Saturday, May 21, 2016

ఇన్ స్టాంట్ ఎనర్జీనిచ్చే ఎనర్జిటిక్ ఫుడ్స్..

సాధారణంగా కొంత మంది ఆహారం బాగే తింటున్నా....శరీరంలో ఏదో ఒక లోపంగా అనిపిస్తుంటుంది. శక్తిలేనట్లు బలహీనంగా ఫీలవుతుంటారు. దాంతో ఎప్పుడు చూసిన అలటతో కనబడుతుంటారు?ఈ కారణం చేత దినచర్య కష్టమవుతుంది. ఏ పనిచేయాలన్నా కష్టంగా ఫీలవుతారు.

ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయంటే మీరు బలహీనతతో బాధపడుతున్నారని గుర్తించాలి. వైద్య పరంగా బలహీనంగా ఉన్నవారు శరీరంలో శక్తి లేకుండా ఉంటారు. ముఖ్యంగా కండరాలు మరియు ఎముకల్లో శక్తిని కోల్పోతారు . ఇలా కండరాలు, ఎముకలు బలహీనంగా మారినప్పుడు దినదిన చర్యలు కష్టంగా మారుతాయి . తరచూ అలసటతో ఆందోళను చెందుతుంటారు .

బలహీనత అనేది సాధారణ సమస్య లేదా కొన్ని ప్రత్యేకమైన కండరాలకు సంబంధించన సమస్యగా నిపుణుల అభిప్రాయపడుతున్నారు . బలహీనత ఉన్నవారు శరీరం మొత్తం వీక్ గా అనిపించడం , లేదా కాళ్ళు, భుజాల బలహీనంగా శక్తి, ఎనర్జీ లేనట్లు ఫీలవుతుంటారు. ఇలా కండరాలు బలహీనపడినప్పుడు ఒంట్లో శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. శక్తిసామర్థ్యాలు తగ్గినప్పుడు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

శరీరకంగా బలహీనంగా మారినప్పుడు అందుకు ముఖ్య కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్స్, నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలు మొదలగునవన్నీ బలహీనంగా మారడానికి కారణం అవుతాయి. అంతే కాదు, క్యాన్సర్, మరియు స్ట్రోక్ వంటి లక్షణాల్లో బలహీనత కూడా ఒకటి.

కాబట్టి, వారం రోజుల కంటే ఎక్కువగా మీరు తరచూ బలహీనతకు గురి అవుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. బలహీనతకు గల అసలు కారణాన్ని తెలుసుకొని తగిన చికిత్సను తీసుకోవడం మంచిది.

సహజంగా చాలా మంది సాధరణ బలహీనతతో బాధపడుతుంటారని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాంటి వారికి సరైన పౌస్టికాహారం, హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్ ను అంధివ్వడం మరియు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా బలహీనత నుండి బయటపడవచ్చు. మరి అలాంటీ హెల్తీ బ్యాలెన్డ్స్ డైట్ ఫుడ్స్ ను కొన్ని ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని హెల్తీ లైఫ్ ను ఎంజాయ్ చేయండి...


అరటిపండ్లు: అరటిపండ్లలో నేచురల్ షుగర్స్ కాకుండా , ఎనర్జీని అందించే అద్భుతమైన ఆహారం. ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. నేచురల్ షుగర్స్ వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి రోజులో ఒకటి రెండు అరటిపండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి. దాంతో మీ డైలీ యాక్టివిటీస్ చురుకుగా చేసుకోవచ్చు.


పాలు: పాలలో క్యాల్షియం, విటమిన్ బి మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరానికి అవసరమయ్యే ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ మిస్ కాకుండా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలను బలోపేతం చేసుకోవచ్చు . వీక్ నెస్ ను తగ్గిస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ను అందిస్తుంది.



బాదం: బాదంలో అత్యంత పోషకవిలున్నాయన్న విషయం యూనివర్సల్ ఫ్యాక్ట్ . బాదం రెగ్యులర్ గా తినడం వల్ల బలహీనత తగ్గించుకోవచ్చు . బాదంలో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం, వంటి మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది వీక్ నెస్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.



జెన్సింగ్ రూట్ : జెన్సింగ్ రూట్ మరో రిమార్కబుల్ నేచురల్ రెమెడీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల నరాలను బలపరుస్తుంది. తగినంత శక్తిని అందిస్తుంది. ఈ హెర్బ్ నేరుగా నరాల మీద ప్రభావం చూపుతుంది, . దాంతో నరాల బలహీనత మరియు టైయర్డ్ నెస్, వీక్ నెస్ అనే సమస్యలుండవు.



స్ట్రాబెర్రీస్: స్ట్రాబెరీలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి . ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. టిష్యు డ్యామేజ్ ను నివారిస్తుంది . ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల బాడీ మజిల్స్ కు సరిపడా శక్తిని అందిస్తుంది. వీక్ నెస్ తో పోరాడుతుంది, కాబట్టి రెగ్యులర్ గా స్ట్రాబెర్రీస్ తినడం వల్ల టేస్టీగా ఉంటుంది మరియు బలహీనతను తగ్గించుకోవచ్చు.



తులసీ టీ తులసీ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇతరబెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు తులసీ టీ తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం చేయడంతో బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.



ఆమ్లా: ఉసిరికాయ ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. కాబట్టి, ఆమ్లా (ఉసరికాయను )రెగ్యులర్ డైట్ లో ఏదోఒక విధంగా చేర్చుకోవడం వల్ల వీక్ నెస్ ఉండదు.



కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది . ఈ విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది వీక్ నెస్ కు కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గించి శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కొబ్బరి నూనెను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెంచుతుంది . ఎనర్జీ లెవల్స్ పెరుగడంతో వీక్ నెస్ తగ్గుంది.



మామిడిపండ్లు: మామిడిపండ్లు అద్భుతమైన రుచి మాత్రమే కాదు, ఈ పండ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్య గ్రేట్ విటమిన్స్ మరియు మినిరల్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి . దాంతో ఎనర్జీ లెవల్స్ పెరగడంతో ఆరోగ్యంగా ఉంటారు.



గుడ్లు: గుడ్డులో ఐరన్, విటమిన్ ఎ, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి . ఒక గుడ్డును రోజూ తినడం వల్ల ఇన్ స్టంట్ గా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి . ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు చేర్చుకోవడం వల్ల నేచురల్ గా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

Friday, May 20, 2016

ఎన్టీఆర్ చిన్న నాటి ఫోటోలతో...

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నేటితో 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను గుర్తు చేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం. 



విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు. చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు.



తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు.



తొలి హిట్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రమే ఎన్టీఆర్ కెరీర్లో తొలి హిట్.



టర్నింగ్ పాయింట్ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. అయితే వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ‘ఆది' చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్.


సింహాద్రి ఆది తర్వాత వచ్చిన అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి ‘సింహాద్రి' చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో ఎన్టీఆర్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.



వరుస చిత్రాలు సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్.



రాఖీ రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంశలనందుకుంది.



ఆ ఇద్దరూ దర్శకులంటే... జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.



ప్లాపులు ఇచ్చిన దర్శకుడు జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" ప్లాపయింది. 2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన "శక్తి" చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది.

వరుస ప్లాపులు శక్తి తర్వాత ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు కూడా ప్లాపు కావడంతో ఎన్టీఆర్ కాస్త డీలా పడ్డాడు.

పడుతూ లేస్తూ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా హిట్ అయింది. తర్వాత రభస, రామయ్య వస్తావయ్యా ప్లాప్. టెంపర్ చిత్రం ఫర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో హిట్. ఇలా పడుతూ లేస్తూ ఎన్టీఆర్ కెరీర్ సాగుతోంది.

జనతా గ్యారేజ్ ప్రస్తుతం జూ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నారు.

నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా..?

నెయ్యి అంటే అందరికీ ఇష్టమే. కమ్మని సువాసన, ఆహారంలో మధురమైన రుచి అందిస్తుంది నెయ్యి. సాధారణంగా స్వీట్స్ లో ఎక్కువగా నెయ్యి ఉపయోగిస్తారు. అలాగే.. పాయసం, పప్పు, పచ్చళ్లతో అన్నం తినేటప్పుడు నెయ్యి రుచి కమ్మదనాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు నెయ్యికి దూరంగా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ?



నెయ్యి అంటే చాలా ఫ్యాట్ ఉంటుందని.. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని చాలామంది భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఖచ్చితంగా డైట్ లో నెయ్యి చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నవాళ్లు డైట్ లో నెయ్యి చేర్చుకుంటే.. మీ టార్గెట్ మరింత తేలికగా రీచ్ అవుతారని సూచిస్తున్నారు. అయితే దేశీ గీ తీసుకుంటే.. ఎక్కువ ఫలితాలు పొందుతారట. మరి బరువు తగ్గాలనుకునేవాళ్లు నెయ్యి ఎందుకు తినాలో తెలుసుకుందామా..



దేశీ ఘీ :
బరువు తగ్గాలనుకునేవాళ్లు తమ డైట్ లో దేశీ ఘీనే ఉపయోగించాలి. ఎందుకంటే ఇలాంటి నెయ్యిలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాధారణంగా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ కాదని భావిస్తారు. కానీ.. మోతాదుకి మించి నెయ్యి తీసుకుంటే అనారోగ్యమే. కాబట్టి ఆ విషయంలో కేర్ తీసుకోవాలి.

ఎంత మోతాదు నిపుణుల ప్రకారం రోజుకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవచ్చు. అది దాదాపు 15 గ్రాములు ఉంటుంది. ఇంత మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయని భావిస్తారు. కానీ దీనిపై ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాగే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కి, హార్ట్ డిసీజ్ లకు ఎలాంటి లింక్ లేదని చెబుతున్నాయి.

విటమిన్స్ :
నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కె ఉంటాయి. ఇవి కొవ్వులో కరిగే అంటే ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్. కాబట్టి ఇవి ఇమ్యున్ సిస్టమ్ కి మంచిది. విటమిన్ ఏ, ఈలో యాంటీ ఆక్సిడెంట్స్, డి ఎముకల ఆరోగ్యానికి, బలానికి, కండరాల నొప్పులు, వాపు నివారించడానికి ఉపయోగపడతాయి. విటమిన్ కె బ్లడ్ క్లాటింగ్ కి సహాయపడుతుంది. చిన్న గాయమైనా ఎక్కువ రక్తస్రావం అయిందంటే.. విటమిన్ కె డెఫిసియన్సీగా గుర్తించాలి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్ల డైట్ లో నెయ్యి చేర్చుకోవడం చాలా అవసరం.

బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయని చాలా కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం.. దీనికి వ్యతిరేకంగా వెల్లడించాయి. ఎక్కువ మొత్తంలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇవి మాత్ర హార్ట్ డిసీజ్ పెంచే రిస్క్ ఉంటుంది.

ఇమ్యునిటీ రోజు ఒక్క స్పూన్ అయినా.. నెయ్యి తీసుకోవాలని మన పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. ఎందుకంటే.. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ పెంచుతాయి. సీజనల్ ఎలర్జీలను నివారిస్తాయి. రెగ్యులర్ గా నెయ్యి తీసుకుంటే.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.


సెమన్ క్వాలిటీ డైట్ లో ప్రొటీన్స్, ఫ్యాట్స్ బ్యాలెన్డ్స్ గా ఉండాలి. హెల్తీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కి అద్భుతమైన, ఆరోగ్యకరమైన హోంమేడ్ ఫుడ్. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల వీర్యం క్వాలిటీ డెవలప్ అవుతుంది.

జీర్ణశక్తి చాలా రకాల ఆయిల్స్ శరీరంలో డైజెస్టివ్ ప్రాసెస్ ని స్లో చేస్తాయి. కానీ.. నెయ్యిలో ఉండే ఫ్యాట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే డైజెషన్ సజావుగా జరగడానికి, న్యూట్రీషన్ అందడానికి సహాయపడతాయి.

సూచన అయితే గుండె సంబంధిత వ్యాధులు, ఒబేసిటీతో బాధపడేవాళ్లు.. నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు, సరైన మోతాదులో నెయ్యి తీసుకుంటే.. బరువు తగ్గాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు.

Thursday, May 19, 2016

దేవాలయాల్లో దైవ దర్శనం తర్వాత ఖచ్చితంగా కూర్చోవాల..?

సాధారణంగా ఆలయంలో దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిపేపు కూర్చొంటారు. ఇలా ఎందుకు కూర్చొంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్ది సేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెపుతున్నాయి.



స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌనధ్యానంతో, కొంతసమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్రసమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అనికాదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.



అలాగే, ఆలయ ప్రవేశానికీ కొన్ని నియమాలున్నాయి. ఆలయం ప్రవవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్థు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా.. ఎవరివద్దా ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతనూ దేవాలయాల్లో చూపించరాదు. 


దేవుడు అందరికీ దేవుడే. దైవకార్యాలకు అందరూ పెద్దలే. దైవప్రీతికి అందరూ పాత్రులే. దైవపూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. 


మరి దేవుడుని దర్శించుకొన్న తర్వాత దేవాలయంలో కూర్చోవడానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు:



దేవాలయాల్లో దైవ దర్శనం తర్వాత ఎందుకు కూర్చుంటారు...? 



  • ఆలయ ప్రదేశాలలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్ర ఉత్తర దక్షిణ ధృవముల తరంగ విస్తృతి అధికముగా ఉండి, ఇటువంటి ధనాత్మక శక్తి విరివిగా లభ్యం అవుతున్నటువంటి చోట వ్యూహాత్మకంగా దేవాలయముల నిర్మాణం జరిగెడిది.
  • మూల విరాట్టు లేదా ప్రధాన మూర్తిని ఈ ప్రదేశం యొక్క కేంద్రక స్థానం వద్ద ప్రతిష్టించడం జరుగుతుంది. దీనినే గర్భగృహం లేదా మూల స్థానం అని కూడా పిలుస్తారు. ఈ మూలస్థానం వద్ద భూమి అయస్కాంత తరంగాలు అధికముగా ఉంటాయి.
  • వేద మంత్రాలు వ్రాయబడ్డ తామ్ర పత్రాలు (రాగి రేకులు) మూల విరాట్టు అడుగు భాగంలో భూస్థాపితం చేయబడి ఉంటాయని మన పెద్దలు చెప్పడం మనకు తెలుసు.
  • వాస్తవానికి ఆ రాగి రేకులు ఏమిటి? పూజారులు శ్లోకాలను మరిచిపోయినప్పుడు చదువుకోవడానికి అవి వారికి ఉపయోగపడతాయా, అంటే కాదు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి తమ పరిసరాలకు పునః ప్రసారం చేస్తాయి.
  • ఆ విధంగా ప్రతీ రోజు దేవాలయ సందర్శనానికి వచ్చి, సవ్య దిశలో (గడియారపు ముల్లు తిరిగే మాదిరి) మూల విరాట్టు కి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి శరీరం మూల విరాట్టు అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేస్తున్న భూ అయస్కాంత తరంగాలను గ్రహించడం జరుగుతుంది.
  • ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది, అందుకే మన పెద్దలు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా మౌనంగా చేయాలని చెబుతుంటారు. శాస్త్రీయంగా, మనం అందరం ఆరోగ్యంగా జీవించడానికి ఈ ధనాత్మక శక్తి ఎంతగానో దోహదపడుతుంది.
  • దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది, దేవాలయంలో భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత శరీరం మనస్సు ఉత్తేజితమవుతాయి.
  • అందుకు కారణం అక్కడి భగవంతుని మహిమ, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం.
  • దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. మంత్రోచ్ఛారణాల్లోని శబ్ధతరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
  • ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే వాతావరణం ఉన్న గుడిలో దైవ సన్నిధిలో ధ్యానం గానీ, జపంకానీ చేయడం వల్ల జ్ఝాపకశక్తి మెరుగై రెట్టింపు ఫలితాలను పొందుతారు.
  • సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సాధించవచ్చు. అందుకే దేవాలయాలలో భగవంతుని దర్శనం తర్వాత కాసేపు ఆ ఆవరణలో ప్రశాంతంగా కూర్చోవాలి.
  • దేవాలయంలో కూర్చుంటే మనస్సుకు ప్రశాంతత, పుణ్యఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. అలా కూర్చోకుండా వెళ్లే భగవంతుని దర్శించిన ఫలితం కూడా రాదని అంటుంటారు.
  • ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని మంచీ , చెడులను ఆలోచించి మంచి వైపు మార్గాన్ని ఎంచుకొనే అవకాశాన్ని మన మనస్సు అందిస్తాయి.
  • ఇలా ఆలయంలో కూర్చోవడం ఒక రకమైన ద్యానం వంటిది. అలా ఒక 2 నిముషాల పాటు మౌనంగా కూర్చొని మనం దర్శించిన ఆ భగవంతుని తిరిగి స్పృతి చేసుకుంటే వచ్చే ఆనందం మరియు ప్రశాంతత ఉత్తమమైనది.


Wednesday, May 18, 2016

ఇలా చేస్తే కిడ్ని సమస్యలు సమసిపోతాయా ?

కిడ్నీలు బ్లడ్ ను శుభ్రం చేస్తుంది. అంతే కాదు, ఇది శరీరంలో టాక్సిన్స్ ను మరియు వ్యర్థాలను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు ఒత్తిడికి గురి అవుతాయి. శరీరంలో వ్యర్థాలు ఎక్కువైనప్పుడు కిడ్నీల మీద అదనపు భారం ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు మరింత ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి. 

మనం రెగ్యులర్ గా తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం మరియు తక్కువగా నీరు తాగడం వల్ల , శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. దాంతో కిడ్నీలు మరియు లివర్ మీద కూడా ఎక్కువ భారం పడుతుంది. 

అందువల్ల, కిడ్నీల మీద అదనపు భారం పడకుండా ఎప్పటికప్పడు ఆరోగ్యంగా జీవక్రియలు జరగాలంటే, కొన్ని పద్దతులు చాలా సింపుల్ గా ఉన్నాయి. అందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలుదు , కిడ్నీలను శుభ్రం చేసే టిప్స్ ను ఫాలో అయితే చాలు. మరి ఆ కిడ్నీ క్లెన్సింగ్ టిప్స్ ఏంటో చూద్దాం...

1. టిప్ # 1: కొన్ని రకాల వెజిటేబుల్స్ కిడ్నీఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో కేల, ఆకుకూరలు, క్యారెట్స్, లెట్యూస్, కీరదోస, మరియు సెలరీ వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

2.టిప్ # 2: నిమ్మరసం అనేక ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు, ఇది కిడ్నీస్టోన్స్ ను కరిగించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించారు . లెమన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగాలి.

3. టిప్ # 3: వెజిటేబుల్స్ సరిగా తినలేని వారు ఆపిల్స్, పీచెస్, పైనాపిల్ , పియర్స్ మరియు ఆరెంజెస్ ను తీసుకోవాలి.

4. టిప్ # 4: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి ఆర్గానిక్ జ్యూస్ ను తాగడం వల్ల కిడ్నీసమస్యలు నివారించబడుతాయి.

5.టిప్ # 5: లెమన్ జ్యూస్ లో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి , తర్వాత ఒక కప్పు వాటర్ మిక్స్ చేసి రోజులో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటుండాలి. ఇలాతాగడం వల్ల కిడ్నీఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది.

6. టిప్ # 6: బీట్ రూట్ లో కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన ఫైటో కెమికల్స్ ఉన్నాయి. నిజానికి, బీట్ రూట్ యూరిన్ లోని యాసిడ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు.

7.టిప్ # 7: రోజుకు సరిపడా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రపడుతాయి . రోజులో అప్పుడప్పుడు నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఎనర్జి లెవల్స్ పెరుగుతాయి. కిడ్నీలు శుభ్రపడుతాయి.


Tuesday, May 17, 2016

ఇలా చేస్తే వేగంగా బరువు తగ్గుతారా ?

లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవకపోవడం, వ్యాయామం నిర్లక్ష్యం చేయడం వంటి అలవాట్ల ద్వారా సరైన బరువు ఉండటం చాలా కష్టం. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుంటుంది. దీనికి చక్కటి పరిష్కారం.. మన పూర్వీకులు ఉపయోగించిన మెడిసిన్. అదే ఎఫెక్టివ్ ఫలితాలు అందించే ఆయుర్వేదం..!!



ఆయుర్వేద అనే పదం.. ఆయు, వేద అనే పదాల ద్వారా వచ్చింది. ఆయు అంటే జీవితం అని, వేద అంటే.. నాలెడ్జ్ అని అర్థం. ఆయుర్వేద అంటే.. మన పూర్వీకుల రహస్యాలు అని అర్థం. జీర్ణక్రియ సరిగా ఉండటం, మలినాలు తొలగించడం ఇవన్నీ ఆయుర్వేదం చాలా ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది.

ఆయుర్వేదం ప్రకారం మనం పాటించే అలవాట్లు సజావుగా లేకపోతే.. బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ శరీరం మూడు రకాలు. వాత, పిత్త, కఫ. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం ఈ మూడు భాగాల ద్వారా ఏర్పడుతుంది. అంటే మనం హెల్తీ డైట్ ఫాలో అయితే.. ఇవి మనకు సరిగ్గా సూట్ అవుతాయి. 



ఆయుర్వేద పరిష్కారాల ద్వారా బరువు తగ్గించుకోవడం తేలిక. వీటి ద్వారా బరువు తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. మరి అవేంటో చూద్దామా..

త్రిఫల త్రిఫల అనేది బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే హెర్బ్. ఇందులో ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే మూడు మూలికలు ఉంటాయి. ఈ మూలికల్లో క్లెన్సింగ్, డెటాక్సిఫైయింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. అలాగే ఆకలిని తగ్గిస్తుంది.

తీసుకునే విధానం ఒక స్పూన్ త్రిఫల పౌడర్ తీసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా ఒక నెలరోజులు పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా అలోవెరాను చర్మానికి, డైజెషన్ కి ఉపయోగిస్తారు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. డెటాక్సిఫై, మెటబాలిజంకు ఇది సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. 

తీసుకునే విధానం అలోవెరా జ్యూస్ ని, నిమ్మరసం, నీళ్లు, తేనె కలపాలి. దీన్ని బరువు తగ్గాలనుకునేవాళ్లు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

కరివేపాకు కరివేపాకు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. బరువు తగ్గించడంతో పాటు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం. 

ఉపయోగించే విధానం పప్పు, కూరల్లో కరివేపాకు ఆకులను యాడ్ చేసుకోవాలి. అలాగే వేడినీటిలో ఉడికించి.. గోరువెచ్చగా ఉన్నవప్పుడు అవి తాగాలి. అలాగే కరివేపాకును నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతి ప్రతి ఇండియన్ వంటింట్లో మెంతులను, మెంతి ఆకులను తరచుగా వాడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గించడానికి మెంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొంతమందికే తెలుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ ని కరిగిస్తుంది. 

తీసుకునే విధానం ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అలాగే మెంతులను కొద్దిగా వేయించి..సలాడ్స్, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

Monday, May 16, 2016

గుడికి వెళ్లేవారు ఇవి పాటిస్తున్నారా..?

ప్రతి రోజూ గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. గుడికి వెళ్ళడమంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. అసలు గుడి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి, గుడులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలన్న విషయంపై వేదాలు ఏం చెప్పున్నాయి. మరియు పాటించాల్సిన నియమాలేంటి అన్న విషయాలను తెసుకోవడం చాలా అవసరం. 



మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.



భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి. 



దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.



ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. మరి ఇంతటి పవిత్రమైన గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏవిధంగా వెళ్ళాలి...పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోవడం ద్వారా మరింత పుణ్య ఫలం దగ్గించుకోవచ్చు...

గుడికి వెళ్లేవారు తప్పక పాటించాల్సిన నియమాలు 
  • తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
  • ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
  • శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
  • ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
  • దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
  • దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
  • దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
  • పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
  • యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
  • శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
  • ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
  • తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
  • తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహ మునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
  • ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
  • ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి)దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
  • నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికిప్రీతికరము.
  • జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
  • ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి
  • ఆలయం వద్ద భక్తులు గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు.
  • గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తోట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారనిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు.
  • దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి.
  • దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపూ చేయాలి. అమ్మవారిని నూనె దీపమయితే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.