Wednesday, September 7, 2016

గణపతి పబ్బ మోరియా : ఓట్స్ లడ్డు టేస్టీ యార్..!

ఇండియాలో, దేవుళ్ళందరిలోకి, లార్డ్ గణేషకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ గుళ్లో చూసినా...ఏ శుభకార్యానికైనా మొదట గణపతిని పూజించిన తర్వాతే మిగిలిన దేవుళ్ళకు పూజలు జరుపుతారు.. లార్డ్ గణేషను ఇష్టపడే వారు వినాయకున్ని గణపతి పబ్బ మోరియా అని పిలుచుకుంటారు. ఆ పిలుపులు, అరుపులు అరవడానికి తగిన సమయం రానే వచ్చింది. ఇక కొద్ది రోజుల్లో గణేష చతుర్ధి రాబోతోంది.గణపతి పబ్బా మోరియా అంటూ గ్రాండ్ గా గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటారు.



విజ్ఝాలు తొలగించే వినాయకుడకి లడ్డులు, మోదక్ లు అంటే మహా ప్రీతి. అయితే ఎప్పటి లాగే ప్రతి సంవత్సరం వండిన లడ్డులనే తయారుచేయకుండా వెరైటీగా ..డిఫరెంట్ లడ్డులు మోతిచూర్ లడ్డు, కొబ్బరి లడ్డు, నట్స్ లడ్డు, బేసన్ కా లడ్డు' మొదలగునవి ట్రై చేయాలి.

అలాగే ఇంకా డిఫరెంట్ గా లోక్యాలరీ లడ్డును ట్రై చేయాలంటే ఓట్స్ లడ్డుతో సర్ ప్రైజ్ చేయండి. ఓట్స్ లడ్డు చాలా టేస్ట్ గా ఉంటుంది. చాలా సింపుల్ గా తయారుచేస్తారు. మరికెందుకు ఆలస్యం ఓట్స్ లడ్డును తయారుచేసి దేవుడు నైవేద్యం పెట్టి తర్వాత ఇంట్లో వారందరికి నోరూ తీపి చెయ్యండి...గణపతి పబ్బ మోరియా అంటూ ఎంజాయ్ చేయండి..


కావల్సిన పదార్థాలు:
 ఓట్స్ - 1 cup
బెల్లం(పొడి చేసుకోవాలి ) - ½ cup
తెల్ల నువ్వులు - 2 tbsp
నెయ్యి - 2 to 3 tbsp
యాలకల పొడి - 1 tsp
ఎండు ద్రాక్ష - 20
కోవ - 1 cup
బాదం - 5
తయారుచేయు విధానం:
1. నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో నువ్వులు వేసి తక్కువ మంట మీద డ్రై రోస్ట్ చేయాలి.
2. అలాగే బాదం కూడా వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి .
3. పాన్ లో ఓట్స్ కూడా వేసి 5 నిముషాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేయాలి.
6. నెయ్యి వేడయ్యాక అందులో బెల్లం తురుము , యాలకలపొడి వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకూ కలియబెడుతుండాలి.
7. బెల్లం కరిగే వరకూ కలియబెడుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రింది బాగంలో బర్న్ కాకుండా ఉంటుంది.
8. తర్వాత ఇందులో రఫ్ గా పొడి చేసుకున్న ఓట్స్, నట్స్, మరియు నువ్వులు వేసి మొత్తం కలగలిసేలా మిక్స్ చేసుకోవాలి.
9. మొత్తం మిశ్రమం మరీ గట్టిగా అయ్యేట్లుంటే కొద్ది నీరు మిక్స్ చేసుకోవచ్చు . నీళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
10. కోవాను మిక్స్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. దాంతో ఉండలు లేకుండా ఉంటుంది.
11. మొత్తం మిశ్రమం మరో సారి కలగలుపుకుని , స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
12. 5నిముషాల తర్వాత లడ్డూలా ఉండలు చుట్టుకోవాలి.
13. ఉండలు చుట్టేటప్పుడే ఎండుద్రాక్ష మరియు బాదంను మిక్స్ చేసి ఉండలు చుట్టాలి.
14. అంతే సర్వ్ చేయడానికి ఓట్స్ లడ్డు రెడీ.