Saturday, June 25, 2016

పొట్ట ఫ్లాట్ గా మారాలంటే.. ఈ కామన్ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!!

సెలబ్రెటీలు, మోడల్స్ సోయగాలు, బాడీ షేప్ చూసి వండర్ అవుతూ ఉంటారా ? ఫిట్ అండ్ సెక్సీగా ఉండే శరీరాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. పొట్ట ఏమాత్రం కనిపించని.. వాళ్ల లాంటి ఫ్లాట్ టమ్మీ పొందాలని ఆరాటపడుతున్నారా ? 

అలాంటి బాడీ పొందడానికి.. ఎంత వ్యాయామం, డైట్ ఫాలో అయినా ఫలితం పొందడం లేదని బాధపడుతున్నారా ? అయితే పొట్టకొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని అని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. పొట్టలో ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా ఫ్యాట్ పేరుకుంటుందట. 

బాడీ బిల్డర్స్ కి కూడా.. ఫ్లాట్ టమ్మీ పొందడం చాలా కష్టమైన, ఛాలెంజ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఫ్లాట్ పొట్ట పొందడానికి నెలలపాటు శ్రమించాలని చెబుతున్నారు. అయితే డైట్ లో కొన్ని మార్పులు కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు.



అన్ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటిని ఇష్టపడేవాళ్లు అయితే.. ఫ్లాట్ బెల్లీ పొందడం మరింత కష్టమైన పని, కొన్ని డైలీ హ్యాబిట్స్ వల్ల.. పొట్టలో ఫ్యాట్ చేరుకుంటుంది. మీరు తీసుకునే కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా పొట్టలో ఫ్యాట్ కి కారణమవుతాయి. కాబట్టి.. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఫ్లాట్ స్టమక్ పొందవచ్చో తెలుసుకుందాం.. 

డైరీ ప్రొడక్ట్స్ 
డైరీ ప్రొడక్ట్స్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు అవి ఆరోగ్యకరమే. కానీ అవి ఎక్కువ బరువు పెరగడానికి కారణమవుతాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడానికి ఇవి కారణమవుతాయి. ఎందుకంటే. .వాటిలో ఫ్యాట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి రోజూ డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే మోతాదు తగ్గించాలి, లేదా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం మంచిది.

రిఫైన్డ్ షుగర్ స్వీట్స్, డోనట్స్, పేస్ట్రీస్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిల్లో షుగర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కాఫీ, టీలలో కూడా రోజూ షుగర్ యాడ్ చేస్తుంటారు. ఇవన్నీ.. పొట్టలో తేలికగా ఫ్యాట్ చేరడానికి కారణమవుతాయి. కాబట్టి.. రిఫైన్డ్ షుగర్స్ కి దూరంగా ఉంటే.. ఫ్లాట్ టమ్మీ సొంతం చేసుకోవచ్చు.



సాల్టీ ఫుడ్స్ 
వంటకాల్లోకి కావాల్సిన దానికంటే.. ఎక్కువ సాల్ట్ కలపడం అలవాటు కొంతమందికి ఉంటుంది. అలా ఎక్కువగా సాల్ట్ కలపడం వల్ల.. పొట్ట పెద్దగా మారడానికి కారణమవుతుంది. దాన్ని తగ్గించడం కూడా కష్టంగా మారుతుంది. కాబట్టి.. సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.

కార్బోహైడ్రేట్స్ వైట్ బ్రెడ్స్, పిజ్జా, పాస్తా, రైస్ వంటి వాటల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కార్బోహైడ్రేట్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే.. ఎనర్జీ లెవెల్స్ పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. కానీ.. మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. పొట్ట పెద్దగా పెరగడానికి కారణమవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ తేలికగా ఫ్యాట్ గా మారతాయి.

Friday, June 24, 2016

ఆ ఫుడ్ లో అంత కిక్ ఉందా..?

హెల్తీగా ఉండటం అంటే.. తినడం, పడుకోవడం కాదు. డైట్ లో చేర్చుకునే ఆహారాలే మన హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. సమయానికి తినడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారాలపై డైట్ లో చేర్చుకోవడం కూడా చాలా అవసరం. శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో పోషకాహారం అవసరమవుతుంది. కాబట్టి.. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మన పర్ఫెక్ట్ గా ఉంటాం. 

హెల్తీ ఫుడ్ అనగానే.. చాలా ఖర్చుతో కూడినదని చాలామంది భావిస్తారు. ప్రొటీన్ డ్రింక్స్, డైట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా.. అంతా ఎక్కువ ఖర్చు చేసి తీసుకోవాల్సినని అనుకుంటారు. కానీ.. తక్కువ ధరలో లభించే సూపర్ ఫుడ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకుంటే.. మీరు హెల్తీగా ఉన్నట్టే.



గుడ్లు: కోడి గుడ్లు తింటే ఫ్యాట్‌ పెరుగుతుందని చాలామందిలో అపోహ ఉంది. కానీ గుడ్డులో మినరల్స్‌, రైబోఫ్లెవిన్‌, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

క్యారెట్స్‌: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ.. వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్‌-ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్‌ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.



వెల్లుల్లి: వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ.. ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యమూ బావుంుటంది. ఇందులో ఉండే విటమిన్ బి, సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్‌ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది. 





క్యాబేజ్‌: క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్‌ ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్‌ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ పొందవచ్చు. హార్ట్‌‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో క్యాబేజ్‌ వల్ల లభించే పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ కీలకపాత్ర పోషిస్తాయి. 



పాలు: పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్‌, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.









Thursday, June 23, 2016

యాంటీ వైరల్ ఫుడ్స్..

కొన్ని సందర్భాల్లో కొన్ని యాంటీబయోటిక్స్ తీసుకొన్నా కూడా వైరస్ మీద అంత ప్రభావం చూపవు. సాధారణంగా కోల్డ్, ఫ్లూ(జలుబు, దగ్గు) వంటివి వాతావరణంలో మార్పుల కారణంగా ఇన్ఫెక్షన్స్ కు గురౌతుంటారు. 

సహజంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహారాలను మనం రెగ్యులర్ గా తినడం వల్ల ఇటువంటి మైనర్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి ఒక మంచి ఐడియా. ఫీవర్ , కోల్డ్, కఫ్ వంటి జబ్బులను నివారించుకోవడానికి మెడిసిన్స్ బాగా పనిచేసినా, మనం తీసుకొనే ఆహారాల ద్వారా మన శరీరానికి స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు. మనం రెగ్యులర్ గా తీసుకొనే నేచురల్ ఆహారాల్లో యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం మంచింది. వ్యాధినిరోధకతను పెంచుకోవడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చేస్తాయి. 

ముఖ్యంగా సీజనల్ గా మనకు అందుబాటులో ఉండే ఆహారాలతోనే ఇటువంటి కామన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . వాతావరణంలో మార్పుల వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురౌతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన యాంటీ వైరల్ ఆహారాలను తీసుకోవాలి. అలాంటి ఆహారాలు మన కిచెన్ లో ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీకోసం...


1.అల్లం: అల్లం ఒక పవర్ ఫుల్ యాంటీ వైరల్ పదార్థాలు . ఇందులో వైద్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి,.అల్లం పేస్ట్ కు కొద్దిగా తేనె మిక్స్ చేిస తీసుకోవడం వల్ల సీజనల్ గా వచ్చే జబ్బులను నివారించుకోవచ్చు. అలాగే మీరు జలుబు దగ్గుతో బాధపడుతుంటే జింజర్ టీ తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.


2. పసుపు: పసుపులో కుర్కుమిన్ అనే ఔషధగుణం ఉంది. ఇది యాంటీ వైరల్ నేచుర్ కలిగినది. కాబట్టి పసుపును రెగ్యులర్ వంటల్లో ఉపయోగించడం వల్ల కొన్ని సాధారణ వైరలన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.


3. వెల్లుల్లి: వెల్లుల్లి ఒక ఔషధపదార్థం. ఔయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెల్లుల్లి పాయలను పచ్చివి తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ను 60శాతం వరకూ తగ్గించుకోవచ్చు.


4. ఆలివ్ లీఫ్: ఆలీవ్ లీఫ్ లో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ లీఫ్ ను నీటిలో మరిగించి ఆవిరి పట్టడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవచ్చు.


5. గ్రీన్ టీ: గ్రీన్ టీలో క్యాచసిన్స్ ఉన్నాయి. గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది . అందుకే రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి.


6. మష్రుమ్: మష్రుమ్ లో యాంటీ వైలర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి . రెగ్యులర్ వంటల్లో మష్రమ్ చేర్చుకోవడం వల్ల యాంటీ వైరల్, యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవచ్చు.


7. లికోరైస్ : లికోరైస్ ఒక గ్రేట్ హెర్బ్ . ఇందులో యాంటీవైరల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి . ఇద బాడీ సెల్స్ లో వైరస్ అటాక్ కాకుండా నివారిస్తాయి.

Wednesday, June 22, 2016

భోజనం తర్వాత ఇలా చేస్తే వందేళ్ళు ఆరోగ్యంగా ఉండోచ్చట..

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గించుకోవాలనుకునే వారు వర్కౌట్స్ చేయడానికి లేదా జిమ్ కు వెళ్ళడానికి లేజీగా పీలవుతుంటారు. అందుకు ఒక సింపుల్ చిట్కా...భోజనం చేసిన తర్వాత సింపుల్ గా వాక్ చేయండి. ఇది పాతకాలపు పద్దతో లేదా అపోహనో కాదు. ఇది నిజంగా కొంత ప్రయోజనం కలిగిస్తుంది కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు . భోజనం తర్వాత నడవడం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. బరువు కంట్రోల్ చేస్తుంది, నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫ్యాటీ లివర్ ను నివారిస్తుందని పరిశోధనల్లో నిర్ధారించబడినది. 

భోజనం చేసిన తర్వాత మీ లాన్ లో లేదా బాల్కనీలో మీకు అనుకూలమైన ప్రదేశంలో చిన్న వాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్రబాగా పడుతుంది . బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి . భోజనం చేసిన తర్వాత చిన్న పాటి నడక వల్ల జీర్ణశక్తి పెరిగి, జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది . బోరుగా అనిపిస్తే మీకు నచ్చిన వారితో, లేదా మీ పార్ట్నర్ తో కబుర్లు చెప్పుకుంటూ 10 నిముషాలు నడవడం వల్ల మీకు ఆ ఫీలింగ్ కూడా తెలియదు. 



బరువు తగ్గి, హెల్తీగా ఉండటానికి ఒది ఒక సింపుల్ ఫన్నీ మార్గం. అంతే కాదు, భోజనం చేసిన వెంటనే ఒక చిన్న పాటి నడక వల్ల మరికొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...



బరువు తగ్గుతారు: బరువు తగ్గించుకోవాలి, కానీ వ్యాయామాలు చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వారు భోజనం చేసిన వెంటనే ఒక చిన్న పాటి వాక్ చేయండి. తిన్న వెంటనే వాక్ చేయడం వల్ల నడుము వద్ద కొవ్వు ఏర్పడకుండా , నడుచుట్టుకొలత తగ్గించుకోవచ్చు.


బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది: భోజనం చేసిన వెంటనే వాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్ లో ఇన్సులిన్ పెరుగుతుంది . ఇది రక్తంతోపాటు గ్లూకోజ్ ను కండరాలకు అందజేస్తుంది దాంతో కొవ్వును విచ్చిన్న చేసి ఎనర్జీగా మారుతుంది . మీల్స్ చేసిన తర్వాత బ్రిస్క్ వాక్ చేయడం వల్ల డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.



గాఢ నిద్ర: రాత్రి డిన్నర్ చేసిన తర్వాత చిన్న పాటి నడక వల్ల జీర్ణశక్తి పెరుగుతంది . మెటబాలిజం రేటు పెరుగుతుంది . దాంతో పొట్ట సమస్యలుండవు. ఇంకా మంచి గాఢ నిద్ర పడుతుంది. నిద్ర సమస్యలు ఉండవు. 

మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది: బరువును కంట్రోల్ చేసుకోవాలనుకుంటే వాక్ చేయాలి. వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది . మెటబాలిజం రేటు పెరగడం వల్ల శరీరం స్లిమ్ గా తయారవుతుంది . అంతే కాదు మెటబాలిజం రేటు పెరగడం వల్ల శరీరంలో ఇతర అవయవాలు చురుకుగా పనిచేస్తాయి.



ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించి ఫ్యాటీ లివర్ ను నివారిస్తుంది: భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది . జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకున్నప్పుడు వెంటనే వాక్ చేయడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ తొలగించి ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను నివారిస్తాయి.



హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ ను నివారిస్తాయి: భోజనం చేసిన తర్వాత 15నిముషాలు వాక్ చేయడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది , దాంతో బ్రెయిన్ మరియు హార్ట్ కు చెడు రక్తం ప్రసరించడాన్ని ఆపుతుంది. మంచి రక్తం ప్రసరణను మెరుగుపరుస్తుంది . దాంతో హార్ట్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ కు అవకాశం ఉండదు.



స్ట్రెస్ తగ్గిస్తుంది: భోజనం చేసిన తర్వాత వాక్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పడుతుంది. ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది.


నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ34

శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ ను ప్రయోగించారు. 48 గంటల కౌంట్‌డౌన్ పూర్తయిన అనంతరం వివిధ దేశాలకు చెందిన 20 ఉపగ్రహాలను మోసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.

44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశల్లో ప్రయోగించారు.  727.5 కిలోల కార్టోశాట్ 2 సిరీస్‌తో పాటు 560 కిలోల బరువైన మరో 19 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ34 మోసుకుపోయింది. ఈ ప్రయోగంలో భారత్‌కు చెందిన ఉపగ్రహాలతో పాటు అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేసియా ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 1288 కిలోలు.

Tuesday, June 21, 2016

ప్రస్తుత జీవితంలో యోగా ప్రాధాన్యత ఏంటి ?

యోగా అంటే.. పాత కాలానికి సంబంధించింది అని భావిస్తాం. కానీ.. ఇటీవల యోగా చాలా పాపులారిటీ సంపాదించింది. మనం హెల్తీగా, హ్యాపీగా బతకడానికి యోగా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ ఆధునిక ప్రపంచంలో యోగాకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. 



ప్రస్తుత రోజుల్లో మనుషులు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న ప్రాబ్లమ్. దాని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. ఫలితం పొందలేకపోతున్నారు. 



కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి పరిష్కారం వెతుక్కుంటున్నారు. అయితే.. ఒత్తిడిని, శారీరక శ్రమను జయించడానికి అందుబాటులో ఉన్న సింపుల్ సొల్యూషన్ యోగా. శారీరక, మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందాలంటే.. యోగా సహాయపడుతుందని.. అందరిలో అవగాహన కల్పించడం చాలా అవసరం.



యోగా అంటే ఏంటి ? యోగా అనే పదం సంస్కృత పదం యోగ్ నుంచి వచ్చింది. యోగ్ అంటే.. జాయిన్, లేదా కలయిక అని అర్థం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండియాలోని మహర్షులు యోగాను కనుగొన్నారు. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా ప్రాక్టీస్ చేసేవాళ్లు. అలాగే ధ్యానం ద్వారా అంతర్దృష్టి తెలుసుకునేవాళ్లు.


ప్రస్తుత లైఫ్ లో యోగా ఎందుకు అవసరం ? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితం చాలా బిజీగా మారిపోయింది. పనితో నిగమ్నమయి ఉంటారు. లేదా వర్క్ కోసం బిజీగా ఉండిపోయి ఉంటారు. ఈ పోటీతత్వ ప్రపంచంలో ప్రజలు.. వాళ్ల వ్యక్తిగత విషయాలను మరిచిపోతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో పడిపోయి.. పర్సనల్ జీవితంపై ఆసక్తి కోల్పోతున్నారు. 



బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ లో పనిచేసేవాళ్లు.. ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. 

జీవితం రేస్ లా మారిపోవడంతో.. ఏం కోల్పోతున్నారో గుర్తించలేకపోతున్నారు. కాబట్టి.. మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. పార్టీలు, షికార్లు, పబ్ లు, క్లబ్ లు అంటూ.. యూత్ ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతోంది. ఇలాంటప్పుడే.. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు.

ప్రస్తుత జీవితంలో యోగా ప్రాధాన్యత ఏంటి

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యోగాకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకుంటున్నారు. చాలా స్కూల్లు, కాలేజీల్లో.. ఆరోగ్యానికి సంబంధించిన కోర్సులతో పాటు, యోగాపైనా అవగాహన కల్పిస్తున్నారు. మోడ్రన్ ప్రపంచంలో యోగాకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

యోగా అనేది మొత్తంగా ఎంతో ప్రయోజనకరం. ఇందులో వందల ఆసనాలున్నాయి. బిగినర్స్ నుంచి.. అనుభవజ్ఝుల వరకు లెవెల్ కి తగ్గట్టు ఆసనాలు ఉన్నాయి. తల నుంచి పాదాల వరకు ఎలాంటి సమస్య ఉన్నాయి.. సరైన పరిష్కారం యోగా. ఇది అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. ప్రశాంతతను కలిగిస్తుంది.

యోగా చాలా న్యాచురల్ మెడిసిన్ గా చెప్పవచ్చు. అయితే ఏ ఆసనం వేయడానికైనా ముందు ఎక్స్ పర్ట్ సలహా తీసుకోవడం అవసరం. అప్పుడే.. యోగాసనం వేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి హెల్తీగా ఉండాలి అంటే, హెల్తీ మైండ్ కావాలన్నా.. డే టు డే లైఫ్ లో యోగా చాలా అవసరం.

Monday, June 20, 2016

కొంచెం వగరు..కొంచెం తీపి..ఆరోగ్యానికెంతో బెటర్ ..!

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా కరర్ ఫుల్ గా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నది. వర్షాకాలం మొదలైతే చాలు..నేరుడు పండ్ల సీజన్ ప్రారంభమైవుతుంది. ప్రతి సీజన్ లనూ ఆ సీజన్ కు మాత్రమే పరిమితమైన కొనని పండ్లు, పువ్వులు లభిస్తుంటాయి. అలా వర్షాకాలంలో నేచర్ మనుకు గిప్ట్ గా ఇచ్చిన అమేజింగ్ అండ్ హెల్తీ ఫ్రూట్స్ లో నేరేడుపండ్లు ఒకటి. 



చూడటానికి నల్లగా, నిగనిగలాడుతూ ద్రాక్ష పండ్లలా నోరూరిస్తుండే నేరుడు పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నేరుడు పండ్లు పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలందరికి కూడా చాలా అరోగ్యకరం. నేరుడు పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. కేవలం పండే కాదు, నేరేడు చెట్టు ఆకులు, గింజలు, బెరడు..ఇలా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. నేరేడు మధుమేహం, క్యాన్సర్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న నేరేడులో ఉండే ఇతర పోషక విలువలేమిటో ? అవి ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం...



ప్రయోజనాలగురించి తెలుసుకునే ముందు బాగా పండిన నేరేడు పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చి చూస్తే మినిరల్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న దిగులు కూడా ఉండదు. నేరుడు గింజల నుండి కూడా అధిక సంఖ్యలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది మొత్తంలో క్యాల్షియం, విటమిన్ బి, సి, ఐరన్ లు కూడా లభిస్తాయి. ప్రతి వంద గ్రాముల నేరేడు పండ్లలో రెండు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. శరీరానికి రోజుకి కావల్సిన విటమిన్ సి నలభై మిల్లీగ్రాములైతే..వందగ్రాముల నేరుడులో 18మిల్లీగ్రాముల దాకా ఉంటుంది . 



కెరోటిన్, ఫైటోకెమికల్స్ (యాంటీఆక్సిడెంట్లు), మెగ్నీషియం, పొటాసియం, పీచుపదార్థాలు, మొదలైన పోషకాలన్నీ కూడా నేరుడు నుంచి మనకు లభిస్తాయి. అలాగే నేరుడు చెట్టుకు ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను స్ట్రాంగ్ గా ఉంచడతో పాటు చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.



లివర్ సమస్యలను మెరుగుపరుస్తుంది: నేరుడు పండులో ఉండే గుణాలు కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే నేచుల్ ఆమ్లాలు జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.



కోరింత దగ్గు నివారిస్తుంది: వర్షాకాలంలో జలుబు, దగ్గు..వంటి ఆరోగ్య సమస్యలు రావడం సహజం. నేరేడు కూడా వర్షాకాలంలో లభించే పండు కాబట్టి, వీటిని తినడం వల్ల జలుబు, కోరింత దగ్గు, దీర్ఘకాలంగా వేధించే దగ్గు, ఆస్తమా..లాంటి సమస్యలను నుంచి విముక్తి పొందవచ్చు.


పైల్స్ నివారణకు తోడ్పడుతుంది. ఈ సీజన్ లో నేరేడు పండును రోజూ ఉదయం ఉప్పుతో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండును తేనెతో పాటు తీసుకుంటే మంచిది.

ఇమ్యూనిటి పెంచుతుంది: వర్షాకాలంలో వచ్చే వివిధ జబ్బుల నుండి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకొనే శక్తిని నేరుడు అందిస్తుంది.