Saturday, January 16, 2016

దగ్గును తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

దగ్గు అనేది ఒక వ్యాధి కాదు, కానీ, వ్యక్తిలో కేవలం శ్వాసవాహిక లో అడ్డంకులు ఏర్పరచి, అసౌకర్యలకు గురి చేస్తుంది. దగ్గును సులభంగా తగ్గించే రసాయన ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆయుర్వేద చికిత్సలో దగ్గును కలుగచేసే కారకాలను శరీరం నుండి భయటకు పంపి, పూర్తిగా నివారించవచ్చు. అంతేకాకుండా, రసాయనిక మందుల వాడకం వలన శరీరంలో మలబద్దకం మరియు మగత వంటి ఇతర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దగ్గును తగ్గించే ఆయుర్వేద ఔషదాల ద్వారా శరీరంలో ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

దగ్గును ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కఫా దశ కింద చేర్చారు. దగ్గును తగ్గించుటకు గానూ, ఆయుర్వేద వైద్య శాస్త్రంలో రెండు భాగాలుగా వర్తింపచేసారువాటిలో ఒకటి- మూలికల వాడకం, రెండవది- పరిమిత ఆహార పదార్థాలను తీసుకోవటం.
జలుబు మరియు దగ్గును తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి కింద తెలుపబడింది:

Ayurvedic Treatment for Cough in Telugu

అల్లం

కోరింత దగ్గుతో భాదపడుతున్నారా! అయితే అల్లం మంచి ఔషదంగా తెలుపవచ్చు. అల్లం మరియు లవంగాలు కలిపి తయారు చేసిన సిరప్ ను 2 రోజు మూడు సార్లు సేవించటం వలన దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.

బే బెర్రీ

దగ్గుతో పాటు గొంతులో రొంపగా ఉంటే, ఆయుర్వేద శాస్త్రంలో బే బెర్రీ సమర్థవంతమైన ఔషదంగా పరిగణించవచ్చు. కానీ, దగ్గు తగ్గాలంటే, ఈ ఔషదాన్ని పొడి రూపంలో మాత్రమే తీసుకోవాలి. ఈ ఆయుర్వేద ఔషదం దగ్గును తగ్గించటమే కాకుండా, తీవ్రమైన బ్రాంకియోల్ ఇన్ఫెక్షన్ లను కుడా తగ్గించి వేస్తుంది.

మోదుగు ఆకులు

మోదుగు ఆకులను నీటిలో కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని చల్లగా చేసి, గొంతు సంబంధిత సమస్యలు మరియు దగ్గును తగ్గించే శక్తివంత ఆతుర్వేద ఔషదం అని చెప్పవచ్చు. ఈ మిశ్రమం యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నందు వలన దగ్గును తగ్గించటమే కాకుండా, శ్వాస వ్యవస్థలోని ఇన్ఫెక్షన్ లను కూడా తగ్గించి వేస్తుంది.

Betel leaves for Cough in Telugu

తమలపాకులు

దగ్గు నుండి ఉపశమనం పొందుటకు, తమలపాకులను దంచి, నీటిని కలిపి, పేస్ట్ రూపంలో తయారు చేసి, చాతిపై అద్దండి. ఈ ఆయుర్వేద ఔషదం దగ్గును సమర్థవంతంగా తగ్గిస్తుంది.
మెంతి విత్తనాలు
దగ్గును తగ్గించే మరొక ఆయుర్వేద ఔషదంగా మెంతి విత్తనాలతో తయారుచేసిన ఔషదాన్ని తెలుపవచ్చు. ఈ ఔషద తయారీలో, మెంతి విత్తనాలను తీసుకొని నీటిలో కలిపి, 30 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని రోజు పుకిలించి ఉంచటం వలన దగ్గు మాత్రమే కాకుండా అన్ని రకాల ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం పొందుతారు.

హెన్నా

దగ్గు నివారణ కోసం హెన్నాను కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో విస్తృతంగా వాడుతున్నారు. ఇది గొంతును నానబెట్టి మరియు జలుబు, దగ్గులను శక్తివంతంగా తగ్గిస్తుంది.

Cloves for cough in Telugu

లవంగాలు

కొన్నిసార్లు, ఫేరనిక్స్ లో మంట మరియు ఇన్ఫెక్షన్ ల ఫలితంగా దగ్గు కలుగుతుంది. అటువంటప్పుడు, లవంగాలు సరైన ఆయుర్వేద ఔషదం అని చెప్పవచ్చు.

ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం, జలుబు మరియు దగ్గు తగ్గించాలంటే, ఆహార నియమాలను కూడా పాటించాలి. వాటిలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి:

  • నీటిని తాగటానికి ముందు వేడి చేయటం వలన గొంతు నాంచబడి, శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
  • ఫ్రిజ్ లో చల్లబరచిన ఆహార పదార్థాలను తినకండి లేదా తాగకండి.  
  • శరీరాన్ని చల్లబరిచే కూరగాయలు లేదా పండ్లను తినకండి. వీటిలో ముఖ్యంగా, బొప్పాయి పండు, నారింజపండు, పుచ్చపండు, పచ్చటి అరటిపండు మారియు దోసకాయ వంటి వాటికి దూరంగా ఉండండి.  
  • అద్భుతమైన ఫలితాల కోసం కొన్ని అత్తి పండ్లతో పాటు రోజూ సోపు గింజలు తినండి.
పైన తెలిపిన ఆయుర్వేద ఔషదాల వాడకం వలన దగ్గు మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుండి దీర్ఘకాలిక సమయం పాటూ ఉపశమనం పొందవచ్చు. కానీ, కొంత సమయం పాటూ ఎలాంటి లోపాలు లేకుండా ఆయుర్వేద ఔషదాలను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. 

Wednesday, January 13, 2016

వామాకు కాడల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

పోషక విలువలు

ఇతర ఆకుకురాలతో పోలిస్తే, వామాకు కాడలలో ఫైటోన్యూట్రిఎంట్స్ (వృక్షఆధారిత పోషకాలు), విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటాయి. విటమిన్ 'K', పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. వీటితో పాటుగా ఈ కాడల నుండి విటమిన్ 'A', విటమిన్ 'B' కొద్ది మొత్తంలో పొందవచ్చు. అంతేకాకుండా, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను వీటి నుండి పొందవచ్చు.


బరువు నిర్వహణ

తక్కువ క్యాలోరీలను అందించటం వలన బరువు నిర్వహణకు అద్భుతమైన ఆహార పదార్థంగా పేర్కొనవచ్చు. శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారికి మరియు ఆరోగ్యకర స్థాయిలో బరువును నిర్వహించుకోవాలనుకునే వారికి ఇవి మంచి ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు.


ఒత్తిడితో పోరాటం

శాంతనపరిచే ఆహార పదార్థాలలో వీటిని కూడా పేర్కొనవచ్చు. వీటిలో ఉండే మినరల్, ముఖ్యంగా మెగ్నీషియం, ఎస్సేన్షియల్ ఆయిల్ ల వలన వామాకు కాడలకు శాంతనపరిచే గుణాలను కలిగి ఉంటాయి.


యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

వామాకు కాడలు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కీళ్ళ మధ్య నొప్పి, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ లు, ఆస్తమా లేదా మొటిమల వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా! వామాకు కాడలను తినటం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.


జీర్ణక్రియలో మెరుగుదల

వామాకులలో ఉండే అధిక నీటి స్థాయిలు, కరగని ఫైబర్ లతో మిళితం చెంది జీర్ణక్రియలో అద్భుతాలను కలుగచేస్తాయి. ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేసి, జీర్ణాశయ భాగాలు ఇన్ఫెక్షన్ లకు గురవకుండా చూస్తాయి.


కంటి చూపులో మెరుగుదల

వామాకు కాడల నుండి రోజు మొత్తంలో శరీరానికి కావలసిన విటమిన్ 'A' అందించబడతాయి. ఫలితంగా, వయసు మీరిన కొలది కలిగే మస్కులార్ డిజెనరేషన్ మరియు ఇతర కంటి సంబంధిత సమస్యలను తగ్గించి, దృష్టిని మెరుగుపరుస్తుంది.


వ్యాధుల నివారణ

శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే "బ్యూటైల్థాలైట్" అనే మూలకాన్ని వామాకు కాడలలో గుర్తించారు. ఈ కాడలలో ఉండే థాలైట్ లు రక్తపీడనాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటితో పాటుగా క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారించే శక్తివంతమైన ల్యుటేలిన్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

సామాన్యుల అగచాట్లు

సంక్రాంతి సంబరం అయినవారందరితో జరుపుకోవాలని పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు దోపిడీకి తెరలేపాయి. ప్రత్యేక బస్సుల పేరిట యాభై నుంచి వంద శాతానికి పైగా అదనపు చార్జీలతో ప్రయాణికులను నిలువునా దోచుకొంటున్నాయి. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో హద్దూ అదుపూ లేకుండా టికెట్ల రేట్లు పెంచేసి సగటు జీవి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లయితే ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు.



 మూడు రోజుల్లో పది లక్షల మంది...
 సంక్రాంతి పండుగ కోసం గత మూడు రోజుల్లో దాదాపు 10 లక్షల మంది నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న అరకొర రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంటోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2,470 ప్రత్యేక బస్సుల్లో 50  శాతం అదనపు చార్జీ వసూలు చేస్తోంది. రెగ్యులర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.304 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం అది రూ.450 దాటింది. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రైవేట్ బస్సుల్లో విశాఖపట్టణానికి ఏసీ బస్సుకు సాధారణ రోజుల్లో రూ.750 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1600 వరకు వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో సొంతూరికి పయనమవుతున్న మధ్యతరగతి వ్యక్తి విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు చార్జీల రూపంలోనే రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పండుగ ఆనందం ఆవిరైపోతోంది.
 

 ఇది అన్యాయం...
 ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలతో చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాం తికి సొంత ఊరుకు వెళ్లడం కంటే ఇక్కడే ఉండిపోతే బాగుండేదనిపిస్తుంది. పండుగ పేరిట ఇలా సామాన్య ప్రజలపై భారం మోపడం అన్యాయం.
 - ఫల్గుణ, మూసాపేట్  
 
 సర్వీసులు పెంచాల్సింది
 పండుగకు శ్రీకాకుళానికి బయలుదేరాం. కానీ ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోతమోగుతోంది. రైళ్లు కూడా చాలినన్ని లేవు. ఇంటిల్లిపాదీ కలిసి వెళ్లాలంటే భయమేస్తుంది. ఆర్టీసీ సర్వీసుల్ని పెంచాల్సింది.
 - గిరిడ చిన్నారావు, కూకట్‌పల్లి
 
 విజయవాడకు రూ.1000!
 ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు దారుణంగా పెంచారు. సాధారణ రోజుల్లో విజయవాడకు రూ.350 తీసుకుంటారు. ఇప్పుడేమో రూ.1000కి పైనే డిమాండ్ చేస్తున్నారు. రైళ్లూ అరకొరానే. ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు.