Saturday, May 7, 2016

బరువు తగ్గించే అమేజింగ్ డ్రింక్...

ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యకర బరువును కలిగిండాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. అధిక బరువు మరయు ఊబకాయం ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తో ప్రతి ఒక్కరికీ తెలుసు.

అధికబరువు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అద్రుష్టవశాత్తు , ఎంత బరువున్నా ...బరువు తగ్గించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్స్, జిమ్, వ్యాయామాలు మరియు కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు, ఇతర సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. ఏ పనిచేయాలన్నా, పరిమితంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గించుకోవడానికి నేచురల్ రెమెడీ ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక సీక్రెట్ రెమెడీని మీరు బరువు తగ్గించుకోవడానికి పరిచయం చేస్తున్నాము.

ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ శరీరానికి డిటాక్సిఫై చేయడంతో పాటు , బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ మార్గం. ఈ నేచురల్ డ్రింక్ ను తయారుచేయడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. వాటిలో కీరదోస, లెమన్, మరియు మింట్ . కీరదోసకాయ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు అద్భుతమైన డ్యూరియాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి.

అదే విధంగా నిమ్మరసం అసిడిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. మరియు ఫ్యాట్ బర్నింగ్ కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఇక పుదీన అద్భుత ఔషధాలు కలిగినది . అనేక న్యూట్రీషియన్స్ గలది మరియు ఇది స్టొమక్ యాసిడ్స్ ను నివారిస్తుంది.

ఈ మూడు రకాల కాంబినేషన్ పదార్థాలు జీర్ణక్రియను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి . వీటిని కలిపినప్పుడు , వండర్ ఫుల్ టమ్మీ ఫ్లాటనింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది.

పొట్టదగ్గర చేరిన అనవసర వ్యర్థాలను తొలగించడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా పనిచేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మరి ఈ బరువు తగ్గించే డ్రింక్ తయారుచేయడం ఎలా, దీనికి ఏం అవసరం అవుతాయో తెలుసుకుందాం..


కావల్సినవి:
కీరదోసకాయ: 1/2
నిమ్మకాయ: 1
పుదీనా ఆకులు 10
నీరు: 1లీటర్
తయారుచేయు విధానం: కీరదోసకాయను , పుదీనా ఆకులను కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అందులో జోడించాలి . తర్వాత మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ ముక్కలు జోడించి చల్లచల్లగా లాంగించేయాలి.

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . రిమార్క్ లేకుండా క్రమంగా బరువు తగ్గుతారు. మంచి మార్పు కనిపిస్తుంది . ఈ హెల్తీ హ్యాబిట్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందడంతో పాటు, స్లిమ్ గా తయారవుతారు.

Friday, May 6, 2016

మీ ఫేవరేట్ స్టార్స్ ముద్దు పేర్లేంటో తెలుసా.. ?


సినిమావాళ్లకు ఆయా సినిమాల్లో పోషించే పాత్రలు కొన్ని నిక్ నేమ్స్‌ని తెచ్చిపెడుతుంటాయి. క్యారెక్టర్‌నిబట్టి పెట్ నేమ్ వస్తుంటుంది. కొందరికైతే ఏకంగా అవే ఇంటిపేరుగా కూడా నిలిచిపోతుంటాయి. అసలీ ముద్దు పేర్లు ఎవరు కనిపెట్టారో గానీ ఒక్కోసారి అసలు పేర్ల కన్నా వీటితోనే ఎక్కువ గుర్తింపు వస్తుంది. పిల్లలు పుట్టగానే ముద్దుగా వాళ్ళకి ఏదో ఒక ముద్దు పేరు తగిలించేస్తారు బుజ్జిగాడు, చిట్టి కన్నా ఎక్సెట్రా..ఎక్సెట్రా. ఇంట్లో వాళ్ళతో పాటు క్రమంగా పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అలా అలా ఆ పేరు అసలు పేరు కన్నా పాపులరయి కూర్చుంటుంది. 

ఒక మారు పేరు (ముద్దు పేరు గా కూడా పిలువ బడుతుంది) అన్నది ఒక వ్యక్తికి, ప్రాంతానికి లేక ఒక వస్తువు పేరుకు వివరణ కోసము అధికారిక పేరుతో పాటు ఇవ్వబడునది. అది బాగా పరిచయమైనది లేక అసలు పేరు యొక్క చిన్న రూపంగా పెట్ నేమ్ గా, వాడుకకు వీలుగా ఉంటుంది. ముద్దు పేరు అను పదము ప్రేమలో వున్నవారు లేక సన్నిహిత భావేవేశ సంబంధం వున్నవారు వాడే మారుపేరుని సూచిస్తుంది. మురిపెముతో వాడే పదంతో పోల్చబడుతుంది. 

పెట్ నేమ్ లేదా నిక్ నేమ్ అనే పదము ప్రేమతో లేదా చనువుతో కూడిన మారుపేర్ల కొరకు వాడబడునది. మన ఇల్లలోనే కాదు, సెలబ్రెటీల్లో కూడా అసలు పేరు కంటే ముద్దు పేర్లతోనే ఎక్కువ పాపులర్ అయిన సెలబ్రెటీలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మీకు ఇష్టమైన మీ సెలబ్రెటీల యొక్క ముద్దు పేర్లు ఈ క్రింది విధంగా...




త్రిష: త్రిష ముద్దు పేరు హనీ.


అనుష్క : అనుష్క ముద్దు పేరు స్వీటీ


శ్రద్దా దాస్: శ్రద్దా దాస్ మద్దు పేరు మాకు.

                                      
    సమంత : సమంత పెట్ నేమ్ మన్నీ, మంత


కాజల్ అగర్ వాల్ ముద్దు పేరు కాజు

అమలా పౌల్: అనఖా

శ్రుతిహాసన్ ముద్దు పేరు శ్రుతి

తాప్సి ముద్దు పేరు టాప్స్

తమన్న ముద్దు పేరు తమ్ము


శ్రియా ముద్దు పేరు మోననెమ్ శ్రియ


ఇలియానా ముద్దు పేరు : ఇల్లు, అందాల ఖజానా



ప్రియమణి ముద్దు పేరు లలితా రాణి

డలయానా మారియమ్ కురియన్ : నయనతార

శ్రీదేవి ముద్దు పేరు పప్పీ


జయసుధ ముద్దు పేరు బాపు బొమ్మ


భూమిక ముద్దు పేరు గుడియా, రచన చావ్లా, భూమి

కార్థిక బాలచంద్రన్:భావనా



స్వాతి రెడ్డి: కలర్స్ స్వాతి


ప్రియాంక చోప్రా ముద్దు పేరు మిని , మితు

కంగనా రౌనత్: అర్షద్


అనుష్క షర్మ: నుషీ


షిల్పా షెట్టీ: మన్యా



ఐశ్వర్య రాయ్ ముద్దు పేరు గుల్లు


సుస్మితా సేన్ ముద్దు పేరు సుస్సు, తితు






Thursday, May 5, 2016

గుక్కెడు తాగితే అంత బాగుంటుందా

ఉదయాన్నే పరగడపున వేడి నీళ్లు తాగితే.. చాల ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. అంతేకాదు.. రోజూ ఇది కంపల్సరీ. ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే.. ఏం తోచదు. కానీ… వేడినీళ్లు తీసుకుంటే.. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే.. చల్లటినీళ్లు తాగుతాం.తాగడానికి హయిగా ఉంటుంది. కానీ.. ఉదయాన్నే వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు , శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది. అలాగే.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పడగడుపునే వేడి నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనలేంటో చూద్దాం…

  • ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతునొప్పి దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. శ్వాసనాళాలను శుభ్రం చేసి.. శ్వాస తేలికగా ఆడటానికి సహాయపడుతుంది.
  • మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపునొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే  శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
  •  ఒక కప్పుు వేడినీళ్లు పరగడపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిస్తుంది. పొట్టలోని ఆహారం,లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అవయవాలను శుద్ధిచేస్తుంది.
  • చాలామందిమలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల పైల్స్ ఉన్నవాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడుతాయి. ఈజీగా జీర్ణమవుతుంది.
  • ఒక గ్లాసు వేడినీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది. వేగంగా బరువు తగ్గవచ్చు.. కిడ్నీలకు,ఇతర అవయవాలకు మంచిది.
  • పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు,చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే.. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.


Wednesday, May 4, 2016

ఎండల్లో ఈ చిట్కా పాటించకపోతే అంతే సంగతులా..!

ప్రస్తుతం వేసవి, వేసవి వేడి శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వేసవి వేడి వల్ల చర్మం మీద చిన్నచిన్న మొటిమలు కనబడుతుంటాయి. వీటిని సమ్మర్ బ్లిస్టర్స్ లేదా చెమట కాయలు అంటారు. ఈ చెమటకాయలు శరీరం మొత్తం వ్యాపిస్తుంటాయి.

సన్ బర్న్ బ్లిస్టర్స్ చూడటానికి నీరుతో నిండి బుడ్డగా చర్మం మీద కనబడుతుంటాయి. చర్మం లోపల ద్రవంతో నిండి ఉంటుంది. ఇవి చూడటానికి బొడిపెల్లా కనబుడుతుంటాయి. ఇవి ఎక్కువగా ఎండలో ఉన్నప్పుడు లేదా హీట్ కు గురైనప్పుడు శరీరం మీద ఇలా ఏర్పడుతుంటాయి.

వీటి వల్ల నొప్పి, దురద ఏర్పడతాయి. వేడి వాతావరణంలో చెమటకాయల సమస్య ఎక్కువగా ఉంటుంది. చర్మ గ్రంథులు చర్మం దిగువున ఉండటం వల్ల అక్కడి నుంచి ఈ సమస్య పుట్టుకొస్తుంది. తర్వాత తర్వాత చర్మం మీద ఇలా బ్లిస్టర్స్ రూపంలో కనబడుతుంది. ముఖ్యంగా ఇవి చర్మం ముడతలు పడే ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుంటాయి.

ఈ చెమటకాయలు చేతుల మీద లేదా పాదాల మీద ఏర్పడుతుంటాయి. వీటిని చిదమడం, లేదా పగిలి, లోపలి ద్రవం బయటకు వచ్చేలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల దాని పక్కనో లేదా దాని కింది మరికొన్ని పుట్టుకొస్తాయి. ఇలా చేయడం కంటే ఈ చెమటకాయలను బ్యాండేజ్ తో మాడిపోయే వారకు కవర్ చేయవచ్చు.

వేసవి చెమటకాయలను నివారించాలంటే ఒకేటే మార్గం. ఎక్కువగా ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉండటం . ముఖ్యంగా ఉదయం 10 నుండి 4 వరకూ బయట తిరగకుండా ఉండాలి. అంతే కాదు, ఇంట్లో ఉన్నాము కదా అని నీరు తాగడం మర్చిపోకూడదు. శరీరాన్ని సాధ్యమైనంత ఎక్కువగా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి . మధ్యమధ్యలో నిమ్మరసం తాగడం మంచిది. సమ్మర్ బ్లిస్టర్స్ ను నివారించుకోవడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి . అవేంటో చూద్దాం...

కలబంద: చెమటకాయలు కొద్ది రోజుల నుంచి బాధిస్తుంటే, వాటి మీద అలోవెర జెల్ ను అప్లై చేయాలి. అలోవెర జెల్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లిస్టర్స్ ను క్లీన్ చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ నివారిస్తాయి. వేడి వాతావరణంలో అలోవెర జెల్ ను ఉపయోగించడం ఇక ఫర్ఫెక్ట్ మార్గం ఇది సమ్మర్ బ్లిస్టర్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

టీ ట్రీ ఆయిల్: సమ్మర్ బ్లిస్టర్స్ నివారించడంలో టీట్రీ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా రెగ్యులర్ ఆయిల్ కు కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని నీటిలో మిక్స్ చేసి అందులో కాటన్ బాల్ డిప్ చేసి చర్మం మీద ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బ్లిస్టర్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

ఐస్ ప్యాక్: వేసవి చెమటకాయలను నయం చేయడంలో కోల్డ్ కంప్రెసర్ బాగా సహాయపడుతుంది. బ్లిస్టర్ పెయిన్ తో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. బ్లిస్టర్స్ మీద ఐస్ ప్యాక్ ను అప్లై చేయాలి. శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ప్రభావితమైన ప్రదేశంలో 15నిముషాలు మసాజ్ చేయాలి. వాపు తగ్గకపోతే, క్రమంగా ఐస్ ప్యాక్ ను ప్రతి మూడు, నాలుగు గంటలకొకసారి అప్లై చేయాలి.

వెనిగర్: వెనిగర్ సన్ బర్న్, పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇందులో అసిటిక్ యాసిడ్ కలిగి ఉండటం వల్ల నయం చేసే గుణం చాల వేగంగా ఉంటుంది. వైట్ వెనిగర్ లో కొన్ని పేపర్ టవల్స్ ను డిప్ చేసి , బ్లిస్టర్స్ ఉన్న ప్రదేశంలో పెట్టాలి . పెపర్ టవల్ కు ఉన్న వైట్ వెనిగర్ బ్లిస్టర్స్ మీద అలాగే కొంత సేపు ఉండటం వల్ల అవి ఎండి పోతాయి.

ల్యావెండర్ ఆయిల్: ఇది కూడా నయం చేసే గుణాలు కలిగి ఉన్నాయి. కాటన్ బాల్ ను ల్యావెండర్ ఆయిల్లో డిప్ చేసి బ్లిస్టర్స్ మీద అప్లై చేయడం వల్ల బ్లిస్టర్స్ మానిపోతాయి. సమ్మర్ బ్లిస్టర్స్ నివారించడంలో ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. ఈ ల్యావెండర్ ఆయిల్ ను నేరుగా బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. ఇది బ్లిస్టర్స్ ను నయం చేయడంతో పాటు, నొప్పిని తగ్గిస్తుంది.

బ్లాక్ టీ: బ్లాక్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది బ్లిస్టర్ పెయిన్ నివారించడానికి సహాయపడుతుంది. ఎఫెక్టెడ్ ఏరియాలో బ్లాక్ టీ ని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్: మొదట , ఓట్ మీల్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని గోరువెచ్చని నీటిని వేసి బాగా మిక్స్ చేసి, బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టూత్ పేస్ట్: మరో హోం రెమెడీ టూత్ పేస్ట్ బ్లిస్టర్స్ పెయిన్ ను నివారించడంలోటూత్ పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది పింపుల్ బ్లిస్టర్స్ ను ఎండిపోయేలా లేదా మాడిపోయేలా చేస్తుంది. అయితే దాల్చిన చెక్కతో తయారుచేసిన పేస్ట్ ను ఎంపిక చేసుకోకూడదు . చర్మంపరిస్థితి మరింత తీవ్రం చేస్తుంది.

Tuesday, May 3, 2016

గుడ్లను అలా నిల్వచేయకుడదట..!

మనందరం కోడి గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైన ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్ లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వీటికి ముందుగా, ఫ్రిజ్ లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాము.



గుడ్లను ఫ్రిజ్ లో ఉంచటం వలన ఆహరం విషంగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా, ఫ్రిజ్ లోపల సాల్మొనెల్ల అభివృద్ధి చెందదు. గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ ఉంచటం మంచిదే అని చెప్పవచ్చు.

మీకు బేకింగ్ చేసిన వంటకాలంటే ఇష్టమా? అయితే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్డు యొక్కతెల్ల సొన కన్నా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గుడ్డు యొక్క తెల్ల సొన రుచికరంగా ఉంటుంది.



కుల్లిపోవటం గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లులతో పోలిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వరగా కుల్లిపోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను భయటకు తీసిన తరువాత పుల్లటి రుచిగా అనిస్తాయి. కావున గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచటమే మంచిది.



పెంకుపై బ్యాక్టీరియా గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లు మరియు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్లను గమనిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు, ఘనీభవనానికి గురై, పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినటం వలనఅనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉన్నాయి. గుడ్లు క్యుటికల్ లను కలిగి ఉంటాయి తాజా గుడ్లను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే, వీటిలో ఉండే క్యుటికల్ లు చెక్కుచెదరకుండా ఉంటాయి.



సాల్మొనెల్లా సంక్రమణ గది ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కన ఉన్న గుడ్డు కూడా వైరస్ కు గురవుతుంది. కానీ, ఫ్రిజ్ లో ఉంచటం వలన ఇలాంటి సంక్రమణకు గురవకుండా చూసుకోవచ్చు. నిజానికి తాజా గుడ్లను రెండు రోజుల లోపే తినటం చాలా ఆరోగ్యకరం.

Monday, May 2, 2016

ఆ పనులే కొంప ముంచుతున్నాయా

మీరు చాలా సందర్భాల్లో ఇరిటేషన్ కి గురవుతున్నారా ? ఉన్నట్టుండి తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవడానికి కొన్ని అలవాట్లు కారణమవుతాయి. మరి మీకున్న అలవాట్లే డిప్రెషన్ కి కారణమవుతున్నాయా ? ప్రస్తుత రోజుల్లో డిప్రెషన్ చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారింది. లైఫ్ స్టైల్, పని ఒత్తిడి, అన్ హెల్తీ హ్యాబిట్స్, జెనెటిక్ టెండెన్సీస్, మెదడుపై కెమికల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల చాలా మంది డిప్రెషన్ కి లోనవుతున్నారు. 

కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ సూసైడ్ ఆలోచనను క్రియేట్ చేస్తాయి. దీన్ని సైకలాజికల్ డ్రగ్స్ ద్వారా నివారించవచ్చు. అయితే డిప్రెషన్ కి కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని చెక్ చేద్దాం.. 


స్మార్ట్ ఫోన్స్ రోజంతా స్మార్ట్ ఫోన్స్ కి అతుక్కుపోవడం వల్ల డిప్రెషన్ కి గురవుతారని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు అలసటకు గురిచేస్తుంది. ఆందోళన కలిగిస్తుంది.

భంగిమలో పొరపాటు కూర్చునే భంగిమ సరిగా లేకపోతే.. నెగటివ్ థాట్స్, డిప్రెషన్ కి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెయిట్ గా కూర్చోవడం, స్ట్రెయిట్ గా నడవడం పాజిటివిటీని తెలుపుతుంది.

కెఫీన్ కెఫీన్ మీ మూడ్ ని కొంతవరకు మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల అది హానికారకం. కాబట్టి సరైన మోతాదులో తీసుకోవాలి.

సోషల్ మీడియా డిప్రెషన్ కి ఇది ఒక కారణం. ఎక్కువ సమయంలో సోషల్ మీడిలో గడపడం వల్ల.. రియల్ లైఫ్ లో మనుషులతో తక్కువగా మాట్లాడగలుగుతారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు.

టాక్సిక్ రిలేషన్ ఎమోషనల్ గా ఇబ్బందికి గురిచేసే వాళ్లతో రిలేషన్ లో ఉండటం వల్ల.. మీరు డిప్రెషన్ కి లోనవుతారు. మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆందోళనకు కారణమవుతుంది.

స్మోకింగ్ స్మోకింగ్ డిప్రెషన్ కి కారణమవుతుందని.. నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ వల్ల కొన్ని నరాలు సరిగా పనిచేయవు. కాబట్టి ఇది డిప్రెషన్ కి కారణమవుతుంది.

సమ్మర్ వెదర్ సమ్మర్ వెదర్ కూడా డిప్రెషన్ కి కారణమవుతుంది. డిప్రెషన్ లక్షణాలు ఉన్నవాళ్లలో.. సమ్మర్ వల్ల డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ.

లక్ష్యాలు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోలేక పోవడం వల్ల డిప్రెషన్ కి గురవుతారు. అలాగే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గేకొద్దీ.. డిప్రెషన్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.