Saturday, February 13, 2016

జీరా ఆరోగ్యానికి మేలు చేయ‌డంలోనూ రారాజు

జీర ఇండియన్ పేరు జీలకర్ర. ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒకపదార్ధంగా వాడేవారు. ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. ఎలాంటి సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది. బంగాళ దుంప కుర్మాలో జీలకర్ర తప్పక రుచికి వేస్తారు. రుచి మాత్రమే కాక తినేవారికి ఆరోగ్యాన్ని కూడా కలిగించే ఈ జీలకర్రను ప్రతివారూ తప్పక ఆహారంలో చేరుస్తారు. 



జీల‌క‌ర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయ‌డంలోనూ రారాజు. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు జీలకర్రలో డయాబెటిస్, ట్యూమర్స్ మరియు మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందుకే ప్రాచీన కాలంలో జీలకర్రను నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగేవారు. జీలకర్ర వాటర్ త్రాగాలంటే, ముందుగా నీటిని 10 నిముషాలు మరిగించాలి . తర్వాత అందులో జీలకర్ర వేసి, 10 నిముషాలు ఉడికించాలి. తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయాలి . ఇలా ఫిల్టర్ చేసిన నీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి . ఈ గోరువెచ్చని నీటితో సూప్ లా తీసుకోవాలి. జీలకర్రలో కుమినాల్ డీహైడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది ఫైటో కెమికల్. నిజానికి జీలకర్ర టేస్ట్ మరియు వాసన చాలా డిఫరెంట్ గా ఉంటుంది . అంతే కాదు జీరా వాటర్ లోని మరిన్ని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

కిడ్నీ హెల్త్ : జీరా వాటర్ కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది . జీలకర్రవల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం. లేదా జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి రోజంతా తాగుతుండాలి.

ర‌క్త‌హీన‌త‌ : రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఐర‌న్ జీల‌క‌ర్ర‌లో పుష్క‌లంగా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల వ‌చ్చే అనీమియా త‌గ్గించుకోవ‌డానికి జీరా బాగా స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త‌హీన‌త ఎక్కువ‌గా పిల్ల‌లు, ఆడ‌వాళ్ల‌లో క‌నిపిస్తుంది. కాబ‌ట్టి జీల‌క‌ర్ర‌ను రెగ్యుల‌ర్ గా తీసుకోవ‌డం మంచిది.

క్యాన్సర్ నివారిణి: జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించుకోవచ్చు . రెగ్యులర్ గా జీరా వాటర్ త్రాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ కార్సినోజిక్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది: జీరా వాటర్ కొన్ని నిద్రసమస్యలను నివారిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు . జీలకర్ర నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. : జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఆకలిని పెంచుతుంది. లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది.

గొంతు నొప్పి నివారిస్తుంది: జీరా వాటర్ గొంతునొప్పిని నివారిస్తుంది. కొద్దిగా జీరా వాటర్ తాగాలి మరియు అదే నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి నివారించబడుతుంది.

హైపర్ టెన్షన్ నివారిస్తుంది: జీరావాటర్లో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నార్మల్ చేస్తుంది మరియు హైపర్ టెన్షన్ ను నివారిస్తుంది.

శరీరాన్ని తగిన హైడ్రేషన్లో ఉంచుతుంది: జీరా బాటర్ మొత్తం బాడీ సిస్టమ్ ను హైడ్రేషన్లో ఉంచుతుంది. ఇందులో ఉండే కొన్ని మెడిసినల్ గుణాల వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది: జీరా వాటర్ వల్ల మరో అమేజింగ్ బెనిఫిట్ , బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

కొన్ని రకాల హెల్త్ సమస్యలను నయం చేస్తుంది: జీరా వాటర్లో ఉండే మెడిసినల్ గుణాలు దంతక్షయం, కళ్ళ సమస్యలు, ప్రేగు సమస్యలు, జాయింట్ సమస్యలు, బ్రీతింగ్ సమస్యలు, వాపులు మరియు చలిని నివారిస్తుంది.

పాలను వ్రుద్దిచేస్తుంది: జీరా వాటర్లో ఉండే ఔషధగుణాల వల్ల కొత్తగా తల్లైన వారిలో పాలపడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది.













పరిక్షలు అంటే భయపడ్తున్నారా..?

ఎగ్జామ్ టిప్స్
 

 మైండ్ అనేది కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వచేసుకోవచ్చు. ఫలానా దానిని మీరు గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే... అది మీ పరిశీలనకు అందడం గాని, గుర్తుండడం గాని కష్టం. కాబట్టి... ఆసక్తిగా, గుర్తుంచుకునేలా చదవడం ముఖ్యం.   {పాక్టీస్ వల్లే ఏ హ్యాబిట్ అయినా పర్ఫెక్ట్ అవుతుంది.  ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించడం అలవాటు చేసుకోవాలి. అపుడు చదువు విషయంలో కూడా అనుసరించడం తేలికవుతుంది.

బ్రెయిన్‌కి ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెల్సుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే ఏకాగ్రత కుదరకపోవడం. ఎలాగంటే ఉదాహరణకు మీరు చదువుతున్నపుడు ఇంటి ముందుగా ఏదైనా బ్యాండ్‌మేళం శబ్దం వినపడిందనుకోండి... ‘‘అది పెళ్ళిదా లేకపోతే ఏదైనా దేవుడి ఊరేగింపా...’’ వగైరా ప్రశ్నలు మనకు తెలీకుండానే బ్రెయిన్‌కి చేరతాయి.

వాటికి సమాధానాలు తెల్సుకోవాలని తహతహలాడుతుంది. దాంతో మీ ఏకాగ్రత చెదురుతుంది. అందుకే చదివేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇలా జరగకుండా ఉండడానికి మార్గం ఏమిటంటే... బ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు  స్టడీస్‌కు, సబ్జెక్టులకు  సంబంధించిన ప్రశ్నలతో నింపేస్తూ ఉండడం{బెయిన్‌కి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిగ్గా దాన్ని చేరుకునేందుకు సిద్ధపడుతుంది. లక్ష్యం లేకుండా చదవవద్దు. ‘‘ఈ గంటలో నేనీ చాప్టర్ ఫినిష్ చేయాలి. ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి’’ లాంటి లక్ష్యంతోనే చదవడం ప్రారంభించాలి.

Thursday, February 11, 2016

కొవ్వును కరిగించే మెంతులు...

అద్భుత ఔషదంగా పేర్కొనే మెంతి విత్తనాలు ప్రోటీన్, విటమిన్ 'C', నియాసిన్, పొటాషియం వంటి మూలకాలను కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అద్భుతమైన ఔషద గుణాలను కలిగి ఉండే మెంతుల వలన కలిగే ప్రయోజనాలు...


జ్వరం
నిమ్మ మరియు తేనెతో కలిపి మెంతి విత్తనాలను తీసుకోవటం వలన జ్వరం తగ్గుతుంది. జ్వరంగా ఉన్న సమయంలో ఈ ఔషదాన్ని తీసుకోవటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. జ్వరం తగ్గటానికి గానూ, రోజు మూడు సార్లు రెండు చెంచాల మెంతులను నిమ్మ మరియు తేనె కలిపి తీసుకోండి.

శరీర కొవ్వు పదార్థాల తగ్గుదల
శరీరంలో కొవ్వు పదార్థాల నిర్వహణకు గానూ మెంతులను వాడమని సిఫార్సు చేయవచ్చు. ప్రతిరోజు రెండు ఔన్ల మెంతులను తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని వివిధ రకాల పరిశోధనలలో తెలుపబడింది.

చర్మ ఇన్ఫెక్షన్
కాలిన గాయాలు, తామర, చీము పట్టిన గడ్డల వంటి చర్మ ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలిగించుటలో మెంతులు చాలా శక్తివంతమైన ఔషదంగా పేర్కొనవచ్చు. ఒక చెంచా మెంతులను రుబ్బి, వేడి నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి.

గుండె సంబంధిత వ్యాధులు
మెంతులలో ఉండే గ్లాక్టోమాన్నన్ ఉండటం వలన గుండెపోటు కలగకుండా చూస్తుంది. అంతేకాకుండా, పుష్కలంగా పొటాషియంను కలిగి ఉండి చర్యలను అడ్డుకోవటం ద్వారా గుండె సంబధిత వ్యాధులను మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.

మధుమేహం
మెంతులు ఆరోగ్యకరం మరియు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. గ్లాక్టోమాన్నన్, కరిగే ఫైబర్ లను కలిగి ఉండి, రక్తంలో చక్కెరలను గ్రహించే రేటును తగిస్తుంది. మెంతులు అమినో ఆసిడ్ లను కలిగి ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

గిరిజన సంప్రదాయాలకు పట్టం కట్టే సమ్మక్క-సారలమ్మ జాతర

మేడారం జాతర.
రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నమి) రోజుల్లో జరిగే జాతర.
గిరిజన సంప్రదాయాలకు పట్టం కట్టే జాతర.
ఆసియాలోనే అతి పెద్ద వనజాతర.



ఈ జాతర సమయంలో కోటి మందికిపైగా వచ్చే భక్తులతో అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది. మొక్కులతో ముడుపులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఈ నెల ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది.
గిరిజనుల గుడులు నిరాడంబరమైనవి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు కూడా గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె) ఆనవాయితీ. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని ‘మండ మలిగె’ అంటారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ‘మండ మెలిగె’ మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండగ నిర్వహిస్తారు. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు.

విగ్రహాలు లేని పూజ
మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సమ్మక్క-సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండకపోవడమే ఆ ప్రత్యేకత. ఇక్కడున్న రెండు గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాల (నారేప)నే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంకమొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. వీరు పసుపు, కుంకుమల స్వరూపాలు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తులు సాష్టంగపడతారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇది దేవతలకు ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. మేడారం వచ్చే భక్తుల్లో గిరిజనులు, పేదలే ఎక్కువగా ఉంటారనే భావనతో విలువైన కానుకలు, మొక్కులు ఇక్కడ లేవని చెబుతుంటారు. మొక్కులు ఫలించి సంతానం కలిగినవారు జాతర వచ్చినప్పుడు ఎత్తు బంగారం సమర్పిస్తారు. కోర్కెలు తీరితే ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వస్తామని అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడి బియ్యం), ఎదురు కోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా గాల్లోకి ఎగరవేసిన కోళ్లు), లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ ఉంటాయి.

వనం నుంచి వనంలోకి
సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంతం మొత్తం శివసత్తుల శివాలుతో, భక్తిపరవశంతో ఊగిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో లెక్కలేనంత మంది భక్తులు మేడారానికి వస్తారు. మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

సమ్మక్క కథ

సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కోయగిరిజనుల కథనం ఇలా ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు-సమ్మక్కలకు సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. మేడారం ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడున్న సారవంతమైన భూములును ఆక్రమించేందుకు కాకతీయరాజు రుద్రదేవుడు మేడారంపై దండెత్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోకుండా, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడింది. ఆమె దాటికి తట్టుకోలేని శత్రువర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో పొడిచాడు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించగా నాగవృక్షపు నీడలో ఉన్న పాముపుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. గిరిజనులు ఈ భరిణే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతర చేసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు.

Wednesday, February 10, 2016

35 అడుగుల మంచులో కూరుకుపోయినా..

సియాచిన్ అంటేనే మృత్యువుకు మరోపేరు. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ఎత్తయిన యుద్ధక్షేత్రంలో కొనఊపిరితో బతికి బయటపడ్డ లాన్స్‌నాయక్ హనుమంతప్ప ధీరోదాత్త ఉదంతం ఓ మిరాకిల్‌గా నిలిచింది. వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఏడు రోజుల క్రితం అక్కడ పహారా కాస్తున్న సైన్యం మంచు తుఫానులో చిక్కుకుంది. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. మీద పడటంతో భారత సైనిక శిబిరం సమాధి అయిన ఘటనలో హనుమంతప్ప ఒక్కడే అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా మిగతా 9 మంది సైనికులు అసువులు బాశారు.

19,600 అడుగుల ఎత్తయిన మంచు పర్వతం.. 35 అడుగుల మంచు.. మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత,  నిమిషాల్లో రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి.. ఇవన్నీ ఉన్నా హనుమంతప్ప బయటపడ్డాడు. హనుమంతప్పను సజీవంగా నిలిపింది ఏంటన్నదే ఇపుడు చర్చకు దారితీసింది. మంచులోని గాలిబుడగలే కాపాడాయని నిపుణులు చెబుతున్నారు.  అతని నోరు, ముక్కు దగ్గర  ఎయిర్ పాకెట్స్ ను గమనించామని  రెస్క్యూ ఆపరేషన్  ఆఫీసర్లు తెలిపారు. తాము పేరు పెట్టుకున్న హనుమంతుడే తన బిడ్డను కాపాడాడని అతడి తండ్రి  అంటున్నారు. నిరంతర కఠోర వ్యాయామం, యోగ సాధన, ప్రాణాయామం బాగా అలవాటు ఉండటం వల్లే హనుమంతప్ప బయటపడినట్లు తెలుస్తోంది. 

శరీరంలోని పలు భాగాలు గడ్డకట్టుకుపోయి కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను సైనిక వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావడం లేదని.. రక్తపోటు చాలా తక్కువగా ఉందని, కిడ్నీలు, లివర్ పనిచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం విషమంగానే ఉందని, 24గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. దీంతో.. హనుమంతప్ప క్షేమ సమాచారం కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది. ధీరుడా.. కోలుకో అంటూ ప్రార్థనలు చేస్తోంది.

అసలు 1984కు ముందు సియాచిన్‌పై సైనిక శిబిరాలు ఉండేవి కావు. అయితే, వ్యూహాత్మక ప్రాంతం కావడంతో ఇరుదేశాలు సైనిక శిబిరాలు ఏర్పాటుచేశాయి. వీటిని విరమించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. కానీ ఇంతవరకూ తొలి అడుగు పడలేదు.

Tuesday, February 9, 2016

గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ రికార్డు

కాలిఫోర్నియా: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పిచాయ్ ఘనత పొందారు. 
గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ అగ్రస్థానంలో నిలిచారు.

భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ 2015 ఆగస్టులో గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన షేర్లతో అల్ఫాబెట్‌లో ఆయన షేర్ల విలువ సుమారు 650 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4,430 కోట్లు)చేరింది. అల్ఫాబెట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్‌ పోరట్‌కు కూడా 38.3 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ లభించాయి. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ అధిపతి డియానే గ్రీనేకు కూడా 42.8మిలియన్ డాలర్ల స్టాక్స్‌ను కట్టబెట్టారు.

రామరామ శివశివ

పేరు రామన్న... వేషం శివన్న... వృత్తి మోసమన్నా...
‘బీస్ సాల్ బాద్’ అంటే... ఇరవై ఏళ్ల తరువాత
యూత్ ఈ చీటింగ్‌కి చెక్ పెట్టింది.
లేకపోతే ఇంకో తరాన్ని మింగేవాడు.
ఎక్కడో ఊర్లళ్లో జరుగుతుందని దీనికి మనకు సంబంధం లేదని... ఓ ఫీలైపోకండి. ఎప్పుడో ఇలాంటోడు మన గడపా తొక్కొచ్చు.
మోసాలు మారలేదు... మోసగాళ్ల తీరులే మారాయి.
బీ కేర్‌ఫుల్ లేకపోతే రామరామ... శివశివ..
.
 
అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలో నేలకోట గ్రామం. ఓ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు రామన్న. ‘మీ ఇంట్లో ఒక జీవి పడుకుని ఉన్నాడు. వారం రోజులైనా వ్యాధి తగ్గడం లేదు. ఎందుకు తగ్గలేదోననే ఆలోచన ఇంట్లో ఒక్కరికీ రాదు. నేనొచ్చి చెప్పకపోతే మరో వారానికి మంచం మీదున్న ఆ జీవిని మంచం దించాల్సి వచ్చేది’ అంటూ పద్యం చదివినట్లు చదువుతున్నాడు. ఇంటి లోపలి నుంచి ఓ మధ్య వయస్కురాలు ఆందోళనగాబయటకు వచ్చింది. ‘నిజమే రామన్నా! పిల్లాడు జ్వరాన పడ్డాడు. వారం నుండి లేవట్లేదు. మందులేస్తున్నాం. జ్వరం తగ్గుతోంది, మళ్లీ వస్తోంది’ అన్నది గాబరాగా. ‘రాత్రి నేను దీవెన పాడుతూ చూశాను. గ్రామంలో పిశాచి తిరుగుతోంది. దాని నీడ మీ ఇంటి మీద పడింది. ఇటుగా వెళ్లి ఆ ఇళ్ల మీద నుంచి దక్షిణంగా వెళ్లిపోయింది. దానిని పట్టుకుని ముగ్గులోకి దించి నల్లపోతును కట్టుపెట్టాలి (బలివ్వడం). అప్పుడే నీ కొడుకు ప్రాణం దక్కుతుంది. ప్రాణానికి ప్రాణమే అడ్డు’ అని ఆమె ముఖంలోకి, ఇంటి వెనుక కట్టేసి ఉన్న మేకపోతును మార్చి మార్చి చూస్తున్నాడు. తల్లి ప్రేమ మరేమీ ఆలోచించలేదు. అన్నట్లుగానే రామన్న నల్లపోతును బలిచ్చాడు. భుజాన ఉన్న జోలె నుంచి పుర్రె, అస్తికలను బయటకు తీశాడు. ఏవేవో పూజలు చేశాడు. ఆ తర్వాత పేగులను మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు.

తెల్లకాళ్ల రామన్న వచ్చాడబ్బా...
నేలకోటలో ఇదో చర్చకు దారి తీసింది. వాళ్లకు అదేమీ కొత్తకాదు కానీ ప్రతిసారీ ఒక ఉదంతం ఆసక్తికరంగా మారుతుంటుంది. రామన్న సంచారజీవి. కుటుంబంతోపాటు సంచరిస్తుంటాడు. ధర్మవరం చుట్టుపక్కల పాతికకు పైగా పల్లెలకు సుపరిచితుడు. పట్టణాల జోలికి వెళ్లడు. కొండల మధ్య నివాసప్రదేశాలనే టార్గెట్ చేసుకుంటాడు. ఒక ఊరికి వచ్చి ఖాళీ జాగా చూసుకుని గుడారం వేస్తాడు. మూడు రోజుల పాటు రోజూ అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామున ఐదింటి వరకు ఊరంతా తిరుగుతూ గ్రామానికి దీవెనలిస్తున్నట్లు రాగయుక్తంగా పద్యాలు చదువుతుంటాడు. పగలు చాలా మామూలుగా తిరిగేవాడు. ఎవరినీ యాచించడు. మూడు రోజుల రెక్కీలో గ్రామంలో ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉందనేది గమనిస్తాడు. ఎవరింట్లో అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ తగాదాల వంటివన్నీ గ్రహిస్తాడు. ఏ ఇంటికి పొలం ఉంది... ధాన్యం బస్తాలివ్వగలిగిందెవరు, మేకలు, గొర్రెలు ఎవరికున్నాయి, కోళ్లతో సరిపెట్టుకోవాల్సిన ఇళ్లేవి... అనేది కూడా పట్టేస్తాడు. ఇక నాలుగవ రోజు పగటి పూట ఏదో ఓ ఇంటి ముందు ఇలా నిలబడిపోతాడు. రామన్న ఊళ్లోకి వచ్చిన రాత్రి నుంచే ‘రామన్న వచ్చినట్లుండబ్బా’ అని ఒకరికొకరు చెప్పుకునేటంతటి ఎరిక రామన్నంటే. ఇక వారం పది రోజులపాటు రామన్న బలిచ్చిన పోతులు, తోలుకెళ్లిన పోతులు కూడా చర్చలో భాగమవుతుంటాయి. రాత్రిళ్లు ఉన్నట్లుండి పెద్దగా అరుస్తూ పడిపోతాడు. తెల్లవారి ఎవరైనా అడిగితే ‘నాలుగు దెయ్యాలు వచ్చి నా గుండెల మీద కూర్చున్నాయి. రావుల చెరువు తండా, మదిరే బయిలు,నార్సింపల్ల్లిలో నేను పారదోలిన దెయ్యాలే అవన్నీ. నా ఆచూకీ వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చాయి’ అంటూ రచ్చబండ దగ్గర కబుర్లు చెబుతూ తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట రామన్న.

మందు కక్కిస్తాడు...
పిశాచాలను పారదోలడంతోపాటు దీర్ఘకాల అనారోగ్యంతో కృశించి పోతున్న వాళ్ల చేత మందు కక్కించడం రామన్నకు ఉన్న మరో అదనపు ఆకర్షణ. ‘మా అబ్బాయికి బాగాలేదనీ, అమ్మాయి నీరసించి పోతోంద’ని వచ్చిన వాళ్లను పరీక్షించి ‘ఎవరో మందు పెట్టారు, ఆ మందుని కక్కిస్తాను’ అని రంగంలో దిగుతాడు. నీటిని తాగించి తాగించి తమలపాకుతో నాలుక గీకగానే వాంతవుతుంది. అందులో కాల్చిన మాంసం ముద్ద, వెంట్రుకలు బయట పడుతుంటాయి. మరికొందరికి మందు తలలోకి ఎక్కించారని చెబుతాడు. తలకు కణిక రాయితో గాటు పెట్టి నోటితో పీలుస్తాడు. పసుపు పచ్చని ద్రవాన్ని బయటకు ఉమ్ముతాడు.
 
నేను గాని నోరు విప్పానా!
చీడపీడలను పోగొడతానంటూ మంత్రాలు చదివి నీటిలో చిటికెడు పొడి కలిపి ఇచ్చేవాడు. ఆ నీరు తియ్యగా ఉంటే వాళ్ల పీడ విరగడైనట్లు అన్నమాట. ఇక అతడు అడిగినవన్నీ సమర్పించుకోవాలి. నీరు చేదుగా ఉంటే పీడ ఇంకా విరుగుడు కాలేదు. దెయ్యం ఇంటి మీద నడుస్తోంది. నీరు తియ్యగా వచ్చే వరకు రోజూ పూజలు చేయాలి... ఇదీ వరస. ఎవరైనా రామన్న వలలో చిక్కకపోతే బెదిరింపులకు దిగుతాడు. ‘నేను మచ్చ నాలుక రామన్నని. నేనేది చెబితే అది జరుగుతుంది’ అని భయపెడతాడు. ఇంటి ముందు ఏ జీవాలున్నాయో చూసి... ‘ఇవి ఇచ్చే వరకు వెళ్లన’ని నిలబడిపోతాడు. మొండి వాడు ఏం చేస్తాడోననే భయంతో ఇచ్చేస్తారు. ఆ పరిసర గ్రామాలన్నింటిలోనూ రామన్న మీద భయంతో కూడిన గౌరవం అది.

రామన్న ఆటకట్టించాలనే ఉత్సాహం కలిగిన యువకులు ఒక బృందంగా కలిశారు. రామన్న బాధితుల్లో బాలాజీ నాయక్ ఒకరు. అతడి దగ్గర సారా తాగి డబ్బు ఎగ్గొట్టేవాడు రామన్న. అప్పు ఇవ్వనంటే శాపం పెట్టి భయపెట్టేవాడు. ఆ బాలాజీ నాయక్ కూడా యువజన బృందంతో కలవడంతో రామన్న ఆట కట్టించడం సాధ్యమైంది.        - వాకా మంజులారెడ్డి
 
తలలో మందు!
గాటు మీద నోటిని ఉంచి పీల్చినట్లు భ్రమింపచేస్తూ అప్పటికే నోట్లోకి తీసుకున్న నువ్వుల నూనెను పుక్కిలిస్తాడు. నువ్వుల నూనె లాలాజలంతో కలిసినప్పుడు పసుపురంగులోకి మారుతుంది. దాన్నే ఉమ్ముతాడు. తలలోని మందును తీసినట్లు నమ్మిస్తాడు.
 
కడుపులోకి మాంసం ఎలా వెళ్లింది?
మందును కక్కించే ప్రయత్నంలో దాదాపుగా ఐదు లీటర్ల నీటిని తాగిస్తాడు. అన్ని నీటిని తాగే క్రమంలో మనిషి బాగా అలసిపోతాడు. నీటిని గుక్క వేయాలంటే గరళాన్ని మింగినట్లు కష్టపడతారు. అప్పుడు నీటితోపాటు మాంసం ముద్దను మింగించేస్తారు. పేషెంటు మాంసాన్ని మింగుతున్న విషయం కూడా గ్రహించలేనంత నీరసించిపోయి ఉంటారు. ఆ తర్వాత తమలపాకుతో నాలుక మీద గీయగానే వాంతయిపోతుంది. మాంసం బయటకు వస్తుంది.
 
ఇలా  ఛేదించారు!
ఓ రోజు రామన్న తాగిన మత్తులో ఉన్నప్పుడు అతడి సంచిని బాలాజీ, హనుమంతరెడ్డి కొట్టేశారు. అందులో తెల్లడి పొడులు గుడ్డల్లో మూటగట్టి ఉన్నాయి. వాటిలో ఒకటి శాక్రిన్ పౌడర్, ఒకటి వేపగింజల పొడి. మళ్లీ ఏమీ తెలియనట్లు సంచిని సర్దేశాం. ఒకరోజు రచ్చ దగ్గర ఇదే ట్రిక్ చేస్తున్నప్పుడు వెళ్లి ‘నేను మంత్రించి ఇచ్చినా కూడా నీళ్లు తీపి అవుతాయి, చేదు కూడా అవుతాయి. చేసి చూపించమంటావా? నీ సంచిలో ఏమేమి ఉన్నాయో నువ్వే చూపిస్తావా, మేము తియ్యమా?’ అని నిలదీయడంతో దారికొచ్చాడు. ఈ సంగతి రామన్నను తెలిసిన ప్రతి ఊరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి తంత్రాలు మానేసి మేకలు మేపుకుంటూ బతకసాగాడు.

Monday, February 8, 2016

చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారించే ఒకే ఒక్క ఉల్లిపాయ

ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికే అనలేదు. ఎందుకంటే ఉల్లిపాయాలో శరీరానికి అంతర్గతంగా మరియు బహిర్గతంగా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది. వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు, వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లై చేస్తే చాలు. అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నేచురల్ గా క్యూర్ చేసే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ ఉల్లిపాయలో ఉన్నాయి . ఒక్క ఉల్లిపాయను ఉపయోగించి అనేక వ్యాధులను నివారించుకోవచ్చు . ఉల్లిపాయతో వాంతులు, దగ్గు, జలుబు, చాతీలో నొప్పి, రొమ్ము పడిశము, చెవి నొప్పి మరియు పొట్టనొప్పి వంటినెంటినో గ్రేట్ గా నివారించుకోవచ్చు. అవును ఒక్క ఉల్లిపాయతోనే ఈ జబ్బులన్నీంటే తగ్గించుకోవచ్చు.


జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి :
శరీరం మీద బహిర్గతంగా అయిన గాయాలను మరియు ఇన్పెక్షన్స్ ను మరియు వీటి ద్వారా రక్త స్రావాన్ని నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారించి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బయోటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో క్యూర్సిటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే శరీరంలోని టాక్సిన్స్ ను శరీరం నుండి ఉల్లిపాయ తొలగిస్తుంది .

జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!
ఉల్లిపాయ రసం శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. చాతీలో చేరిన అన్ని శ్లేష్మం (కఫం) బహిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు జాయింట్ పెయిన్, డయాబెటిస్, హార్ట్ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది.

దగ్గు: ఉల్లిపాయను రెండు గా కట్ చేయాలి. ఉల్లిపాయ లోపలి బాగంలో ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లై చేయాలి. ఇలా ప్రతి ఒక్క లేయర్ అప్లై చేసిన తర్వాత, ఇప్పుడు ఈ రెండు భాగాలను క్లోజ్ చేసి, ఒక జార్లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది.

ఫీవర్: జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. ఉల్లిపాయను రెండుభాగాలుగా కట్ చేసి, సగం ఒక కాలి పాదం క్రింద, మరో సగం మరో కాలి పాదం క్రింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్ మరియు జబ్బులను నివారిస్తుంది.

వాంతులు: ఉల్లిపాయలను గ్రైండ్ చేసి అందు నుండి రసాన్ని తియ్యాలి. ఇప్పుడు స్ట్రాంగ్ గా పుదీనా టీ తయారుచేసి, 2చెంచాలా ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి, 5నిముషాల తర్వాత 2 చెంచాల చల్లటి పుదీనా టీ త్రాగాలి మరియు 5 నిముషాల తర్వాత దీన్ని రిపీట్ చేయాలి. ఇలా చేస్తుంటే వాంతులు త్వరగా తగ్గుతాయి.

తెగిన గాయాల నుండి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది: ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ ఔటర్ స్కిన్ ను తెగిన గాయం చుట్టూ చుట్టాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది . మరియు గాయం చుట్టూ క్రిములు చేరకుండా నాశనం చేస్తుంది.

జలుబు దగ్గు, కఫం తగ్గిస్తుంది: ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను చాతీ మీద అప్లై చేయాలి. తర్వాత టవల్ ను కప్పాలి. లేదా రాత్రుల్లో ఇలా చేసి టీషర్ట్ ధరించి పడుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం తగ్గుతుంది.

చెవి నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది: చెవి నొప్పిని మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ ను నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . ఆప్రదేశంలో క్లాత్ తో చుట్టేయాలి .

బేబీస్ లో పొట్టనొప్పిని తగ్గిస్తుంది: పిల్లల్లో పొట్టనొప్పిని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు చేయాల్సిందల్లా, ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి . ఆనియన్ వాటర్ కూల్ గా అయిన తర్వాత , ఈ వాటర్ ను ఒక చెంచా పిల్లలకు త్రాగిస్తే తక్షణ రిలీఫ్ పొందుతారు . గంటకొక్కోసారి ఇస్తుంటే నొప్పి నివారించబడుతుంది.