Monday, September 19, 2016

యువరాజ్ కి వెరీ స్పెషల్ రోజు


ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది.

2007లో తొలి టి-20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియాకు మ్యాచ్ కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప  అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్ లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించనివిధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.  స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా, ఓవరాల్ గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు.  యువీ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.

No comments:

Post a Comment