Saturday, April 16, 2016

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఈజీ టిప్స్

మచ్చలు లేకుండా, వంక పెట్టడానికి వీలు లేని చర్మం ఉండాలనిఎ అ స్త్రీ కోరుకోదు?? ప్రకటనల్లో చూపించినట్లు మనందరికీ ఇలాంటి చర్మం ఉండటం అసాధ్యం.అలాంటి చర్మం సొంతమవుతుందన్నట్లు చూపించడం మార్కెటింగ్ గిమ్మిక్కు. కానీ అలాంటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు,అదీ ఇంట్లో దొరికే పదార్ధాలతో అంటే నమ్ముతారా??

మీరు చెయ్యాల్సిందల్లా సహజంగా లభిచే కొన్ని పదార్ధాలతో మాస్కులు చేసి మీ ముఖానికి క్రమం తప్పకుండా వేస్తూ ఉండటమే.వీటిని క్రమం తప్పకుండా వాడితే మీ చర్మానికి కేవలం మెరుపునివ్వడమే కాకుండా మచ్చలు లేని చర్మం కూడా మీ సొంతమవుతుంది.పెరుగు, కుంకుమ పువ్వు, నారింజ తొక్కల పొడి మొదలైన పదార్ధాలు మీ చర్మం మీద అధ్భుతాలు చేస్తాయి.వీటిని కొన్ని వారాలు వాడి మీ చర్మంలో కలిగే మార్పులని మీరే గమనించండి. ప్రకాశవంతమైన, మచ్చలు లేని చర్మం సొంతమవ్వడానికి ఏ యే పదార్ధాలు వాడాలో క్రింద ఇచ్చాము. చదివి కాంతి వంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.


  • పెరుగు: పెరుగులో ఉన్న లాక్టిక్ ఆసిడ్ బ్లీచింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది.పెరుగుని మీ ముఖం మీద మృదువుగా రుద్ది తరువాత వెచ్చటి నీటితో కడిగితే చర్మానికి తేమ అంది ప్రకాశవంతమవుతుంది.


  • కుంకుమ పువ్వు: అతి ఖరీదైన సుగంధ ద్రవ్యమైన కుంకుమ పువ్వుకి చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది.పాలల్లో కాసిని కుంకుమ పూ రెక్కలు వేసి దానిని ముఖానికి పట్టించి ఆరాకా కడిగెయ్యాలి. ముఖం మీద మచ్చలు, గాట్లని తొలగించి చర్మాన్ని మెరిపించే గుణం ఈ సుగంధ ద్రవ్యం సొంతం.
  • నారింజ తొక్కల పొడి: మీ చర్మం సహజం గా మెరిసేటట్లు చేయడంలో నారింజ తొక్కలదే అగ్రస్థానం.ఒక స్పూన్ పెరుగులో ఎండబెట్టి పొడి చేసిన నారింజ తొక్కల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగితే మీకే తేడా తెలుస్తుంది.వారానికొకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలొస్తాయి.
  • బాదాం మరియూ పాలు:
    నల్లని చర్మపు చాయని మెరుగుపరచడానికి ఇది పురాతన కాలం నుండీ వస్తున్న చిట్కా.ఈ మాస్క్ నల్లటి మచ్చలనీ, నల్ల వలయాలనీ తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.బాదం పప్పులని నాబెట్టి పేస్టు చేసి దానికి కాస్త పాలు కలపండి. దీనిని ముఖమంతా పట్టించి ఆరాకా కడిగెయ్యాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలొస్తాయి.
  • టమాటా మరియూ కొత్తిమీర
    మాస్క్:చర్మ ఛాయని మెరుగుపరచడానికి ఈ ప్యాక్ అధ్భుతాలు చేస్తుంది.ఇది అన్ని రకాల చర్మాలకీ నప్పుతుంది.2 స్పూన్ల కొత్తిమీర రసానికి సమపాళ్ళలో టమాటా రసాన్ని కలిపి ముఖానికి పట్టించి ఆరాకా నీళ్ళతో కడగాలి.


టేస్టీ ఫాస్ట్ ఫుడ్ తో కలిగే.. డేంజరస్ డిసీజెస్.. !

ఫాస్ట్ ఫుడ్.. !! చిన్నా పెద్దా .. అందరినీ నోరూరించే పసందైన, కలర్ ఫుల్ ఫుడ్ ఇది. ఇది లేకుండా రోజు గడవదంటే ఆశ్చర్యం లేదు. చాలా త్వరగా ప్రేపర్ చేసి.. త్వరగా తినడానికి వీలయ్యే ఆహారమిది. ఫాస్ట్ ఫుడ్ ని ఎలాంటి పోషకాలు లేని ఆహారంగా, ఎక్కువ ఫ్యాట్, క్యాలరీలు ఉన్న ఫుడ్ గా చెప్పవచ్చు.



ఫాస్ట్ ఫుడ్స్ లో తక్కువ పోషక విలువలు, ఎక్కువ ఫ్యాట్, షుగర్, క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. స్నాక్ ఫుడ్స్, గమ్, క్యాండీ, స్వీట్ డిజర్ట్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ బివరేజెస్ వంటివన్నీ ఫాస్ట్ ఫుడ్స్ గా పరిగణిస్తారు. అలాగే పేస్ట్రీలు, సాండ్ విజ్ లు, బర్గర్స్, కబాబ్, పిజ్జా, సూప్స్, సలాడ్స్ ఇవన్నీ.. ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్సే. కానీ.. వీటినే ఎక్కువ ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. 


ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు టక్కున గుర్తొచ్చేది.. టేస్టీగా, సువాసనగా, కలర్ ఫుల్ గా ఉండే ఫాస్ట్ ఫుడ్సే. కానీ ఇంతకీ ఎట్రాక్ట్ చేసే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దుష్ర్పభావాలు ఎక్కువని.. అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..


  • ఒబేసిటీ : ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎక్కువగా వచ్చే సమస్య ఒబేసిటీ. అంటే.. శరీరంలో ఎక్కువగా ఫ్యాట్ చేరడం. అధిక బరువు ఉండటం, ఒబేసిటీ ఒకటి కాదు. తక్కువ మొత్తంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నా.. ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందడం వల్ల బరువు పెరుగుతారు.

  • గుండె సమస్యలు వారానికి నాలుగు సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లలో హార్ట్ డిసీజ్ లు వచ్చే ఛాన్స్ లు ఎక్కువ. వీటిల్లో ఎక్కువగా ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ డిసీజ్ లకు అవకాశాలు ఎక్కువ.

  • టైప్ 2 డయాబెటీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతుందట. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది.. అది డయాబెటిస్ ని డెవలప్ చేస్తుంది.
  • అల్సర్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. తీవ్రమైన నొప్పితో కూడిన ఎసిడిటీ ఏర్పడుతుంది. స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్.. కారణంగానే ఎక్కువ అల్సర్స్ వస్తున్నట్లు అధ్యయనాలు నిరూపించాయి. పిజ్జా, చిప్స్, సాల్టెడ్ స్నాక్స్ వంటివి అల్సర్లకి ప్రధాన కారణం.
  • ఆకలి తగ్గిపోతుంది మామూలు ఆహారాల మాదిరిగా కాకుండా.. ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే ఆకలి తగ్గిపోతుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, జీర్ణం కాకుండా.. ఫాయిజనస్ గా మారుతుంది.
  • పోషకాలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. కానీ.. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. ఎలాంటి పోషకాలు అందవు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
  • ఒత్తిడి ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల హార్ట్, బ్లడ్, లివర్ వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. అలాగే.. ఇది ఒత్తిడిని కూడా పెంచుతుంది. తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకునే వాళ్ల కంటే.. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకునే వాళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 





Friday, April 15, 2016

రామ..! మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు..

రామ..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే.. కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది ? 



రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.

భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిళ ఉంటుంది. మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, రామనామం శక్తి సామర్థ్యాలను శ్రీరామ నవమి సందర్భంగా తెలుసుకుందాం...

రామ నామం పుట్టుక తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మ అనేది జీవాక్షరం.


రామ నామం పుట్టుక అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు. అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ రెండు అక్షరాలు లేకపోతే.. ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది.

రాముడి కంటే రామనామం గొప్పది లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. అయితే.. రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి.. తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా.. తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది.

రాముడి కంటే రామనామం గొప్పది తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. కానీ.. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. రాముడు ఆశ్చర్యపోయాడు.

రాముడి కంటే రామనామం గొప్పది తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. అప్పుడు హనుమంతుడు.. రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా.. అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు.

రామనామం గొప్పదనం ఇలా రాముడి కంటే.. రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు.

రామ నామం అర్థం రామ అనే మంత్రంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. ర అంటే అగ్ని, అ అంటే సూర్యుడు, మ అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది.

రామ నామ జపం విశిష్టత రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది.

విష్ణుసహస్రనామం రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం లభిస్తుందట.

రామ నామ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి.. రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది.

శనీశ్వరుడినే జయించిన రామనామం పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. తాను రామనామ జపంలో ఉన్నానని... అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. రామనామ జపం పూర్తవలేదు. దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు.

సీతారాముల కళ్యాణము చూతము రారండి.....


తెలుగునాట సీతారామ కల్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, చైత్రశుక్ల పాడ్యమి ఉగాది నుంచి నవమి వరకు అంటే సీతారామకల్యాణం వరకు తెలుగు వారు పెళ్లిళ్లు చేసుకోరు. భద్రాచలంలోనూ, ఇతర దేవస్థానాల్లోనూ సీతారామ కల్యాణం అయిన తర్వాత ఆ కల్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించి, శిరస్సున ధరించి నవమి తర్వాత ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకుంటారు.  భారతీయ సంస్కృతిలో వయస్సులో పెద్దవారైన జంటను చూస్తే ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల తోనూ, యౌవనంలో ఉన్న జంటను సీతారాములతోనూ పోల్చడం పరిపాటి. ఎందుకంటే పురుషోత్తముడు అంటే రాముడే. ఆదర్శ నారీమణి అంటే సీతయే. భిన్న దృక్పథాలు కలిగిన ఇద్దరిని ఒక్కటి చేసి బంధాలను దృఢం చేసే సంస్కారానికే వివాహమని పేరు. ఈ జగత్తుకు కల్యాణ సంస్కృతిని నేర్పిన జంట సీతారాముల జంట. ఆదర్శవంతమైన జంట. ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగిన కల్యాణాన్ని ఈనాటికీ మనం శ్రీరామ నవమినాడు ఆచరిస్తున్నాం అంటే వారి కల్యాణానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.


మాధవుడు మానవుడుగా అవతరించాడు. అతీత మానవుడుగా కాదు. సామాన్య మానవుడుగా పంచభూతాల సమ్మేళనంతో రూపొందే శరీరంతో జన్మించాడు. అది పార్థివ దేహం. భూసంబంధమైన లక్షణాలన్నీ ఆ దేహానికీ ఉంటాయి. ఆకలిదప్పులూ, ఆనందాలూ, ఆవేదనలూ, కష్టాలూ, కన్నీళ్లూ, సుఖాలూ ఆనందభాష్పాలూ అన్నీ ఉంటాయి. ఈ ద్వంద్వాలన్నింటినీ అనుభవించాల్సిందే! శ్రీరాముడు అనే మానవుడుగా జన్మించిన భగవంతుడు అన్నింటినీ అనుభవించాడు. మానవుడుగానే మరణించాడు. సహజ మానవుడుగా, స్వచ్ఛ మానవుడుగా, సార్థక మానవుడుగా జీవించాడు. మానవ సహజంగానే తనువు చాలించాడు.
 
అయితే, మానవుడుగా పుట్టి, మానవుడుగా గిట్టిన శ్రీరాముడు ఇలమీద వేలుపు అయ్యాడు; ఇలవేలుపు అయ్యాడు! ఎందుకు? మానవుడుగా ఆయన గడిపింది ఆదర్శ జీవనం. ధర్మాధర్మ జీవనం. ధర్మం అనేది ఒక మహాశక్తి. విశాల విశ్వసృష్టి విన్యాసం ధర్మం మీదనే ఆధారపడి ఉందంటున్నాయి భారతీయ ధార్మిక దార్శనిక గ్రంథాలు ‘ధర్మం’ అంటే ఏమిటో మహాభారతం బహు చక్కగా చెప్పింది. ‘ఇతరులు ఏమి చేస్తే నీకు అప్రియాన్ని (కష్టాన్ని) కలిగిస్తుందో, దానిని ఇతరులకు నువ్వు చేయకుండా ఉండటమే ధర్మం’ అంటూ అరటిపండు ఒలిచినట్టు చెబుతుంది భారతం. సమస్త సృష్టికీ మూలాధారమైన ఆ ధర్మాన్ని - మనిషిగా పుట్టిన ప్రతివాడూ ఆచరిస్తూ జీవయాత్ర గడిపినందుకు శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన ఆలోచనా, అభివ్యక్తీకరణా, ఆచరణా ఒక్కటే! మనసు ఒకటీ, మాట ఒకటీ, చేత ఒకటీ కాదు.
 
మానవ జీవితంలో ఆచరించాల్సిన ధర్మసంబంధమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులను గౌరవించడం, తోడబుట్టినవాళ్లను ప్రేమించడం. తోటిమానవులను ఆదరించడం. నిస్సహాయులను ఆదుకోవడం. ఏకపత్నీవ్రతం పాటించడం. ముఖ్యంగా సర్వకాల సర్వ అవస్థలలోనూ సత్యాన్నే పలకడం. ‘సత్యం వద, ధర్మంచర’ అన్నాయి మన శాస్త్రాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీరాముడు కేవలం సత్యాన్నే పలికాడు. కేవలం ధర్మాన్నే ఆచరించాడు. ఆయన మాట మహాసత్యం. మనుగడ మహాధర్మం.

శ్రీమహావిష్ణువు ధర్మాన్ని ఉద్ధరించడానికి మాత్రమే కాదు, ఆచరించి చూపిస్తూ ధర్మాన్ని మానవజాతికి బోధించడానికి శ్రీరాముడుగా జన్మించాడు. ధర్మప్రవర్తననూ, సత్యవచన శిల్పాన్నీ మనిషికి నేర్పించడానికి జన్మించాడు. మనిషి మనీషిగా, పురుషుడు ఉత్తమపురుషుడుగా జీవించి తరించే విధానాన్ని విశదీకరించడానికి జన్మించాడు. ఆచరించి చూపిస్తూ ఆదర్శ పురుషుడుగా వెలుగొందాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు రామకథను మనకు బహూకరించిన వాల్మీకి మహాకవి. రూపం దాల్చిన ధర్మమే రాముడు అంటాడాయన. బాల్యంలో ధర్మం తప్పని బాలుడు ఆయన. యవ్వనంలో ధర్మం తప్పని యువకుడు. ధర్మం తప్పని వీరుడు. మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు అన్నిటా ఆదర్శప్రాయుడే. ఆయన ఆదర్శపుత్రుడు. ఆదర్శ సోదరుడు. ఆదర్శ యువరాజు. ఆదర్శ వనవాసి. ఆదర్శ వీరుడు. ఆదర్శ భర్త. ఆదర్శ పాలకుడు. సత్యధర్మాలు ప్రాతిపదికగా, ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగిన ఆయన పరిపాలన ఆదర్శపాలన అయింది. ఆయన రాజ్యం ‘రామరాజ్యం’ అయింది.
 
శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు అన్నది జగమెరిగిన సత్యం. తండ్రి మాట ఆయనకు వేదం. తండ్రి ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞతో సమానం. ప్రజారంజకమైన పరిపాలనలో కూడా ఆయనకు తండ్రి ఆదర్శం. ప్రవర్తన అయినా, పరిపాలన అయినా శ్రీరామచంద్రుడు తన పితృపితామహులనూ, సూర్యవంశ మూలపురుషులను ఆదర్శంగా స్వీకరించాడు. అయితే ఒక విషయంలో ఆ మూలపురుషులలో కొందరిని కానీ, దైవంగా భావించి ఆరాధించే తండ్రిని కానీ ఆదర్శంగా తీసుకోలేదు. అదే వివాహ విషయం. తనది సూర్యవంశం. సూర్యుడి తండ్రి కశ్యపుడు. ఆయనకు భార్యలు పదముగ్గురు! సాక్షాత్తూ తన తండ్రికి ముగ్గురు భార్యలు. కానీ శ్రీరామచంద్రుడు ఏకపత్నిని స్వీకరించి, బహుభార్యత్వాన్ని తిరస్కరించాడు. తను క్షత్రియుడు. క్షత్రియులు బహుభార్యత్వానికి అర్హులు. రాములవారి దృష్టిలో అది ధర్మం కాదు. ఆదర్శం కాదు. స్త్రీ ఒక పురుషుడికి సర్వాత్మనా అంకితమైనట్టే పురుషుడు కూడా సర్వాత్మనా తన స్త్రీకి అంకితమైపోవాలన్న సామాజికమైన ధర్మాన్ని ఆచరణలో చూపించాడు ఆయన. తాను అవతరించిన మానవ జాతి ఆదర్శ దాంపత్య ధర్మాన్ని పాటించాలన్న ఉదాత్త ఆశయం ఆయనది.
 
శ్రీరామపత్ని సీతమ్మ సతీ ధర్మం గురించి తెలియని వాళ్లుండరు. ‘భారత స్త్రీకి వివాహం అయ్యేదాకా భగవంతుడే భర్త. వివాహం అయ్యాక భర్తే భగవంతుడు’ అన్నారు ధర్మ కోవిదులు. రావణాసురుడికి గడ్డిపరక అడ్డుపెట్టి మాట్లాడి, పరపరుషుడిని తిరస్కరిస్తే, ఇటు ఆమె భర్త సౌందర్యానికి ప్రతిరూపంగా రూపం మార్చుకుని వచ్చిన శూర్పణఖను తిరస్కరించాడు.
 
సీతాదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి అగ్నిపరీక్ష పెట్టాడు రాముడు. రాముడికి తన పాతివ్రత్యం మీద ఉన్న అచంచల విశ్వాసాన్ని లోకానికి కళ్లకు కట్టడానికి అగ్నిప్రవేశం చేసిన మహా మహిళ సీతమ్మ. రాముడికి సీత ప్రాణం. సీతకు రాముడు ప్రాణం. ఒకరు సముద్రం. ఒకరు కెరటం. ఒకరు పుష్పం. ఒకరు సౌరభం. ఒకరు జ్యోతి. ఒకరు కాంతి. సీతారాములు ఒకరికొకరు ఆదర్శం. సీతారాముల దాంపత్యం మానవ దంపతులకు ఆదర్శం. పురుషుడు శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా, స్త్రీ సీతాసాధ్విని ఆదర్శంగా స్వీకరించడం శ్రేయోదాయకం.
 
రామయ్య సీతమ్మను స్వయంవరంలో గెలిచి వివాహం చేసుకున్నాడు. అన్నంత మాత్రాన ప్రేమ వివాహమో మరే ఇతర పద్ధతో కాదు. విశ్వామిత్రుని ఆదేశం ప్రకారమే శివధనుర్భంగం చేశాడు. ఆ తర్వాత కూడా తండ్రి అయిన దశరథుని ఆజ్ఞ అయితే సీతమ్మను స్వీకరించాడు. అంటే రామయ్యది పెద్దలు కుదిర్చిన వివాహమే. అలాగని, సీతమ్మను బలవంతాన ఇష్టపడలేదు.

ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభి వర్థత ॥
 
పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. ఇదీ ఆదర్శ దాంపత్యానికి ఉండాల్సిన లక్షణం. అందుకే యుగాలు గడిచినా సీతారాముల దాంపత్యం నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.  అంతకు ముందురోజున రామా! రేపే పట్టాభిషేకం, అందుకు తగిన నియమాలతో సిద్ధంగా ఉండమన్నారు పెద్దలు, కులగురువులు. ఆయన ఆ ఏర్పాట్లలో ఉండగానే పట్టాభిషేకం లేదు సరికదా... పద్నాలుగేళ్లపాటు అడవులకు వెళ్లాలని అన్నారు. రాముడు సరే అన్నాడు. సీతమ్మ కూడా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. భర్తను వెనక్కు లాగలేదు. రాముడు మాత్రం తండ్రి తనను ఒక్కడినే కదా అడవులకు వెళ్లమన్నది... క్రూరమృగాలు, విషసర్పాలు సంచరించే అడవులకు అతి సుకుమారి, సుందర కోమలాంగీ, ఎండ కన్నెరుగని రాజకుమారి అయిన సీత తనతోబాటు ఎందుకు కష్టాలు పడాలి... ఆమె అయోధ్యలోనే ఉండి, రాణివాస స్త్రీగా భోగాలనుభవించవచ్చు లేదా పుట్టింటిలో హాయిగా కాలక్షేపం చేయవచ్చు అనుకున్నాడు. అదే మాట  ఆమెతో చెప్పాడు. కానీ సీత అందుకు అంగీకరించలేదు. భర్త సామీప్యం లేని సిరిసంపదలు తనకు అక్కరలేదంది. భర్తను వెన్నంటి ఉండటమే భాగ్యం అనుకుంది.  సంసారాన్ని ఈదడానికి నేనొక్కడినే కష్టపడుతున్నాను, భార్య హాయిగా ఇంట్లో తిని కూర్చుంటోంది అని వాపోయే నేటికాలపు పురుషులు ఈ విషయంలో రాముడి నుంచి నేర్చుకోవాలి. అలాగే అత్తగారికి, తనకు లేదా మామగారికి తనకు మధ్య ఏవైనా గొడవలు వచ్చినప్పుడు భర్త తన తరఫున మాట్లాడకుండా వారిని వెనకేసుకుని వచ్చినందుకు మూతివిరిచే భార్యలకు సీతమ్మ వారు ఆదర్శం కాదా!
 
అశోకవనంలో ఉన్న సీత మ్మతో హనుమంతుడు తన భుజంపై కూర్చోబెట్టుకుని రాముని వద్దకు చేరుస్తానంటాడు. అప్పుడు సీతమ్మ- హనుమా! నీవు ఉత్తముడివే. కానీ పురుషుణ్ణి తాకన నే నియమం కలదాన్ని. అదేకాదు, నీవు నన్ను తీసుకొని వెళ్లిపోతే, తన భార్యను వేరే వారెవరో ఎత్తుకుని వెళితే, మరొకరితో ఆమెను తన వద్దకు తెప్పించుకున్నాడు పిరికివాడైన రాముడు అని నా నాథుణ్ణి లోకులు ఎగతాళి చేయరా? అదీగాక నాలాగే ఈ దుష్టుడి చెరలో ఉన్న ఇతర స్త్రీలకు కూడా విముక్తి లభించాలి కదా! అందుకే నా రాముణ్ణే రానివ్వు... ఆయన శూరత్వాన్ని లోకానికి చాటనివ్వు-  అంటుంది సీతమ్మ. అది చాలదా? సీతమ్మకు తన భర్త వీరత్వం మీద ఎంత నమ్మకమున్నదో తెలుసుకోవడానికి!

Thursday, April 14, 2016

మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తున్నారా..?

ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం చాలా మంచి అలవాటు. మన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించిన 'హిస్టరీ' ఇంకా 'కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే 'ప్రైవేట్ బ్రౌజింగ్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. గూగుల్ క్రౌమ్ బ్రౌజర్ నుంచి మీ బ్రౌజింగ్ హిస్టరీని సెకన్ల వ్యవధిలో తొలిగించేందుకు ముఖ్యమైన చిట్కాలు....

స్టెప్ - 1 ముందుగా గూగుల్ క్రౌమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.



స్టెప్ - 2 బ్రౌజర్ పేజ్ టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ పై క్లిక్ చేయండి.



స్టెప్ - 3 మెనూలోని టూల్స్ పై క్లిక్ చేయండి. Clear Browsing Data ఆప్షన్ పై క్లిక్ చేయండి.



స్టెప్ - 4 బ్రౌజింగ్ డేటాకు సంబంధించి వివిధ చెక్ బాక్సులతో కూడిన ప్రత్యేకమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.



స్టెప్ - 5 వాటిలో కావల్సిన చెక్ బాక్సుల పై టిక్ చేసి Clear Browsing Data ఆప్షన్ పై క్లిక్ చేయండి.


స్టెప్ - 6 మీ బ్రౌజింగ్ డేటాను manualగా కూడా డిలీట్ చేసుకోవచ్చు.

బేండీ వాటర్ అంధించే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్



బేండకాయను హిందీలో బేండీ, ఇంగ్లీష్ లో ఓక్రా అని పిలుస్తారు. బెండకాయకు వివిధ రకాలుగా పిలవడం మాత్రమే కాదు, వివిధ రకాల ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి . మరి ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్లో డిప్ చేసి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరతాయి..?చూద్దాం.. మూడు, నాలుగు కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆనేటిని పరగడుపు త్రాగాలి. మరి ఇది డయాబెటిస్, కొలెస్ట్రాలో మరియు కిడ్నీ సమస్యలను నయం చేస్తుందా అంటే ? మీరు ఒక సారి ట్రై చేసి చూడడంటి ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది.

మీరు వంటల్లో జోడించినా, ఉడికించినా....

లేదా ఫ్రై చేసిన లేదా పచ్చివి అలాగే తిన్నా కూడా న్యూట్రీషియన్స్ అందుతాయి. కానీ...ఈ బేండీ వాటర్ తాగిచూడండి. చాలా మంది అనుభజ్ఝులతో పాటు, ఆరోగ్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. బేండీ వాటర్ త్రాగడం వల్ల కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలను ..ఇంకా ఆస్త్మా సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు . మరియు ఇది ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

  • బెండకాయలోని హై ఫైబర్ కంటెంట్ వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ట్రాక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ బేండి వాటర్ త్రాగడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపుబ్బరం మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • బేండీ వాటర్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ప్రేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా చేరుతుంది . బెండకాలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
  • బెండకాయను పచ్చిగా తిన్నా లేదా ఉడికించి తిన్నా, లేదా నీటిలో నానబెట్టి ఆనీటి ఉదయాన్నే పరగడుపున త్రాగినా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
  • బెండకాయలో విటమిన్ ఎ, లూటిన్ , క్సాంథిన్ మరియు బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
  • బెండకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. బాడీలోని ఎక్సెక్స్ క్యాలరీలు కరుగుతాయి . ఇందులో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
  • బెండకాయలో శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. బెండకాయను తినడం ఇష్టం లేకపోతే బెండకాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి, ఆనీటితో త్రాగొచ్చు.
  • పుర్వకాలం నుండి బెండకాయను వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఐబిఎస్ ను నివారిస్తుంది మరియు అల్సర్ ను నివారిస్తుంది . మరియు లాక్సేటివ్ కోసం కూడా దీన్ని ఉపయోగించుకోచ్చు.


Wednesday, April 13, 2016

అరటిపండ్లు, కోడి గుడ్లను మెక్కల పెంపకానికి ఉపయోగించండి.

అరటిపండులో ఎన్నోపోషకాలున్నాయి అలాగే సెమీనాన్వెజ్ గా పీలవబడే కోడి గుడ్డులోనూ పుష్కలంగా పోషక విలువలున్నాయి. అయితే బాగా పండిన అరటి పండునో,పాడైన కోడిగుడ్డునో ఏం చేస్తారు?? ఏం చేస్తాం పడేస్తాం అంటారా..! సరే పడేయండి అయితే బయట కాదు మొక్కల దగ్గర పడేయండి. మొక్కలకీ పోషకాలౌ అందాలి కదా…! అదెంటలా చూస్తారు, నమ్మకం లేదా? నిజమండీ బాబూ గులాబీ మొక్కలు పెంచే వాళ్ళు కోడిగుడ్డు పెంకులని వేయటం ఎప్పుడూ చూడలేదా ఏమిటీ? ఇదీ అలాగే నట. గుంతలు తవ్వడం, నీరు పోయడం ఎవరైనా శ్రద్ధతో చేస్తారు. 

కాకపోతే ఎరువుల విషయానికి వస్తేనే ఎటూ తేల్చుకోలేరు.ఓ వ్యక్తి అర టిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించి అద్భుతం చేశాడు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడడంతో ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇందు కోసం అతను ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. మొక్కలను పెంచాలంటే మూడు అంశాలను ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. అవి చక్కని మట్టిలో గుంతలు తవ్వడం, సరైన ఎరువులు వాడడం, తగిన సమయానికి నీరు పోయడం తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొక్కలు కాస్తా ఎండుపుల్లలైపోతాయ్ మరి…

అయితే డబ్బులు వెచ్చించి కృత్రిమ ఎరువులను వాడేందుకు ప్రస్తుతం ఎవరూ ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో మొక్కల పెంపకం కోసం సేంద్రీయ ఎరువుల వాడాల్సిన అవసరం వచ్చింది. అయితే మిగతా సేంద్రీయ ఎరువుల కన్నా అరటి పండ్లు, కోడిగుడ్లు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా ఎరువులా వాడుకోవచ్చు.అంతే కాకుండా మిగిలి పోయిన పాడైన అరటిపండ్లను కూడా వాడొచ్చుట.. 

సాధారణంగా మొక్కలకు సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం వంటి వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా అదే తరహా పోషకాలను మొక్కలకు అందిస్తాయి.అయితే వాటిని వాడాలంటే గుంతను కనీసం 10 నుంచి 12 ఇంచుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. బాగా పండిన అరటిపండ్లు, గడువు ముగిసిన కోడిగుడ్లను కూడా ఈ పద్ధతి కోసం ఉపయోగించవచ్చు.

ఒక మొక్కకు ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు చొప్పున ఉంచాల్సి ఉంటుంది. అయితే వీటిని గుంతలో పక్క పక్కనే యథాతథంగా ఉంచాలి కోడిగుడ్డుని పగలకొట్టటం గానీ అరటిపండుని గుజ్జుగా చేయటం గానీ చేయాల్సిన అవసరం లేదు.తర్వాత గుంతను సగానికి మట్టితో నింపాలి. మిగిలిన భాగంలో మొక్క వేర్లు వచ్చేలా పెట్టి మొత్తం గుంతను పూడ్చేయాలి. మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు కూడా పెరుగుతాయి. అయితే మొక్క వేర్లకు, దాని కింద ఉంచిన పదార్థాలకు దాదాపు 4,5 ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు ఆ గ్యాప్‌ను భర్తీ చేసి చివరిగా కింద ఉంచిన పదార్థాలను చేరుకుంటాయి. ఆ సమయంలో ఆ పదార్థాలు అధిక స్థాయిలో పోషకాలను విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో వేర్ల ద్వారా ఆ పోషకాలలోని శక్తి మొక్కకు చేరి మొక్క ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది…. .

Tuesday, April 12, 2016

ఆర్థికమాంద్య సమయంలో కలిగే ఒత్తిడిని తగ్గించే మార్గాలు


  • ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి కొన్ని ప్రణాళికలు అవసరముంటాయి.
  • కొన్ని కారకాలు అధిక ఒత్తిడిని నియంత్రంచలేవు.
  • నిరుత్సాహం చెందకుండా, మీపై మీరే పెత్తనం చేలాయించుకోవడానికి ప్రయత్నించండి.
  • ఆర్థిక క్షీణత, ఆర్ధిక విజృంభణలను అనుసరిస్తుంది.

ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి, కొన్ని ప్రణాళికలు అవసరమవుతాయి, వీటిని దూరదృష్టి మరియు క్రమశిక్షణల ఆధారంగా తయారు చేసుకోవాలి. ఆర్థిక మాంద్యం కొత్త విషయమేం కాదు. మాంద్యం అనేది గురుత్వాకర్షణ సూత్రం వంటిది, ఇందులో ఏది పైకి వెళితే, అది మళ్ళి కిందకి రావడాన్ని సూచిస్తుంది. 1929 సంవత్సరంలో ఆర్థిక నిస్పృహ కూడా ఏర్పడడం జరిగింది. కానీ, చివరి సమయం వరకు ఏ ఒక్కరూ ఆశను కోల్పోకుండా, శాంతంగా ఉన్నారు.

ఈ పరిస్థితి చాలా సమయం వరకు కొనసాగుతూనే ఉంటుంది
మాంద్యం మీ పై ఏవిధంగా ప్రభావం చూపింది లేదా చూపబోతుందని దీర్ఘాలోచనలు చేయకూడదు. కొన్ని విషయాలు మరియు కారకాలు ఒత్తిడిని నియంత్రించలేవు. మీ జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, బహుశా ఇప్పటికే ఈ విషయాల పట్ల మీరు చాలా ఒత్తిడికి లోనై ఉంటారు. మీపై మీరు పెత్తనం చేలాయించుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మీరు నిరుత్సహతకు లోనుకాలేరు మరియు చివరి వరకు సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఆర్థిక క్షీణత, ఆర్ధిక విజృంభణ మరియు సమృద్ధిలను అనుసరిస్తుంది.

ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి
బడ్జెట్ చాలా కఠినంగా ఉన్నట్లయితే వ్యాయామశాలకు వెళ్ళడం అనేది అంత ప్రధానం కాకపోవచ్చు మరియు వెళ్ళకూడదు. శారీరక దృఢత్వం మరియు వ్యాయామంలను మనం ఎక్కడైనా/ ఎప్పుడైనా పొందవచ్చు. కానీ, ఆర్థిక అస్థిరతను సంతులనం చేసే సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించే విషయంపై డబ్బును మరియు సమయాన్ని పెట్టుబడిగా పెట్టకూడదు.

నడక లేదా పరిగెత్తడం వంటి వ్యాయామాలను ప్రారంభించడం అనేవి మెదడుని శాంతపరచడానికి ఒక మంచి మార్గం మరియు ఇది మిమ్మల్ని ప్రకృతితో సన్నిహిత పరుస్తుంది. నిజానికి, బరువులెత్తడం మీ ప్రధాన వ్యాయామం అయితే, ఒక జత డంబెల్స్ లేదా బార్ బెల్స్ ను కొనుగోలు చేయడం అనేది ఒక మంచి ఆలోచనగా నిరుపించుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం.

నిరుత్సాహం పై పోరాడండి
మిమ్మల్ని ఆందోళనలకు గురి చేసే పరిస్థితులు మీ ధరిచేరకుండా ఉండడానికి ప్రయత్నించండి అటువంటి పరిస్థితులలో ఒత్తిడికి లోనుకావడం చాలా సహజం. నిజానికి ఒత్తిడిని కలిగి ఉండడం వలన ఒత్తిడి, నిరాశ మరియు ఆతురత వంటి విషవలయాలను ఎదుర్కోవడానికి ఎలాంటి సహాయం పొందలేము. అధిక ఒత్తిడి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాన్ని మరింత కఠినతరం చేస్తుంది మరియు మిమ్మల్ని మరింత కిందకి లాగేయవచ్చు. యోగా మరియు ధ్యానంలను సాధన చేస్తూ మీ దినచర్యను ప్రారంభించడానికి ప్రయత్నించకండి.

మీ కలలను వెంటాడండి
ఉద్యోగం కోల్పోవడం అనేది భయానక విషయం, కానీ ఈ సమయంలో మీ జీవితంలో కొత్త విషయాలు చేయడానికి ప్రయత్నించండి. డ్రమ్స్ లేదా గిటార్ వంటి సంగీత పరికరాలను వాయించడం నచ్చుతుందా ప్రతిగా మీ ట్రాక్స్ ని వాల్ స్ట్రీట్ లో ప్రదర్శించాలి అనుకుంటున్నారా? అవును అయితే, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ సమయం సరైనది. మీ ప్రదర్శనను చూడటానికి చివరి వరకు ప్రజలు వారి వెన్నుముకను గోడలకు ఆనించి మరియు ఏమీ కోల్పోకుండా మీ ద్వారా ఆనందం పొందడం అనేది చాలా అద్భుతమైన విషయం.

పుదిన వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు

సమ్మర్ అంటేనే వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బయటకు వెళ్లకపోయినా.. ఆ వేడి శెగ తగులుతూనే ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎండాకాలంలో ఉంటుంది. ఎండతోపాటు, వేడిగాలులు.. మనుషుల్లో ఎనర్జీ కోల్పోయేలా చేస్తుంది. రోజూ చెమట, ఎండతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. కానీ సమ్మర్ లో ఫ్రెష్ గా, తాజాగా ఉండాలని కోరుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ అది సాధ్యంకాని పని అనుకుంటారు. అయితే.. చిన్న చిటుకు మిమ్మల్ని రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉండేలా సహాయపడుతుంది. ఘుమఘుమవాసన కలిగిన పుదీన సమ్మర్ లో చల్లచల్లగా ఉండేలా చేస్తుంది. సలాడ్స్, డ్రింక్స్ లో పుదీనను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే సమ్మర్ లో ఎదురయ్యే అనేక అనారోగ్య సమస్యలను.. పుదీన ద్వారా పరిష్కరించుకోవచ్చు.

ఒక గాజు జార్ తీసుకుని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, దోసకాయ లేదా వాటర్ మిలాన్ ముక్కలు, కొద్దిగా అల్లం తురుము కలుపుకుని.. మింట్ వాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి.. చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఈ జార్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సమ్మర్ లో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

జీర్ణక్రియ సమ్మర్ లో జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. దీనికి చక్కటి పరిష్కారం పుదినా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్టలో జీర్ణసమస్యలను నివారిస్తుంది.

వికారం సమ్మర్ లో మింట్ వాటర్ తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు సమ్మర్ లో తప్పనిసరిగా ఈ నీటిని తీసుకోవడం వల్ల.. మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడవచ్చు.

యాక్నె సమ్మర్ లో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చర్మం నిర్జీవంగా మారిపోతుంది. మొటిమలు, యాక్నె సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా మింట్ వాటర్ తీసుకుంటూ ఉండటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే. అలాగే చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

ఆస్త్మా ఆస్తమా పేషంట్స్ కి పుదిన న్యాచురల్ రిలాక్సేషన్ ని ఇస్తుంది. ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి అయినా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

రుతుక్రమ సమస్యలు సమ్మర్ వచ్చిందంటే అమ్మాయిల సమస్యలు అంతా ఇంతా కాదు. రుతుక్రమం సమయంలో.. కడుపునొప్పి, బ్లీడింగ్ కారణంగా చాలా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువ మోతాదులో మింట్ వాటర్ తీసుకోవడం వల్ల.. రుతుక్రమం సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఇమ్యునిటీ సమ్మర్ వచ్చిందంటే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ జ్యూస్ లు, కూల్ డ్రింగ్స్ తీసుకోవడం వల్ల మరిన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వేధిస్తాయి, ఉదయాన్నే ఒక గ్లాస్ మింట్ వాటర్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఒత్తిడి, డిప్రెషన్ పుదినా మీ మూడ్ ని మార్చేసి, యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి.. నీటిని వేడి చేసి.. అందులో పుదినా ఆకులు వేసి తాగాలి. ఇలా రెగ్యులర్ గా ఈ నీటిని తీసుకుంటే.. ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి బరువు తగ్గడానికి సమ్మర్ మంచి సీజన్. ఒకవేళ పుదినా వాటర్ మీరు సమ్మర్ లో తీసుకుంటే.. బరువు తగ్గడం మరింత తేలికైన పని. పుదిన తీసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలోని ప్రొటీన్స్ ని శరీరానికి అందించి.. ఫ్యాట్స్ ని ఎనర్జీగా మార్చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గడం చాలా సులువవుతుంది.

పంటి ఆరోగ్యానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటర్ గుణాలు కలిగి ఉన్న పుదినా తీసుకోవడం వల్ల చిగుళ్లు, పంటి సమస్యలు తగ్గిపోతాయి. మింట్ వాటర్ తీసుకోవడం వల్ల తాజా శ్వాసతోపాటు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

జ్వరం సమ్మర్ లో రకరకాల అలర్జీలతో సతమతమవుతుంటే.. మింట్ వాటర్ మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. పుదినా తీసుకోవడం వల్ల.. సీజనల్ అలర్జీలు, జ్వరం తగ్గిస్తుంది.

Monday, April 11, 2016

క్లియర్ స్కిన్ పొందడానికి వేప చేసే అద్భుతాలు..

వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిలో ఉండే యాంటిసెప్టిక్‌ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.

ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేపతో తయారుచేసిన సౌందర్యసాధనాలు కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి.

1. వేపఆకులు-గంధం: ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు వేపాకులను ఆ నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ఫ్రిజ్‌లో భద్రపరచు కోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఫ్రిజ్‌లో భద్రపరచిన వేపాకు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి అద్దుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే, ముఖంలో జిడ్డుతత్వంపోయి, ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అలాగే వేపాకు పేస్ట్ కు కొద్దిగా గంధం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొలగిపోతాయి .


2. వేప ఆకుల పేస్ట్- శెనగపిండి: కొన్ని వేపా ఆకులను వేడినీటిలో ఉడికించి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి, దీనికి కొద్దిగా శెనగపిండి మిక్స్ చేసి ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా టీనేజ్ స్కిన్ ప్రాబ్లెమ్స్ నివారించుకోవచ్చు. చర్మంలో దురద, ఎరుపుదనం, మొటిమలు, మచ్చలను తొలగిపోయేలా చేస్తుంది.


3. వేప మరియు తేనె: క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వేప మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతాయి. వేపాకు పొడిని తేనెతో మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు ఈ ఫేస్ ప్యాక్ టీనేజర్స్ కు చాలా ముఖ్యం మరియు అవసరం.


4. నీమ్ మరియు బొప్పాయి: వేప మరియు బొప్పాయి కాంబినేషన్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ టోన్ అందిస్తుంది . కొద్దిగా వేప పౌడర్ తీసుకొని అందులో బొప్పాయి గుజ్జు మిక్స్ చేసి , చర్మానికి అప్లై చేయాలి . కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందివ్వవచ్చు.


5. నీమ్ మరియు టమోటో: ఈ రెండింటి కాంబినేషన్ వల్ల చర్మం ఫ్రెష్ గా మరియు హైడ్రేషన్లో ఉంటుంది. వేప పౌడర్ కు కొద్దిగా టమోటో గుజ్జు మిక్స్ చేసి , చర్మానికి అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది మొటిమలను మాయం చేసి, మంచి గ్లోను అందిస్తుంది.


6. వేప, నిమ్మ మరియు రోజ్ వాటర్: ఇది మరొక హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఇది ముఖంలో మెటిమలు, మచ్చలు పూర్తిగా తొలగించి ముఖంలో కొంత కాంతులను ఏర్పరుస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే రెండు రోజుల్లో మీ ముఖంలో మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.

Sunday, April 10, 2016

సమ్మర్ సెలవులు లేదా వేసవి హాలిడేస్...

ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి.
 


‘ఏమండీ... ఈ ఎల్లో సరిపోతుందా’ అంది మా ఆవిడ నా దగ్గరకు వచ్చి కలిపిన శనగపిండిని చూపిస్తూ. ఆమెనే ఆరాధనగా చూశాను. ఎవరైనా ఉప్పు సరిపోయిందా పచ్చి మిర్చి సరిపోయిందా అని అడుగుతారు. ఎల్లో సరిపోయిందా అని అడగడం ఏ భర్తకైనా అరుదుగా దొరికే ఆనందబాష్పకణం. ‘ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు పెట్టుకున్నావ్ చెప్పూ’ అన్నాను. ‘అదేమిటండీ... పిల్లలకు సెలవులు కదా. ఆడుకుంటున్నారు. కాసేపటికి సాయంత్రమవుతుంది. చిరుతిండి ఏదైనా అడిగితే ఏం పెట్టను? అందుకని మసాలా వడలు చేద్దామనుకుంటున్నాను. ఏడో క్లాస్‌లో ఒకసారి అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అప్పుడు తను పొయ్యి మీద బాండిల్ పెట్టి వీటిని చేసిన గుర్తు’...
 
‘చేశాక నాకు పెట్టవు కదూ. దొంగ... చెప్పు... పెట్టవు కదూ’... ‘భలేవారే. మొదటి వడ మీరే తినాలి. ఈ హార్లిక్స్ సీసా ఎక్కడుందో’ ‘ఏమిటి... పిండిలో హార్లిక్స్ కలుపుతావా?’ ‘భలేవారే. నాకు ఆ మాత్రం తెలియదా. అందులో సోడా ఉప్పు దాచేనండీ’... కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే అలాంటి లలితమైన సౌండ్లు మా చిన్నాడే చేస్తాడు. పరిగెత్తుకుంటూ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాను. ల్యాప్‌టాప్‌లో నుంచి తేలికపాటి పొగ వస్తోంది. వాడు విజయం సాధించినట్టుగా గంభీరంగా నవ్వుతున్నాడు. పెద్దాడు బిక్కముఖం వేసుకొని చూస్తున్నాడు.
 
ఫ్లాష్‌కట్: ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘మోటూ పత్లూ’ పెద్దాడు చూస్తున్నాడు. కాదు ‘షౌన్ ద షీప్’ చూడాలని చిన్నాడు ముచ్చటపడ్డాడు. పెద్దాడు వినలేదు. చిన్నాడు ఎర్రగడ్డలో కొన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాట్ తీసుకొని ల్యాప్‌టాప్ మీద పట్టుదలగా ‘పుటుక్’మని కొట్టాడు. యూకు ట్యూబ్ పోయింది. నా సెన్సెక్స్ పతనమయ్యింది. మా ఆవిడ ఏం అనలేదు. నా వైపు చూసి ‘అప్పుడే చెప్పాను. అనుభవించండి’ అంది. ‘ఏదో నా తప్పులా మాట్లాడుతున్నావ్?’
 

‘మీ తప్పు కాదా. పెద్దాణ్ణి చూడండి ఎంత బుద్ధిగా ఉంటాడో! ఎందుకు?.. వాడి కాన్పు మా పుట్టింట్లో అయ్యింది కాబట్టి. రెండో కాన్పు కూడా మా పుట్టింట్లోనే చేద్దామండీ పిల్లలు బుద్ధిగా ఉంటారంటే విన్నారా? ఊహూ.. మా ఊళ్లో మా ఫ్యామిలీ డాక్టర్ భానుకట్ల విజయతోనే చేయించాలన్నారు. ఇప్పుడేమైంది? విజయ్ మాల్యాలాగా తయారయ్యాడు. మీ ఇళ్లల్లో పిల్లలంతా అంతేగా... కింగ్‌కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’
 
‘శారదా’... ‘శంకర్ శాస్త్రీ’... ఆ అరుపుకు బిక్క చచ్చాను. ‘ఏం... మీకేనా గొంతు. మాకు లేదా. మేం మాత్రం మిరియాల పాలు తాగడం లేదా. మీరు ఎంత పెద్దగా అరిచినా వాస్తవం వాస్తవమే. మీ అన్నయ్య పిల్లలు,  చెల్లెలి పిల్లలు, తమ్ముడి పిల్లలు... హవ్వ.. హవ్వ... దేశీయ స్టెంట్ కంపెనీలన్నీ మీ పేరు చెప్పుకునే కదండీ బతుకుతున్నాయి. వీళ్ల అల్లరికే కదా మీ ఊళ్లో నిక్షేపంలా ఉన్నవాళ్లంతా గుండెకి ఒక స్టెంటు రెండు స్టెంట్లూ వేసుకొని తిరుగుతున్నారు.’... లాభం లేదు ఎదురుదాడి చేయాల్సిందే.‘ఆ మాటకొస్తే మీవాళ్ల పిల్లలు మాత్రం తక్కువా? మొన్న మీ ఊరి పేరు పేపర్లో వేశారు చూళ్లేదా? మీ ఊళ్లోకి ఒక్క కోతి కూడా రావడం లేదని విడ్డూరంగా రాశారు. మీ కొండముచ్చులుండగా కోతులెందుకొస్తాయ్? వాటి సేఫ్టీ అవి చూసుకోవూ’ ‘మాటలు నేర్చిన యాంకర్ వాట్సప్ అంటే థమ్సప్ అదంట. అలా ఉంది మీరు మాట్లాడటం’
 
‘ఖుదా మెహర్బాన్‌తో గధా పహిల్వాన్.. అలా ఉంది నువ్వు చెప్పడం’... ‘నాకు హిందీ రాదని ఆ భాషలో వాగకండి’.. ‘ఇంకా వాగుతాను. పోవే ఖాందన్.. ఘరోండా... జ్యోతీ బనేగీ జ్వాలా.. ఖూన్ కా రిష్తా’.... అవన్నీ ఏవో భారీ బూతు తిట్లు అనుకుని చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలని మా ఆవిడ ఆ ఏర్పాట్లలోకి వెళ్లింది. ఈలోపు హాల్లో నుంచి మళ్లీ ఏవో మృదువైన శబ్దాలు రావడం మొదలెట్టాయి. పరిగెత్తి చూశాను. వంశాంకురాలిద్దరూ టీవీ దగ్గర ఉన్నారు. స్టార్ మూవీస్ చూడాలని పెద్దాడు.. డిస్నీ ఎక్స్‌డి చూడాలని చిన్నాడు... సున్నితమైన చర్యలతో ఒకరి పై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అమీర్‌పేట సర్దార్‌జీ షాపులో కొన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ చిన్నాడి చేతిలో సిద్ధంగా ఉంది... ‘శారదా’ పెద్దగా అరిచాను. ‘శంకరశాస్త్రి’... మా ఆవిడ జవాబిచ్చింది.ఇక ఈ వేసవి హాలిడేస్ జాలీ జాలీగా గడవబోతున్నందుకు ఎంతో రొమాంచితంగా అనిపించింది.