Wednesday, May 25, 2016

ప్రొద్దున్నే అవి తాగితే బరువు పెరుగుతారా ?

బరువు తగ్గాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వ్యాయామంపై ఫోకస్ పెడితే, మరికొందరు డైటింగ్ ఫాలో అవుతారు. మరికొందరు డ్రింక్స్ విషయంలో కేర్ తీసుకుంటారు. అయితే మీరు తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ మీకు తెలియకుండానే మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి.

తాజా అధ్యయనాల ప్రకారం కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లు హెల్తీ ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం అలవాటు చేసుకుంటే.. వాళ్లు ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టే అని తేల్చారు. కొంతమంది ఉదయం ప్రొబయోటిక్ డ్రింక్ తీసుకుని బరువు తగ్గాలని భావిస్తారు. కానీ.. దానివల్ల బరువు తగ్గడం కంటే.. పెరగడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరిగించాలి, అధిక బరువు తగ్గించాలని మీరు భావిస్తుంటే.. ఉదయం తీసుకునే ఈ 7 రకాల డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. మరి అవేంటో ఇప్పుడే చెక్ చేయండి.

స్వీట్ లస్సీ:
పెరుగు, పంచదార, నీళ్లు కలిపి తయారు చేసుకునే డ్రింక్ స్వీట్ లస్సీ. ఇది నార్త్, వెస్ట్ లో చాలా ఫేమస్ డ్రింక్. కానీ ఇందులో ఉండే ఫ్యాట్ బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒక గ్లాసు లస్సీలో 159 క్యాలరీలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు దీనికి దూరంగా ఉండటం మంచిది.


బాదాం, చాక్లెట్ మిల్క్:
పాలు న్యాచురల్ గానే కొద్దిగా తీయటి రుచి కలిగి ఉంటాయి. అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిలోకి స్వీట్ నెస్ కోసం ఏవైనా కలపడం చాలామందికి అలవాటు. అంటే పంచదార, బాదాం, చాక్లెట్ సిరప్ వంటివి కలుపుతుంటారు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల క్యాలరీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక గ్లాస్ ఫ్లేవర్డ్ మిల్క్ లో 158 క్యాలరీలుంటాయి.

ఆరంజ్ జ్యూస్:
ఫ్రూట్స్ ని జ్యూస్ ల రూపంలో కంటే.. కట్ చేసి డైరెక్ట్ గా తీసుకోవడమే మంచిది. అలా తీసుకుంటేనే ఎక్కువ పోషకాలు పొందవచ్చు. అదే ఫ్రూట్ జ్యూస్ చేయడం వల్ల అందులోని ఫైబర్ కోల్పోతుంది. అంతేకాదు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ లో 220 క్యాలరీలుంటాయి. కాబట్టి వీటిని డైరెక్ట్ గా తినడమే మంచిది.

గేదె పాలు :
ఒక గ్లాసు గేదె పాలల్లో 280 క్యాలరీలుంటాయి. ఫ్యాట్ 16.81 గ్రాములుంటుంది. కాబట్టి ఈ పాలను కూడా బరువు తగ్గాలనుకునేవాళ్లు తీసుకోకూడదు.

అరటిపండు మిల్క్ షేక్ :
మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలని కోరుకుంటే.. అరటిపండ్లు, పాలు కలిపి తీసుకోవడం మానేయండి. ఒక అరటిపండులోనే 108 క్యాలరీలుంటాయి. అప్పుడు పాలు, అరటిపండ్లు కలిపిన మిల్క్ షేక్ లో ఇక ఎన్ని క్యాలరీలుంటాయో గమనించండి.

స్మూతీస్ : 
చాలా మంది ఉదయాన్నే స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ.. ఉదయాన్నే ఈ స్మూతీస్ తీసుకుంటే.. మీ బరువు భారీగా పెరుగుతుంది. ఒక గ్లాస్ తీసుకున్నా.. అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒక గ్లాస్ స్మూతీలో 145 క్యాలరీలుంటాయి.

బరువు తగ్గాలంటే:
బరువు తగ్గాలనుకునే వాళ్లు పైన చెప్పిన డ్రింక్స్ కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ని ఏమాత్రం తీసుకోకూడదు. అయితే మీరు బరువు తగ్గాలంటే.. తాగాల్సిన కొన్ని హెల్త్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అవి మిమ్మల్ని ఫిట్ అండ్ హెల్తీగా మార్చేస్తాయి.

తేనె, దాల్చిన చెక్క:
ఒక టేబుల్ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలపాలి. నిద్రలేవగానే ఈ డ్రింక్ ని ప్రతి రోజూ తాగండి. ఒక వేళ టేస్టీగా కావాలనుకుంటే.. కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోండి.

గ్రీన్ టీ :
డెటాక్స్ డ్రింక్ తో రోజుని ప్రారంభించడం చాలా అద్భుతమైన ఐడియా. ఫ్యాట్ కరిగించడానికి మాత్రమే కాదు.. రోజుకి 3 నుంచి 5 కప్పుల గ్రీన్ టీ తాగితే.. శరీరంలో మలినాలను బయటకు పంపుతుంది.

No comments:

Post a Comment