Tuesday, July 12, 2016

కొత్తి మీర కట్టే అనుకోకండి. కొంపలు మునిగిపోతాయి లేదంటే

సెలరీ..దీన్ని కోరియాండర్ లీఫ్ లేదా కొత్తిమీర అని కూడా పిలుస్తారు. ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్, దీన్ని యూరప్, యుఎస్ ఎ మరియు ఈస్ట్ ఏసియాలో ఎక్కువగా పండిస్తారు. గ్రీన్ లీఫ్ మాత్రమే కాదు, కొత్తిమీర విత్తనాలు(ధనియాలు) కూడా పండిస్తారు. కొత్తిమీర ఆకులు, కాండం, మరియు విత్తనాలను వివిధ రకాల సలాడ్స్ మరియు వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు . ఇండియాలో దీని వాడకం ఎక్కువ ప్రతి మార్కెట్లోనూ ఎక్కువగా కనబడుతుంటుంది.


కొత్తిమీరను రెగ్యులర్ గా వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు పొటాషియంలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి గల 8 ముఖ్య కారణాలు ఈ క్రింది విధంగా ...


హై కొలెస్ట్రాల్ తో పోరాడుతుంది: కొత్తిమీరలో హైకొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రీసెర్చ్ ప్రకారం రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ ను నివారిస్తుంది.

ధనియాలతో తయారుచేసే వంటలు, లేదా డికాషన్ తాగడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్ మరియు లో బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. 

కొత్తిమీరలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్స్ స్టొమక్ అల్సర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీర పొట్టలో ప్రేగుల చుట్టూ మ్యూకస్ ఏర్పడేలా చేసి అల్సర్ అటాక్ కాకుండా నివారిస్తుందని రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో నిర్ధారించారు. అలాగే ఇది ఎసిడిటి లక్షనాలను నివారిస్తుంది. 

మనం రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో కొత్తిమీరను చేర్చుకోవడం ఫ్యాటీ లివర్ సమస్యలుండవు. సెలరీతో పాటు, చికోరి,డాండలిన్,బార్లీ వంటి వాటిని చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలుండవు. 

కామన్ హెర్బల్ రెమెడీగా ఉపయోగిస్తారు. ఇది డికాషన్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది, మరియు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో ధనియాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. 



కొత్తిమీర క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన ఒక సూపర్ ఫుడ్ . క్యాన్సర్ నివారిణిగా గ్రేట్ గా సహాయపడుతుంది. కొత్తిమీరలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సెల్స్ ను శరీరాన్ని కాపాడుతుంది.

కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది శరీరంలో సెక్స్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది, సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలని కోరుకునే వారు ప్రతి రోజూ ఒక చిన్న కప్పు కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది . అలాగే సబ్జీలు , ఫ్రైస్ లో చేర్చుకుంటే మరింత హెల్తీ మీల్ అవుతుంది.

No comments:

Post a Comment