Monday, August 22, 2016

సింధుకు నజరానాల వెల్లువ

రియో ఒలింపిక్స్ లో రెండో పతకం భారత్ ఖాతాలో చేరింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో ఓడినా.. రజతాన్ని ఒడిసిపట్టింది. ఫైనల్లో వాల్డ్ నంబర్ వన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో హోరాహోరీగా పోరాడిన సింధు.. మొదటి సెట్లో గెలిచినా.. రెండు, మూడు సెట్లో ఓడిపోయింది. దీంతో రజతంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. కానీ రజతం సాధించినా సింధు ఘనత తక్కువేమీ కాదు. అతి చిన్న వయసులో ఒలింపిక్స్ రజతం సాధించిన అథ్లెట్ గా సింధు రికార్డుల కెక్కింది.

బ్యాడ్మింటన్లో భారత్ కు రజతం రావడం కూడా ఇదే మొదటిసారి. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా కాంస్యం గెలిచింది. ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెండో తెలుగమ్మాయి సింధు. 2000 ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం గెలిచింది. అద్భుతమైన గేమ్ తో ప్రత్యర్థిని ఇరుకునపెట్టిన పీవీ సింధు, అనుభవ రాహిత్యం, కొన్ని పొరపాట్ల కారణంగా మ్యాచ్ చేజార్చుకుందని కోచ్ గోపీచంద్ చెబుతున్నాడు. అయితే సింధుకు ఇంకా చాలా సమయముందని, వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్ కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే  సింధూకు రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య  కూడా సింధూకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటన చేసింది.

1 comment:

  1. The way Indian life goes, and as history shows, anyone winning a medal in Olympics just fades out of sight by the time next Olympics come up. So do not bet too much on this lady for Tokyo 2020, though I myself will be very very happy to see her win a gold in Tokyo.

    ReplyDelete