Wednesday, July 13, 2016

ఉదయం పూట ఫుల్లుగా తాగితే అంత బాగుంటుందా


ప్రతి రోజూ ఉదయం కాలీకడుపుతో నీరు త్రాగితే అనేక వ్యాధులను నివారించవచ్చు?చాలా వరకూ జీర్ణసమస్యలకు చెక్ పెట్టవచ్చు . మరియు మీరు ఖాలీ కడుపుతో నీళ్ళను త్రాగడం వల్ల మీరు మీ జీవిత కాలంలో మీ పొట్టను హెల్తీగా ఉంచుకోవచ్చు. ఖాలీ కడుపుతో నీళ్ళ త్రాగాలినే అనే ఒక బేసిక్ ఐడియా జపనీయుల నుండి వచ్చినది. జపనీయులు ప్రతి రోజూ ఉదయం ఖాలీ కడుపుతో, బ్రష్ కూడా చేయకుండా కనీసం నాలుగు గ్లాసుల నీళ్ళను తప్పనిసరిగా తీసుకుంటారు. దాని తర్వాత అరగంటపాటు వారు ఏటువంటి ఆహారాలు కానీ, పానియాలు కానీ తీసుకోరు. ఈ వాటర్ థెరఫీ వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు వారి యాక్టివ్ గా ఉంచుతుంది . మనందరికి తెలిసిన నిజం ఏంటంటే, ప్రపంచంతో మొత్తంలో జపనీయులు చాలా యాక్టివ్ గా మరియు ఎఫిషియంట్ గా ఉంటారు.



ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయి. ఆరోగ్యవిషయానికి కొచ్చినప్పుడు నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే ఆయిల్ ఘనపాదార్థంగా కొవ్వుగా రూపాంతరం చెదందు. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చనినీరు త్రాడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.


కాబట్టి, ప్రతి రోజూ ఉదయం ఖాలీ పొట్టతో నీరు త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

మెటబాలిజం రేటు పెరుగుతుంది: గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కనీసం 24పర్సెంట్ మెటబాలిక్ రేటు మెరుగుపడేందుకు సహాయపడుతుంది . అంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి కొంత బరవు తగ్గడానికి సహాయపడుతుంది.

వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది: మన శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి నీరు చాలా అవసరం. వ్యాధినిరోధకశక్తి తగ్గితే ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి. కాబట్టి, మీరు నీరు ఎక్కువగా త్రాడం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

బౌల్ (ప్రేగు)లను శుభ్రం చేస్తుంది: మొదట, ఎక్కువగా నీరు తీసుకొన్నప్పుడు, వెంటనే టాయిలెట్ కు వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి . ఎప్పుడైతే ప్రతి రోజూ స్టూల్స్ పాస్ చేస్తారో, మీ శరీరంలో వ్యర్థాలను క్లియర్ చేస్తుంది.

శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది: ప్రతి రోజూ మనం పీల్చే గాలి మరియు మనం తీసుకొనే ఆహారం ద్వారా మన శరీరంలో చేరే వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి నీరు గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే నీరు త్రాగి, యూరినేట్ చేయడం ద్వారా మీ శరీరంను నిజంగా డిటాక్సిఫై చేయవచ్చు.

మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది: చాలా సందర్భాల్లో తలనొప్పితో బాధపడుతుంటాము. తలనొప్పి డీహైడ్రేషన్ వల్లే వస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగడం వల్ల మీశరీరానికి కావల్సినంత డీహైడ్రేషన్ అందుతుంది.

బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గించే డైట్ లో నీరు ఒకటి. జస్ట్ మీరు ఖాలీ కడుపుతో నీరు త్రాగాలి అంతే . ఇది శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి మరియు శరీరం యొక్క జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

ఆకలి పెంచుతుంది: ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగుతూ బౌల్ క్లియర్ చేసుకోవడం వల్ల నిద్రలేమిని నివారించుకోవచ్చు. మరియు మీకు త్వరగా ఆకలి కలిగే విధంగా చేస్తుంది. దాంతో మీరు ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవచ్చు.

చర్మాన్ని క్లియర్ గా శుభ్రం చేస్తుంది: మీ బౌల్ మూమెంట్ క్లియర్ గా లేనప్పుడు మొటిమల సమస్యకు కూడా దారితీస్తుంది . ఒకసారి మీలో రెగ్యులర్ బౌల్ మూమెంట్ ఉన్నప్పుడు, మీ శరీరం డిటాక్సిఫై అవుతుంది. దాంతో మొటిమలు మచ్చలు సమస్య తక్కువగా ఉంటుంది.

ఎనర్జీ బూస్టర్ తరచూ అలసటగా అనిపిస్తుంటే నీరు తాగడం వల్ల తక్షణ ఎనర్జీ అంది, అలసట నుండి బయటపడుతారు.

కోలన్ శుభ్రం చేస్తుంది: నీరు పద్ద ప్రేగును శుభ్రపరుస్తుంది. శరీరంలో న్యూట్రీషియన్స్ త్వరగా శోషించడానికి సహాయపడుతుంది.

బ్లడ్ సెల్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి: ఖాలీ పొట్టతో నీరు త్రాగడం వల్ల, రెడ్ బ్లడ్ సెల్స్ వేగంగా ఉత్పత్తి అవుతాయి . ఇది ఎక్కవు ఆక్సిజన్ ను బ్లడ్ తో పాటు శరీరంలో మిగిలినభాగాలకు చేరేందుకు సహాయపడుతాయి . దాంతో మీరు మరింత ఎనర్జిటిక్ గా భావిస్తారు.పరగడపున వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే.. దీనివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.

జాయింట్ పెయిన్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల ఆర్థరైటీస్ మరియు బ్యాక్ పెయిన్ ను నివారించానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది: ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల క్యాన్సర్ రోగుల్లో 180 రోజుల్లో గొప్ప మార్పును చూపిస్తుంది

కిడ్నీ సమస్యలను నిరోధిస్తుంది : కిడ్నీలలోని మలినాలను శుభ్రపరుస్తుంది దాంతో ప్రస్తుతం ఎలా కిడ్నీ సమస్యలున్నా నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

బ్రెయిన్ టానిక్ : మెదడులోని కణాలు 80శాతం వరకూ నీటితో తయారుచేయబడి ఉంటాయి. అందువలన , ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల మెదడులోని డెడ్ సెల్స్ తరిగి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.

No comments:

Post a Comment