Wednesday, May 4, 2016

ఎండల్లో ఈ చిట్కా పాటించకపోతే అంతే సంగతులా..!

ప్రస్తుతం వేసవి, వేసవి వేడి శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వేసవి వేడి వల్ల చర్మం మీద చిన్నచిన్న మొటిమలు కనబడుతుంటాయి. వీటిని సమ్మర్ బ్లిస్టర్స్ లేదా చెమట కాయలు అంటారు. ఈ చెమటకాయలు శరీరం మొత్తం వ్యాపిస్తుంటాయి.

సన్ బర్న్ బ్లిస్టర్స్ చూడటానికి నీరుతో నిండి బుడ్డగా చర్మం మీద కనబడుతుంటాయి. చర్మం లోపల ద్రవంతో నిండి ఉంటుంది. ఇవి చూడటానికి బొడిపెల్లా కనబుడుతుంటాయి. ఇవి ఎక్కువగా ఎండలో ఉన్నప్పుడు లేదా హీట్ కు గురైనప్పుడు శరీరం మీద ఇలా ఏర్పడుతుంటాయి.

వీటి వల్ల నొప్పి, దురద ఏర్పడతాయి. వేడి వాతావరణంలో చెమటకాయల సమస్య ఎక్కువగా ఉంటుంది. చర్మ గ్రంథులు చర్మం దిగువున ఉండటం వల్ల అక్కడి నుంచి ఈ సమస్య పుట్టుకొస్తుంది. తర్వాత తర్వాత చర్మం మీద ఇలా బ్లిస్టర్స్ రూపంలో కనబడుతుంది. ముఖ్యంగా ఇవి చర్మం ముడతలు పడే ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుంటాయి.

ఈ చెమటకాయలు చేతుల మీద లేదా పాదాల మీద ఏర్పడుతుంటాయి. వీటిని చిదమడం, లేదా పగిలి, లోపలి ద్రవం బయటకు వచ్చేలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల దాని పక్కనో లేదా దాని కింది మరికొన్ని పుట్టుకొస్తాయి. ఇలా చేయడం కంటే ఈ చెమటకాయలను బ్యాండేజ్ తో మాడిపోయే వారకు కవర్ చేయవచ్చు.

వేసవి చెమటకాయలను నివారించాలంటే ఒకేటే మార్గం. ఎక్కువగా ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉండటం . ముఖ్యంగా ఉదయం 10 నుండి 4 వరకూ బయట తిరగకుండా ఉండాలి. అంతే కాదు, ఇంట్లో ఉన్నాము కదా అని నీరు తాగడం మర్చిపోకూడదు. శరీరాన్ని సాధ్యమైనంత ఎక్కువగా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి . మధ్యమధ్యలో నిమ్మరసం తాగడం మంచిది. సమ్మర్ బ్లిస్టర్స్ ను నివారించుకోవడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి . అవేంటో చూద్దాం...

కలబంద: చెమటకాయలు కొద్ది రోజుల నుంచి బాధిస్తుంటే, వాటి మీద అలోవెర జెల్ ను అప్లై చేయాలి. అలోవెర జెల్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లిస్టర్స్ ను క్లీన్ చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ నివారిస్తాయి. వేడి వాతావరణంలో అలోవెర జెల్ ను ఉపయోగించడం ఇక ఫర్ఫెక్ట్ మార్గం ఇది సమ్మర్ బ్లిస్టర్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

టీ ట్రీ ఆయిల్: సమ్మర్ బ్లిస్టర్స్ నివారించడంలో టీట్రీ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా రెగ్యులర్ ఆయిల్ కు కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని నీటిలో మిక్స్ చేసి అందులో కాటన్ బాల్ డిప్ చేసి చర్మం మీద ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బ్లిస్టర్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

ఐస్ ప్యాక్: వేసవి చెమటకాయలను నయం చేయడంలో కోల్డ్ కంప్రెసర్ బాగా సహాయపడుతుంది. బ్లిస్టర్ పెయిన్ తో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. బ్లిస్టర్స్ మీద ఐస్ ప్యాక్ ను అప్లై చేయాలి. శుభ్రంగా ఉండే కాటన్ క్లాత్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ప్రభావితమైన ప్రదేశంలో 15నిముషాలు మసాజ్ చేయాలి. వాపు తగ్గకపోతే, క్రమంగా ఐస్ ప్యాక్ ను ప్రతి మూడు, నాలుగు గంటలకొకసారి అప్లై చేయాలి.

వెనిగర్: వెనిగర్ సన్ బర్న్, పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇందులో అసిటిక్ యాసిడ్ కలిగి ఉండటం వల్ల నయం చేసే గుణం చాల వేగంగా ఉంటుంది. వైట్ వెనిగర్ లో కొన్ని పేపర్ టవల్స్ ను డిప్ చేసి , బ్లిస్టర్స్ ఉన్న ప్రదేశంలో పెట్టాలి . పెపర్ టవల్ కు ఉన్న వైట్ వెనిగర్ బ్లిస్టర్స్ మీద అలాగే కొంత సేపు ఉండటం వల్ల అవి ఎండి పోతాయి.

ల్యావెండర్ ఆయిల్: ఇది కూడా నయం చేసే గుణాలు కలిగి ఉన్నాయి. కాటన్ బాల్ ను ల్యావెండర్ ఆయిల్లో డిప్ చేసి బ్లిస్టర్స్ మీద అప్లై చేయడం వల్ల బ్లిస్టర్స్ మానిపోతాయి. సమ్మర్ బ్లిస్టర్స్ నివారించడంలో ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. ఈ ల్యావెండర్ ఆయిల్ ను నేరుగా బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. ఇది బ్లిస్టర్స్ ను నయం చేయడంతో పాటు, నొప్పిని తగ్గిస్తుంది.

బ్లాక్ టీ: బ్లాక్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది బ్లిస్టర్ పెయిన్ నివారించడానికి సహాయపడుతుంది. ఎఫెక్టెడ్ ఏరియాలో బ్లాక్ టీ ని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్: మొదట , ఓట్ మీల్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని గోరువెచ్చని నీటిని వేసి బాగా మిక్స్ చేసి, బ్లిస్టర్స్ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టూత్ పేస్ట్: మరో హోం రెమెడీ టూత్ పేస్ట్ బ్లిస్టర్స్ పెయిన్ ను నివారించడంలోటూత్ పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది పింపుల్ బ్లిస్టర్స్ ను ఎండిపోయేలా లేదా మాడిపోయేలా చేస్తుంది. అయితే దాల్చిన చెక్కతో తయారుచేసిన పేస్ట్ ను ఎంపిక చేసుకోకూడదు . చర్మంపరిస్థితి మరింత తీవ్రం చేస్తుంది.

No comments:

Post a Comment