Wednesday, May 18, 2016

ఇలా చేస్తే కిడ్ని సమస్యలు సమసిపోతాయా ?

కిడ్నీలు బ్లడ్ ను శుభ్రం చేస్తుంది. అంతే కాదు, ఇది శరీరంలో టాక్సిన్స్ ను మరియు వ్యర్థాలను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు ఒత్తిడికి గురి అవుతాయి. శరీరంలో వ్యర్థాలు ఎక్కువైనప్పుడు కిడ్నీల మీద అదనపు భారం ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు మరింత ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి. 

మనం రెగ్యులర్ గా తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం మరియు తక్కువగా నీరు తాగడం వల్ల , శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి. దాంతో కిడ్నీలు మరియు లివర్ మీద కూడా ఎక్కువ భారం పడుతుంది. 

అందువల్ల, కిడ్నీల మీద అదనపు భారం పడకుండా ఎప్పటికప్పడు ఆరోగ్యంగా జీవక్రియలు జరగాలంటే, కొన్ని పద్దతులు చాలా సింపుల్ గా ఉన్నాయి. అందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలుదు , కిడ్నీలను శుభ్రం చేసే టిప్స్ ను ఫాలో అయితే చాలు. మరి ఆ కిడ్నీ క్లెన్సింగ్ టిప్స్ ఏంటో చూద్దాం...

1. టిప్ # 1: కొన్ని రకాల వెజిటేబుల్స్ కిడ్నీఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో కేల, ఆకుకూరలు, క్యారెట్స్, లెట్యూస్, కీరదోస, మరియు సెలరీ వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

2.టిప్ # 2: నిమ్మరసం అనేక ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు, ఇది కిడ్నీస్టోన్స్ ను కరిగించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించారు . లెమన్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగాలి.

3. టిప్ # 3: వెజిటేబుల్స్ సరిగా తినలేని వారు ఆపిల్స్, పీచెస్, పైనాపిల్ , పియర్స్ మరియు ఆరెంజెస్ ను తీసుకోవాలి.

4. టిప్ # 4: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి ఆర్గానిక్ జ్యూస్ ను తాగడం వల్ల కిడ్నీసమస్యలు నివారించబడుతాయి.

5.టిప్ # 5: లెమన్ జ్యూస్ లో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి , తర్వాత ఒక కప్పు వాటర్ మిక్స్ చేసి రోజులో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటుండాలి. ఇలాతాగడం వల్ల కిడ్నీఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది.

6. టిప్ # 6: బీట్ రూట్ లో కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన ఫైటో కెమికల్స్ ఉన్నాయి. నిజానికి, బీట్ రూట్ యూరిన్ లోని యాసిడ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు.

7.టిప్ # 7: రోజుకు సరిపడా నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రపడుతాయి . రోజులో అప్పుడప్పుడు నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఎనర్జి లెవల్స్ పెరుగుతాయి. కిడ్నీలు శుభ్రపడుతాయి.


No comments:

Post a Comment