Friday, May 20, 2016

ఎన్టీఆర్ చిన్న నాటి ఫోటోలతో...

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నేటితో 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను గుర్తు చేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం. 



విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు. చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు.



తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు.



తొలి హిట్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రమే ఎన్టీఆర్ కెరీర్లో తొలి హిట్.



టర్నింగ్ పాయింట్ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. అయితే వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ‘ఆది' చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్.


సింహాద్రి ఆది తర్వాత వచ్చిన అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి ‘సింహాద్రి' చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో ఎన్టీఆర్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.



వరుస చిత్రాలు సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్.



రాఖీ రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంశలనందుకుంది.



ఆ ఇద్దరూ దర్శకులంటే... జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.



ప్లాపులు ఇచ్చిన దర్శకుడు జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" ప్లాపయింది. 2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన "శక్తి" చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది.

వరుస ప్లాపులు శక్తి తర్వాత ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు కూడా ప్లాపు కావడంతో ఎన్టీఆర్ కాస్త డీలా పడ్డాడు.

పడుతూ లేస్తూ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా హిట్ అయింది. తర్వాత రభస, రామయ్య వస్తావయ్యా ప్లాప్. టెంపర్ చిత్రం ఫర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో హిట్. ఇలా పడుతూ లేస్తూ ఎన్టీఆర్ కెరీర్ సాగుతోంది.

జనతా గ్యారేజ్ ప్రస్తుతం జూ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నారు.

1 comment:

  1. ఎన్‌టీఆర్ చిన్ననాటి ఫొటోలతో అని పోస్ట్ పేరు చూసి బ్లాగులోకి వస్తే ఇక్కడ కనిపించినవి జూనియర్ గారి ఫొటోలు. జూనియర్ ఎన్‌టీఆర్ గురించి చెప్పినప్పుడు జూనియర్ అనే పదం తగిలించకుండా చెప్పడం పెద్ద ఎన్‌టీఆర్ ని అవమానించడమే.

    ReplyDelete