Friday, June 24, 2016

ఆ ఫుడ్ లో అంత కిక్ ఉందా..?

హెల్తీగా ఉండటం అంటే.. తినడం, పడుకోవడం కాదు. డైట్ లో చేర్చుకునే ఆహారాలే మన హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. సమయానికి తినడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారాలపై డైట్ లో చేర్చుకోవడం కూడా చాలా అవసరం. శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో పోషకాహారం అవసరమవుతుంది. కాబట్టి.. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మన పర్ఫెక్ట్ గా ఉంటాం. 

హెల్తీ ఫుడ్ అనగానే.. చాలా ఖర్చుతో కూడినదని చాలామంది భావిస్తారు. ప్రొటీన్ డ్రింక్స్, డైట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా.. అంతా ఎక్కువ ఖర్చు చేసి తీసుకోవాల్సినని అనుకుంటారు. కానీ.. తక్కువ ధరలో లభించే సూపర్ ఫుడ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకుంటే.. మీరు హెల్తీగా ఉన్నట్టే.



గుడ్లు: కోడి గుడ్లు తింటే ఫ్యాట్‌ పెరుగుతుందని చాలామందిలో అపోహ ఉంది. కానీ గుడ్డులో మినరల్స్‌, రైబోఫ్లెవిన్‌, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుడ్డును కానీ, ఆమ్లెట్‌ను గానీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

క్యారెట్స్‌: క్యారెట్స్ ఎవర్ గ్రీన్ హెల్తీ వెజిటబుల్ అని మనందరికీ తెలుసు. కానీ.. వీటిని తినడానికి మాత్రం కొంతమందే ఇష్టపడతాు. కళ్లకు మేలు చేయడంలో క్యారెట్‌కు మించినది లేదు. ఇందులో ఉండే విటమిన్‌-ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు బీటా-కెరటీన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా క్యారెట్స్ లో లభిస్తాయి. అలాగే ఖనిజలవణాలు, ఫైబర్‌ క్యారెట్స్ నుంచి పొందవచ్చు.



వెల్లుల్లి: వెల్లుల్లి రుచి దాదాపు ప్రతి కూరలు, చారుల్లోనూ దట్టిస్తారు. కానీ.. ఆహారం తినేటప్పుడు వీటిని పక్కనపెట్టేవాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ ఇది తినడం వల్ల రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యమూ బావుంుటంది. ఇందులో ఉండే విటమిన్ బి, సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారించడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు, కార్డియోవాస్కులర్‌ డీసీజ్‌లను నివారించే శక్తి ఉంది. 





క్యాబేజ్‌: క్యాబేజ్ అంటే చాలామంది నో చెప్పేస్తారు. కానీ ఇందులో ఉండే లో సాచురేటెడ్‌ ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌ శరీరానికి ఎంతో అవసరం. క్యాబేజ్‌ నుంచి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ పొందవచ్చు. హార్ట్‌‌రేట్‌ను, రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో క్యాబేజ్‌ వల్ల లభించే పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ కీలకపాత్ర పోషిస్తాయి. 



పాలు: పాల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలలో ఉండే ఐరన్‌, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న వేరే ఆహార పదార్థం మరొకటి లేదు.









No comments:

Post a Comment