ఎమ్ఎల్
ఆలివ్ ఆయిల్ 100 ఎమ్ఎల్
నిమ్మరసం 100 ఎమ్ఎల్

తయారు చేసే విధానం ఆలివ్ ఆయిల్, బీర్ కలిపి.. అందులోకి తాజాగా తీసిన నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు డబ్బాలో పోసి.. బాగా కలపాలి. తాగడానికి ముందు బాగా షేక్ చేసి తీసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి ?

ఉదయం నిద్రలేవగానే.. 50 ఎమ్ఎల్ ఈ డ్రింక్ తీసుకోవాలి. ఆరు రోజుల పాటు రెగ్యులర్ గా ఈ పద్ధతిలోనే తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీల్లో ఏర్పడిన స్టోన్ కరగడం మొదలుపెట్టి.. యూరిన్ ద్వారా బయటకు పోతుంది. 4 రోజుల్లో అది బయటకు వస్తుంది. అయితే చిన్నగా ఉన్న కిడ్నీస్టోన్ తో బాధపడేవాళ్లు మాత్రమే ఈ డ్రింక్ ఉపయోగించాలి. ఒకవేళ మీకు ఏర్పడిన స్టోన్ 15ఎమ్ఎమ్, అంతకంటే ఎక్కువ సైజు ఉన్నవాళ్లు ఉపయోగించకండి.



Tuesday, May 31, 2016

ఇంట్లో బొద్దింకలు బల్లులు ఉన్నాయా ?

ఇల్లు చూసి ఇల్లాలిని చేసుకోవాలనే నానుడి ఎక్కువగా వుంది. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి వుంటుంది. ఏ వస్తువు ఎక్కడ వుండాలి ఏది ఎంత శుభ్రంగా వుంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి వుంటుంది.ఇంటిలోకి ధారాళంగా గాలీ, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలో వీలైనంత వెంటిలేషన్‌ బాగా వుండేటట్లు చూసుకోవాలి. మురుగునీరు ఎప్పటికప్పుడు బైటికి ప్రవహించే విధంగా చూసుకోవాలి. కూరగాయలు మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి. ఈగలు, దోమలు వాలిన పదార్థాలు తినటం వలన అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ వుంటుంది.

ఏ ఇల్లు అయినా సూక్ష్మజీవులు, బొద్దింకలు, చీమలు, బల్లులు, తేళ్ళు, జెర్రులు వంటివి కంటికి కనిపించే కీటకములు, ఈగలు, దోమలు వంటి వ్యాధి వ్యాపించే కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చాలా మంది బొద్దింకలన్నా, బల్లులన్నా విపరీతంగా భయపడుతుంటారు.సాలెపురుగులు, బొద్దింకలు, బల్లులు వంటి కొన్ని జంతువులను, సరీసృపాలను చూసినప్పుడు కొంతమందికి భయం కలుగుతుంటుంది. వారు పెద్దవారైనా సరే ఆ భయం వెంటాడుతూనే ఉం టుంది. లా భయపడే వాళ్లను చాలా మందిని మనం మన చుట్టుపక్క ల ఇళ్లలో గమనించే ఉంటాం. బొద్దికలు వచ్చిన తర్వాత వాటిని చూసి బయపడటం కన్నా, అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే భయం ఉండదు మరియు ఆరోగ్యకరమైన వాతరణం కలిగి ఉంటారు.

ఇల్లల్లో గోడ మీద తిరిగే బల్లులు ఒక రకంగా హెల్ఫ్ అవుతాయనే చెప్పాలి .

ఎందుకంటే ఇంట్లో క్రిములు, కీటకాలను ఇవి ఎప్పటికప్పడు తినేస్తుంటాయి. అయితే పరోక్షంగా మనకు సహాయపడినా..గోడ మీద అవి కనిపిస్తే చాలు బయపడుతుంటాము.అలాగే బొద్దింకలు, ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ఇవి ఆహారాలను విషపూరితం చేస్తాయి. ఆహారాల మీద చేరినప్పుడు వాటీలాలాజలం కలుషితమై విషపదార్థంగా మారి వివిధ రకాలా వ్యాధులకు గురిచేస్తుంది. ఈ రెండు సరీసృపాలను ఇంట్లో ఉండకూడదనుకుంటే మనకు వెంటనే కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల క్రిమి సంహారిణిలు అందుబాటులో ఉన్నాయి .కానీ ఇవన్నీ హానికరమైన కెమికల్స్ తో తయారుచేయబడినవి మరియు టాక్సిక్ నేచుర్ ను కలిగి ఉన్నాయి . పిల్లులు మరియు పెంపుడు జంతువులన్న ఇల్లలో వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకోసం కొన్ని హోం రెమెడీస్ ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి ఖరీదైనవి కావు. ఎకోఫ్రెండ్లీ తత్వం కలిగి ఈ కీటకాలను ఎఫెక్టివ్ గా నాశనం చేస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం...


1. ఎగ్ సెల్స్: బల్లులు ఎగ్ స్మెల్ కు ఆ చుట్టుపక్కలకు రాకుండా ఉంటాయి . కాబట్టి డోర్ దగ్గర్లో మరియు గోడల మీద మూలల్లో అక్కడక్కడ ఎగ్ సెల్ ను ఉంచండి . ఇవి ఇంట్లోకి రాకుండా తిరగకుండా ఎగ్ స్మెవ్ వాటిని కట్టడి చేస్తుంది.


2. వెల్లుల్లి: వెల్లుల్లి కూడా క్రిమినాశక పదార్థమే. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వాటిని రాకుండా చేస్తుంది. ముఖ్యంగా గార్లిక్ జ్యూస్ ను స్ప్రే బాటిల్లో వేసి ఇట్లో అప్పుడప్పుడ స్ప్రే చేస్తుండాలి . ఇలా చేయడం వల్ల బొద్దికలు మరియు బల్లులు ఇంటి చాయలకు రాకుండా ఉంటాయి.


3. కాఫీ బాల్స్ మరియు టుబాకో పౌడర్: కాఫీ పౌడర్ మరియు టుబాకో పౌడర్ ను మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసే అగ్గిపుల్ల లేదా టూత్ స్టిక్ కు గుచ్చి ఇంట్లో అక్కడక్కడ చెక్కిపెట్టాలి . వీటిని కప్ బోడ్స్ మరియు బల్లులు తిరిగే ప్రదేశంలోఉంచితే బల్లులనేవి కనబడవు .


4. ఉల్లిపాయలు: ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన బొద్దికలను, బల్లులను నివారిస్తుంది . ఉల్లిపాయను జ్యూస్ చేసి స్ప్రే బాటిల్లో పోసి ఇంట్లో స్ప్రే చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే క్రిమికీటకాలు కనబడవు.

5.నాఫ్తలీన్ బాల్స్ : నాఫ్తలిన్ బాల్స్ బల్లుల్లను చుట్టు ఇంట్లో తిరగనివ్వకుండా చేస్తాయి . వీటిని కిచెన్ సెల్ఫ్స్ మరియు కప్ బోర్డ్స్ లో ఉంచుకోవచ్చు .

6. కాఫీ గింజలు: బొద్దికలను నివారించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి . కాఫీ విత్తనాలను కొన్నింటిని చిన్న చిన్న గిన్నెల్లో వేసి అక్కడక్కడా ఉంచాలి . దాంతో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో బొద్దింకలు చేరకుండా ఉంటాయి.

7. బోరాక్స్ అండ్ షుగర్: మరో అమేజింగ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ బోరాక్స్ మూడు బాగాలు తీసుకొని అందులో ఒక బాగం షుగర్ మిక్స్ చేయాలి .బొద్దింకలున్న ప్రదేశంలో వీటిని ఉంచడం ద్వారా బొద్దింకలు నివారించబడుతాయి . కొన్ని గంటల్లోనే బొద్దింకలను దూరం చేస్తాయి.

8. బేకింగ్ సోడా మరియు షుగర్ : బోరాక్స్ ఉపయోగించడం మీకు సురక్షితం కాదు అనిపిస్తే, బేకింగ్ సోడా మరియు షుగర్ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు, ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి అక్కడక్కడ చిలకరించుకోవాలి . వీటిని బొద్దికలు తినడం వల్ల అవి చనిపోతాయి.

9. ఫ్యాబ్రిక్ సాప్ట్నర్స్ : ఈ స్ప్రేలో మూడు ఫ్యాబ్రిక్స్ , రెండు బాగాలు నీళ్ళు మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను బొద్దింకల మీద చల్లడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

10. అమ్మోనియా మరియు వాటర్: అమ్మోనియం వాటర్ తో తరచూ ఇల్లు శుభ్రం చేస్తుంటే బొద్దింకలు, మరియు బల్లుల బెడదను నివారించుకోవచ్చు . రెండు కప్పులు అమ్మోనియంను ఒక బకెట్ వాటర్ లో మిక్స్ చేసి ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏమవుతుంది?

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది రోజూ ఉదయం మనం తీసుకునే 'బ్రేక్ ఫాస్టే'! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్ఫాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంత మందికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికే టైముండదు. 

మరికొందరైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ద పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్ పాస్ట్ తీసుకోకపోవడం వల్ల కలిగే లాభాలేంటి ? చేయకపోతే వచ్చే నష్టాలేంటో? తెలుసుకుందాం...

బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా ఎందుకు తినాలి? మనం రెగ్యులర్ గా రోజూ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోసకవిలువలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. 



బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. కాబట్టి మనం ఏ పని మీదైనా పూర్తిగా శ్రద్ద పెట్టొచ్చు . అదే బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఆకలితో చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ బరువును అదుపులో పెట్టుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. 

బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా అందుతాయి .

శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంతో అవసరం. ఎందుకంటే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల మధ్యహ్నానం భోజం తక్కువగా తీసుకుంటాం. దాంతో శరీర బరువు కంట్రోల్లో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే,మధ్యహ్నాన భోజనంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జ్ఝాపకశక్తి పెరుగుతుంది. చేసే పనిమీద కాన్సంట్రేట్ చేయొచ్చు.

నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. తిరిగి వేగవంతంగా పుంజుకుంటాయి. ఈ ప్రక్రియల వల్ల శరీరంలో క్యాలరీలు కరుగుతాయి. బరువు అదుపులో ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే ఏం జరగుతుంది.?

బ్రేక్ ఫాస్ట్ తినడకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

మెదడు చురుగ్గా పనిచేయాలంటే..మెదడుకు మనం తీసుకునే ఆహారం నుంచి గ్లూకోజ్ అందాలి. అలాకాకుండా అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు . ఫలితంగా చేపే పనిపట్ల ఆసక్తి తగ్గుతుంది.

క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడంలాంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ కు కారణమవుతాయి. ఆహారం తీసుకొనే మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని ఓ సర్వేలో వెల్లడైంది.