Saturday, September 24, 2016

డేంగ్యూ ఫీవర్ తో బాధపడే వారి రక్తంలో ఫ్లేట్ లెట్స్ ను పెంచే 7 హెర్బ్స్

రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలోనూ ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. మీరు ఇప్పటికే డేంగ్యూ ఫీవర్ గురించి వినే ఉంటారు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్ స్థాయిలో తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాధం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు . ఈ వైరస్ కు కారణం జన్యుపరమైన, మెడికేషన్స్, ఆల్కహాల్, వైరస్, గర్భాధారణ మరియు ఇతర కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అలా వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా, లేదా ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నా, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 

శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడవ వల్ల నేచురల్ గానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడేవారు, తప్పనిసరిగా అధిక విటమిన్స్ మరియు మినిరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అది అనారోగ్యకరమైన శరీరం నుండి తర్వగా కోలుకొనేందుకు సహాయపడుతుంది . 

ప్లేట్ లెట్స్ ను నేచురల్ గా అభివృద్దిపరుచుకోవడం కోసం ఈ క్రింద కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ రెమెడీస్ ను ఇవ్వడం జరిగింది. మీలో ప్లేట్ లెట్స్ తగ్గాయని తెలుసుకోగానే, వెంటనే ఐరన్ పుష్కలంగా ఉన్న రెండు ఆహారాలు, హెర్బల్ రెమెడీస్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ పవర్ ఫుల్ హెర్బల్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం... 



బొప్పాయి: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. అందుకు మీరు చేయాల్సిండి బొప్పాయి ఆకులను జ్యూస్ ను త్రాగడం లేదా బొప్పాయి ఆకులను కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఆ నీటిని వడగట్టి రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. 



వీట్ గ్రాస్: వీట్ గ్రాస్ హెర్బ్, దీన్నే గోధుమ గడ్డి అనిపిలుస్తారు, దీన్నె రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ప్లెట్ లెట్ కౌంట్ పెరుగుతుంది, వీట్ గ్రాస్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెరుతుంది. ఇంకా ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకనాలకు సపోర్ట్ చేస్తుంది. 



ఆకు కూరలు: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాలే మరియు ఇతర గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను అభివృద్ది పరచుకోవచ్చు. 



ఉసిరికాయ: ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. 



గుడుచి: శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి. 



తులసి: డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 



aఅలోవెర: అలోవెరా ఎమినో యాసిడ్స్ పెంచి, బ్లడ్ ప్లేట్లెట్ లెవెల్స్ ని పెంచుతుంది. డెంగ్యూ ఫీవర్ బారిన పడినవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ముందు బ్లడ్ ప్లెట్లెట్స్, ఎమినో యాసిడ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి.

Wednesday, September 21, 2016

రెగ్యులర్ డైట్ లో మిల్లెట్ వుంటే మంచిదట...!

మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్ గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.



రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు. రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం మరియు ఒక మంచి ఆరోగ్య నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే, ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ ద్రవయాసిడ్ ను పెంచుతుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్ళు (మూత్రమార్గంలో రాళ్ళు )ఉన్నవారికి వీటిని తినమని సలహా ఇవ్వలేదు.

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది: రెగ్యులర్ డైట్ లో రాగులను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. రాగిలో ఫాలిఫినాల్స్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంది . బియ్యం, బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ కంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ. రాగుల్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ జీర్ణశక్తిని పెంచుతుంది, బ్లడ్ షులర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మధ్యహ్నానం మరియు ఈవెనింగ్ స్నాక్ గా గ్రేట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది

అనీమియా: రాగుల్లో ఐరన్ అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ కు అసవరమయ్యే ఐరన్ ను అందిస్తుంది. దాంతో అనీమియాను సమస్యను తగ్గించుకోవచ్చు. రాగులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ , రాగులను మొలక కట్టి తినడం వల్ల విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఐరన్ పిల్స్ ను తినడం కంటే డైలీ డైట్ లో రాగిపిండిని చేర్చుకోవడం మంచిది. ఏదో ఒక రకంగా రాగులను చేర్చుకోవడం వల్ల అనీమియాకు చెక్ పెట్టవచ్చు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

మిల్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. చర్మం యంగ్ గా మార్చుతుంది . ప్రీమెచ్యుర్ ఏజింగ్ సమస్య ఉండదు . రాగుల్లో ఉండే అమినినో యాసిడ్స్ మరియు మెతియోనిన్ , స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క ఫ్లెక్సిబిలిటిని పెంచతుుంది. స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది. అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

 ప్రోటీన్స్ ఎక్కువ
రాగుల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల మాల్ న్యూట్రిషియన్ లోపంను నివారిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను  నివారిస్తుంది.రాగులను క్రమంత తప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి : కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

బాలింతల్లో పాలఉత్పత్తి: మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్నంధించే టానిక్ వంటింది.  

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది. థ్రియోనిన్ అమినో యాసిడ్స్ కాలేయంలో కొవ్వు చేరకుండా నివారిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:
రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

Monday, September 19, 2016

యువరాజ్ కి వెరీ స్పెషల్ రోజు


ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది.

2007లో తొలి టి-20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియాకు మ్యాచ్ కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప  అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్ లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించనివిధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.  స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా, ఓవరాల్ గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు.  యువీ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.