Friday, August 26, 2016

చాక్లెట్ తినడం మంచి అలవాటే అంటా..!

ప్రతి ఉదయం అందమైనదే. ప్రతి రోజూ విలువైనదే. చిరునవ్వుతో రోజు ప్రారంభించి ఆనందంగా గడపడమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచివ్వ మంటోంది ఆధునిక సమాజం. అందుకే నేటి యువతరం అన్నింటా సింపుల్‌ ట్రిక్స్‌ ఆఫర్‌ చేస్తున్నారు. అలాంటి ట్రిక్స్‌లో చాక్లెట్‌ ఒకటి!



ఇప్పుడు చాక్లెట్‌ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు! మనోల్లాసంతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పేశారు వైద్య నిపుణులు! అత్తా కోడళ్ళైనా, ఆలూమగలైనా, ఆఫీసులో బాసూ కొలీగైనా చాక్లెట్‌వైపు మొగ్గుచూపిస్తే రోజంతా ఆరోగ్యం, ఆనందమేనట! బుజ్జాయి ఏడుస్తోందంటే చాక్లెట్‌ కొనాల్సిందే. ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవాలంటే చాక్లెట్‌ చూపించాల్సిందే. చాక్లెట్‌ తింటే చాలు ముఖంపై చిరునవ్వు రావాల్సిందే..కానీ చాక్లెట్‌ తింటే దంతాలు దెబ్బతింటాయి, పళ్లు పుచ్చిపోతాయి, బరువు పెరుగుతామని చాలామంది భయపడ తారు! జిహ్వను అణచుకుంటారు. ఇవేవీ నిజం కాదట. మరి ఆ చాక్లెట్స్‌ చెప్పే తీపి కబుర్లేంటో విందామా!

చాక్లెట్‌ తింటే సంతోషం కలుగుతుంది.
ఎందుకో తెలుసా! అందులో ఉండే ట్రిప్టోఫాన్, ఫెవైల్‌టి లాలామిన్లు లాంటి పదార్థాల వల్ల పది గ్రాముల చాక్లెట్లు ప్రతిరోజూ తింటే శరీరంలో రక్తప్రస రణ మెరుగు పడుతుందని యూరప్‌ ఆహార భద్రతా సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు వీటిని రోజూవారి డైట్‌లో భాగంగా చేసుకుంటే మరెన్నో లాభాలున్నాయట. వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే తప్పకుండా చాక్లెట్ తినాల్సందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాక్లెట్లు ఏవి పడితే అవి తినడం కాకుండా ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. మరి రోజుకు ఒక్క చాక్లెట్ తినడం వల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


హార్ట్ కు మంచిది:
రోజుకు ఒక చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ చాక్లెట్ తింటే హార్ట్ కు మంచిది . బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. హార్ట్ అటాక్ నివారణతో పాటు హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. . క్రమం తప్ప కుండా రోజూ చాక్లెట్‌ తినేవారికి గుండె జబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందనీ, 45 శాతం మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్‌ గుండె ఆరో గ్యాన్ని పెంచడమే కాకుండా లోబ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమయ్యే శక్తిని వ్యాధి నిరోధకతను వెంటనే అందించే శక్తి చాక్లెట్‌కు ఉంది. ఇవి చాలావరకూ అన్ని రకాల బ్లడ్‌ ప్రజర్స్‌ను రెగ్యులేట్‌ చేస్తాయట. అందువల్ల చాక్లెట్‌ను కూడా రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధినిరోధకశక్తని పెంచుతుంది: చాక్లెట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో వివిధ రకాల జబ్బులను రాకుండా నివారిస్తుంది. చాక్లెట్స్ లో ఉండే న్యూట్రీషియన్స్ హానికర బ్యాక్టీరియాను నాశనం చేసి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

స్ట్రోక్ నివారిస్తుంది:
చాక్లెట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు స్ట్రోక్ తో పోరడటానికి సహాయపడుతుంది. మహిళలు చాక్లెట్ ను వారానికొకసారి తినడం ఆరోగ్యానికి మంచిది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: డార్క్ చాక్లెట్ ను రోజుకొక్కటి తినడం వల్ల బ్లడ్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేయడంలో డార్క్ చాక్లెట్ గ్రేట్ అని చెప్పొచ్చు. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది: చాక్లెట్స్ లో ఉండే కోక దీన్నే పెంటమెరిక్ ప్రొకెనిడిన్ అని పిలుస్తారు. ఈ కాంపౌండ్ చాలా ఎఫెక్టివ్ గా క్యాన్సర్ సెల్స్ ను ఎదుర్కుంటుంది. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది.



డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది:
చాక్లెట్ ను రెగ్యులర్ గా తినడానికి ఇక ముఖ్యకారణం, డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది. చాక్లెట్స్ ఇన్సులిన్ సెన్సిస్టివిటిని పెంచుతుంది. దాంతో డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

దగ్గు నివారిణి :
చాక్లెట్స్‌ తింటే దగ్గు పెరుగుతుంది కానీ తగ్గుతుందా! అనుకుంటున్నారా తగ్గుతుందనే అంటున్నాయి పరిశోధనలు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు దగ్గును చాక్లెట్‌తోనే తగ్గించవచ్చట. హుల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలైన మొరిస్‌ అంతర్జాతీయ దగ్గు స్పెషలిస్ట్‌. దగ్గును చాక్లెట్‌తో తగ్గించవచ్చనే విషయాన్ని ఓ పరిశోధనలో ఆయన తేల్చేశాడు. 163 మంది రోగులకు 12 నెలలపాటు రోజుకో చాక్లెట్‌ తినిపించి చూస్తే, దగ్గుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదట. సాధారణ మందులకన్నా చాక్లెట్‌ సంబంధించిన ఔషధాన్ని సేవిస్తే దగ్గు తగ్గు ముఖం పడుతుందని ఆయన పరిశోధనలో తేలింది. చాక్లెట్ లో ఉండే థియోబ్రొమైన్ కఫ్ సిరఫ్ లా పనిచేస్తుందని చెబుతున్నారు.

బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది :
చాక్లెట్లు తినడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుంది. ఆలోచనాప్రక్రియ మెరుగు పడుతుందని అమెరికా మైన విశ్వవిద్యాలయం - దక్షిణ ఆస్ర్టేలియా విశ్వవిద్యాలయం, లగ్జెమ్‌బర్గ్‌ ఆరోగ్య సంస్థల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. పిల్లల డైట్ లో కూడా చాక్లెట్స్ ను చేర్చడం వల్ల ఇది పిల్లలను మంచి ఇంటలిజెంట్స్ గా మార్చుతుంది. రెగ్యులర్ గా చాకెట్స్‌ తినేవారిలో జ్ఞాపకశక్తి, పరిశీలన, విశ్లేషణా సామర్థ్యం, సమన్వయం తదితర అంశాల్లో మంచి ప్రతిభ చూపుతారు.

రక్తంకు మంచిది :
ప్రతి రోజూ ఒక డార్క్ చాక్లెట్ తినడం వల్ల , చాక్లెట్ లో ఉండే ఔషధగుణాలు రక్తంను శుద్ది చేస్తుంది. దాంతో రక్తప్రసరణ బాగుటుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు ఉండుటవల్ల మీరు వాటిని తిన్న తర్వాత 2-3 గంటలు వరకు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మెదడులో రక్తనాళాలు విస్తరణ ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

కోపం, ఒత్తిడి మటుమాయం:
నలుపురంగు చాక్లెట్‌ తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఈ విషయాన్ని తాజా అధ్య యనాలు కూడా నిరూపిస్తున్నాయి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి బ్లాక్‌ చాక్లెట్‌ ఉపకరి స్తుందట. అందులో ఉండే పాలిఫెనాల్స్‌ అనే రసాయనం ప్రశాంతతను, తృప్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలిఫెనాల్స్‌ రసాయ నాలు ఆక్సిడేటివ్‌గా పనిచేసి ఒత్తిడి తగ్గిస్తాయి. మానసికంగా అనేక దుష్ప్రభావాలని ఇవి దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మోనోపాజ్ దశలో గ్రేట్ గా సహాయపడుతుంది:
మహిళలు మోనోపాజ్ దశలో ఉన్నప్పుడు రోజుకు ఒక్క చాక్లెట్ తింటే చాలు, మూడ్ ను అందిస్తుంది. భావోధ్వేగాలను అణచివేస్తుంది. హార్మోనుల ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి చాక్లెట్ లో ఉండే గుణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

మహిళల సమస్యలకు:
మహిళలకు వచ్చే నెలసరి సమయంలో ఈస్ర్టో జన్, ప్రొజెస్టరాన్ స్థాయి తగ్గుతుంది. ఈ సమ యంలో కడుపునొప్పి, టెన్షన్, కోపతాపాలు అధిక మవుతాయి. చికాకుగా ఉంటారు. క్షణక్షణానికి వాళ్ల మూడ్‌ మారుతూ ఉంటుంది. హార్మోన్లలో వచ్చే మార్పులే దీనికి కారణం. హాయిని కలిగించే పెరోటినిస్‌ తగ్గిపోవడం, ఎండార్ఫిన్‌లు మాయమవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో కొన్నిరకాల పోషకాహారంతో పాటు, డార్క్‌ చాక్లెట్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పొట్ట తగ్గడానికి :
నేటికాలంలో చాలామందిని వేధించే సమస్య అధిక బరువు. దానికితోడు బానపొట్ట. సన్నగా నాజూగ్గా తయారవ్వాలనేది ప్రతి వారికీ కోరికే. అందుకు కఠినమైన ఆహారనియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ రోజుకో డార్క్‌ చాక్లెట్‌ తింటే మీ బాన పొట్ట కాస్తా తగ్గుతుందట. ప్రత్యేకించి కోకోబీన్సతో చేసిన చాక్లెట్లు లేదా వాటి పౌడర్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. కోకో శరీరంలో కొవ్వును ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేలా చేస్తుంది.

శృంగార సామర్థ్యం :
చాక్లెట్లతో ఉండే కోకోబీన్స్‌కు లైంగిక సామ ర్థ్యానికి అతిదగ్గర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఓ హస్పెటల్‌లో 200 మందిపై పరిశోధనలు చేసి వారికి రోజుకొక చాక్లెట్‌ తిని పించారట. చాక్లెట్‌ తిన్న వారిలో ఉండే శృంగార కోరికలు, తిననివారికంటే అధికంగా ఉన్నాయని కనిపెట్టారు. చాక్లెట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీ షియం ఎముకలలో దృఢత్వాన్ని కలిగిస్తాయి. రక్తంలో షుగర్‌ శాతం తగ్గినట్టయితే చాక్లెట్‌ తినడం మంచిది. రోజూ చాక్లెట్‌ తింటే వృద్ధులలో వచ్చే అల్జీమర్స్‌ వ్యాధికి చెక్‌పెట్టవచ్చు.

వృద్ధాప్యం రానివ్వదు: చాక్లెట్లు ఎక్కువగా వినియోగించుట వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే కొంతకాలం వృద్ధాప్యంను తప్పించడంలో సహాయపడుతుంది. ముఖం మీద ముడతలు రాకుండా చేస్తుంది. మళ్లీ, యాంటీఆక్సిడెంట్లు ఈ ప్రయోజనాల కోసం బాధ్యత తీసుకుంటాయి.

Thursday, August 25, 2016

ఉదయం పరకడుపుతో బార్లీగంజి తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు!

బార్లీ వాటర్ ఒక హెల్తీ డ్రింక్ , బార్లీని నీటితో మిక్స్ చేసి ఉడికించడం ద్వారా బార్లీ వాటర్ తయారవుతుంది . ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ లైట్ గా స్వీట్ గా కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవచ్చు. బార్లీ వాటర్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిగురించి మీరు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక తప్పదు. బార్లీ వాటర్ ను ఎలా తయారుచేసుకోవాలో..మరియు వాటిలోని అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ..

ఒక సర్వింగ్ కు , రెండు టీస్పూన్ల బార్లీ తీసుకుని సాస్ పాన్ లో ఒక నిముషం ఫ్రై చేసి తర్వాత అందులో వాటర్ మిక్స్ చేయాలి. బార్లీ మెత్తబడే వారకూ ఉడికించాలి. ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ తో తాగొచ్చు. దీన్ని ఒకే సారి ఎక్కువగా తయారుచేసి నిల్వచేసుకోవచ్చు కూడా. అది కూడా చాలాసింపుల్ గా కొద్దిగా ఎక్కువ మొత్తంలో బార్లీని కుక్కర్ లో వేసి దానికి డబుల్ గా నీరు మిక్స్ చేసి సాప్ట్ గా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వత దీన్ని వడగట్టి, చల్లార్చి, బాటిల్లో నింపి ఫ్రింజ్ లో పెట్టుకుని, రోజుకు రెండు మూడు సార్లు తాగొచ్చు. బార్లీ ఎటువంటివి ఎంపి చేసుకోవచ్చు? ఒరిజినల్ బార్లీబియ్యంను ఎంపికచేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని తీసుకోవడం మంచిది.



1. కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది: బార్లీ వాటర్ లో దాగున్న బీటా గ్లూకాన్ బాడీలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . దాంతో బౌల్ మూమెంట్ సాఫీగా జరుగుతుంది. హెమరాయిడ్స్ రిస్క్ తగ్గిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. దాంతో కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.  

2.బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుంది: ఇది డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, శరీరంలో నిల్వ చేరిన అదనపు వాటర్ ను మరియు టాక్సిన్స్ ను యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది.

3. బాడీహీట్ తగ్గిస్తుంది: వేసవి సీజన్ లో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గిస్తుంది .

4. పొట్ట సమస్యలు తగ్గిస్తుంది: కారంగా ఉన్న ఆహారాలు తిన్నప్పుడు కడుపులో మంటగా ఉన్నప్పుడు, బార్లీ వాటర్ ను తాగడం వల్ల బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తుంది.

5. యాంటీఇన్ఫ్టమేటరీ: బార్లీ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది . ఆర్థరైటిస్ తో బాధపడే వారు మరియు జాయింట్ పెయిన్ తో బాధపడేవారు బార్లీ వాటర్ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.



6. బీటా గ్లూకాన్ : బీటా గ్లూకాన్ శరీరంలోని గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో బ్లడ్ షుగక్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే డయాబెటిక్ పేషంట్స్ బార్లీ వాటర్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటుంది.

7. డైటరీ ఫైబర్ అందుతుంది: రెగ్యులర్ గా బార్లీ వాటర్ తాగడం వల్ల, శరీరానికి అవసరమయ్యే డైటరీ ఫైబర్ అందుతుంది.

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: హైఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది.

9.బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది: బార్లీ వాటర్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది . గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ప్రయోజనకారి . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. కాళ్ల వాపులను తగ్గిస్తుంది.

10. జెస్టేషనల్ డయాబెటిస్: గర్భిణీ స్త్రీలో జస్టేషనల్ డయాబెటిస్ ను, ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

11. ల్యాక్టేషన్ పెంచుతుంది : పాలిచ్చే తల్లులు, బార్లీ వాటర్ తాగడం వల్ల పాలు పడేలా చేస్తుంది మరియు తల్లి, బిడ్డలో జీర్ణశక్తిని పెంచుతుంది.

12. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది: కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో బార్లీ వాటర్ గ్రేట్ రెమెడీ. రోజూ ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్టోన్స్ ను యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా, మంచి ఆకారంతో ఉంటాయి.

13. బార్లీ వాటర్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది: ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది ఇది షుగర్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. రోజంతా సరపడే ఎనర్జీ లెవల్స్ ను అందిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది మరియు మెటబాలిజం రేటు పెంచుతుంది. వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బార్లీ వాటర్ ను ఉదయం మరియు సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Wednesday, August 24, 2016

రోజుకు రెండే రెండు.. చాలు

 వెల్లుల్లిని " allium sativum " , సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ . వెల్లుల్లి జలుబు , ఫ్లూ జ్వరం తగ్గిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది, బి.ఫై.ని సరైన స్థితి లో ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, కేన్సర్ వ్యాధిని దరిచేరనివ్వదు , శరీర రక్షణ శక్తిని పెంచుతుంది, కాలేయానికి మంచి చేస్తుంది, కీళ్ళ నోపుఉలు తగ్గిస్తుంది. వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్‌- సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్‌-సితో అల్లిసిన్‌ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్‌-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.



వందగ్రాములు వెల్లుల్లిలో ఉండే న్యూట్రీసియన్ విలువలు: క్తి 149 కేలరీస్‌, కార్బోహైడ్రేడ్స్‌-33.6 గ్రాములు , చక్కెర-1.00 గ్రాములు, ఫైబర్‌-2.1 గ్రాములు, పదార్ధాలు-0.5 గ్రాములు, ప్రొటీన్లు-6.39 గ్రాములు, బిటా కారొటిన్‌ 0%, విటమిన్‌ బి - 15%, విటమిన్‌ బి2 - 7%, విటమిన్‌ బి3 - 5%, విటమిన్‌ బి5 - 12%, విటమిన్‌ బి6 - 95%, 
టమిన్‌ బి9 - 1%, విటమిన్‌ సి - 52%, కాల్షియం - 18%, ఐరన్‌ - 14%, మాగ్నీషియం - 7%, ఫాస్పరస్‌ - 22%, పొటాషియం - 9%, సోడియం - 1%, జింకు - 12%, 
మాంగనీస్‌ 1.672 మిల్లీగ్రాములు, సెలినియం 14.2


ఆరోగ్యాన్ని పెంపొందించటానికి వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆధునిక వైద్యానికి పితామహుడనదగ్గ హిప్పో క్రేట్‌‌స(460-357 బి.సి) వెల్లుల్లిని అంటు రోగాలకు, ఉదర సంబంధ వ్యాధులకు వైద్యంగా ఉపయోగించేవాడని చెబుతారు. ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యుల ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ల్యుకోడెర్మా కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. రీసెంట్ గా జరిపిన పరిశోధనల ద్వారా వెల్లడైనది. వీటితో పాటు మరికొన్ని అద్భుత ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం...
వెల్లుల్లిలోని అద్భుతమైన న్యూట్రీషినల్ బెనిఫిట్స్...!

  
1. యాంటీ వైరల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి:
వెల్లుల్లిల్లో ఇ. కోలి, సాల్మనెల్లా, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్యాక్టీరియను నాశనం చేస్తుంది. వెల్లుల్లి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఈస్ట్ లేదా వార్మ్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . యాంటీబ్యాక్టిరియల్ గా మరియు యాంటీ వైరస్ గా పనిచేస్తుంది.
  
2. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:
వెల్లుల్లిలో ఉండే అజోయిన్ అనే కెమికల్ ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా అథ్లెట్స్ ఫూట్ మరియు రింగ్ వార్మ్ వంటి ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
  


3. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే ''హైడ్రోజన్‌ సల్ఫేట్‌'', ''నైట్రిక యాసిడ్‌'', రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లిలో ఉండే ఆంజియోటిన్స్2 ఇది ప్రోటీన్ . ఇది బ్లడ్ ప్రెజర్ పెరగకుండా బ్లడ్ వెజిల్స్ ఫ్రీచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ , అంజియోటిన్స్ 2ను గ్రహించడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే ఫాలిసల్ఫైడ్స్ హైడ్రోజన్ సల్ఫైడ్ గా మార్పు చెందుతుంది. దాంతో రెడ్ బ్లడ్ సెల్స్ లో హైడ్రోజన్ సల్ఫైడ్, రక్తనాళాల్లో విస్తరిస్తుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది.
బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన వైద్యంగా వెల్లుల్లి తగ్గిస్తుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. మందుల షాపులలో లభించే వెల్లుల్లి క్యాప్యూల్‌‌సని రోజుకు రెండు లేదా మూడిటిని వేసుకోవటం ద్వారా బీపిని దారిలోకి తెచ్చుకోవచ్చు.
  

4: కార్డియో వాస్క్యులర్ సమస్యలను నివారిస్తుంది :
వెస్ట్ జర్మనీకి చెందిన డాక్టర్లు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని విదితమైంది. వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట రాల్‌ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందనీ, దీనితో హైబీపీ, గుండెపోటు నివారించబడతాయనీ కోలోన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ హామ్‌‌స రాయిటర్‌ అంటున్నారు.గుండె పోటు వచ్చిన రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట రాల్‌ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అంతకు పూర్వం గుండెకు జరిగిన డామేజ్‌ అయితే తొలగిపోదు గాని తిరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తగ్గిపోతాయంటారు.
వెల్లుల్లి హార్ట్ అటాక్ వంటి ప్రాణాంత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది, ధమనులు వదులవ్వడం ప్రారంభమౌతుంది . అలా జరగకుండా ఉండాలంటే, వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది హార్ట్ కు డ్యామేజ్ కలగకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్రీ ఆక్సిజన్ ర్యాడికల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ బ్లడ్ వెజిల్స్ బ్లాక్ కాకుండా నివారిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.


  
5: థైరాయిడ్ ట్రీట్మెంట్ :
వెల్లుల్లి హైపోథైరాయిడిజం వంటి హైలెవల్స్ థైరాయిడ్ చికిత్సకు గ్రేట్ గా సహాయపడుతుంది.
  


6: వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:
వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి, హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్త కణాల పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది. తరచూ మూడ్ మారుతుంటే , వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది.


  
7: అలర్జీలను నివారిస్తుంది :
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలర్జీలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
  
8: రెస్పిరేటరీ సమస్యలను నివారిస్తుంది:
జలుబు దగ్గుతో బాధపడుతుంటే, వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. . వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఆస్తమా పేషంట్స్ లో బ్రీతింగ్ సమస్యలను నివారిస్తుంది . క్రోనిక్ బ్రొంకైటిస్ ను నివారిస్తుంది.. ఇది లైఫ్ సేవియర్ రెస్పిరేటరీ సమస్యలను నివారిస్తుంది.


  
9: క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది
వెల్లుల్లిలోని మరో న్యూట్రీషియనల్ బెనిఫిట్, రెగ్యులర్ గా వెల్లుల్లి తినడం వల్ల వివిధ రకాల క్యాన్సర్స్ ను దూరం చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసల్ఫైడ్ లక్షణాలు యాంటీక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇవి యాంటీక్యాన్సర్ గా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
  
10: మెటబాలిజంను మెరుగుపరుస్తుంది :
ఫెర్రో ప్రోటీన్ ఇది ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది మరియు వెల్లుల్లిలో ఉండే డైలియల్ సల్ఫైడ్ ఫెర్రోప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఐరన్ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.


  
11. ఉబ్బసం:
వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్‌‌ట - వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి పడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.
  
12. జీర్ణకోశ వ్యాధులు:
జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణయంత్రాంగానికి సోకే అన్ని రకాల అంటురోగాలనూ వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. అందుకు కారణం- వెల్లుల్లిలో ఉన్న యాంటీ సెప్టిక్‌ గుణం!
  
13. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది
రష్యాలో వాతరోగాలకు వెల్లుల్లి ఉపయోగిస్తుంటారు. బ్రిటనులో కూడా అంతే. జపానులో జరిపి పరిశీలనలో మిగతా వాతరోగాల మీద ఎలాంటి సైడ్‌ఎఫెక్‌‌ట్స లేకుండా వెల్లుల్లి వైద్యం పని చేసినట్లుగా నిరూపితమైంది. వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. వెల్లుల్లి తైలాన్ని చర్మం పీల్చుకొని రక్తంలో కలిసి వేగంగా నొప్పులను నివారిస్తుంది.
  
14. లైంగిక సమస్యలు లేదా సెక్స్ సంబంధ వ్యాధులు:
సపుంసకత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని అమెరికా లోని ప్రముఖ సెక్సాలజిస్‌‌ట డాక్టర్‌ రాబిన్‌సన్‌ పేర్కొంటున్నారు. సెక్‌‌స సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్‌‌ససంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు.
  
15. వంటకాలలో:
మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.

Tuesday, August 23, 2016

చివరి ఘట్టానికి చేరుకున్న కృష్ణా పుష్కరాలు


కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. చివరి అంకానికి చేరుకున్న పుష్కరాల్లో స్నానం చేయడానికి.. తరలివచ్చే భక్తులతో రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్కర ఘాట్లు పదకొండో రోజు కుంభమేళాను తలపించాయి. పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో.. ఘాట్లలో స్నానం చేయాలన్న ఆత్రుతతో భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ, అమరావతి, నల్గొండ, మహబూబ్ నగర్లో పుష్కర ఘాట్లు భక్తులతో కళకళలాడాయి.
అటు కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద కృష్ణమ్మకు పవిత్రహారతిని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తెలుగు ప్రభుత్వాలు.. ముగింపు ఉత్సవాలను కూడా బాగా ప్లాన్ చేశాయి. ఏపీలో చివరిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచే పుష్కరస్నానాలు నిలపేయనున్నారు. ఫెర్రీ వద్ద చివరిరోజు కృష్ణమ్మకు ఇచ్చే పవిత్రహారతి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది.

Monday, August 22, 2016

సింధుకు నజరానాల వెల్లువ

రియో ఒలింపిక్స్ లో రెండో పతకం భారత్ ఖాతాలో చేరింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో ఓడినా.. రజతాన్ని ఒడిసిపట్టింది. ఫైనల్లో వాల్డ్ నంబర్ వన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో హోరాహోరీగా పోరాడిన సింధు.. మొదటి సెట్లో గెలిచినా.. రెండు, మూడు సెట్లో ఓడిపోయింది. దీంతో రజతంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. కానీ రజతం సాధించినా సింధు ఘనత తక్కువేమీ కాదు. అతి చిన్న వయసులో ఒలింపిక్స్ రజతం సాధించిన అథ్లెట్ గా సింధు రికార్డుల కెక్కింది.

బ్యాడ్మింటన్లో భారత్ కు రజతం రావడం కూడా ఇదే మొదటిసారి. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా కాంస్యం గెలిచింది. ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెండో తెలుగమ్మాయి సింధు. 2000 ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచింది. అద్భుతమైన గేమ్ తో ప్రత్యర్థిని ఇరుకునపెట్టిన పీవీ సింధు, అనుభవ రాహిత్యం, కొన్ని పొరపాట్ల కారణంగా మ్యాచ్ చేజార్చుకుందని కోచ్ గోపీచంద్ చెబుతున్నాడు. అయితే సింధుకు ఇంకా చాలా సమయముందని, వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్ కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే  సింధూకు రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య  కూడా సింధూకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటన చేసింది.