Thursday, August 11, 2016

పసుపు, క్యారట్ ఫేస్ ప్యాక్...

మీ చర్మం నిర్జీవంగా, ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసినా.. నిగారింపు పొందలేకపోతున్నారా ? ఎన్ని క్రీములు, ఎన్ని ఫౌండేషన్స్ వాడినా.. ముఖంలో కాంతి మాత్రం కనిపించడం లేదా ? చర్మం డల్ గా కనిపించడం వల్ల ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. మీ ఆకర్షణ మిమ్మల్ని ఆకట్టుకోలేకపోతోందా ? 



ప్రస్తుత రోజుల్లో చాలామంది.. ఒత్తిడితో కూడిన జాబ్స్, పొల్యూషన్, చర్మ సంరక్షణకు సమయం కుదరకపోవడం, హెల్తీ డైట్ ఫాలో అవకపోవడం వల్ల అనేక చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. మీకు తెలుసా.. మీరు ఇంట్లో నిత్యం ఉపయోగించే.. వస్తువులతోనే.. అందమైన, ఆకర్షణీయమైన చర్మాన్ని చాలా కొన్ని రోజుల్లోనే పొందవచ్చు. 



క్యారట్ జ్యూస్, పసుపు కాంబినేషన్ చర్మానికి ముఖ్యమైన పోషణను, కాంప్లెక్షన్ ని, హెల్తీ, రేడియంట్ స్కిన్ ని అందిస్తుంది. ఈ రెండింటితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:
  • క్యారట్ జ్యూస్ 3 టేబుల్ స్పూన్లు 
  • పసుపు 2 టీస్పూన్లు


తయారు చేసే విధానం రెండింటినీ.. ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గ్లోయింగ్ కాంప్లెక్షన్ ఈ న్యాచురల్ మిశ్రమంలో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలకు పోషణ అందిస్తాయి. చర్మం లోపల పోషణ అందడం వల్ల చర్మం హెల్తీగా, గ్లోయింగ్ గా మారుతుంది.

మచ్చలు నివారించడానికి పసుపు, క్యారట్ జ్యూస్ మిశ్రమంలో.. మొటిమల తాలుకు మచ్చలు, ఇతర గాయాల మచ్చలు తొలగించే సత్తా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఎలాంటి మచ్చ అయినా మాయం అవుతుంది.

ముడతలు ఈ హోంమేడ్ ప్యాక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కొల్లాజెన్ ఉత్పత్తిని.. పెంచుతాయి. చర్మంలో ఎలాస్టిసిటీని పెంచి.. ముడతలు, ఫైన్ లైన్స్ ని తొలగిస్తాయి.

ఎండ నుంచి సంరక్షణ క్యారట్, పసుపు మిశ్రమం న్యాచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఎండకు చర్మం కమిలిపోకుండా, సూర్య కిరణాల వల్ల.. ఎలాంటి హాని కలగకుండా.. కాపాడతాయి.

డ్రై స్కిన్ ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ప్రతి కణానికి హైడ్రేట్ చేసి.. చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా, సాఫ్ట్ గా ఉండటానికి సహాయపడుతుంది.

మొటిమలు తగ్గించడానికి ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. బ్యాక్టీరియాను, దుమ్ము, ధూళిని.. చర్మ రంధ్రాల నుంచి బయటకు తొలగిస్తాయి. దీనివల్ల మొటిమలు తగ్గిపోతాయి.

ర్యాషెష్ ర్యాషెస్, బర్న్స్, కట్స్ వంటి చర్మ సమస్యలను క్యారట్, పసుపు మిశ్రమం ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ లో ఉండే.. గుణాలు.. ఎలాంటి చర్మ సమస్యకైనా చెక్ పెట్టేస్తాయి.

No comments:

Post a Comment