Tuesday, May 24, 2016

అంద‌మైన శిరోజాల‌కు మ‌రింత అందం సమకుర్చుకోవాలా ?

ఆడ‌వారికి అందం జుట్టే. అటువంట‌ప్పుడు పొడ‌వైన ,న‌ల్ల‌ని ,వ‌త్తైన ,అంద‌మైన శిరోజాలు కావాల‌ని ఎవ‌రు కోరుకోరు. కానీ ఆ అందాన్ని సంర‌క్షించుకోవాల‌న్నా అంద‌మైన శిరోజాల‌కు మ‌రింత అందం స‌మ‌కూరాల‌న్నా మారుతున్న వాత‌వ‌ర‌ణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ, మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవి ఇప్పుడు చూద్దాం.
వేస‌వి కాలంలో తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు:-
చలికాలంతో పోలిస్తే వేసవిలో వెంట్రుకలు ఊడడమనే సమస్య పెరుగుతుంటుంది. కారణం సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నేరుగా కేశాలను తాకడం వల్ల శిరోజాల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. త్వరగా పొడిబారి, తెల్లజుట్టుకు కూడా కారణమవుతుంది.

అతినీలలోహిత కిరణాలు నేరుగా శిరోజాలను తాకకుండా బయటకు వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్స్ వంటివి తలకు ఉపయోగించాలి. బయటకు వెళ్లేముందు కండిషనర్‌ను లేదా సన్‌స్క్రీన్‌ను పై వెంట్రుకలకు రాయాలి. బయట నుంచి వచ్చిన వెంటనే జుట్టును శుభ్రపరుచుకోవాలి.


వేసవిలో కొంతమంది స్విమ్మింగ్‌ను ఇష్ట‌ప‌డే వారు అలవాటుగా ఎంచుకుంటారు. ఈత కొలనులలో ఉండే ఉప్పు వల్ల జుట్టు పొడిబారి, వెంట్రుకల చివరలు చిట్లుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో క్లోరిన్ లేని నీటితో తలను శుభ్రపరుచుకుంటే వెంట్రుకలు చిట్లడం, నిస్తేజంగా మారడం ఉండదు.

వేసవిలో వేడి అమితం. దీంతో జుట్టు తడి పోగొట్టడానికి హెయిర్ డ్రయ్యర్, బ్లోయర్, స్ట్రెయిటనర్.. వంటివి వాడుతుంటారు. ఈ పరికరాల వల్ల వెంట్రుకలు చిట్లి, మరింత దెబ్బతింటాయి. అందుకని వేసవిలో ‘వేడి’ పరికరాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. శుభ్ర‌మైన మెత్త‌టి పొడిగా ఉన్న ట‌వ‌ల్‌ని వాడ‌డం మంచిది.
వేసవి చీకాకును పోగొట్టుకోవడానికి వారంలో ఎక్కువసార్లు తలస్నానానికి షాంపూను ఉపయోగిస్తారు. దీని వల్ల షాంపూలోనే ఉండే రసాయనాలు వెంట్రుకలపై ఉండే సహజసిద్ధమైన నూనెను తగ్గించి, వెంట్రుకలను గరుకుగా మారుస్తాయి. షాంపూతో తలంటుకున్న ప్రతీసారి ప్రొటీన్, కెరటీన్ ఉన్న కండిషనర్‌నే ఉపయోగించాలి. లేదా వారానికి రెండుసార్లు పెరుగుతో తలకు ప్యాక్ వేసుకొని, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చల్లని ప్రభావాన్ని చూపుతుంది. వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు.
వేడినీటితో తలస్నానం చేసేవారు వేసవిలో ఆ అలవాటును మానుకోవడం మంచిది. సహజంగానే వేడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటుంటాయి. అలాంటిది వేడినీటి వల్ల వెంట్రుక కుదురు మరింతగా పొడిబారి జీవం కోల్పోతుంది. అందుకని తలస్నానానికి చన్నీటినే ఉపయోగించాలి. జ‌డ వేసుకునే వారు బిగుతుగా అల్ల‌కండా లూజుగా అల్లుకోవ‌డం మంచిది. ఎందుకంటే బిగుతుగా అల్ల‌డం వ‌ల‌న చెమ‌ట ఆరిపోవ‌డానికి అవ‌కాశం లేకుండా వేస‌విలో జుట్టు దుర్వ‌స‌న వ‌స్తుంది. వ‌దులుగా అల్ల‌డం వ‌ల‌న గాలికి చెమ‌ల ఆరిపోయి త‌ల వాస‌న రావ‌టం త‌గ్గుంది.
తేనెలోని విటమిన్లు, ఖనిజ లవణాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. తేనె చక్కని కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. జట్టు పచ్చుకుచ్చులా జాలువారాలంటే, తలస్నానం చేశాక మగ్గు నీటిలో అరకప్పు తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టును తడిపి, రెండు నిమిషాల తరువాత తలపై నుంచి చల్లటి నీటిని ధారలా పోయాలి.

పెరుగులో మెంతులు నాన‌బెట్టి గ్రైండ్ చేసి త‌ల‌కు రాసుకుని అర‌గంట త‌రువాత క‌డిగేసుకుంటే చుండ్రు త‌గ్గ‌డ‌మే కాక జుట్టు కూడా మెరుస్తుంది.మృదువుగా త‌యార‌వుతంది.

No comments:

Post a Comment