Saturday, February 27, 2016

ఇంట్లో చీమలు చికాకు పెడుతున్నాయా...? నివారణ కోసం...

ఇంట్లో చీమలు ఉన్నాయంటే.. ఆడవాళ్లకు కంగారే. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడుతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీటు, స్నాక్స్, హాట్ అని తేడా లేకుండా.. అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్థాలకైనా.. చక్కెరకైనా.. కొనుకొచ్చిన మిక్చర్ పొట్లానికైనా.. చీమలు పట్టాయంటే.. చాలా చికాకు పుడుతుంది.

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకల బెడద ఎక్కువైందా ? అయితే వాటిని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత ట్రై చేసినా.. ఇల్లు వదలవంటాయి చీమలు. వంట గది నుంచి హాలు వరకు ఎక్కడ చూసినా చీమల బెడద ప్రతి ఇంట్లో కామన్. అయితే చీమలు నివారించడానికి మార్కెట్ లో దొరికే ఫెస్టిసైడ్స్ వల్ల మనుషులకు వాసన పడకపోవడం, మార్బుల్స్, టైల్స్ దెబ్బతినే అవకాశముంది. అదే చక్కటి హోం రెమిడీస్ ఫాలో అయితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.


కాఫీ: కాఫీ వాసన చీమలకు పడదని మీకు తెలుసా ? నిజమే అందుకే చీమల చిక్కు వదిలించుకోవడానికి ఇదో చక్కటి మార్గం. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ లేదా.. కాఫీ వడపోసిన తర్వాత వచ్చే పొడిని గానీ చీమలు ఉన్నచోట చల్లితే.. చీమలను ఈజీగా నివారించవచ్చు.


పుదినా పుదినా వాసనకు చీమలు బెంబేలెత్తిపోతాయి. కాబట్టి.. కొన్ని పుదిన ఆకులు తీసుకుని.. కాస్త ఎండనివ్వాలి. ఎండిపోయిన తర్వాత నలిపి.. పొడిని చీమలు ఉన్న ప్రాంతంలో చల్లితే.. చీమలు మాయమవుతాయి. లేదా పుదినా టీ తాగే అలవాటు ఉంటే.. ఆ టీ బ్యాగ్ చీమలున్న దగ్గర పెట్టినా ఫలితం ఉంటుంది.


మిరియాలు లేదా నిమ్మ బారులు బారులుగా ఉండే చీమలపై ప్రతాపం చూపించాలంటే.. మిరియాలపొడి చక్కగా పనిచేస్తుంది. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిరియాలపొడి చల్లతే సరిపోతుంది. చీమలు రాకుండా నిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది. నిమ్మ తొక్క లేదా దోసకాయ ముక్కను చీమలు ఉండే ప్రాంతంలో పెడితే.. వాటి వాసనకు చీమలు మైల్డ్ అయిపోతాయి.

బియ్యంతో ఎప్పుడూ ప్రయత్నించని 6 ఆశ్చర్యకమైన గృహ ప్రయోజనాలు వెనిగర్ వెనిగర్ ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు రావు. లేదా కొన్ని వేడి నీళ్లలో ఉప్పు కలపాలి. ఈ నీటిని చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చల్లటం వల్ల వెంటనే చీమలు పారిపోతాయి.

ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిందా..?

ఎర్ర రక్తకణాలు

శరీర రక్తంలో ఉండే కణాల రకాలలో ఎర్ర రక్తకణాలు కూడా ఒక రకం. ఇవి శరీర కణాలకు కావాల్సిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. వీటి సంఖ్యను కొన్ని ఆహార పదార్థాలను తినటం ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలు ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచటమేకాకుండా, పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

హోల్ గ్రైన్స్

రక్తకణాల సంఖ్య రెట్టింపు అవటానికి అవసరమైన ముఖ్య పోషకం- కాపర్. మన శరీరానికి ఎంత స్థాయిలో కాపర్ కావాలో అంతమేరకు హోల్ గ్రైన్స్ నుండి పొందవచ్చు. నత్తగుల్లలు (షెల్ ఫిష్), పౌల్ట్రీ, బీన్స్, చెర్రీలు, చాక్లెట్ మరియు నట్స్ వంటి వాటిలో కూడా కాపర్ అధిక స్థాయిలో ఉంటుంది.

నట్స్ (గింజలు)

ఐరన్ ను అధిక మొత్తంలో కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన శరీరం కోల్పోయిన ఐరన్ ను భర్తీ చేయవచ్చు. ఒక పిడికెడు నట్స్ (గింజలు) నుండి శరీరానికి సరిపోయేంత ఐరన్ పొందవచ్చు. అంతేకాకుండా, వీటితో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బలవర్థకమైన ధాన్యాలు
ఎర్రరక్తకణాలు ఉత్పత్తి చెందుటకు మానవ శరీరానికి విటమిన్ 'B12' అవసరం. బలవర్థకమైన ధాన్యాలు ఈ హార్మోన్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. సాధారణంగా శాఖాహారులు విటమిన్ 'B12' లోపంతో భాదపడుతుంటారు. కావున ఎర్ర రక్త కణాల పెంచుకోటానికి  వీటిని మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.

స్ట్రాబెరీ

"మార్చె పాలిటెక్నిక్ యూనివర్సిటీ" (ఇటలీలో ఉన్న, UNIVPM) మరియు "యూనివర్సిటీ గ్రెనడా" వారు పరిశోధనలు జరిపి, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయటానికి స్ట్రాబెరీ ఉపయోగపడుతుందని తెలిపారు. స్ట్రాబెరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయని తెలిపారు.

పచ్చని ఆకూకూరలు

ఎర్ర రక్తకణాల సంఖ్య అధికమవటానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలైనట్టి, 'ఫోలిక్ ఆసిడ్' మరియు 'విటమిన్ 'B6' పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటాయి. కావున స్పీనాచ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు పాలకూర వంటి వాటిని మీరు పాటించే ఆహార ప్రణాళికలలో తప్పక కలుపుకోండి.

పండ్లు

ఎర్రరక్తకణాల సంఖ్యను తక్కువగా కలిగి ఉన్నవారు పండ్లను ఎక్కువగా తినమని వైద్యులు మరియు నిపుణులు సలహా ఇస్తుంటారు. ఆప్రికాట్, ఆపిల్, ద్రాక్ష పండ్లు, ఎండుద్రాక్షలు ఎర్ర రక్తకణాల సంఖ్యను రెట్టింపు చేయటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

Thursday, February 25, 2016

శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే..

కొంతమందికి బాడీలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ హీట్ గా ఫీలవడం, పెదాలు ఆరిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఇలా శరీరంలో హీట్ ఎక్కువగా ఉన్నవాళ్లకు సమ్మర్ మరింత ఇబ్బంది కలుగజేస్తుంది. శరీరంలో వేడికి తోడు సూర్య కిరణాలు, ఎండ కారణంగా మరింత ఇబ్బందికి గురవుతారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే.. హార్ట్ స్ట్రోక్ కి కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు తలనొప్పి, బద్దకం, కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
ఇలాంటప్పుడు ఎండకు దూరంగా ఉండటంతో పాటు శరీరంలో వేడిని తగ్గించుకునే న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవ్వాలి. ఫుడ్ విషయంలో చాలా కేర్ గా ఉండటంతోపాటు.. కొన్ని రకాల మందులు కూడా శరీరంలో ఉష్ణం పెరగడానికి కారణమవుతాయి. సాధారణంగా 36.9 సెల్సియస్ ఉష్ణోగ్రత మానవ శరీరంలో ఉంటే సాధారణంగా చెప్పవచ్చు. ఇంతకంటే ఎక్కువైతే.. ప్రమాదమే. కాబట్టి.. బాడీలో వేడిని తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన సింపుల్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. !
స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, కెఫీన్ శరీరంలో వేడికి కారణమవుతాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి.

బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. ! 
మెంతులు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. కాబట్టి రోజూ ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.


బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. !
తేనె, పాలు కలిపి తాగితే.. మంచి ఫలితం ఉంటుంది. చల్లని పాలల్లో టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. రోజూ ఇలా తాగితే మంచిది.




బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. !
కొబ్బరినూనె, ఆలివ్ నూనెలు వాడటం వల్ల శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు. కాబట్టి వంటకాలకు వేరుశనగ నూనె వాడకుండా.. వీటిని ఉపయోగించడం మంచిది.

బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. ! 
నాన్ వెజ్ ఫుడ్ శరీరంలో ఉష్ణానికి కారణమవుతుంది. కాబట్టి.. మాంసాహారం తగ్గించుకోవడం మంచిది


బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. ! 
సగసాలు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా.. మితంగా వీటిని తీసుకోవడం మంచిది. పిల్లలకు ఎక్కువ పెట్టరాదు.

బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. ! 
కూరగాయలు వండుకునేటప్పుడు ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ప్రొటీన్స్ అందడమే కాదు శరీరానికి మంచిది. కానీ ఫ్రై రూపంలో మాత్రం తీసుకోకూడదు. దీనివల్ల పోషకాలు కోల్పవడమే కాదు.. శరీరంలో వేడికి కారణమవుతాయి.

బాడీ టెంపరేచర్ తగ్గించుకునే మార్గాలు.. ! 
రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ లో కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలిపి తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

Tuesday, February 23, 2016

ఉదయం అల్పాహారం స్కిప్ చేస్తున్నారా?

మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారుచేయడానికి మీకు సమయం సరిపోవడం లేదా తినడానికి సమయం చాలట లేదా అయితే మీకు ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ పరిచయం చేస్తున్నాము. అదే బనానా మిల్క్ షేక్ రిసిపి. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఒక బెస్ట్ ఆప్షన్.

బనానా మిల్క్ షేక్ మన శరీరానికి అవసరం అయ్యే పోషకహారాలను అందిస్తుంది . దీన్ని వెంటనే మీరు త్రాగలేకపోయినా, బాటిల్లో మీ వెంట పట్టుకెళ్ళ వచ్చు. ట్రావెలింగ్ లోనో...లేదా ఆఫీస్ లోనో సమయం ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా తాగేవయచ్చు. అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు బనానా మిల్క్ షేక్ ను తయారుచేయడం చాల సులభం.


బనానా మిల్క్ షేక్ తయారుచేయడానికి కేవలం రెండు పదార్థాలు చాలు. అంతే కాదు మీకు అవసరం అనిపిస్తే కొద్ది ప్రోటీన్ పౌడర్, ఫ్లేవర్ ను జోడించుకోవచ్చు . అలాగే ఎవరైతే వర్కౌట్స్ చేస్తుంటారో అలాంటి వారు కూడా దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవచ్చు. బనానా మిల్క్ షేక్ లో ఉండే ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ మజిల్స్ ను బలోపేతం చేస్తాయి. ఎనర్జీని అందిస్తాయి. బనానా మిల్క్ షేక్ లో ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, మరియు ఇతర మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి బనానా మిల్క్ షేక్ లో ఉండే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

బెనిఫిట్ 1: బానానా మిల్క్ షేక్ లో ఉండే పెక్టిన్ అనే సోలబుల్ ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థకు గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు మలబద్దకాన్ని నివారిస్తాయి.

బెనిఫిట్ 2: రోజంత యాక్టివ్ గా ఉండాలన్నా మరియు చురుకుగా పనిచేయాలన్నా తగినంత శక్తిసామర్థ్యాలు అవసరం అవుతాయి . అందుకు అవసరం అయ్యే పోషకాలన్నీ బనానా మిల్క్ షేక్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ ఎనర్జీని అందిస్తాయి.

బెనిఫిట్ 3 : పాలలో ఉండే క్యాల్షియం కంటెంట్ బోన్ డెన్సిటిని ప్రమోట్ చేస్తుంది.


బెనిఫిట్ 4 : బనానా మిల్క్ షేక్ లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంది. ఈ న్యూట్రియంట్ శరీరంలో న్యూక్లియిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డిఎన్ ఎ అభివ్రుద్దికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ ను ప్రోత్సహిస్తుంది.

బెనిఫిట్ 5 : పాలలో ఫాస్పరస్ కంటెంట్ అధికంగా ఉంటుంది . శరీరంలో కణాలకు తగిన శక్తిని అందివ్వడానికి ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . మరియు బోన్స్ స్ట్రాంగ్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బెనిఫిట్ 6 : పాలలో విటమిన్ ఎ కూడా అధికం. కాబ్టటి వ్యాధినిరోధకశక్తి పెంచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది . దాంతో హెల్తీ స్కిన్ మరియు మంచి కంటి చూపును పొందవచ్చు.

బెనిఫిట్ 7 : హెల్తీ బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. హెల్తీ బోన్స్ మరియు హెల్తీ లెవల్స్ ఎలక్ట్రోలైట్స్, శరీరానికి పొటాసియం మరియు మెగ్నీషియం అధికంగా అవసరం అవుతుంది .ఈ డ్రింక్ వల్ల శరీరానికి ఎక్కువగా మినిరల్స్ అందుతాయి.

మూత్రపిండాలో ఏర్పడే రాళ్ళను నివారించే అద్భుత ఔషదాలు

మూత్రపిండాల లోపల చిన్న పరిమానంలో, మినరల్ లు రాళ్ళ రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ గా అభి వర్ణిస్తారు. సాధారణంగా ఈ రాళ్ళు మినరల్ మరియు ఆసిడిక్ సాల్ట్ ల వలన ఏర్పడతాయి. మూత్రం గాడత అధికమై, మినరల్ లు మరియు ఉప్పు లవణాలు చెంతకు చేరి, ఘన పదార్థాలుగా రాళ్ళ రూపంలో ఏర్పడతాయి. వీటిని తగ్గించుటకు చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇక్కడ తెలుపిన సహజ ఔషదాలు కూడా తగ్గిస్తాయి.

దానిమ్మపండు రసం :
దానిమ్మ రసం కూడా మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గిస్తుంది. దానిమ్మపండు వలన వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటి విత్తనాల నుండి తయారు చేసిన రసం మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే సహజ ఔషదమని చెప్పవచ్చు. పుల్లగా మరియు ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారిణి) గుణాలను కలిగి ఉండే ఈ రసం మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను కరిగించి వేస్తుంది.

తులసి :
తులసి ఆకులతో చేసిన టీ, మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే సహజ ఔషదంగా చెప్పవచ్చు. స్వచ్చమైన తులసి రసం మూత్రనాళాలలను శుభ్రపరచి, అవాంతరాలను కలిగించే వాటిను బయటకు పంపుతుంది. కావున, మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించుటకు ఇది సరైన ఔషదమని చాలా మంది నమ్ముతున్నారు. రెండు నెలలపాటూ తేనె కలిపిన తులసి రసం తీసుకోవటం వలన తేడాను మీరే గమనించవచ్చు.



మెగ్నీషియం :

మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళను తగ్గించుకోటానికి మేగ్నిషయం అధికంగా గల ఆహార పదార్థాలను తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటాన్ని మరియు నివారించుటకు రోజు కనీసం 300 మిల్లి గ్రాముల 'మెగ్నీషియం ఒరొటేట్' తినాలని నిపుణులు తెలుపుతున్నారు. కరిగే ఫైబర్, తృణధాన్యాలు మరియు నీరు అధికంగా మెగ్నీషియంలను కలిగి ఉంటాయి.

నిమ్మ రసం & ఆలివ్ ఆయిల్ :
మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించుటకు అందుబాటులో ఉన్న మరొక అద్భుత ఔషదం- నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమం. రెండు చెంచాల సేంద్రీయ ఆలివ్ ఆయిల్ ను రెండు చెంచాల నిమ్మరసంతో కలపాలి. రోజు దీనిని తీసుకోవటం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చూడటమే కాకుండా, ఈ మిశ్రమం పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


ఆరోగ్యకర ఆహరం :
పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని రోజు తీసుకుంటూ, సోడా, శక్తిని అందించే కృత్రిమ ద్రావణాలు, సంవిధానపరచిన ఆహారాలు, ఆల్కహాల్ వంటి వాటికీ దూరంగా ఉండటం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు. తగిన వ్యాయామాలు, ఆరోగ్యకర ఆహార ప్రణాళికతో కూడిన జీవన శైలి వలన ఈ సమస్యే కాదు, ఏ ఆరోగ్య సమస్యకైనా దూరంగా ఉండవచ్చు.


Monday, February 22, 2016

ఆధ్యాత్మిక జీవనసూత్రాలు

కేనోపనిషత్తు
దశోపనిషత్తులలో ప్రముఖమైనది కఠోపనిషత్తు. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, జీవన విధానాన్ని, పరిశీలనా దృష్టిని ఆసక్తికరంగా చెప్పే కఠోపనిషత్తు ఉపనిషత్తులకు తలమానికం. ఉత్తిష్ఠత/ జాగ్రత/ ప్రాప్యవరాన్నిబోధత/ క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదంతి.(1-3-14)
 (లేవండి. మెలకువ పొందండి. శ్రేష్ఠులైన గురువుల వద్దకు వెళ్లి ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇది పదునైన కత్తి అంచుమీద నడకలాగా కష్టమైనది)

 స్వామి వివేకానంద ప్రపంచ మానవులందరికీ ఇచ్చిన ఈ సందేశం కఠోపనిషత్తులోనిదే. ప్రబోధాత్మకమైన ఈ ఉపనిషత్తు ఆయనకు చాలా ఇష్టం. కఠోపనిషత్తు రెండు అధ్యాయాలు ఒక్కొక్కదాంట్లో మూడు వల్లులు, మొత్తం నూట పందొమ్మిది మంత్రాలు. పిల్లలు, పెద్దలు అందరూ చదవ వలసిన సందేశాత్మకమైన ఉపనిషత్తు ఇది. నాటకీయత తో ఆకర్షణీయమైన కథతో భౌతిక ఆధ్యాత్మిక జీవన సూత్రాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్పే కఠోపనిషత్తు సారాంశాన్ని చదండి.

 ప్రథమాధ్యాయం: ప్రథమ వల్లి
 వాజశ్రవసుడు అనే గృహస్థు ఒక మహాయజ్ఞాన్ని చేస్తూ తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. అతనికి నచికేతుడు అనే కొడుకు ఉన్నాడు. తన తండ్రి బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వటానికి తెచ్చిన ఆవుల్ని ఆ పిల్లవాడు చూశాడు. అవి చాలా ముసలివి. నీళ్లు తాగలేవు. గడ్డి తినలేవు. పాలు ఇవ్వలేవు. శక్తిలేనివి. వట్టిపోయినవి. తండ్రి ఇటువంటి పనికిరాని ఆవుల్ని అశ్రద్ధగా పుణ్యంకోసం దానం చేయడం అతనికి బాధ కలిగించింది. ఇటువంటి దానాలు చేస్తే ఆనందలోకాలకు పోలేరు. మనం ఎదుటివారికి ఇచ్చేవి పనికి వచ్చేవి అయితే అది శ్రద్ధతో చేసిన దానం అవుతుంది. తండ్రి తప్పు చేస్తున్నాడు అనుకున్నాడు.

తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘తండ్రీ! పుణ్యం కోసం నన్ను ఎవరికి దానం ఇవ్వబోతున్నావు?’’అని రెండుమూడుసార్లు వెంటపడి అడిగాడు. పిల్లవాడు అలా ఎందుకు అడుగుతున్నాడో గమనించని తండ్రికి విసుగు, కోపం వచ్చాయి. ‘‘నిన్ను మృత్యువుకి దానం చేస్తున్నాను’’ అన్నాడు. తండ్రి విసుగుతో అన్న మాటను ఆ పసివాడు నిజం అనుకున్నాడు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు కేకలేస్తారు. నేను బాగానే చదువుకుంటున్నాను కదా! సహాధ్యాయులు కొందరిలో మొదటివాణ్ణి. కొందరిలో మధ్యముణ్ణి. నేనెప్పుడూ చదువులో వెనకపడలేదు. మరి తండ్రి నన్ను యముడికి ఎందుకు ఇస్తానంటున్నాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? రాలిపోయిన గింజలే మళ్లీ మొలకెత్తినట్లు మరణించిన మానవుడు మళ్లీ పుడతాడు. దీంట్లో బాధపడేది ఏముంది? అనుకుంటూ తండ్రి మాట ప్రకారం నచికేతుడు యమలోకానికి వెళ్లాడు. యముడు అక్కడలేడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ పిల్లవాడు యమధర్మరాజు ఇంటిముందు మూడురోజులు నిద్రాహారాలు లేకుండా గడిపాడు.

 అప్పుడు యముడు వచ్చాడు. రాగానే యమలోకపు పెద్దలు కొందరు ‘యమా! ఈ బ్రాహ్మణ బాలుడు నీ ఇంటికి అతిథిగా వచ్చాడు. మూడురోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాడు. అతిథిని సంతృప్తి పరచడం మంచి గృహస్థుల ధర్మం. అతనికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఆహ్వానించు. ఏ ఇంట్లో అతిథి ఆహారం లేకుండా ఉంటాడో ఆ గృహస్థుని పుణ్యం, సిరిసంపదలు, పశువులు, సంతానం సమస్తం నశించిపోతాయి’’అన్నారు. యమునికి కూడా భయపడకుండా ధ ర్మాన్ని ఉపదేశించే పెద్దలు యమలోకంలో ఉన్నారంటే భూలోకంలో మనం ఎలా ఉండాలో కఠోపనిషత్తు సూచిస్తోంది.

 అప్పుడు యముడు నచికేతుడి దగ్గరకు వచ్చాడు. ‘బ్రహ్మచారీ! మా ఇంట్లో మూడురాత్రులు నిరాహారంగా ఉన్నావు. దానికి ప్రాయశ్చిత్తంగా నేను నీకు మూడువరాలు ఇస్తాను. ఏం కావాలో కోరుకో’ అన్నాడు.

 నచికేతుడు మృత్యుదేవా! నేను కోరే మొదటివరం నా తండ్రికి నాపై కోపం తగ్గాలి. శాంతసంకల్పుడు కావాలి. మంచి మనస్సుతో ఉండాలి. నువ్వు నన్ను తిప్పి పంపినందుకు సంతోషించాలి. దగ్గరకు తీసుకోవాలి’ అన్నాడు. తనను తిట్టినందుకు తండ్రి మీద కోపగించకుండా తండ్రికోపం తగ్గాలి అని కోరడంతో నచికేతుడు యువతరానికి ఆదర్శం అవుతున్నాడు. ‘తిరిగి వచ్చినందుకు సంతోషించాలి’ అనడంలో బుద్ధి చాతుర్యం ఉంది. ఒకసారి యమలోకానికి వచ్చినవాడు తిరిగి వెళ్లడం అరుదు. తెలివిగా యముణ్ణే బుట్టలో వేశాడు.

 యముడు నచికేతా! నీ తండ్రి నిన్ను ఆద రిస్తాడు. నీతో ప్రేమగా ఉంటాడు. యమలోకం నుంచి తిరిగి వచ్చిన నిన్ను చూసి హాయిగా నిద్రపోతాడు’అన్నాడు. పిల్లల్ని చేరదీసి వారికి ఏదన్నా జరిగితే పెద్దవాళ్లు నిద్రాహారాలు మాని ఎలా దుఃఖిస్తారో యముడు చెప్పకనే చెప్పాడు.

 నచికేతుడు యమధర్మరాజా! స్వర్గానికి చేరే యజ్ఞాన్ని గురించి నాకు వివరించు. నేను చాలా ఆసక్తితో శ్రద్ధతో ఉన్నాను. శ్రద్ధావంతుడు విద్యను ఉపదేశించవచ్చు. స్వర్గానికి చేరినవారు అమృతత్వాన్ని పొందుతారు కదా! ఇదే నా రెండోవరం!’ అన్నాడు.