వేపాకు ఓ ఔషద మొక్క. వేపాకును మించిన ఔషధమేదీ లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్నో రకాల ఔషద గుణాలున్న వేపాకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉన్న వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా కూడా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే చర్మం కలిగినవారికి వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది.
దీనిలో ఉండే యాంటిసెప్టిక్ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.
ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేపతో తయారుచేసిన సౌందర్యసాధనాలు కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి.
1. వేపఆకులు-గంధం: ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు వేపాకులను ఆ నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ఫ్రిజ్‌లో భద్రపరచు కోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఫ్రిజ్‌లో భద్రపరచిన వేపాకు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి అద్దుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే, ముఖంలో జిడ్డుతత్వంపోయి, ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అలాగే వేపాకు పేస్ట్ కు కొద్దిగా గంధం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొలగిపోతాయి .
2. వేప ఆకుల పేస్ట్- శెనగపిండి: కొన్ని వేపా ఆకులను వేడినీటిలో ఉడికించి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి, దీనికి కొద్దిగా శెనగపిండి మిక్స్ చేసి ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా టీనేజ్ స్కిన్ ప్రాబ్లెమ్స్ నివారించుకోవచ్చు. చర్మంలో దురద, ఎరుపుదనం, మొటిమలు, మచ్చలను తొలగిపోయేలా చేస్తుంది.
3. వేప మరియు తేనె: క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వేప మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతాయి. వేపాకు పొడిని తేనెతో మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు ఈ ఫేస్ ప్యాక్ టీనేజర్స్ కు చాలా ముఖ్యం మరియు అవసరం.
4. నీమ్ మరియు బొప్పాయి: వేప మరియు బొప్పాయి కాంబినేషన్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ టోన్ అందిస్తుంది . కొద్దిగా వేప పౌడర్ తీసుకొని అందులో బొప్పాయి గుజ్జు మిక్స్ చేసి , చర్మానికి అప్లై చేయాలి . కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందివ్వవచ్చు.
5. నీమ్ మరియు టమోటో: ఈ రెండింటి కాంబినేషన్ వల్ల చర్మం ఫ్రెష్ గా మరియు హైడ్రేషన్లో ఉంటుంది. వేప పౌడర్ కు కొద్దిగా టమోటో గుజ్జు మిక్స్ చేసి , చర్మానికి అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది మొటిమలను మాయం చేసి, మంచి గ్లోను అందిస్తుంది.
6. వేప, నిమ్మ మరియు రోజ్ వాటర్: ఇది మరొక హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఇది ముఖంలో మెటిమలు, మచ్చలు పూర్తిగా తొలగించి ముఖంలో కొంత కాంతులను ఏర్పరుస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే రెండు రోజుల్లో మీ ముఖంలో మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.
దీనిలో ఉండే యాంటిసెప్టిక్ గుణాలు గాయాలను పెరగకుండా, వాటివలన చర్మానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడతాయి. అంతేకాకుండా విషజ్వరాలను అదుపుచేయగల శక్తిని కూడా వేపాకు కలిగి ఉంటుంది. కమిలిన, ఎర్రగా కందిపోయిన చర్మానికి వేపాకు ఇట్టే ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మానికి ఎంతో చల్లదనాన్ని కూడా ఇస్తుంది. కొన్ని జ్వరాలు వచ్చి తగ్గాక వేపాకును స్నానానికి వాడటం మన సంప్రదాయంలో గమనించవచ్చు.
ఇది చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పా లంటే మహిళల చర్మతత్వానికి సరిపడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ముఖంపై ఎటువంటి చర్మసంబంధ సమస్యలు తలెత్తినా వాటి నివారణకు వేపాకు ఎంతగానో ఉపకరిస్తూ సౌందర్య సాధనంలా పనిచేస్తుంది. ముఖానికి నునుపైన మెరిసే ఛాయను ఇస్తుంది. వేపతో తయారుచేసిన సౌందర్యసాధనాలు కూడా మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి.
1. వేపఆకులు-గంధం: ఓ కప్పు నీటిని స్టీలు గిన్నెలో పోసి, మరో కప్పు వేపాకులను ఆ నీటిలో వేసి 20 నిమిషాలపాటు బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడగట్టి ఫ్రిజ్‌లో భద్రపరచు కోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఫ్రిజ్‌లో భద్రపరచిన వేపాకు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి అద్దుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే, ముఖంలో జిడ్డుతత్వంపోయి, ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అలాగే వేపాకు పేస్ట్ కు కొద్దిగా గంధం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తొలగిపోతాయి .
3. వేప మరియు తేనె: క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వేప మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతాయి. వేపాకు పొడిని తేనెతో మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు ఈ ఫేస్ ప్యాక్ టీనేజర్స్ కు చాలా ముఖ్యం మరియు అవసరం.
No comments:
Post a Comment