- అధిక మొత్తంలో కలబంద రసం తీసుకోవటం వలన విరేచనాలు కలుగుతాయి.
- ఇది శరీరంలో కొన్ని రకాల మందులు గ్రహించటాన్ని ఆపివేస్తుంది.
- కలబంద రసాన్ని తాగటం వలన అలర్జీలు కలుగవచ్చు.
- గర్భంతో ఉన్న ఆడవారు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
విరేచనాలు
అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవటం వలన ఇందులో ఉండే 'లాక్సైటీవ్' గుణాలు విరేచనాలను కలిగిస్తాయి. కానీ కొంత మంది వారి భోజనానికి ముందుగా ఆహరం జీర్ణం అవటానికి, పోషకాలను గ్రహించుకోటానికి, ఆహర విచ్చిన్నానికి గానూ ఈ రసాన్ని తీసుకుంటారు. తగిన మొత్తంలో తీసుకోవటం వలన పేగు కదలికలకు ఉపయోగపడుతుంది, కానీ అధిక మొత్తంలో దీనిని తీసుకోవటం వలన విరేచనాలు మరియు తిమ్మిరులు కలుగుతాయి.
మందులకు స్పందన
మీరు ఒకవేళ ఎవైన సమస్యలను కలిగి ఉండి లేదా వైద్యుడు చెప్పిన విధంగా మందులను పాటించే సమయంలో కలబంద రసం తాగటం వలన, మందులతో కలిసి దుష్ప్రభావాలను అధికం చేస్తుంది. అతేకాకుండా కలబంద రసంలో ఉండే లాక్సైటీవ్ గుణాలు తీసుకున్న మందులతో కలిసి, వేసుకున్న మందులను శరీరంలో గ్రహించకుండా చేస్తాయి. ఒక్క అల్లోపతి మందుల విషయంలో మాత్రమె కాకుండా, అల్లం మరియు ఫేనుగ్రీక్ విత్తనాలతో కూడా కలిసి దుష్ప్రభావాలకు గురి చేస్తుంది. కలబంద రసం తాగటం వలన శరీర రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు మరియు పొటాషియం స్థాయిలు తగ్గటం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.
అలర్జీ
లిల్లియేసి కుటుంబానికి చెందిన (ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, తులిప్, లిల్లీస్) వాటిని వాడినపుడు మీరు అలర్జీలకు గురవుతున్నారా, అయితే మీరు కలబందను వాడితే తప్పని సరిగా అలర్జీలకు గురవుతారు. కలబంద రసం వలన చర్మం పై దద్దురులు, చాతిలో నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చర్మ సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కలబంద వలన మీరు అలర్జీకి గురవుతున్నారో లేదో తెలుసుకోటానికి, దీనిని వాడటానికి ముందుగా కొన్ని చుక్కల కలబందను మీ చర్మం పైన వేయండి, మీ చర్మం పైన ఎవైన సమస్యలు కలిగి ఉన్నట్లయితే కలబంద వలన మీరు అలర్జీకి గురవుతున్నారు అని అర్థం.
స్రావాలు
గర్భంతో ఉన్న స్త్రీలు కలబంద రసానికి వీలైనంత దూరం ఉండటం మంచిది, ఇందులో ఉండే లాక్సైటీవ్ గుణాలు గర్భంతో ఉన్న ఆడవారిని స్రావలకు గురి చేసి, జనన లోపాలను కలుగచేస్తాయి. కలబంద రసం త్రాగటం వలన తల్లి నుండి పాల ద్వారా శిశువులోకి చేరి విరేచనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఎవరయితే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటారో వారు కూడా కలబంద రసానికి వీలైనంత దూరం ఉండటం శ్రేయస్కరం.
జీర్ణక్రియ సంబంధిత సమస్యలు
కలబంద రసం తాగటం వలన పేగు కదలికలో సమస్యలు మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలను కలుగచేస్తాయి. కలబంద రసం వలన కలిగే దుష్ప్రభావాలు ఇంతటితో ఆగకుండా, ఎక్కువ మొత్తంలో లాక్సైటీవ్ గుణాలను కలిగి ఉన్న కలబంద రసం తాగటం వలన శరీరంలో ఎలక్ట్రాన్'ల అసమతుల్యత మరియు డీ-హైడ్రేషన్ వంటి సమస్యలకి లోనయ్యే అవకాశం ఉంది. మూత్ర విసర్జనలో మూత్రం ఎరుపు లేదా గులాభి రంగులోకి మారటానికి కారణం కూడా కలబంద అని చెప్పవచ్చు.
గుండె సంబంధిత వ్యాధులు
కలబంద రసం త్రాగటం వలన, గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే 'అడ్రినలిన్' హార్మోన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను తగ్గించి, క్రమ రహిత హృదయ స్పందనలను కలిగిస్తుంది, మృదు కండరాలను బలహీన పరుస్తుంది. కావున దీనికి చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్న వారు దూరంగా ఉండాలి.
రక్తంలో చక్కెర
కలబంద రసం తాగటం వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయ పరిచే మందులు లేదా మధుమేహ వ్యాధి కలిగిన వారు అయితే సాధ్యమైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరైతే రోజు ఇన్సులిన్ వంటి మందులను వాడతారో మరియు శరీరంలో చక్కెర స్థాయిలను సమన్వయపరిచే మందులను వాడతారో, వారు కలబంద రసం, కలబందకు దూరంగా ఉండటం చాలా మంచిది.
ఎక్కువ కాలం పాటూ కలబంద రసం తీసుకోవటం వలన మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో కలబంద తీసుకోవటం వలన 'పెల్విస్' మరియు 'మూత్రపిండ' సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున కలబంద రసంకు దూరంగా ఉండటం క్షేమం.
No comments:
Post a Comment