Friday, November 6, 2015

Quote of The Day

ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో,
ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్దతుల విషయంలో కూడా
అంతే శ్రద్ధ వహించాలి.. - స్వామీ వివేకానందుడు

Thursday, November 5, 2015

గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు
గ్రీన్ టీ అనగానే అందరు సాధారణంగా కొవ్వును కరిగించుకోటానికి వాడతారు అని తెలుసు. కానీ గ్రీన్ టీ వలన మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మరియు అనేక రకాలైన మూలకాలను అందిస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.



ఆరోగ్యవంతమైన కణాలు

గ్రీన్ టీ యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది, వీటిని కాటేచిన్స్ (Catechins) అంటారు. ఇవి కణాలకు హానిచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన కణాలకు మంచిది.

మధుమేహం

గ్రీన్ టీ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, అనగా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీ లో 'కాటేచిన్స్' (CATECHINS) ఉండటం వలన శరీరంలోని కొవ్వు  మరియు రక్తపీడనాన్ని తగ్గిస్తుంది, అందువలన మధుమేహం కలుగుతను ఆలస్యం లేదా నియంత్రిస్తుంది.

గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది

గ్రీన్ టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది. గ్రీన్ టీ అధిక రక్త పీడనాన్ని మరియు 'కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్' వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.

బరువు తగ్గటం

గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్'గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలోరిలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి మీరు తీసుకునే చక్కర ద్రావకానికి బదులుగా గ్రీన్ టీ తీసుకోండి.

మెదడు చురుగ్గా ఉండటానికి

గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకి చాలా మంచిది, ఇది ప్లేక్స్ (Plaques) ఏర్పడటాన్ని నివారించి, మతిమరపు (Alzeimer's) రాకుండా చేస్తుంది. గ్రీన్ టీ మెదడులో పనిచేసే మరియు గుర్తుపెట్టుకొనే (Working-Memory) భాగంలో దీని ప్రభావాన్నిచూపిస్తుంది.

క్యాన్సర్గ్రీన్ టీ చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది, అందులో క్యాన్సర్'ను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ అన్ని రకాల కణాల పెరుగుదలకు సహకరిస్తుంది, దాని వల్ల కాన్సర్ నివారిస్తుంది.

కీళ్ళనొప్పులు

గ్రీన్ టీ చాలా శక్తివంతంగా కీళ్ళనొప్పుల వంటి వ్యాధులకు పని చేస్తుంది అని చాలా పుస్తకాలలో ప్రచూరించారు. గ్రీన్ టీ, జబ్బు పడిన ఇన్ఫ్లమేషన్'కి గురైన కణాలు 'కార్టిలేజ్'తో కలిగి ఉండే సంబంధాన్ని విచ్చిన్నం చేసి కీళ్ళనొప్పుల వంటి వ్యాధులను రాకుండా చేస్తుంది. మీరు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లైతే రోజుకి ఒక కప్పు గ్రీన్ టీ తాగటానికి ప్రయత్నించండి.

ఒత్తిడి నుండి ఉపశమనం

ఒక కప్పు గ్రీన్ తాగటం వల్ల మీరు ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. గ్రీన్ టీ 'థయామిన్', 'అమినోసిడ్స్'ని కలిగి ఉండటం వల్ల ఇది కామింగ్ (Calming) ఎఫెక్ట్'ని కలుగచేస్తుంది. మీరు ఒత్తిడిగా భావించినపుడు అయినపుడు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల ఉపశమనం పొందుతారు.

రోగనిరోధకత

గ్రీన్ టీలో ఉండే రసాయనాలు, చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. గ్రీన్ టీ రోగనిరోధక వ్యవస్థకి శక్తిని సమకూర్చునని పుస్తకాలలో ప్రచురించారు.

ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానెల్ చేస్తున్న నీచానికి కారణం ఇదే..!


హైదరాబాద్) చంద్రబాబు నాయుడు కి భజన చేసేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న నీచమైన రాజకీయం బట్టబయలు అయింది. తిరుపతిలో అడ్డదారిలో ఎకరంన్నర విలువైన స్థలం కొట్టేసి, అందుకు రుణం తీర్చుకొనేందుకు చౌకబారు ఎత్తుగడలు వేయటం తగదని వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి, తాను, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమై ప్రాంతీయ ఉద్యమాన్ని లేవదీయబోతున్నామంటూ ఏబీఎన్  -ఆంధ్రజ్యోతి చానెల్ నీచమైన ప్రచారానికి తెర లేపిందని ఆయన మండిపడ్డారు. ఆ పత్రికా ప్రకటన సారాంశం ఆయన మాటల్లోనే...
 ‘వాస్తవానికి నేను హైదరాబాద్‌లోనే లేను. నా నియోజకవర్గంలో ఉన్నా.

చంద్రబాబు హయాంలో మొత్తంగా 13 జిల్లాలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని, ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదాన్ని ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేము బహిరంగంగా ప్రజల దృష్టికి  తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మైసూరారెడ్డిని, నన్నూ ప్రస్తావిస్తూ ఈ రోజు ఇచ్చిన కథనం పూర్తిగా ఆ చానెల్ దిగజారుడు జర్నలిజానికి, చెంచాగిరీకి, కుట్ర పూరిత వ్యవహారానికి అద్దం పడుతోంది. తిరుపతిలో ఎకరం భూమి రూ.5 కోట్లు పలుకుతోంటే.. ఎక రా కేవలం రూ.80 లక్షల చొప్పున 1.5 ఎకరాల భూమిని చంద్రబాబు పభుత్వం ఈ చానెల్ యాజమాన్యానికి కట్టబెడుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం ఆమోదింప జేసుకుంది.

ఇది జరిగిన మరునాడే చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు ఇంతగా దిగజారి పోయి ఆ చానెల్ ఈ  కథనాన్ని అల్లింది. రాష్ట్రంలో ఒకపక్క కరువు నెలకొంది. అప్పుల తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. పట్టిసీమ నుంచి రాజధాని వరకు, ఇసుక నుంచి మైనింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, రాక్షస చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అన్నింటికీ మించి వంగవీటి మోహనరంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న అంశంపై రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అంతా అట్టుడుకుతోంది.

వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అప్పనంగా రూ.కోట్ల  ఆస్తిని కట్టబె ట్టిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఈ చానెల్ ఇంతగా దిగజారిపోయి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మీద, మైసూరారెడ్డిపైనా, చివరకు నామీద కూడా పాతాళపు స్థాయి నీచ రాజకీయానికి దిగింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా పార్టీ వ్యతిరేకం. హైదరాబాద్ అనుభవాల నేపథ్యంలో అటువంటి పని చేయరాదన్నది మా విధానం. ఈ విషయంలో దాపరికం కానీ రాజీ గానీ ఉండబోదు..’ అని గడికోట తన ప్రకటనలో స్పష్టం చేశారు.

Tuesday, November 3, 2015

కలబంద రసం వలన కలిగే దుష్ప్రభావాలు


  •     అధిక మొత్తంలో కలబంద రసం తీసుకోవటం వలన విరేచనాలు కలుగుతాయి.
  •     ఇది శరీరంలో కొన్ని రకాల మందులు గ్రహించటాన్ని ఆపివేస్తుంది.
  •     కలబంద రసాన్ని తాగటం వలన అలర్జీలు కలుగవచ్చు.
  •     గర్భంతో ఉన్న ఆడవారు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.


విరేచనాలు


అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవటం వలన ఇందులో ఉండే 'లాక్సైటీవ్' గుణాలు విరేచనాలను కలిగిస్తాయి. కానీ కొంత మంది వారి భోజనానికి ముందుగా ఆహరం జీర్ణం అవటానికి, పోషకాలను గ్రహించుకోటానికి, ఆహర విచ్చిన్నానికి గానూ ఈ రసాన్ని తీసుకుంటారు. తగిన మొత్తంలో తీసుకోవటం వలన పేగు కదలికలకు ఉపయోగపడుతుంది, కానీ అధిక మొత్తంలో దీనిని తీసుకోవటం వలన విరేచనాలు మరియు తిమ్మిరులు కలుగుతాయి.




మందులకు స్పందన


మీరు ఒకవేళ ఎవైన సమస్యలను కలిగి ఉండి లేదా వైద్యుడు చెప్పిన విధంగా మందులను పాటించే సమయంలో కలబంద రసం తాగటం వలన, మందులతో కలిసి దుష్ప్రభావాలను అధికం చేస్తుంది. అతేకాకుండా కలబంద రసంలో ఉండే లాక్సైటీవ్ గుణాలు తీసుకున్న మందులతో కలిసి, వేసుకున్న మందులను శరీరంలో గ్రహించకుండా చేస్తాయి. ఒక్క అల్లోపతి మందుల విషయంలో మాత్రమె కాకుండా, అల్లం మరియు ఫేనుగ్రీక్ విత్తనాలతో కూడా కలిసి దుష్ప్రభావాలకు గురి చేస్తుంది. కలబంద రసం తాగటం వలన శరీర రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు మరియు పొటాషియం స్థాయిలు తగ్గటం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.

అలర్జీ

లిల్లియేసి కుటుంబానికి చెందిన (ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, తులిప్, లిల్లీస్) వాటిని వాడినపుడు మీరు అలర్జీలకు గురవుతున్నారా, అయితే మీరు కలబందను వాడితే తప్పని సరిగా అలర్జీలకు గురవుతారు. కలబంద రసం వలన చర్మం పై దద్దురులు, చాతిలో నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కలబంద వలన మీరు అలర్జీకి గురవుతున్నారో లేదో తెలుసుకోటానికి, దీనిని వాడటానికి ముందుగా కొన్ని చుక్కల కలబందను మీ చర్మం పైన వేయండి, మీ చర్మం పైన ఎవైన సమస్యలు కలిగి ఉన్నట్లయితే కలబంద వలన మీరు అలర్జీకి గురవుతున్నారు అని అర్థం.

స్రావాలు

గర్భంతో ఉన్న స్త్రీలు కలబంద రసానికి వీలైనంత దూరం ఉండటం మంచిది, ఇందులో ఉండే లాక్సైటీవ్ గుణాలు గర్భంతో ఉన్న ఆడవారిని స్రావలకు గురి చేసి, జనన లోపాలను కలుగచేస్తాయి. కలబంద రసం త్రాగటం వలన తల్లి నుండి పాల ద్వారా శిశువులోకి చేరి విరేచనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఎవరయితే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటారో వారు కూడా కలబంద రసానికి వీలైనంత దూరం ఉండటం శ్రేయస్కరం.

జీర్ణక్రియ సంబంధిత సమస్యలు

కలబంద రసం తాగటం వలన పేగు కదలికలో సమస్యలు మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలను కలుగచేస్తాయి. కలబంద రసం వలన కలిగే దుష్ప్రభావాలు ఇంతటితో ఆగకుండా, ఎక్కువ మొత్తంలో లాక్సైటీవ్ గుణాలను కలిగి ఉన్న కలబంద రసం తాగటం వలన శరీరంలో ఎలక్ట్రాన్'ల అసమతుల్యత మరియు డీ-హైడ్రేషన్ వంటి సమస్యలకి లోనయ్యే అవకాశం ఉంది. మూత్ర విసర్జనలో మూత్రం ఎరుపు లేదా గులాభి రంగులోకి మారటానికి కారణం కూడా కలబంద అని చెప్పవచ్చు.

గుండె సంబంధిత వ్యాధులు

కలబంద రసం త్రాగటం వలన, గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే 'అడ్రినలిన్' హార్మోన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను తగ్గించి, క్రమ రహిత హృదయ స్పందనలను కలిగిస్తుంది, మృదు కండరాలను బలహీన పరుస్తుంది. కావున దీనికి చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్న వారు దూరంగా ఉండాలి.

రక్తంలో చక్కెర

కలబంద రసం తాగటం వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయ పరిచే మందులు లేదా మధుమేహ వ్యాధి కలిగిన వారు అయితే సాధ్యమైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరైతే రోజు ఇన్సులిన్ వంటి మందులను వాడతారో మరియు శరీరంలో చక్కెర స్థాయిలను సమన్వయపరిచే మందులను వాడతారో, వారు కలబంద రసం, కలబందకు దూరంగా ఉండటం చాలా మంచిది.

ఎక్కువ కాలం పాటూ కలబంద రసం తీసుకోవటం వలన మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో కలబంద తీసుకోవటం వలన 'పెల్విస్' మరియు 'మూత్రపిండ' సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున కలబంద రసంకు దూరంగా ఉండటం క్షేమం.

రైతుల కష్టాలకు కారణాలు ఏమిటి

రైతు కంట కన్నీరు తెలుగు నాట రైతులకు కష్టాలు తలుపు తట్టి లోపలకు వచ్చాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నాయి. కష్టాల ఊబిలోకి కూరుకొని పోవటమే కాని బయటకు వచ్చే మార్గం కాన రావటం లేదు.

రుణమాఫీచేసిన గాయం..
అధికారంలోకి రావటానికి ముందు నుంచీ చంద్రబాబు ప్రచారం ఊదరగొట్టారు. బ్యాంకులకు అప్పులు కట్టాల్సిన పని లేదని, తాము అదికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ చేసేస్తానని నమ్మబలికారు. నమ్మి ఓట్లేసినందుకు చంద్రబాబు తన తడాఖా చూపించారు. పదవిలోకి వచ్చాక కూడా రుణమాఫీ జరిగిపోతోందని ప్రచారం కొనసాగించారు. దీంతో రైతులు అప్పు కట్టకుండా నిరీక్షించారు. వాస్తవానికి వ్యవసాయ రుణాల విషయంలో మొదటి సీజన్ పూర్తయ్యే దాకా బ్యాంకులు నామ మాత్రపు వడ్డీతో నిరీక్షిస్తాయి. కానీ, సీజన్ దాటిపోతే మాత్రం మొదట రోజు నుంచి చక్రవడ్డీ విధిస్తాయి. చంద్రబాబు ని నమ్మిన రైతులందరికీ వడ్డీల మీద వడ్డీ , అంటే చక్రవడ్డీలు పడిపోయాయి. దీంతో బ్యాంకుల్లో రుణాలు తడిసిమోపెడు అయ్యాయి.

పెట్టుబడి కరవు
2,3 సీజన్ లు దాటాక రైతులకు పెట్టుబడి దొరికే దారి లేకుండా పోయింది. బ్యాంకులు పాత బాకీలు తీరిస్తే తప్ప గుమ్మం తొక్కద్దని చెప్పేశాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇదే అదనుగా వడ్డీ రేటు పెంచేశారు. దీంతో మరో మార్గం లేక 5,6 రూపాయిల వడ్డీకి అప్పులు తెచ్చుకొన్నారు. అటు బ్యాంకుల అప్పు, ఇటు ప్రైవేటు అప్పు అన్నీ కలిసి రైతుల్ని అప్పుల కుప్పంలోకి లాగేస్తున్నాయి. చిన్న రైతులు, కౌలు రైతులకు మాత్రం ఈ అప్పులు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు.

విత్తన సమస్య
ప్రతీ ఏటా వ్యవసాయ శాఖ సీజన్ కు ముందుగానే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. వచ్చే సీజన్ లో ఎంత మేర సాగు జరుగుతుంది, ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల అవసరాలు వంటివి మదింపు చేస్తుంది. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు పూర్తిగా రాజధాని పనుల్లో బిజీగా మారిపోవటంతో సన్నాహాక భేటీలు కొండెక్కేశాయి. దీంతో సీజన్ కు సరిపడ విత్తనాలు, ఎరువులు వంటివి కరవయ్యాయి. దీంతో నాసిరకం విత్తనాలతో సేద్యానికి రైతులు ఒడిగట్టాల్సి వచ్చింది. దీంతో ప్రక్రతి కాస్తంత కోపించినా పంట మొత్తం నష్టపోవాల్సి వస్తోంది.
సాగునీటి కష్టాలు
వ్యవసాయానికి సాగునీరు గుండె కాయ వంటిది. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే పొలాలకు సక్రమంగా తడి అందుతుంది. కానీ చంద్రబాబు పంతం పట్టి మరీ , ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేసేస్తున్నారు. సగానికి సగం సిబ్బంది కొరత ఉండటంతో అదునుకు తగినట్లుగా నీటిని విడుదల చేయటం లేదు. క్షేత్ర స్థాయిలో పనిచేసే లష్కర్ వంటి పోస్టులు వదిలేయటంతో నీటిని వదిలే పరిస్తితి కనిపించటం లేదు. దీంతో పొలాలకు నీరు అందటం లేదు. అటు ప్రధాన ప్రాజెక్టులన్నీ నత్త నడక నడుస్తున్నాయి. చెరువులు, కాల్వల్లో పూడిక తీసే నాధుడులేడు. దీంతో అడప తడపా నీటి తడులతోనే కాలం వెళ్లబుచ్చాల్సి  వస్తోంది.
బాబుతో తరలి వచ్చిన కరవు
చంద్రబాబు కరవు కవల పిల్లలు అని చెబుతారు. ఏడాది కాలంగా కరవు పరిస్తితి కరాళ నాట్యం చేస్తోంద. 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కంటికి చుక్క నీరుకనిపించక రైతుల కళ్లల్లో నీ రు తిరుగుతోంది. అయినప్పటికీ కరవు మండలాల ప్రకటనలో చంద్రబాబు తన బుద్ది బయట పెట్టుకొన్నారు. సగానికి సగం మండలాల్ని తగ్గించేసి మమ అనిపించేశారు. స్వయంగా వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 350 మండలాలు కరవు మండలాలు ఉన్నాయని ప్రకటిస్తే, దాన్ని పట్టించుకోకుండా 200 లోపే కరవు మండలాల్ని ప్రకటించారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల్ని ఎగ్గొట్టేందుకు బాబు పన్నిన కుట్ర ఇది.

గిట్టుబాటు ధర విషయంలో పూర్తి స్తాయి మోసం
ఇన్ని కష్టాలు పడి వ్యవసాయం చేస్తే రైతులకు చివరకు మిగిలేది శూన్యమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. మద్య దళారీలు, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయాలు అమలు అవుతున్నాయి. ఎంత మొత్తుకొన్నా వరికి రూ. 50కి మించి మద్దతు ధర పెంచలేదంటే అర్థం చేసుకోవచ్చు. అయిన కాడికి అమ్ముకొని రైతులు బయట పడుతున్నారు. చివరకు రైతు పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి మాదిరిగా తయారైంది.
అనుబంధ పరిశ్రమలదీ అదే తీరు
వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు దిగాలు చెందాయి. కరెంటు కోతలు, అంటు వ్యాధులతో పౌల్ట్రీ ఫామ్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. రేటు విషయంలో దళారీలు ఆడిందే ఆట గా సాగుతోంది. పాడి పరిశ్రమ బాగా క్షీణించింది. రాష్ట్రమంతా కరవు వ్యాపించటంతో పచ్చ గడ్డి నిల్వలు అడుగంటిపోయాయి. మనుషులు తాగటానికే నీళ్లు లేకపోవటంతో పశువులకు నీరు అందించే దిక్కు లేదు.