Tuesday, May 17, 2016

ఇలా చేస్తే వేగంగా బరువు తగ్గుతారా ?

లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవకపోవడం, వ్యాయామం నిర్లక్ష్యం చేయడం వంటి అలవాట్ల ద్వారా సరైన బరువు ఉండటం చాలా కష్టం. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుంటుంది. దీనికి చక్కటి పరిష్కారం.. మన పూర్వీకులు ఉపయోగించిన మెడిసిన్. అదే ఎఫెక్టివ్ ఫలితాలు అందించే ఆయుర్వేదం..!!



ఆయుర్వేద అనే పదం.. ఆయు, వేద అనే పదాల ద్వారా వచ్చింది. ఆయు అంటే జీవితం అని, వేద అంటే.. నాలెడ్జ్ అని అర్థం. ఆయుర్వేద అంటే.. మన పూర్వీకుల రహస్యాలు అని అర్థం. జీర్ణక్రియ సరిగా ఉండటం, మలినాలు తొలగించడం ఇవన్నీ ఆయుర్వేదం చాలా ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది.

ఆయుర్వేదం ప్రకారం మనం పాటించే అలవాట్లు సజావుగా లేకపోతే.. బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ శరీరం మూడు రకాలు. వాత, పిత్త, కఫ. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం ఈ మూడు భాగాల ద్వారా ఏర్పడుతుంది. అంటే మనం హెల్తీ డైట్ ఫాలో అయితే.. ఇవి మనకు సరిగ్గా సూట్ అవుతాయి. 



ఆయుర్వేద పరిష్కారాల ద్వారా బరువు తగ్గించుకోవడం తేలిక. వీటి ద్వారా బరువు తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. మరి అవేంటో చూద్దామా..

త్రిఫల త్రిఫల అనేది బరువు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే హెర్బ్. ఇందులో ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే మూడు మూలికలు ఉంటాయి. ఈ మూలికల్లో క్లెన్సింగ్, డెటాక్సిఫైయింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. అలాగే ఆకలిని తగ్గిస్తుంది.

తీసుకునే విధానం ఒక స్పూన్ త్రిఫల పౌడర్ తీసుకుని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా ఒక నెలరోజులు పాటిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా అలోవెరాను చర్మానికి, డైజెషన్ కి ఉపయోగిస్తారు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. డెటాక్సిఫై, మెటబాలిజంకు ఇది సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. 

తీసుకునే విధానం అలోవెరా జ్యూస్ ని, నిమ్మరసం, నీళ్లు, తేనె కలపాలి. దీన్ని బరువు తగ్గాలనుకునేవాళ్లు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

కరివేపాకు కరివేపాకు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. బరువు తగ్గించడంతో పాటు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం. 

ఉపయోగించే విధానం పప్పు, కూరల్లో కరివేపాకు ఆకులను యాడ్ చేసుకోవాలి. అలాగే వేడినీటిలో ఉడికించి.. గోరువెచ్చగా ఉన్నవప్పుడు అవి తాగాలి. అలాగే కరివేపాకును నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతి ప్రతి ఇండియన్ వంటింట్లో మెంతులను, మెంతి ఆకులను తరచుగా వాడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గించడానికి మెంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొంతమందికే తెలుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ ని కరిగిస్తుంది. 

తీసుకునే విధానం ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అలాగే మెంతులను కొద్దిగా వేయించి..సలాడ్స్, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.

No comments:

Post a Comment