Saturday, August 13, 2016

తరచుగా మైగ్రేన్ తో బాధపడుతున్నారా ?

మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. లైటింగ్, శబ్ధం ఏమీ భరించలేక.. చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మైగ్రేన్ తో బాధపడేటప్పుడు.. పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో.. మైగ్రేన్ పేషంట్స్ ని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేలా చేస్తుంది. 

తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి లక్షణాలు ఇబ్బందిపెడతాయి. మెడ నొప్పి, ముఖంలో నొప్పి, అలసట, నీరసం, చూపు మందగించడం, ముక్కులో సమస్య వంటి లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తాయి. మైగ్రేన్ ఒక్కరికి ఒక్కోలా ఉంటుంది. 

సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెరిడిటీ, డిప్రెషన్, ఆందోళన, అసమతుల్య ఆహారం, కాంట్రాసెప్టివ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, మెనోపాజ్ వంటివి కారణాలు. చాలామంది మైగ్రేన్ తో బాధపడేవాళ్లు పెయిన్ కిల్లర్స్ తో ఉపశమనం పొందుతారు. 

కానీ.. పెయిన్ కిల్లర్స్ ఉపశమనం కలిగించినా.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి. కాబట్టి.. మైగ్రేన్ తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మైగ్రేన్ ని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చట.


ఆకుకూరలు స్పినాచ్, పుదీనా వంటి ఆకు కూరల్లో విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. రక్త ప్రసరణను తలలో మెరుగుపరుస్తాయి. దీనివల్ల మైగ్రేన్ కి దూరంగా ఉండవచ్చు.



నట్స్ మైగ్రేన్ తలనొప్పి.. మెగ్నీషియం డెఫీసియన్సీ వల్ల వస్తుంది. నట్స్, డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి.. ఎఫెక్టివ్ గా మైగ్రేయిన్ ని తగ్గిస్తాయి.



రెడ్ మీట్ రెడ్ మీట్ గుండెకు మంచిది కాదు. కానీ.. మెగ్రేన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో బి12, CoQ10 ఉంటుంది.



ఎగ్ పోషకాలు ఉండటమే కాకుండా ఎగ్స్ హెల్తీ. వీటిల్లో బి 2 ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ గా మైగ్రేన్ ని తగ్గిస్తుంది. బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లోని మెరుగుపరుస్తుంది.



చేపలు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉంటాయి. ఈ రెండూ.. మైగ్రేన్ కి సంబంధించిన తలనొప్పులు నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.



ధాన్యాలు బార్లీ, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు.. హైపోగ్లిసిమియా, మైగ్రేన్ నివారించడంలో సహాయపడతాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.



ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. మైగ్రేన్ ఎటాక్స్ ని అడ్డుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసి.. మైగ్రేన్ రాకుండా అడ్డుకుంటాయి.

ఘనంగా పుష్కర స్నానాలు


తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటిరోజు నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గాఘాట్లో, తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్లో సతీ సమేతంగా పుష్కరస్నానం చేశారు. ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని సంకల్పం చేసుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


కృష్ణాతీరంలోని గ్రామాలన్నీ పుష్కరకళతో మెరిసిపోతున్నాయి. సరిగ్గా పుష్కరాల సమయానికి కృష్ణానదికి వరద రావడంపై అందరూ సంతోషంగా ఉన్నారు. శ్రీశైలం పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ శక్తిమేరకు యాత్రికులకు సేవలందిస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రతి ఐదు నిమిషాలకు పుష్కర ఘాట్లకు బస్సులు తిరుగుతున్నాయి. రైల్వే శాఖ కోసం పుష్కరాల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. పుష్కర ఘాట్ల సమీపంలోని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం మీద కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

Friday, August 12, 2016

వరలక్ష్మీ వ్రత ఉపవాసం సమయంలో.. ఎలాంటివి తీసుకోవాలి ?

వరలక్ష్మీ వ్రతం.. చాలా ముఖ్యమైన, ప్రాముఖ్యత ఉన్న పండుగ. ఈ పూజను లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. శ్రావణ శుక్రవారం రెండోవారం దక్షిణ భారతీయులు నిర్వహిస్తారు. ఈ వరలక్ష్మీ పూజను పెళ్లైన మహిళలు.. తమ సౌభాగ్యాలు, కుటుంబ శ్రేయస్సు, సంపద కోసం నిర్వహిస్తారు. 



ప్రశాంతత, సంపద, ధనం, సంతోషం, కుటుంబ శ్రేయస్సుతో పాటు.. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేసే మహిళలు.. పూజ అయ్యేంతవరకు, కొంతమంది.. వరలక్ష్మీ పూజ రోజంతా ఉపవాసం పాటిస్తారు.

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రత పూజను.. ఆగస్ట్ 12న జరుపుకుంటున్నాం. ఈ పూజ చేయడానికి మహిళలు ఉదయాన్నే లేచి.. బ్రహ్మ ముహూర్తంలో లేచి.. స్నానం చేస్తారు. పూజ అయ్యేంతవరకు.. ఉపవాసం ఉంటారు. అయితే.. ఈ పూజ నిర్వహించడానికి చాలా ఓపిక, శక్తి అవసరం అవుతాయి. 

ఇల్లంతా శుభ్రం చేయడానికి, పూజ గది శుభ్రం చేసి అలంకరించుకోవడానికి, స్వీట్స్, వంటకాలు చేయడానికి రకరకాలుగా శారీరక శ్రమ అవసరం అవుతుంది. కాబట్టి.. ఉపవాసం సమయంలో.. కొన్ని ఆహారాలు తినడం వల్ల.. ఉపవాసం ఉన్నప్పటికీ.. ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది.



అరటిపండు స్టామినా అందించడంలో బెస్ట్ ఫ్రూట్ అరటిపండు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ గ్లూకోజ్ ఉంటుంది. ఇది.. ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. దీన్ని ఫ్రూట్ గానే తినవచ్చు, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఒక అరటిపండు తిన్నా.. పొట్టనిండిన ఫీలింగ్ కలిగించి.. కావాల్సిన శక్తిని ఇస్తుంది.



పాలు ఉపవాసం సమయంలో పాలు తీసుకోవడం వల్ల.. వాటి ద్వారా విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అలాగే పాలను పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఒక కప్పు పాలు తీసుకుంటే.. ఉపవాసం సమయమంతా.. ఎలాంటి నీరసం మీ దరిచేరదు.



ప్రూట్ జ్యూస్ తాజా ఫ్రూట్ జ్యూస్ లలో ఎనర్జీ అందించడానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. బొప్పాయి, పుచ్చకాయ, ఆరంజ్, దానిమ్మ వంటి ఫ్రూట్స్ తో జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే.. మీరు పూజ చేసినంత సేపు ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉంటారు.



నట్స్ బాదాం, కిస్ మిస్ లు ఉపవాసం సమయంలో ఎనర్జీని అందిస్తాయి. బాదాంలో విటమిన్ ఈ, మెగ్నీషియం ఉండటం వల్ల.. ఎనర్జీని అందిస్తాయి. కాబట్టి 3 నుంచి 4 బాదాం, 4 నుంచి 5 ఎండు ద్రాక్షలను..రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇవి.. పూజ సమయంలో కావాల్సిన శక్తిని అందిస్తాయి.



Thursday, August 11, 2016

పసుపు, క్యారట్ ఫేస్ ప్యాక్...

మీ చర్మం నిర్జీవంగా, ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా.. నిగారింపు పొందలేకపోతున్నారా ? ఎన్ని క్రీములు, ఎన్ని ఫౌండేషన్స్ వాడినా.. ముఖంలో కాంతి మాత్రం కనిపించడం లేదా ? చర్మం డల్ గా కనిపించడం వల్ల ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. మీ ఆకర్షణ మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతోందా ? 



ప్రస్తుత రోజుల్లో చాలామంది.. ఒత్తిడితో కూడిన జాబ్స్, పొల్యూషన్, చర్మ సంరక్షణకు సమయం కుదరకపోవడం, హెల్తీ డైట్ ఫాలో అవకపోవడం వల్ల అనేక చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. మీకు తెలుసా.. మీరు ఇంట్లో నిత్యం ఉపయోగించే.. వస్తువులతోనే.. అందమైన, ఆకర్షణీయమైన చర్మాన్ని చాలా కొన్ని రోజుల్లోనే పొందవచ్చు. 



క్యారట్ జ్యూస్, పసుపు కాంబినేషన్ చర్మానికి ముఖ్యమైన పోషణను, కాంప్లెక్షన్ ని, హెల్తీ, రేడియంట్ స్కిన్ ని అందిస్తుంది. ఈ రెండింటితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:
  • క్యారట్ జ్యూస్ 3 టేబుల్ స్పూన్లు 
  • పసుపు 2 టీస్పూన్లు


తయారు చేసే విధానం రెండింటినీ.. ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గ్లోయింగ్ కాంప్లెక్షన్ ఈ న్యాచురల్ మిశ్రమంలో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలకు పోషణ అందిస్తాయి. చర్మం లోపల పోషణ అందడం వల్ల చర్మం హెల్తీగా, గ్లోయింగ్ గా మారుతుంది.

మచ్చలు నివారించడానికి పసుపు, క్యారట్ జ్యూస్ మిశ్రమంలో.. మొటిమల తాలుకు మచ్చలు, ఇతర గాయాల మచ్చలు తొలగించే సత్తా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఎలాంటి మచ్చ అయినా మాయం అవుతుంది.

ముడతలు ఈ హోంమేడ్ ప్యాక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కొల్లాజెన్ ఉత్పత్తిని.. పెంచుతాయి. చర్మంలో ఎలాస్టిసిటీని పెంచి.. ముడతలు, ఫైన్ లైన్స్ ని తొలగిస్తాయి.

ఎండ నుంచి సంరక్షణ క్యారట్, పసుపు మిశ్రమం న్యాచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఎండకు చర్మం కమిలిపోకుండా, సూర్య కిరణాల వల్ల.. ఎలాంటి హాని కలగకుండా.. కాపాడతాయి.

డ్రై స్కిన్ ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ప్రతి కణానికి హైడ్రేట్ చేసి.. చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా, సాఫ్ట్ గా ఉండటానికి సహాయపడుతుంది.

మొటిమలు తగ్గించడానికి ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. బ్యాక్టీరియాను, దుమ్ము, ధూళిని.. చర్మ రంధ్రాల నుంచి బయటకు తొలగిస్తాయి. దీనివల్ల మొటిమలు తగ్గిపోతాయి.

ర్యాషెష్ ర్యాషెస్, బర్న్స్, కట్స్ వంటి చర్మ సమస్యలను క్యారట్, పసుపు మిశ్రమం ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ లో ఉండే.. గుణాలు.. ఎలాంటి చర్మ సమస్యకైనా చెక్ పెట్టేస్తాయి.

Wednesday, August 10, 2016

ఆ గొంతు వినబడిందంటే.. ఎవరైనా ఆగిపోవాల్సిందే...!

హైదరాబాద్ :"ఆ రాత్రి సుప్రజ బార్ లో పీకల దాకా మద్యం సేవించిన రాకేష్.. నేరుగా సుప్రజ దగ్గరకు వెళ్లాడు. అక్కడే.. సరిగ్గా అక్కడే.. చూడకూడని దృశ్యం ఒకటి అతని కంటపడింది." 
'ఏంటా.. దృశ్యం?' 
అరగంట కార్యక్రమంలో చివరి నిముషం వరకు ఆ ఉత్యంఠను కొనసాగిస్తూ సాగే వ్యాఖ్యానమది. 20 సెకన్ల క్రైమ్ వార్తను భరించడమే కష్టమనుకునేవాళ్లను సైతం 30 నిముషాల క్రైమ్ బులెటిన్ ముందు నుంచి కదలకుండా చేసింది. 
ఒకవిధంగా.. క్రైమ్ టైమ్ ను కమ్యూనికేట్ చేయడంలో 'ఆల్ టైమ్ హిట్' ఆ గొంతు. 
రాత్రి ఎనిమిది.. ఎనిమిదిన్నర సమయంలో ఈటీవీ-2లో వచ్చే నేరాలు-ఘోరాలు ఎసిసోడ్స్ చూసినవాళ్లందరికీ.. సుపరిచితమైన గొంతు. ఎస్.. 'నూతన్ ప్రసాద్' వాయిస్ ఓవర్ చేసిన మ్యాజిక్ అది. ఆ పరంపరలో.. ప్రతీ ఛానెల్ ఓ క్రైమ్ బులెటిన్ ను రూపొందించుకుని.. ఆయా బులెటిన్లకు మరెన్నో గొంతులు జతకలిసినా..! క్రైమ్ న్యూస్ కు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన బూస్టింగ్ మరెవరి వల్ల కాలేదనే చెప్పాలి.

స్కేలు బద్ద పెట్టి కొలిచినట్లు.. పర్ఫెక్ట్ మెజర్ మెంట్ తో.. టీవీ తెర మీద కనిపిస్తున్న క్రైమ్ సీన్ ను రక్తి కట్టించడంలో ఆయన వ్యాఖ్యానికి మరేది సాటి రాదేమో! అందుకే.. కష్టంగా అరగంట పాటు నడిచే క్రైమ్ బులెటిన్ కాస్త.. ఆయన వ్యాఖ్యానం తోడవడంతో.. ఒకే క్రైమ్ న్యూస్ కూడా ఎసిసోడ్స్.. ఎపిసోడ్స్.. గా కొనసాగింది. 
విషయమేదైనా దాన్ని జనానికి కమ్యూనికేట్ చేయడంలో సఫలమయ్యేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో.. అందరికంటే మిన్నగా కమ్యూనికేట్ చేసేవాళ్లు ఒక్కరో.. ఇద్దరో మాత్రమే ఉంటారు. అలా క్రైమ్ న్యూస్ ను కమ్యూనికేట్ చేయడంలో నూతన్ ప్రసాద్ అంతలా సక్సెస్ అయిన వారు ఇంకొకరు లేరు. 
ఒక్క మాటలో చెప్పాలంటే..! 

"నూతన్ ప్రసాద్ వాయిస్ ఓవర్ ఇప్పటి క్రైమ్ న్యూస్ యాంకర్స్ అందరికీ ఓ పారా మీటర్"

Tuesday, August 9, 2016

యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడితే ప్రమాదం తప్పదట ?

చల్లటి వాతావరణం.. అనేక ఇన్ఫెక్షన్స్, శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా.. దగ్గు, జలుబు, తుమ్ములు, తల పట్టేయడం వంటి సమస్యలు తీసుకొస్తాయి. ఇలాంటి లక్షణాలతో డాక్టర్ ని సంప్రదించినప్పుడు వెంటనే సూచించేది యాంటీ బయోటిక్స్. లేదా కొంతమంది డాక్టర్ సలహా తీసుకోకుండా.. స్వతహాగా.. యాంటీ బయోటిక్స్ తీసుకుంటూ ఉంటారు.

 ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్యాబ్లెట్ కోసం చూస్తారు. కానీ యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల.. చాలా పెద్ద సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. లైఫ్ సేవ్ చేసేవి యాంటి బయాటిక్స్. కానీ.. అందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

డయేరియా యాంటిబయాటిక్స్ లో అమోక్సిసిల్లిన్, మెట్రోనైడజోల్ ఉంటాయి. ఇవి.. డయేరియాకి కారణమవుతాయి. చాలా తరచుగా.. నీళ్ల విరేచనాలు అవడానికి యాంటీ బయాటిక్స్ కారణమవుతాయి.



ఎసిడిటీ, గ్యాస్ యాంటీ బయాటిక్స్ ని ఏదైనా ఇన్ఫెక్షన్ నివారించడానికి తీసుకోవడం వల్ల.. అవి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ కి కారణమవుతాయి. సాధారణంగా.. యాంటి బయాటిక్స్ మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కానీ.. ఇవి ఇన్ టెస్టైన్ కి చాలా అవసరం.

స్కిన్ ఎలర్జీ కొన్ని రకాల డ్రగ్స్ సల్పా టెట్రాసైక్లిన్ అనే యాంటీ బయాటిక్.. స్కిన్ ఎలర్జీకి కారణమవుతాయి. వీటివల్ల దురద, పొక్కులు చర్మంపై ఏర్పడతాయి. చాలా అరుదుగా.. స్టివెన్స్, జాన్ సన్ సిండ్రోమ్ కి దారితీస్తాయి. దీనివల్ల.. చర్మంపై తీవ్రమైన వాపు, మంట వస్తాయి.

వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ యాంటి బయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో చాలా సాధారణమైనది.. వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్. టెట్రాసైక్లిన్, క్లిండమిసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఈస్ట్ గ్రోత్ ని పెంచి.. వాజినల్ ప్రాంతంలో తక్కువ ఎసిడిక్ ఉండటానికి కారణమై.. ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

నోటి పుండు యాంటి బయాటిక్స్ వల్ల.. ఓరల్ ఇన్ఫెక్షన్ కూడా వేధిస్తుంది. వీటిని స్టొమటిటిస్ అంటారు.

కిడ్నీ పనిచేయకపోవడం ఎమినొగ్లైకోసైడ్స్ వంటి యాంటీ బయాటిక్స్ కిడ్నీలకు మంచిది కాదు. ఇలాంటి యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల.. కిడ్నీల పనితీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఇలాంటి యాంటీ బయాటిక్స్ కి దూరంగా ఉండటం వల్ల.. కిడ్నీ వ్యాధులను అరికట్టవచ్చు.