Saturday, July 16, 2016

ప్రతి రోజూ 10 కర్జూరాలు తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కర్జూరాలు సరైన ఎంపిక అని నిపుణులు సూచిస్తారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు.. రోజంతా ఎనర్జీటిక్ గా ఉండటానికి సహాయపడతాయి. డేట్స్ టేస్టీగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి. 

డేట్స్ ని ఎలా తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనేదానిపై చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే.. రోజుకి కనీసం 8 నుంచి 10 డేట్స్ ని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి మిరాకిలస్ బెన్ఫిట్స్ అందుతాయని తాజా అధ్యయనాలు చెబతున్నాయి. ఇవి చర్మం సౌందర్యానికి నుంచి ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, కంటిచూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు.. రోజుకి 10 డేట్స్ తినడం వల్ల పొందే 16 అమోఘమైన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..


  • గాయాలకు గాయాలు అయినప్పుడు.. కొన్ని డేట్స్ ని క్రష్ చేసి.. పెరుగులో బాగా కలిపి తీసుకోవడం వల్ల.. వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • ఎనర్జీ రోజు 5 కర్జూరాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల.. రోజంతా ఎనర్జీని అందిస్తాయి.
  • నిద్రకు రాత్రి నిద్రపోవడానికి ముందు డేట్స్ తిని ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే ఎనర్జిటిక్ గా ఉంటారు.
  • ఇమ్యునిటీకి కర్జూరాలతో పాటు.. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్ ఇమ్యునిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
  • సలాడ్స్ లో డేట్స్ కర్జూరాలను ఫ్రూట్ సలాడ్ తోపాటు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల న్యూట్రిషియంట్ వ్యాల్యూ పెరుగుతుంది.
  • బరువు తగ్గడానికి కర్జూరాల్లో షుగర్, ప్రొటీన్ ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
  • తక్షణ శక్తిని కర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
  • హార్ట్ ప్రాబ్లమ్స్ డేట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి.. ఇవి గుండెకు మంచిది.
  • కీళ్లు, కండరాల నొప్పులకు కర్జూరాల్లో క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇవి జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తాయి.
  • కాన్ట్సిపేషన్ డేట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది. అలాగే.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది.
  • అనీమియా డేట్స్ అనీమియా నివారించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు.
  • కంటిచూపుని విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ డేట్స్ లో ఉండటం వల్ల.. కంటిచూపుని మెరుగుపరుస్తాయి.
  • బీపీ డేట్స్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా డేట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.


Friday, July 15, 2016

అమేజింగ్ స్కిన్ పొందాలంటే రాత్రిపూట త‌ప్ప‌కుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్

రోజంతా బిజీ బిజీగా గ‌డ‌ప‌డం.. అల‌స‌ట‌, వ‌ర్క్ ప్రెజ‌ర్ కార‌ణంగా.. ఇంటికి వ‌చ్చేస‌రికి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌పై జాగ్ర‌త్త వ‌హించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తారు. వ‌ర్క్ చేసేవాళ్లు, వాళ్ల పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లోప‌డి.. బిజీ షెడ్యూల్ లో త‌మ గురించి ప‌ట్టించుకోరు. దీనివ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు పెరుగుతాయి.

చాలా సంద‌ర్భాల్లో గ్లోయింగ్ స్కిన్, లాంగ్ హెయిర్ ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల, స‌రైన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి, ఎక్కువ స‌మ‌యం కంప్యూట‌ర్ ముందు గ‌డ‌ప‌టం, దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం, జుట్టు నిర్జీవంగా, డ‌ల్ గా మారుతుంది. ఉన్న మంచి జుట్టు, చ‌ర్మాన్ని కోల్పోవ‌డం మొద‌ల‌వుతుంది.

చాలామంది జుట్టు, చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం కొన్ని టిప్స్ ని ఉద‌యం పాటిస్తారు. కానీ కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను రాత్రి నిద్ర‌కు ముందు పాటించ‌డం చాలా అవ‌స‌రం. రెగ్యుల‌ర్ చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం.. రాత్రిపూట కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తాయి.

ముఖం శుభ్రం చేసుకోవ‌డం కొన్ని గంట‌ల ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్నా.. రాత్రిప‌డుకోవ‌డానికి ముందు మ‌ళ్లీ శుభ్రం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీనివ‌ల్ల పింపుల్స్ రాకుండా అరిక‌ట్ట‌వ‌చ్చు.

మేక‌ప్ తీసేయ‌డం రాత్రి పడుకోవ‌డానికి ముందు మేక‌ప్ తొల‌గించ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే.. మేక‌ప్ కోసం ఉప‌యోగించే ప్రొడ‌క్ట్స్ లో ఉండే కెమిక‌ల్స్, గ్రీజ్ మొటిమ‌లు, యాక్నెకి కార‌ణ‌మ‌వుతాయి.

ఎక్స్ ఫోలియేట్ మైల్డ్ స్క్ర‌బ్ ఉప‌యోగించి చ‌ర్మాన్ని రాత్రి పూట ఎక్స్ ఫోలియేట్ చేయాలి. దీనివ‌ల్ల దుమ్ము, డెట్ స్కిన్ సెల్స్ చ‌ర్మం నుంచి రాత్రిపూట తొల‌గించాలి.

అండ‌ర్ ఐ క్రీమ్ రాత్రిపూట క‌ళ్ల కింద క్రీమ్ అప్లై చేసి కొన్ని నిమిషాల‌పాటు మ‌సాజ్ చేయాలి. దీనివ‌ల్ల డార్క్ స‌ర్కిల్స్, ఏజ్ లైన్స్ నివారించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

చేతులు, పాదాల సంర‌క్ష‌ణ‌ విట‌మిన్ ఏ లేదా విట‌మిన్ సి ఉన్న క్రీమ్ లేదా మాయిశ్చ‌రైజ‌ర్ ని పాదాలు, చేతుల సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగించ‌డం వ‌ల్ల‌.. ఏజ్ స్పాట్స్, ప‌గిలిన పాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అలాగే కాళ్లు, చేతుల చ‌ర్మం డ్యామేజ్ అవ‌కుండా నివారించ‌వ‌చ్చు.

ముఖానికి మాయిశ్చ‌రైజ‌ర్ మాయిశ్చ‌రైజ‌ర్ ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కొల్లాజెన్ ప్రొడ‌క్ష‌న్ ని పెంచుతుంది. రాత్రిపూట మాయిశ్చ‌రైజ‌ర్ రాస్తే.. చ‌ర్మంపై ఏజింగ్ ల‌క్ష‌ణాలు, ముడ‌త‌లు, ఫైన్ లైన్స్ కి దూరంగా ఉండ‌వ‌చ్చు.

కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్ కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు ర‌ఫ్ గా, డ‌ల్ గా మార‌కుండా.. హెల్తీగా, షైనీగా ఉంటుంది.

Thursday, July 14, 2016

రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్..!!

గ్రీన్ టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. పంచదార, పాలు కలపకుండా గ్రీన్ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని, అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే.. అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే గ్రీన్ టీ చర్మం, జుట్టుకి చాలా మంచిది. అయితే చాలామంది ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. కనీసం రాత్రి పడుకోవడానికి ముందు.. గ్రీన్ టీ తాగడం మొదలుపెడితే.. లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.



రిలాక్స్ గా ఉంచడానికి రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. ఈ టీలో ఉండే కెఫీన్ బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. ఎమినో యాసిడ్స్, ఎల్ థియానిన్ ఆందోళన నుంచి ఉపశమనం కలిగగించి.. రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది.



కామన్ కోల్డ్ క్రిముల నాశనానికి కెటాచిన్ అనేది చాలా పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీన్ని గ్రీన్ టీ ద్వారా తేలికగా పొందవచ్చు. ఒకవేళ మీరు కామన్ కోల్డ్, ఫ్లూ నుంచి బాధపడుతుంటే.. ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి. ఇది క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో గ్రేట్ మెడిసిన్ గా పనిచేస్తుంది.



మెటబాలిజం మెరుగుపరచడానికి నిద్రలో ఎలాంటి భంగం ఏర్పడకుండా హ్యాపీగా నిద్రపోవాలంటే.. మెటబాలిజం మెరుగుపడాలి. హెల్తీ మెటబాలిజం కోసం.. ఫిట్ బాడీ, గ్లోయింగ్ స్కిన్ పొందడం. రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. మెటబాలిజం ట్రాక్ లో ఉంటుంది.

ఫ్లూ రిస్క్ తగ్గిస్తుంది రాత్రి పడుకోవడానికి ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఫ్లూ రిస్క్ ని తగ్గించవచ్చు. వైరల్ ఫీవర్ రాకుండా అడ్డుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే ఫోలిఫెనాల్ వైరల్ ఎటాక్ ని అరికడుతుంది.

బాడీ నుంచి మలినాలు తొలగించడానికి రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల బోవెల్ మూమెంట్స్ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. ఉదయం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే టాక్సిన్స్ ని గ్రీన్ టీ తాగడం వల్ల తేలికగా తొలగించుకోవచ్చు.

స్మార్ట్ గా చేస్తుంది రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ఇవాళే మొదలుపెట్టండి.

క్యాన్సర్ రిస్క్ ఫ్రీ రాడికల్స్ గ్రోత్ కి వ్యతిరేకంగా పోరాడటంలో గ్రీన్ టీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి.. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే.. క్యాన్సర్ మీ దరిచేరకుండా ఉంటుంది.

Wednesday, July 13, 2016

ఉదయం పూట ఫుల్లుగా తాగితే అంత బాగుంటుందా


ప్రతి రోజూ ఉదయం కాలీకడుపుతో నీరు త్రాగితే అనేక వ్యాధులను నివారించవచ్చు?చాలా వరకూ జీర్ణసమస్యలకు చెక్ పెట్టవచ్చు . మరియు మీరు ఖాలీ కడుపుతో నీళ్ళను త్రాగడం వల్ల మీరు మీ జీవిత కాలంలో మీ పొట్టను హెల్తీగా ఉంచుకోవచ్చు. ఖాలీ కడుపుతో నీళ్ళ త్రాగాలినే అనే ఒక బేసిక్ ఐడియా జపనీయుల నుండి వచ్చినది. జపనీయులు ప్రతి రోజూ ఉదయం ఖాలీ కడుపుతో, బ్రష్ కూడా చేయకుండా కనీసం నాలుగు గ్లాసుల నీళ్ళను తప్పనిసరిగా తీసుకుంటారు. దాని తర్వాత అరగంటపాటు వారు ఏటువంటి ఆహారాలు కానీ, పానియాలు కానీ తీసుకోరు. ఈ వాటర్ థెరఫీ వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు వారి యాక్టివ్ గా ఉంచుతుంది . మనందరికి తెలిసిన నిజం ఏంటంటే, ప్రపంచంతో మొత్తంలో జపనీయులు చాలా యాక్టివ్ గా మరియు ఎఫిషియంట్ గా ఉంటారు.



ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయి. ఆరోగ్యవిషయానికి కొచ్చినప్పుడు నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే ఆయిల్ ఘనపాదార్థంగా కొవ్వుగా రూపాంతరం చెదందు. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చనినీరు త్రాడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.


కాబట్టి, ప్రతి రోజూ ఉదయం ఖాలీ పొట్టతో నీరు త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

మెటబాలిజం రేటు పెరుగుతుంది: గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కనీసం 24పర్సెంట్ మెటబాలిక్ రేటు మెరుగుపడేందుకు సహాయపడుతుంది . అంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి కొంత బరవు తగ్గడానికి సహాయపడుతుంది.

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది: మన శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి నీరు చాలా అవసరం. వ్యాధినిరోధకశక్తి తగ్గితే ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి. కాబట్టి, మీరు నీరు ఎక్కువగా త్రాడం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

బౌల్ (ప్రేగు)లను శుభ్రం చేస్తుంది: మొదట, ఎక్కువగా నీరు తీసుకొన్నప్పుడు, వెంటనే టాయిలెట్ కు వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి . ఎప్పుడైతే ప్రతి రోజూ స్టూల్స్ పాస్ చేస్తారో, మీ శరీరంలో వ్యర్థాలను క్లియర్ చేస్తుంది.

శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది: ప్రతి రోజూ మనం పీల్చే గాలి మరియు మనం తీసుకొనే ఆహారం ద్వారా మన శరీరంలో చేరే వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి నీరు గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే నీరు త్రాగి, యూరినేట్ చేయడం ద్వారా మీ శరీరంను నిజంగా డిటాక్సిఫై చేయవచ్చు.

మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది: చాలా సందర్భాల్లో తలనొప్పితో బాధపడుతుంటాము. తలనొప్పి డీహైడ్రేషన్ వల్లే వస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగడం వల్ల మీశరీరానికి కావల్సినంత డీహైడ్రేషన్ అందుతుంది.

బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గించే డైట్ లో నీరు ఒకటి. జస్ట్ మీరు ఖాలీ కడుపుతో నీరు త్రాగాలి అంతే . ఇది శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి మరియు శరీరం యొక్క జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

ఆకలి పెంచుతుంది: ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగుతూ బౌల్ క్లియర్ చేసుకోవడం వల్ల నిద్రలేమిని నివారించుకోవచ్చు. మరియు మీకు త్వరగా ఆకలి కలిగే విధంగా చేస్తుంది. దాంతో మీరు ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవచ్చు.

చర్మాన్ని క్లియర్ గా శుభ్రం చేస్తుంది: మీ బౌల్ మూమెంట్ క్లియర్ గా లేనప్పుడు మొటిమల సమస్యకు కూడా దారితీస్తుంది . ఒకసారి మీలో రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఉన్నప్పుడు, మీ శరీరం డిటాక్సిఫై అవుతుంది. దాంతో మొటిమలు మచ్చలు సమస్య తక్కువగా ఉంటుంది.

ఎనర్జీ బూస్టర్ తరచూ అలసటగా అనిపిస్తుంటే నీరు తాగడం వల్ల తక్షణ ఎనర్జీ అంది, అలసట నుండి బయటపడుతారు.

కోలన్ శుభ్రం చేస్తుంది: నీరు పద్ద ప్రేగును శుభ్రపరుస్తుంది. శరీరంలో న్యూట్రీషియన్స్ త్వరగా శోషించడానికి సహాయపడుతుంది.

బ్లడ్ సెల్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి: ఖాలీ పొట్టతో నీరు త్రాగడం వల్ల, రెడ్ బ్లడ్ సెల్స్ వేగంగా ఉత్పత్తి అవుతాయి . ఇది ఎక్కవు ఆక్సిజన్ ను బ్లడ్ తో పాటు శరీరంలో మిగిలినభాగాలకు చేరేందుకు సహాయపడుతాయి . దాంతో మీరు మరింత ఎనర్జిటిక్ గా భావిస్తారు.పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే.. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.

జాయింట్ పెయిన్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల ఆర్థరైటీస్ మరియు బ్యాక్ పెయిన్ ను నివారించానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల క్యాన్సర్ రోగుల్లో 180 రోజుల్లో గొప్ప మార్పును చూపిస్తుంది

కిడ్నీ సమస్యలను నిరోధిస్తుంది : కిడ్నీలలోని మలినాలను శుభ్రపరుస్తుంది దాంతో ప్రస్తుతం ఎలా కిడ్నీ సమస్యలున్నా నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

బ్రెయిన్ టానిక్ : మెదడులోని కణాలు 80శాతం వరకూ నీటితో తయారుచేయబడి ఉంటాయి. అందువలన , ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల మెదడులోని డెడ్ సెల్స్ తరిగి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.

Tuesday, July 12, 2016

కొత్తి మీర కట్టే అనుకోకండి. కొంపలు మునిగిపోతాయి లేదంటే

సెలరీ..దీన్ని కోరియాండర్ లీఫ్ లేదా కొత్తిమీర అని కూడా పిలుస్తారు. ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్, దీన్ని యూరప్, యుఎస్ ఎ మరియు ఈస్ట్ ఏసియాలో ఎక్కువగా పండిస్తారు. గ్రీన్ లీఫ్ మాత్రమే కాదు, కొత్తిమీర విత్తనాలు(ధనియాలు) కూడా పండిస్తారు. కొత్తిమీర ఆకులు, కాండం, మరియు విత్తనాలను వివిధ రకాల సలాడ్స్ మరియు వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు . ఇండియాలో దీని వాడకం ఎక్కువ ప్రతి మార్కెట్లోనూ ఎక్కువగా కనబడుతుంటుంది.


కొత్తిమీరను రెగ్యులర్ గా వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు పొటాషియంలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి గల 8 ముఖ్య కారణాలు ఈ క్రింది విధంగా ...


హై కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది: కొత్తిమీరలో హైకొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రీసెర్చ్ ప్రకారం రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ ను నివారిస్తుంది.

ధనియాలతో తయారుచేసే వంటలు, లేదా డికాషన్ తాగడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్ మరియు లో బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. 

కొత్తిమీరలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్స్ స్టొమక్ అల్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీర పొట్టలో ప్రేగుల చుట్టూ మ్యూకస్ ఏర్పడేలా చేసి అల్సర్ అటాక్ కాకుండా నివారిస్తుందని రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో నిర్ధారించారు. అలాగే ఇది ఎసిడిటి లక్షనాలను నివారిస్తుంది. 

మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో కొత్తిమీరను చేర్చుకోవడం ఫ్యాటీ లివర్ సమస్యలుండవు. సెలరీతో పాటు, చికోరి,డాండలిన్,బార్లీ వంటి వాటిని చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలుండవు. 

కామన్ హెర్బల్ రెమెడీగా ఉపయోగిస్తారు. ఇది డికాషన్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది, మరియు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో ధనియాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. 



కొత్తిమీర క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన ఒక సూపర్ ఫుడ్ . క్యాన్సర్ నివారిణిగా గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీరలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సెల్స్ ను శరీరాన్ని కాపాడుతుంది.

కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది శరీరంలో సెక్స్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది, సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలని కోరుకునే వారు ప్రతి రోజూ ఒక చిన్న కప్పు కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది . అలాగే సబ్జీలు , ఫ్రైస్ లో చేర్చుకుంటే మరింత హెల్తీ మీల్ అవుతుంది.