Tuesday, May 3, 2016

గుడ్లను అలా నిల్వచేయకుడదట..!

మనందరం కోడి గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైన ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్ లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వీటికి ముందుగా, ఫ్రిజ్ లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాము.



గుడ్లను ఫ్రిజ్ లో ఉంచటం వలన ఆహరం విషంగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా, ఫ్రిజ్ లోపల సాల్మొనెల్ల అభివృద్ధి చెందదు. గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ ఉంచటం మంచిదే అని చెప్పవచ్చు.

మీకు బేకింగ్ చేసిన వంటకాలంటే ఇష్టమా? అయితే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్డు యొక్కతెల్ల సొన కన్నా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గుడ్డు యొక్క తెల్ల సొన రుచికరంగా ఉంటుంది.



కుల్లిపోవటం గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లులతో పోలిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వరగా కుల్లిపోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను భయటకు తీసిన తరువాత పుల్లటి రుచిగా అనిస్తాయి. కావున గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచటమే మంచిది.



పెంకుపై బ్యాక్టీరియా గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లు మరియు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్లను గమనిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు, ఘనీభవనానికి గురై, పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినటం వలనఅనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉన్నాయి. గుడ్లు క్యుటికల్ లను కలిగి ఉంటాయి తాజా గుడ్లను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే, వీటిలో ఉండే క్యుటికల్ లు చెక్కుచెదరకుండా ఉంటాయి.



సాల్మొనెల్లా సంక్రమణ గది ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కన ఉన్న గుడ్డు కూడా వైరస్ కు గురవుతుంది. కానీ, ఫ్రిజ్ లో ఉంచటం వలన ఇలాంటి సంక్రమణకు గురవకుండా చూసుకోవచ్చు. నిజానికి తాజా గుడ్లను రెండు రోజుల లోపే తినటం చాలా ఆరోగ్యకరం.

No comments:

Post a Comment