Friday, May 27, 2016

బొప్పాయి తింటే బాడీ హీట్ అవుతుందా..?లేదా అపోహ మాత్రమేనా.....

ప్రకృతిలో కొన్ని మనకు దేవుడు అంధించే కొన్ని పదార్థాలు , ప్రకృతి సిద్ధంగా లభించేవి ఒక వరంగా భావించవచ్చు. అలాంటి వరాల్లో వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు ప్రపంచ మొత్తం అందుబాటులో ఉన్నాయి. 

ఈ పండ్లు మరియు కూరగాయలు మానవులకు అత్యంత ఆరోగ్యకర ఆహారాలుగా నిత్యజీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ ఆహారాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత మరియు ప్రాధాన్యత విలువలు కలిగి ఉన్నాయి. 

ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్స్, న్యూట్రీషియన్స్, మరియు కార్బోహైడ్రేట్ వంటి అత్యంత విలువైన పోషకవిలువలుండటం వల్ల వీటిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం జరిగింది.



ఇంకా ఈ ఆహారాన్ని మన ఆరోగ్యానికి సహాయపడే మినిరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఇతర మరెన్నో పోషక విలువలను అందిస్తున్నాయి. 

మనం నిత్యఆహారాలుగా తీసుకొనే పండ్లు మరియు కూరగాయల్లో బొప్పాయి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది . ఎందుకంటే దీన్ని వెజిటేబుల్ గాను మరియు ఫ్రూట్ గా కూడా తీసుకోవచ్చు. 

మనం ప్రతి రోజూ తినే ఆహారాలలో బొప్పాయి ఒక ముఖ్యమైన ఆహారంగా ఆహార నిపుణులు సూచిస్తున్నారు . మరి రెగ్యులర్ గా బొప్పాయిని తినడం వల్ల శరీరానికి వేడి చేస్తుందని చాలా మంది భావిస్తారు.



శాస్త్రీయపరంగా బొప్పాయి , మనుష్యలు శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైనది, కానీ ఒక పరిమితిలో మాత్రమే తీసుకోవాలిని గుర్తించుకోవాలి. 

వాస్తవానికి, మన శరీరానికి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్స్ ను బొప్పాయి అందిస్తుంది. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల , చాలా ఇబ్బంది కలిగిస్తుంది. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ క్రమంగా పెరుగుతాయి. 

అంతే కాకుండా , బొప్పాయి శరీరంలో ఉష్ణోగ్రతను ఏవిధంగా పెంచుతుందన్న విషయం మీరు తెలుసుకోవడం కంటే, బొప్పాయి తినడం వల్ల పొందే అనేక ప్రయోజనాలను తెలుసుకోవడం మంచిది. మరియు ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

జీర్ణక్రియ బాగా జరగుతుంది: బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా పెరగుతుంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఆమ్ల రసం జీర్ణవ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా బొప్పాయిని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇది ఒక పర్ఫఎక్ట్ గా పనిచేసి పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. 

ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది: శరీరంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది మరియు వాటిని దూరం చేస్తుంది. ఇది ప్రేగులోని వార్మ్స్ మరియు ఇతర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉంటాయి . దాంతో శరీరం ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంటుంది. 

క్యాన్సర్ తో పోరాడుతుంది: బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఈ మద్యన జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు. ప్రత్యామ్నాయంగా బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల క్యాన్సర్లతో పోరాడుతుందని కనుగొన్నారు. ముఖ్యంగా ప్యాక్రియాటిక్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుందని కనుగొన్నారు. ఇలాంటి ప్రాణాంత క్యాన్సర్ ను నివారించుకోవడానికి ఉపయోగించే ఔషధాల్లో బొప్పాయిని ఉపయోగిస్తున్నారు. 

చర్మ రక్షణ: బొప్పాయి ఒక నేచురల్ పదార్థం . ఇది ఒక స్కిన్ ఆహార పదార్థం కూడా . సౌందర్య పోషణలో బొప్పాయిని కూడా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి బొప్పాయిలో రివిటలైజింగ్ గుణాలున్నాయి . దాని వల్ల ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది. అన్ని చర్మసంరక్షణ ఉత్పత్తుల్లో అలోవెర మరియు బొప్పాయి ప్రధాన స్థానాలు కలిగి ఉన్నాయి . ఎలాంటి సందేహం లేకుండా బొప్పాయిచర్మానికి అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. 

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినది: బొప్పాయిని ఉపయోగించడం వల్ల ఇది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది . కానీ, ఇది వెంటనే చర్మంలో ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మం సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.. 

బొప్పాయి తినడం వల్ల ఇలాంటి గొప్ప ప్రయోజనాలను తెలుసుకోవడంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోతారు.







Wednesday, May 25, 2016

ప్రొద్దున్నే అవి తాగితే బరువు పెరుగుతారా ?

బరువు తగ్గాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వ్యాయామంపై ఫోకస్ పెడితే, మరికొందరు డైటింగ్ ఫాలో అవుతారు. మరికొందరు డ్రింక్స్ విషయంలో కేర్ తీసుకుంటారు. అయితే మీరు తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ మీకు తెలియకుండానే మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి.

తాజా అధ్యయనాల ప్రకారం కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లు హెల్తీ ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం అలవాటు చేసుకుంటే.. వాళ్లు ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టే అని తేల్చారు. కొంతమంది ఉదయం ప్రొబయోటిక్ డ్రింక్ తీసుకుని బరువు తగ్గాలని భావిస్తారు. కానీ.. దానివల్ల బరువు తగ్గడం కంటే.. పెరగడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరిగించాలి, అధిక బరువు తగ్గించాలని మీరు భావిస్తుంటే.. ఉదయం తీసుకునే ఈ 7 రకాల డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. మరి అవేంటో ఇప్పుడే చెక్ చేయండి.

స్వీట్ లస్సీ:
పెరుగు, పంచదార, నీళ్లు కలిపి తయారు చేసుకునే డ్రింక్ స్వీట్ లస్సీ. ఇది నార్త్, వెస్ట్ లో చాలా ఫేమస్ డ్రింక్. కానీ ఇందులో ఉండే ఫ్యాట్ బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒక గ్లాసు లస్సీలో 159 క్యాలరీలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు దీనికి దూరంగా ఉండటం మంచిది.


బాదాం, చాక్లెట్ మిల్క్:
పాలు న్యాచురల్ గానే కొద్దిగా తీయటి రుచి కలిగి ఉంటాయి. అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిలోకి స్వీట్ నెస్ కోసం ఏవైనా కలపడం చాలామందికి అలవాటు. అంటే పంచదార, బాదాం, చాక్లెట్ సిరప్ వంటివి కలుపుతుంటారు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల క్యాలరీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక గ్లాస్ ఫ్లేవర్డ్ మిల్క్ లో 158 క్యాలరీలుంటాయి.

ఆరంజ్ జ్యూస్:
ఫ్రూట్స్ ని జ్యూస్ ల రూపంలో కంటే.. కట్ చేసి డైరెక్ట్ గా తీసుకోవడమే మంచిది. అలా తీసుకుంటేనే ఎక్కువ పోషకాలు పొందవచ్చు. అదే ఫ్రూట్ జ్యూస్ చేయడం వల్ల అందులోని ఫైబర్ కోల్పోతుంది. అంతేకాదు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ లో 220 క్యాలరీలుంటాయి. కాబట్టి వీటిని డైరెక్ట్ గా తినడమే మంచిది.

గేదె పాలు :
ఒక గ్లాసు గేదె పాలల్లో 280 క్యాలరీలుంటాయి. ఫ్యాట్ 16.81 గ్రాములుంటుంది. కాబట్టి ఈ పాలను కూడా బరువు తగ్గాలనుకునేవాళ్లు తీసుకోకూడదు.

అరటిపండు మిల్క్ షేక్ :
మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని కోరుకుంటే.. అరటిపండ్లు, పాలు కలిపి తీసుకోవడం మానేయండి. ఒక అరటిపండులోనే 108 క్యాలరీలుంటాయి. అప్పుడు పాలు, అరటిపండ్లు కలిపిన మిల్క్ షేక్ లో ఇక ఎన్ని క్యాలరీలుంటాయో గమనించండి.

స్మూతీస్ : 
చాలా మంది ఉదయాన్నే స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ.. ఉదయాన్నే ఈ స్మూతీస్ తీసుకుంటే.. మీ బరువు భారీగా పెరుగుతుంది. ఒక గ్లాస్ తీసుకున్నా.. అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒక గ్లాస్ స్మూతీలో 145 క్యాలరీలుంటాయి.

బరువు తగ్గాలంటే:
బరువు తగ్గాలనుకునే వాళ్లు పైన చెప్పిన డ్రింక్స్ కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ని ఏమాత్రం తీసుకోకూడదు. అయితే మీరు బరువు తగ్గాలంటే.. తాగాల్సిన కొన్ని హెల్త్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవి మిమ్మల్ని ఫిట్ అండ్ హెల్తీగా మార్చేస్తాయి.

తేనె, దాల్చిన చెక్క:
ఒక టేబుల్ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలపాలి. నిద్రలేవగానే ఈ డ్రింక్ ని ప్రతి రోజూ తాగండి. ఒక వేళ టేస్టీగా కావాలనుకుంటే.. కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోండి.

గ్రీన్ టీ :
డెటాక్స్ డ్రింక్ తో రోజుని ప్రారంభించడం చాలా అద్భుతమైన ఐడియా. ఫ్యాట్ కరిగించడానికి మాత్రమే కాదు.. రోజుకి 3 నుంచి 5 కప్పుల గ్రీన్ టీ తాగితే.. శరీరంలో మలినాలను బయటకు పంపుతుంది.

Tuesday, May 24, 2016

అంద‌మైన శిరోజాల‌కు మ‌రింత అందం సమకుర్చుకోవాలా ?

ఆడ‌వారికి అందం జుట్టే. అటువంట‌ప్పుడు పొడ‌వైన ,న‌ల్ల‌ని ,వ‌త్తైన ,అంద‌మైన శిరోజాలు కావాల‌ని ఎవ‌రు కోరుకోరు. కానీ ఆ అందాన్ని సంర‌క్షించుకోవాల‌న్నా అంద‌మైన శిరోజాల‌కు మ‌రింత అందం స‌మ‌కూరాల‌న్నా మారుతున్న వాత‌వ‌ర‌ణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ, మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవి ఇప్పుడు చూద్దాం.
వేస‌వి కాలంలో తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు:-
చలికాలంతో పోలిస్తే వేసవిలో వెంట్రుకలు ఊడడమనే సమస్య పెరుగుతుంటుంది. కారణం సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా కేశాలను తాకడం వల్ల శిరోజాల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. త్వరగా పొడిబారి, తెల్లజుట్టుకు కూడా కారణమవుతుంది.

అతినీలలోహిత కిరణాలు నేరుగా శిరోజాలను తాకకుండా బయటకు వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్స్ వంటివి తలకు ఉపయోగించాలి. బయటకు వెళ్లేముందు కండిషనర్‌ను లేదా సన్‌స్క్రీన్‌ను పై వెంట్రుకలకు రాయాలి. బయట నుంచి వచ్చిన వెంటనే జుట్టును శుభ్రపరుచుకోవాలి.


వేసవిలో కొంతమంది స్విమ్మింగ్‌ను ఇష్ట‌ప‌డే వారు అలవాటుగా ఎంచుకుంటారు. ఈత కొలనులలో ఉండే ఉప్పు వల్ల జుట్టు పొడిబారి, వెంట్రుకల చివరలు చిట్లుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో క్లోరిన్ లేని నీటితో తలను శుభ్రపరుచుకుంటే వెంట్రుకలు చిట్లడం, నిస్తేజంగా మారడం ఉండదు.

వేసవిలో వేడి అమితం. దీంతో జుట్టు తడి పోగొట్టడానికి హెయిర్ డ్రయ్యర్, బ్లోయర్, స్ట్రెయిటనర్.. వంటివి వాడుతుంటారు. ఈ పరికరాల వల్ల వెంట్రుకలు చిట్లి, మరింత దెబ్బతింటాయి. అందుకని వేసవిలో ‘వేడి’ పరికరాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. శుభ్ర‌మైన మెత్త‌టి పొడిగా ఉన్న ట‌వ‌ల్‌ని వాడ‌డం మంచిది.
వేసవి చీకాకును పోగొట్టుకోవడానికి వారంలో ఎక్కువసార్లు తలస్నానానికి షాంపూను ఉపయోగిస్తారు. దీని వల్ల షాంపూలోనే ఉండే రసాయనాలు వెంట్రుకలపై ఉండే సహజసిద్ధమైన నూనెను తగ్గించి, వెంట్రుకలను గరుకుగా మారుస్తాయి. షాంపూతో తలంటుకున్న ప్రతీసారి ప్రొటీన్, కెరటీన్ ఉన్న కండిషనర్‌నే ఉపయోగించాలి. లేదా వారానికి రెండుసార్లు పెరుగుతో తలకు ప్యాక్ వేసుకొని, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చల్లని ప్రభావాన్ని చూపుతుంది. వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు.
వేడినీటితో తలస్నానం చేసేవారు వేసవిలో ఆ అలవాటును మానుకోవడం మంచిది. సహజంగానే వేడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటుంటాయి. అలాంటిది వేడినీటి వల్ల వెంట్రుక కుదురు మరింతగా పొడిబారి జీవం కోల్పోతుంది. అందుకని తలస్నానానికి చన్నీటినే ఉపయోగించాలి. జ‌డ వేసుకునే వారు బిగుతుగా అల్ల‌కండా లూజుగా అల్లుకోవ‌డం మంచిది. ఎందుకంటే బిగుతుగా అల్ల‌డం వ‌ల‌న చెమ‌ట ఆరిపోవ‌డానికి అవ‌కాశం లేకుండా వేస‌విలో జుట్టు దుర్వ‌స‌న వ‌స్తుంది. వ‌దులుగా అల్ల‌డం వ‌ల‌న గాలికి చెమ‌ల ఆరిపోయి త‌ల వాస‌న రావ‌టం త‌గ్గుంది.
తేనెలోని విటమిన్లు, ఖనిజ లవణాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. తేనె చక్కని కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. జట్టు పచ్చుకుచ్చులా జాలువారాలంటే, తలస్నానం చేశాక మగ్గు నీటిలో అరకప్పు తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టును తడిపి, రెండు నిమిషాల తరువాత తలపై నుంచి చల్లటి నీటిని ధారలా పోయాలి.

పెరుగులో మెంతులు నాన‌బెట్టి గ్రైండ్ చేసి త‌ల‌కు రాసుకుని అర‌గంట త‌రువాత క‌డిగేసుకుంటే చుండ్రు త‌గ్గ‌డ‌మే కాక జుట్టు కూడా మెరుస్తుంది.మృదువుగా త‌యార‌వుతంది.

Monday, May 23, 2016

మొటిమలతో బాధ పడుతున్నారా...?

ప్రస్తుత రోజుల్లో స్త్రీ , పురుషులిద్దరిలో వేధిస్తున్న సమస్య మొటిమలు. ఈ మొటిమలు ఏ రూపంలో అయినా ముఖం మీద ఏర్పడవచ్చు. చిన్నవిగా, పెద్దవిగా, చిన్న బుడిపెలుగా , బ్లాక్ హెడ్స్ లేదా సాధారణ మొటిమల రూపంలో కనబడుతాయి . మొటిమలు ఎలా ఏర్పడినా ఇవి మీ అందాన్ని పాడు చేస్తాయి . అంతే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీస్తాయి. 



ఈ మొటమలకు ప్రధాణ కారణం చర్మ రంద్రాలు మూసుకుపోవడం . డెడ్ స్కిన్ సెల్ తొలగించకపోవడం, అలాగే చర్మ రంద్రాల్లో బ్యాక్టీరియా చేయడం, ఇంకా ఇతర చర్మ సమస్యలు మొటిమలకు కారణమవుతుంది. 

ఇంకా ఒత్తిడి, మరియు హార్మోనుల్లో మార్పులు వల్ల చర్మంలో మొటిమలు ఏర్పడుతాయి. ఈ మొటిమలు, మచ్చలను సులభంగా , సురక్షితంగా తొలగించుకోవడం వల్ల మొటిమలు పగలకుండా ఉంటాయి. ఇలా సురక్షితమైన పద్ధతిలో మొటిమలను నివారించుకోవడం కొద్దిగా కష్టమే . అయితే కొన్ని నేచురల్ పదార్థాలతోటే ఎఫెక్టివ్ గా, సేఫ్ గా తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ బ్యూటీ స్ట్రోర్స్ లో లభించే క్రీములకన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీ మనమే ఇంట్లో తయారుచేసుకొనే పద్ధతిని ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ సెల్ఫ్ మాస్క్ , విటమిన్ సి పౌడర్ లేదా ఆరెంజ్ తొక్క పొడి , తేనె మరియు లావెండర్ నూనె అవసరమవుతాయి. 

విటమిన్ సి పౌడర్ చర్మంలో పిహెచ్ లెవల్ ను రీస్టోర్ చేస్తుంది. అదే విధంగా తేనె ఒక అద్భుతమైన యాంటీసెప్టిక్ , యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కలిగినది. 

ఇక లావెండర్ ఆయిల్ మరో మోస్ట్ బెనిఫిషియల్ ఆయిల్ ఇది. మొటిమలు బ్రేక్ అవుట్ కాకుండా సురక్షితంగా మొటిమలను నివారిస్తుంది. మరి ఈ యాంటీ ఏన్స్ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు: 
విటమిన్ సి లేదా ఆరెంజ్ పీల్ పౌడర్ : 1టీస్పూన్ 
తేనె : 1 
టీస్పూన్ 2-3 
చుక్కల లావెండర్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి: ఈ పదార్థాలన్నింటిని మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. 20 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.